బంగాళాఖాతం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము తొలగిస్తున్నది: ku:Tengava Bengal (deleted)
చి యంత్రము కలుపుతున్నది: ku:Kendava Bengalê
పంక్తి 54: పంక్తి 54:
[[km:ឈូងសមុទ្របេងហ្គាល់]]
[[km:ឈូងសមុទ្របេងហ្គាល់]]
[[ko:벵골 만]]
[[ko:벵골 만]]
[[ku:Kendava Bengalê]]
[[lt:Bengalijos įlanka]]
[[lt:Bengalijos įlanka]]
[[lv:Bengālijas līcis]]
[[lv:Bengālijas līcis]]

18:49, 19 సెప్టెంబరు 2011 నాటి కూర్పు


దస్త్రం:Bay of Bengal.png
బంగాళా ఖాతము ప్రాంతము

హిందూ మహా సముద్రపు ఈశాన్య ప్రాంతపు సముద్రాన్ని బంగాళాఖాతము (Bay of Bengal) అంటారు. త్రిభుజాకారంలొ ఉండే బంగాళాఖాతానికి తూర్పున మలై ద్వీపకల్పం, పశ్చిమాన భారత ఉపఖండం ఉన్నాయి. అఖాతానికి ఉత్తరాగ్రాన భారతదేశపు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్, మరియు బంగ్లాదేశ్ దేశము ఉన్నాయి. అందువలననే దీనికి బంగాళాఖాతము అనే పేరు వచ్చింది. దక్షిణాన శ్రీలంక, అండమాన్‌ నికోబార్‌ దీవుల వరకు బంగాళాఖాతం వ్యాపించి ఉంది.

భారత దేశం లోని చాలా ముఖ్యమైన నదులు పడమర నుండి తూర్పుకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి: ఉత్తరాన, గంగ,మేఘన, బ్రహ్మపుత్ర నదులు, దక్షిణాన మహానది, గోదావరి, కృష్ణ మరియు కావేరినదులు. గంగ, బ్రహ్మపుత్ర, మేఘన నదులు బంగాళాఖాతంలో కలిసే ప్రాంతంలో విస్తరించిన మడ అడవులను సుందర్బన్స్‌ అంటారు. మయన్మార్‌ (బర్మా) లోని ఇరావతి కూడా బంగాళాఖాతంలోనే కలుస్తుంది.

చెన్నై (ఇదివరకటి మద్రాసు), విశాఖపట్నం, కొల్కతా (ఇదివరకటి కలకత్తా), పరదీప్‌ మరియు పాండిచ్చేరి బంగాళాఖాత తీరంలోని ముఖ్య నౌకాశ్రయాలు.

దీనిని భారతదేశానికి తూర్పున ఉండటం వల్ల చాలా కాలం వరకూ "తూర్పు సముద్రం" అనీ, లేదా దాని తత్సమ పేర్లతో పిలిచారు, ఇప్పటికీ మన చరిత్ర పుస్తకాలలోని ఇండియా మ్యాపులలో బ్రిటీషువారిముందు ఈ సముద్రాన్ని ఇదే పేరుతో సూచిస్తారు. ముఖ్యముగా గుప్తుల కాలం, విజయనగరకాలంనాటి మ్యాపులు చూడండి!

బ్రిటీషు వారు వచ్చినప్పుడు బెంగాలు చాలా పెద్దగా ఉండేది, దానినిబెంగాలు ప్రావిన్సు అని పిలిచేవారు, ఇందులో ప్రస్తుత పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్, ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని భాగాలు, ఒరిస్సా రాష్ట్రము, బీహార్‌ రాష్ట్రము, జార్ఖండ్ రాష్ట్రములు అంతర్భాగములుగా ఉండేవి, ఈ పెద్ద బెంగాలు ప్రావిన్సు బెంగాలు విభజన వరకూ కొనసాగింది, తరువాత ముక్కలైంది, ఇంత పెద్ద బెంగాలు ప్రావిన్సు ఉండుటం వల్ల, దానికి కోస్తాగా చాలావరకూ ఈ సముద్రం ఉండటం వల్ల ఈ సముద్రాన్ని వారు బే ఆఫ్ బెంగాల్ అని పిలిచినారు, అదే స్థిరపడిపొయినది. తరువాత మన తెలుగులో అదే అనువాదం చెంది బంగాళాఖాతం అయినది.

ఇంకా చూడండి: అండమాన్‌ దీవులు