జిక్కి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:Q3533136
చి వర్గం:మహిళా గాయకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 89: పంక్తి 89:
[[వర్గం:1938 జననాలు]]
[[వర్గం:1938 జననాలు]]
[[వర్గం:2004 మరణాలు]]
[[వర్గం:2004 మరణాలు]]
[[వర్గం:మహిళా గాయకులు]]

12:55, 31 మే 2013 నాటి కూర్పు

జిక్కి
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంపి.జి.కృష్ణవేణి
జననంనవంబరు 3, 1937
చంద్రగిరి
చిత్తూరు జిల్లా
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
మరణం2004 ఆగస్టు 16(2004-08-16) (వయసు 68)
వృత్తినేపధ్య గాయని
క్రియాశీల కాలం1938-2004

జిక్కి అని ముద్దుగా పిలుచుకునే పి.జి.కృష్ణవేణి (1938 - 2004) తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, సింహళ మరియు హిందీ భాషలలో ప్రసిద్ధ సినీ గాయకురాలు. మూడు దశాబ్దాల పాటు పదివేలకు పైగా పాటలు పాడారు. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరిలో జన్మించిన జిక్కి ఏ సంగీత శిక్షణ లేక పోయినా వినికిడి జ్ఞానంతో పాడటం నేర్చుకొన్నది. జిక్కి తండ్రి మద్రాసులో స్టూడియోలో చిన్నాచితక పనులు చేస్తుంటే ఆమె ఎప్పుడైనా వెళ్లినపుడు అదంతా తిరిగేది. అలా తిరుగుతున్నపుడు చూసిన ప్రముఖ దర్శకులు గూడవల్లి రామబ్రహ్మం, పంతులమ్మ (1943) సినిమాలో చిన్నవేషంతో పాటు పాట పాడే అవకాశం కల్పించారు. జిక్కి అప్పట్లో ప్రముఖగాయకుడైన ఏ.ఎమ్.రాజా ను ప్రేమవివాహం చేసుకున్నది. వీరికి ఆరుగురు సంతానం. అరవయ్యేళ్లు దాటాక కూడా ఆమె ఆదిత్య 369 సినిమాలో జాణవులే... అనే పాట పాడి తన గొంతులో ఇంకా వాడి తగ్గలేదని నిరూపించారు

ప్రాచుర్యం పొందిన గీతాలు

  • వద్దురా కన్నయ్యా! ఈ పొద్దు ఇలు వదలి పోవద్దురా అయ్యా
  • జీవితమే సఫలము... ప్రేమకథా మధురము
  • 'ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా'
  • 'పందిట్లో పెళ్లవుతున్నాదీ,'
  • పులకించని మది పులకించు లాంటి పాటలు

చిత్ర సమాహారం

బయటి లంకెలు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో జిక్కి పేజీ

"https://te.wikipedia.org/w/index.php?title=జిక్కి&oldid=854316" నుండి వెలికితీశారు