బీర్పూర్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బీర్పూర్
—  మండలం  —
తెలంగాణ పటంలో జగిత్యాల జిల్లా, బీర్పూర్ స్థానాలు
తెలంగాణ పటంలో జగిత్యాల జిల్లా, బీర్పూర్ స్థానాలు
తెలంగాణ పటంలో జగిత్యాల జిల్లా, బీర్పూర్ స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జగిత్యాల జిల్లా
మండల కేంద్రం బీర్పూర్
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 110 km² (42.5 sq mi)
జనాభా (2016)
 - మొత్తం 20,913
 - పురుషులు 10,128
 - స్త్రీలు 10,785
పిన్‌కోడ్ {{{pincode}}}


బీర్పూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లాకు చెందిన మండలం.[1]

ఇది సమీప పట్టణమైన జగిత్యాల నుండి 30 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. [2] ఇందులో 11 గ్రామాలున్నాయి. దానికి ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లా లో ఉండేది. [3] ప్రస్తుతం ఈ మండలం జగిత్యాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  11  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం బీర్పూర్

గణాంకాలు[మార్చు]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 110 చ.కి.మీ. కాగా, జనాభా 20,913. జనాభాలో పురుషులు 10,128 కాగా, స్త్రీల సంఖ్య 10,785. మండలంలో 5,552 గృహాలున్నాయి.[4]

2016 లో ఏర్పడిన మండలం[మార్చు]

లోగడ బీర్పూర్  గ్రామం కరీంనగర్ జిల్లా, జగిత్యాల రెవెన్యూ డివిజను పరిధిలోని సారంగాపూర్ మండలానికి చెందినది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా బీర్పూర్ గ్రామాన్ని (1+11) పదకొండు గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా జగిత్యాల జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[5]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. బీర్పూర్
  2. నర్సింలపల్లి
  3. చర్లపల్లి
  4. తుంగూర్
  5. కాండ్లపల్లి
  6. కొల్వాయి
  7. రంగాసాగర్
  8. మంగేల
  9. తాళ్లధర్మారం
  10. కమ్మునూర్
  11. రేకులపల్లె

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-04-30. Retrieved 2019-01-27.
  2. "జగిత్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "జగిత్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  5. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు[మార్చు]