Jump to content

బెరీలియం నైట్రైడ్

వికీపీడియా నుండి
(బెరీలియం నైట్రైడు నుండి దారిమార్పు చెందింది)
బెరీలియం నైట్రైడ్
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [1304-54-7]
ధర్మములు
Be3N2
మోలార్ ద్రవ్యరాశి 55.06 g/mol[1]
స్వరూపం yellow or white powder
సాంద్రత 2.71 g/cm3[1]
ద్రవీభవన స్థానం 2,200 °C (3,990 °F; 2,470 K)
బాష్పీభవన స్థానం 2,240 °C (4,060 °F; 2,510 K) (decomposes)[1]
decomposes
ద్రావణీయత in [[acids, bases]] hydrolyzes
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
Cubic, cI80, SpaceGroup = Ia-3, No. 106 (α form)
ప్రమాదాలు
US health exposure limits (NIOSH):
PEL (Permissible)
TWA 0.002 mg/m3
C 0.005 mg/m3 (30 minutes), with a maximum peak of 0.025 mg/m3 (as Be)
REL (Recommended)
Ca C 0.0005 mg/m3 (as Be)
IDLH (Immediate danger)
Ca [4 mg/m3 (as Be)]
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

బెరీలియం నైట్రైడ్ ఒక అకర్బన రసాయన సంయోగపదార్థం.ఇది బెరీలియం మూలకం యొక్క నైట్రైడ్.అత్యధిక ఉష్ణోగ్రత (1100–1500 °C)వద్ద మూలకాలనుండి ఉత్పత్తి చెయ్యుదురు[2] . బెరీలియం నైట్రైడ్ యొక్క రసాయన సంకేతపదం Be3N2. బెరీలియం అజైడ్ లేదా హెక్సానైట్రైడ్ (BeN6)వలెకాకుండ,వ్యాక్యుం (పీడన రహితస్థితి)లో బెరీలియం, నైట్రోజన్గా వియోగం చెందును[2].ఇది సులభంగా జలవిశ్లేషణ చెంది బెరీలియం హైడ్రాక్సైడ్, అమ్మోనియాలుగా ఏర్పడును. బెరీలియం నైట్రైడ్ రెండు బహురూపకతలను (polymorphic)కలిగిఉన్నది. ఒకటి α-Be3N2 కాగామరొకటి β-Be3N2.బెరీలియం నైట్రైడ్ సంయోగపదార్ధం 1800–1900 °C వద్ద అమ్మోనియా ప్రవాహంలో సిలికాన్ నైట్రైడ్ (Si3N4 )తో రసాయనచర్య వలన బెరీలియం సిలికాన్ నైట్రైడ్ (BeSiN2)ను ఏర్పరచును.

ఉత్పత్తి

[మార్చు]

ఆక్సిజన్ రహితస్థితిలో బెరీలియం లోహపొడిని/చూర్ణాన్ని పొడి నైట్రోజన్ తో700 -1400 °C ఉష్ణోగ్రత మధ్య వేడిచెయ్యడం వలన బెరీలియం నైట్రైడ్ ఉత్పత్తి అగును.

భౌతిక లక్షణాలు

[మార్చు]

బెరీలియం నైట్రైడ్ పసుపు లేదా తెల్లని రూపంలో ఉండును.[3] బెరీలియం నైట్రైడ్ అణుభారం 55.06గ్రాములు/మోల్.[1] 25 °C ఉష్ణోగ్రత వద్ద బెరీలియం నైట్రైడ్ సాంద్రత 2.71గ్రాములు/సెం.మీ3. బెరీలియం నైట్రైడ్ సంయోగపదార్ధం ద్రవీభవన స్థానం 2,200 °C (3,990 °F;2,470K)[1]. అలాగే బెరీలియం నైట్రైడ్ సంయోగపదార్ధం బాష్పీభవన స్థానం 2,240 °C (4,060 °F; 2,510K)2,200 °C (3,990 °F;2,470K)[1],ఈ ఉష్ణోగ్రత చేరునప్పటికి బెరీలియం నైట్రైడ్ వియోగం చెందును.

రసాయన చర్యలు

[మార్చు]

ఖనిజఆమ్లాలతో బెరీలియం నైట్రైడ్ రసాయనచర్య వలన అమ్మోనియా, ఆమ్లసంబంధిత లవణాలు ఏర్పడును.

Be3N2 + 6HCl → 3 BeCl2 + 2 NH3

గాఢ బలమైనక్షారాలతో బెరీలియం నైట్రైడ్ రసాయనచర్య జరపడం వలన బెరిలేట్ (beryllate)ఏర్పడి,అమ్మోనియా విడుదల అగును.

Be3N2 + 6NaOH → 3Na2BeO2 + 2NH3

ఆమ్లాలతో, క్షారాలతో బెరీలియం నైట్రైడ్ జరుపు రసాయనచర్య చురుకుగా వేగవంతంగా ఉండును.అయితే నీటితో చాలా నెమ్మదిగా చర్య జరుగును.

Be3N2 + 6H2O → 3 Be(OH)2 + 2 NH3

ఆక్సీకరణ కారకాలతో బెరీలియం నైట్రైడ్ జరుపు రసాయనచర్య స్థాయి చాలా తీవ్రంగా ఉండును. బెరీలియం నైట్రైడ్ ను గాలిలో 600 °C వరకు వేడిచేసిన ఆక్సీకరణ చెందును.

ఉపయోగాలు

[మార్చు]

బెరీలియం నైట్రైడ్‌ను రిఫ్రాక్టరి సేరామిక్స్ తయారీలోఉపయోగిస్తారు[4]. న్యూక్లియర్ రియాక్టరు లలో అణుధార్మికతయుత కార్బన్14ను ఉత్పత్తి చెయ్యుటకు ఉపయోగిస్తారు.

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు/ఆధారాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "Beryllium Nitride". americanelements.com. Retrieved 2015-10-07.
  2. 2.0 2.1 Egon Wiberg, Arnold Frederick Holleman (2001) Inorganic Chemistry, Elsevier ISBN 0-12-352651-5
  3. "Beryllium Nitride". espimetals.com. Retrieved 2015-10-07.
  4. Hugh O. Pierson, 1996, Handbook of Refractory Carbides and Nitrides: Properties, Characteristics, Processing, and Applications, William Andrew Inc.,ISBN 0-8155-1392-5