మా ఎన్నికలు 2021

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నికలు 10 అక్టోబర్ 2021న జరిగాయి. ఈ ఎన్నికల్లో ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ , విష్ణు మంచు ప్యానల్‌ ప్రధాన పోటీలో ఉన్నాయి.‘మా’ ఎన్నికలు 2021 ఏప్రిల్‌లో జరగాల్సి ఉండగా కొవిడ్‌ సెకెండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడి అక్టోబర్ 10న జరగనున్నాయి. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) 900 మంది సభ్యులు ఉన్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నికల కోలాహలం 2021 జూన్ నుండే ప్రారంభమైంది. ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ప్రకాశ్‌ రాజ్‌ , విష్ణు మంచు, జీవిత రాజశేఖర్‌[1], హేమ,[2] సీవీఎల్‌ నరసింహారావు, స్వతంత్ర అభ్యర్ధిగా జనరల్ సెక్రటరీ పదవికి బండ్ల గణేష్ పోటీ చేయనున్నట్టు ప్రకటించారు.[3]

జీవిత రాజశేఖర్‌ ముందుగా అధ్యక్షురాలిగా పోటీ చేస్తున్నట్టు ప్రకటించి ఆ తర్వాత ప్రకాష్ రాజ్ ప్యానెల్‌లో చేరి జనరల్ సెక్రటరీగా, అధ్యక్షురాలిగా పోటీ చేస్తానన్న హేమ ప్రకాష్ రాజ్ ప్యానెల్‌లో చేరి వైస్‌ ప్రెసిడెంట్‌గా పోటీకి దిగారు.సీవీఎల్‌ నరసింహారావు ‘మా’ అధ్యక్ష పదవికి 2021 అక్టోబర్ 1న నామినేషన్‌ దాఖలు చేసి, తన మ్యానిఫెస్టోను ప్రకటించిన అనంతరం కొద్ది సేపటికే నామినేషన్‌ను ఉపసంహరించుకున్నాడు.[4] మా 2021-23 కార్యవర్గానికి సంబంధించి మొత్తం 26 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటే 56 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మా ఎన్నికలు అక్టోబర్ 10న ఫిల్మ్‌నగర్‌లోని జూబ్లీ పబ్లిక్ పాఠశాలలో జరిగాయి. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికల అధికారిగా కృష్ణమోహన్‌ ఉన్నాడు.

ఎన్నికల ప్రక్రియ[మార్చు]

  • నామినేషన్‌ : 27 సెప్టెంబర్‌ నుండి 29 సెప్టెంబర్‌ 2021
  • నామినేషన్‌ల పరిశీలన : 30 సెప్టెంబర్‌ 2021
  • నామినేషన్ల ఉపసంహరణ: 1 , 2 అక్టోబర్‌ 2021
  • ఎన్నికలు , ఫలితాలు : 10 అక్టోబర్‌ 2021

మా అధ్యక్ష అభ్యర్థులు[మార్చు]

  1. ప్రకాశ్‌ రాజ్‌ [5]
  2. విష్ణు మంచు

హైదరాబాద్ ఫిలిం నగర్ లోని ఫిలింఛాంబర్ లో సెప్టెంబర్ 27న ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యులతో, మంచు విష్ణు సెప్టెంబర్ 28న తన ప్యానల్ సభ్యులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.

‘మా’ ఎన్నికల బరిలో నిలిచిన తుది అభ్యర్థుల జాబితా[మార్చు]

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) అధ్యక్ష పదవికి ప్రకాశ్‌ రాజ్‌ ,విష్ణు మంచు పోటీ పడుతున్నారు. అధ్యక్ష పదవికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సీవీఎల్ నరసింహారావు, కె.శ్రావణ్ కుమార్ చివరి నిమిషంలో నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి బాబుమోహన్, శ్రీకాంత్ ఉపాధ్యక్ష పదవికి మంచు విష్ణు ప్యానెల్ నుంచి పృథ్వీరాజ్, మాదాల రవి, ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ నుంచి బెనర్జీ, హేమ పోటీలో ఉన్నారు. జనరల్ సెక్రటరీ పోస్టుకు జీవిత రాజశేఖర్‌ (ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌), రఘుబాబు (విష్ణు ప్యానెల్‌)లు బరిలో నిలిచారు.

(మా) కోశాధికారి పదవికి శివబాలాజీ, నాగినీడు పోటీలో ఉండగా రెండు జాయింట్ సెక్రటరీ పదవులకు ఉత్తేజ్, అనితా చౌదరి, బచ్చల శ్రీనివాస్, గౌతమ్ రాజ్, కళ్యాణి లు పోటీలో ఉన్నారు. అసోసియేషన్‌లోని 18 ఈసీ పోస్టులకు 39 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

మంచు విష్ణు ప్యానల్

మంచు విష్ణు ప్యానల్ సభ్యుల జాబితా[మార్చు]

  1. అధ్యక్షుడు : మంచు విష్ణు
  2. ఉపాధ్యక్షులు : మాదాల రవి, పృథ్వీరాజ్
  3. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్: బాబు మోహన్
  4. సంయుక్త కార్యదర్శులు: కరాటే కల్యాణి, గౌతమ్ రాజు
  5. కోశాధికారి: శివ బాలాజీ
  6. జనరల్ సెక్రటరీ: రఘుబాబు
ఈసీ సభ్యులు

1. సంపూర్ణేష్ బాబు 2. అర్చన 3. స్వప్నమాధురి 4. విష్ణు బోపన్న 5. వడ్లపట్ల 6. అశోక్ కుమార్ 7. గీతాసింగ్ 8. హరినాథ్ బాబు 9. జయవాణి 10. మేర్లపాక శైలజ 11. పూజిత 12. రాజేశ్వరిరెడ్డి 13. రేఖ 14. శశాంక్ 15. శివనారాయణ 16. శ్రీలక్ష్మి 17. శ్రీనివాసులు [6]

ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యుల జాబితా[మార్చు]

ప్రకాష్ రాజ్ ప్యానల్
  1. అధ్యక్షుడు : ప్రకాష్ రాజ్
  2. ఉపాధ్యక్షులు : బెనర్జీ, హేమ
  3. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్: శ్రీకాంత్‌
  4. సంయుక్త కార్యదర్శులు: అనితా చౌదరి, ఉత్తేజ్
  5. కోశాధికారి: నాగినీడు
  6. జనరల్ సెక్రటరీ: జీవితా రాజశేఖర్‌
ఈసీ సభ్యులు

1. ప్రగతి 2. అనసూయ 3. అజయ్ 4. సుబ్బరాజు 5. సమీర్ 6. ఖయ్యూం 7. బ్రహ్మాజీ 8. కౌశిక్ 9. ప్రభాకర్ 10. భూపాల్ 11. శివారెడ్డి 12. రమణారెడ్డి 13. సుడిగాలి సుధీర్ 14. సురేష్‌ కొండేటి 15. తనీష్ 16. టార్జాన్ 17. గోవింద రావు [7][8]

ఎన్నికల ఫలితాలు[మార్చు]

అక్టోబర్ 10న జరిగిన ‘మా’ ఎన్నికల్లో 926 మంది సభ్యులున్న ‘మా’ లో 883 ఓటర్లకు గాను మొత్తం 665 ఓట్లు పోలవగా ఇందులో 52 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షులుగా పోటీ చేసిన విష్ణు మంచు 381 ఓట్లు సాధించగా, ప్రకాశ్‌రాజ్‌ కు 274 ఓట్లు వచ్చాయని దీనితో 107 ఓట్ల తేడాతో విష్ణు గెలుపొందడని ఎన్నికల అధికారి వి.కృష్ణ మోహన్‌ అధికారికంగా ప్రకటించాడు. మా జనరల్‌ సెక్రటరీగా పోటీ చేసిన రఘుబాబు (విష్ణు ప్యానల్‌ - 340 ఓట్లు) జీవితా రాజశేఖర్‌ (ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ - 313 ఓట్లు) పై 27 ఓట్లతో గెలిచాడు.[9] ‘మా’ అధ్యక్షుడిగా అక్టోబర్ 13న మంచు విష్ణు బాధ్యతలు చేపట్టాడు.[10]

2021 ‘మా’ కార్యవర్గం[మార్చు]

కార్యవర్గ సభ్యులు

గీతా సింగ్అశోక్‌ కుమార్‌ఎన్‌.శివన్నారాయణసంపూర్ణేశ్‌బాబుశివారెడ్డిబ్రహ్మాజీతనీష్‌సురేశ్‌ కొండేటిసుడిగాలి సుధీర్సమీర్ ♦ కౌశిక్‌ ♦ శ్రీలక్ష్మీ ♦ సి.మాణిక్‌ ♦ ప్రభాకర్‌ ♦ శ్రీనివాసులు ♦ హరనాథ్‌బాబు ♦ శశాంక్‌ ♦ బొప్పన విష్ణు[11]

రాజీనామాలు[మార్చు]

మా ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత అక్టోబర్‌ 10న మా ప్రాథమిక సభ్యత్వానికి నాగబాబు,[12] అక్టోబర్‌ 11న హైదరాబాద్‌లోని దస్బల్లా హోటల్‌ నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రకాశ్‌ రాజ్‌ మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.[13]ప్రకాష్‌ రాజ్ ప్యానెల్‌ నుంచి గెలుపొందిన 11మంది సభ్యులు అక్టోబర్ 12న తమ పదవులకు రాజీనామా చేశారు.[14]

మూలాలు[మార్చు]

  1. Andrajyothy (26 June 2021). "నేను ఫైటర్‌ని!". Archived from the original on 3 October 2021. Retrieved 3 October 2021.
  2. Andrajyothy (24 June 2021). "'మా‌' బరిలోని ఆ నలుగురి బలాబలాలు ఇవే!". Archived from the original on 3 October 2021. Retrieved 3 October 2021.
  3. TV9 Telugu (1 October 2021). "నామినేషన్ ఉపసంహరణ.. పోటీ నుంచి తప్పుకున్న బండ్ల గణేష్". Archived from the original on 3 October 2021. Retrieved 3 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Andrajyothy (1 October 2021). "నామినేషన్‌ ఉపసంహరించుకున్నా". Archived from the original on 3 October 2021. Retrieved 3 October 2021.
  5. Andrajyothy (25 June 2021). "'మా' సభ్యుల ఆత్మగౌరవం నిలబెట్డడమే లక్ష్యం!". Archived from the original on 3 October 2021. Retrieved 3 October 2021.
  6. Sakshi (23 September 2021). "మంచు విష్ణు ప్యానల్‌ ఇదే". Archived from the original on 3 October 2021. Retrieved 3 October 2021.
  7. V6 Velugu (3 September 2021). "'మా' ఎన్నికల్లో ప్యానెల్ సభ్యులను ప్రకటించిన ప్రకాష్ రాజ్" (in ఇంగ్లీష్). Archived from the original on 3 October 2021. Retrieved 3 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  8. Sakshi (27 September 2021). "ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ నామినేషన్‌ దాఖలు.. లిస్టులో ఉన్నది వీరే." Archived from the original on 3 October 2021. Retrieved 3 October 2021.
  9. Sakshi (11 October 2021). "'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు ఘనవిజయం". Archived from the original on 11 October 2021. Retrieved 11 October 2021.
  10. TV9 Telugu (13 October 2021). "'మా' అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు.. ఆ ఫైలుపై తొలి సంతకం". Archived from the original on 15 అక్టోబరు 2021. Retrieved 15 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  11. Sakshi (11 October 2021). "'మా' ఎన్నికల్లో గెలుపొందిన మొత్తం సభ్యులు వీళ్లే." Sakshi. Archived from the original on 11 October 2021. Retrieved 11 October 2021.
  12. Sakshi (10 October 2021). "ఇక సెలవంటూ నాగబాబు సంచలన నిర్ణయం". Archived from the original on 11 October 2021. Retrieved 11 October 2021.
  13. Sakshi (11 October 2021). "'మా' సభ్యత్వానికి ప్రకాశ్‌ రాజ్‌ రాజీనామా". Archived from the original on 11 October 2021. Retrieved 11 October 2021.
  14. HMTV (12 October 2021). "మూకుమ్మడిగా రాజీనామా ప్రకటించిన ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌". Archived from the original on 12 అక్టోబరు 2021. Retrieved 15 October 2021.