Jump to content

రాజా (1976 సినిమా)

వికీపీడియా నుండి
(రాజ (1976 సినిమా) నుండి దారిమార్పు చెందింది)
రాజా
సినిమా పోస్టర్
దర్శకత్వంకె.రాఘవేంద్రరావు
రచనసలీం - జావెద్ (కథ), సత్యానంద్ (మాటలు)
నిర్మాతఎ. లక్ష్మీ కుమార్
తారాగణంశోభన్ బాబు ,
జయసుధ,
అంజలీదేవి
ఛాయాగ్రహణంవి. ఎస్. ఆర్ స్వామి
కూర్పుకోటగిరి గోపాలరావు
సంగీతంకె. చక్రవర్తి
నిర్మాణ
సంస్థ
మారుతి ప్రొడక్షన్స్
సినిమా నిడివి
136 ని
దేశంభారతదేశం
భాషతెలుగు

రాజా 1976 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇందులో శోభన్ బాబు, జయసుధ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఎ. లక్ష్మీ కుమార్ మారుతీ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించాడు. ఈ చిత్రానికి సలీం-జావెద్ కథ నందించగా సత్యానంద్ మాటలు రాశాడు. వి. ఎస్. ఆర్ స్వామి ఛాయాగ్రహణం, కోటగిరి గోపాలరావు కూర్పు బాధ్యతలు నిర్వహించారు. కె. చక్రవర్తి సంగీతాన్నందించగా ఆచార్య ఆత్రేయ, సి. నారాయణ రెడ్డి, ఆరుద్ర పాటలు రాశారు. పి. సుశీల, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం పాటలు పాడారు.

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: కె.రాఘవేంద్రరావు

సంగీతం:కొమ్మినేని చక్రవర్తి

నిర్మాత: ఎ.లక్ష్మికుమార్

నిర్మాణ సంస్థ: మారుతి ప్రొడక్షన్స్

మాటలు: సత్యానంద్

పాటలు:ఆరుద్ర , ఆత్రేయ, సి.నారాయణ రెడ్డి

నేపథ్య గాయకులు: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, వాణి జయరాం

కధ: సలీం జావేద్

కెమెరా: వి.ఎస్.ఆర్.స్వామి

కూర్పు: కోటగిరి గోపాలరావు

విడుదల:16:12:1976.

సంగీతం

[మార్చు]

కె. చక్రవర్తి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు. ఆచార్య ఆత్రేయ, సి. నారాయణ రెడ్డి, ఆరుద్ర పాటలు రాశారు. పి. సుశీల, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం పాటలు పాడారు.

1.కోటిజన్మల ఆనందం శతకోటి జన్మల అనుబందం, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల

2.ఓరబ్బో పిల్లంటే పిల్లకాదు అహా ఒళ్లంటే, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం కోరస్

3.గుండెలోన ఒకమాటుంది గొంతుదాటి రానంటుంది, రచన:ఆచార్య ఆత్రేయ, గానం.పి . సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

4.నీ నవ్వు లేకుంటే చీకటేనమ్మా నీ కనుల కన్నీళ్లు చూడలేనమ్మా, రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

5.నీ నవ్వు లేకుంటే చీకటేనమ్మా నీ కనుల కన్నీళ్లు చూడలేనమ్మ, రచన: ఆత్రేయ, గానం.పి . సుశీల

6.మాటచూస్తే మావిడల్లం మనసు చూస్తే పటిక బెల్లం, రచన:ఆరుద్ర, గానం.ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.