Jump to content

రామగిరి మండలం (సెంటనరీ కాలనీ)

అక్షాంశ రేఖాంశాలు: 18°34′N 79°33′E / 18.57°N 79.55°E / 18.57; 79.55
వికీపీడియా నుండి
(రామగిరి సెంటనరీ కాలనీ నుండి దారిమార్పు చెందింది)
రామగిరి
—  మండలం  —
తెలంగాణ పటంలో పెద్దపల్లి, రామగిరి స్థానాలు
తెలంగాణ పటంలో పెద్దపల్లి, రామగిరి స్థానాలు
తెలంగాణ పటంలో పెద్దపల్లి, రామగిరి స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°34′N 79°33′E / 18.57°N 79.55°E / 18.57; 79.55
రాష్ట్రం తెలంగాణ
జిల్లా పెద్దపల్లి
మండల కేంద్రం సెంటనరీ కాలనీ (రామగిరి మండలం)
గ్రామాలు 13
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 171 km² (66 sq mi)
జనాభా (2016)
 - మొత్తం 45,768
 - పురుషులు 23,325
 - స్త్రీలు 22,443
పిన్‌కోడ్ {{{pincode}}}

రామగిరి మండలం, తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా, రామగిరి అనే పేరుతో ఏర్పడిన కొత్త మండలం.[1]దీని పరిపాలనా ప్రధాన కేంద్రం సెంటనరీ కాలనీ.

రామగిరి కోట నుండి ప్రకృతి దృశ్యం

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. [2] దానికి ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లా లో ఉండేది. [3] ప్రస్తుతం ఈ మండలం మంథని రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 15  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు. ఇక్కడికి సమీపంలో రామగిరి కోట ఉంది.

గణాంకాలు

[మార్చు]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 171 చ.కి.మీ. కాగా, జనాభా 45,768. జనాభాలో పురుషులు 23,325 కాగా, స్త్రీల సంఖ్య 22,443. మండలంలో 12,002 గృహాలున్నాయి.[4]

2016 లో ఏర్పడిన మండలం

[మార్చు]
రామగిరి కోట

లోగడ రామగిరి (సెంటనరీ కాలనీ) గ్రామం కరీనగర్ జిల్లా, మంథని రెవెన్యూ డివిజను పరిధిలోని కమాన్‌పూర్ మండలానికి చెందినది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా రామగిరి మండలం పేరుతో సెంటనరీ కాలనీ మండల ప్రధాన కేంద్రంగా ఉండేలాగున (0+15) పదిహేను గ్రామాలుతో నూతన మండలంగా పెద్దపల్లి జిల్లా,మంథని రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. ముస్తియల్
  2. ఉప్పర్లకేసారం
  3. లంకకేసారం
  4. కల్వచర్ల
  5. నాగేపల్లి
  6. పన్నూర్
  7. బేగంపేట
  8. సుందిళ్ల
  9. జల్లారం
  10. రత్నాపూర్
  11. ఆదివారంపేట
  12. లద్నాపూర్
  13. బుధవారంపేట

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణించబడలేదు

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016   
  2. "పెద్దపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "పెద్దపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లింకులు

[మార్చు]