రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకం
రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించినన మంత్రి టి. హరీశ్ రావు
ప్రదేశంతేలెల్మ, ఆందోల్ మండలం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ
ఆవశ్యకతవ్యవసాయానికి నీరు
స్థితివాడుకలో వున్నది
నిర్మాణం ప్రారంభం2017-2018
ప్రారంభ తేదీ2022, జూన్ 20
నిర్మాణ వ్యయం36 కోట్ల 74 లక్షల రూపాయలు
యజమానితెలంగాణ ప్రభుత్వం
నిర్వాహకులుతెలంగాణ నీటిపారుదల శాఖ
ఆనకట్ట - స్రావణ మార్గాలు
Spillway typeChute spillway
Website
నీటిపారుదల శాఖ వెబ్సైటు

రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, ఆందోల్ మండలం, తేలెల్మ గ్రామ సమీపంలో ఉన్న ఎత్తిపోతల పథకం.[1] 36 కోట్ల 74 లక్షల రూపాయల వ్యయంతో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన ఎత్తిపోతల పథకం ద్వారా ఆందోల్, వట్‌పల్లి, ఆళ్ళదుర్గ్, టేక్మల్ మండలాల్లోని 14 గ్రామాలకు చెందిన 3 వేల ఎకరాలకు ప్రత్యక్షంగా, మరో 10 వేల ఎకరాలకు పరోక్షంగా సాగునీరు అందుతోంది.[2]

ప్రణాళిక[మార్చు]

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, 2017-2018 మధ్యకాలంలో ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ప్రణాళికను రూపొందించాడు. ఈ పథకంలో భాగంగా 2 ప్రధాన డిస్టిబ్యూటరీ కెనాల్స్‌ ఏర్పాటుచేశారు. సింగూరు ప్రాజెక్టు నుంచి 0.117 టీఎంసీల నీటిని ఎత్తిపోసి, ఈ 14 గ్రామాల్లోని 40 ట్యాంకులను నింపడమే లక్ష్యంగా నిర్మించిన ఈ ప్రాజెక్టుకు 2018లో శంకుస్థాపన జరిగింది.

నీటిపారుదల శాఖ ఇక్కడ నాలుగు 430 హెచ్‌పీ మోటార్లను ఏర్పాటుచేసింది, ఇవి రోజుకు 41.2 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తాయి. నీటిపారుదల శాఖ మూడు ఫీడర్ ఛానళ్లను నిర్మించి, లీకేజీలను అరికట్టేందుకు నిర్వహించిన ట్రయల్ రన్ కూడా విజయవంతమైంది.[3]

ప్రారంభం[మార్చు]

2022 జూన్ 20న ఉదయం 11 గంటలకు సాయిపేట శివారులోని సింగూరు ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ వద్ద ఏర్పాటుచేసిన ఎత్తిపోతల పంప్‌హౌస్‌ మోటార్లను తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖామంత్రి టి. హరీశ్ రావు స్విచ్‌ ఆన్‌ చేసి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి, నీటిని విడుదల చేశాడు.[4] డిస్ట్రిబ్యూటర్‌ ఛానెల్‌ వద్ద మంజీరా నీటిలో పూలను వెదజల్లి, మంజీరా జలాలతో పక్కనే ఉన్న రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారికి అభిషేకం చేశాడు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బి.బి. పాటిల్‌, ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, కలెక్టర్‌ శరత్‌, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[5]

మూలాలు[మార్చు]

  1. "Harish rao: రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకం ప్రారంభం". ETV Bharat News. 2022-06-20. Archived from the original on 2022-07-01. Retrieved 2022-07-01.
  2. krishna (2022-06-20). "సింగూరు నీళ్లతో రేణుక ఎల్లమ్మ పాదాలు కడిగాం: హరీష్ రావు". Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News. Archived from the original on 2022-06-20. Retrieved 2022-07-01.
  3. Today, Telangana (2022-06-19). "Talelma Project to bring 3,000 acres upstream Singur project under irrigation". Telangana Today. Archived from the original on 2022-06-19. Retrieved 2022-07-01.
  4. Velugu, V6 (2022-06-20). "కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వరు". V6 Velugu. Archived from the original on 2022-06-30. Retrieved 2022-07-01.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  5. "అందోలు ఇక.. తెలంగాణ కోనసీమ". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-06-21. Archived from the original on 2022-07-01. Retrieved 2022-07-01.