Jump to content

నాగమడుగు ఎత్తిపోతల పథకం

వికీపీడియా నుండి
నాగమడుగు ఎత్తిపోతల పథకం
నాగమడుగు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్
ప్రదేశంజక్కాపూర్, నిజాంసాగర్‌ మండలం, కామారెడ్డి జిల్లా, తెలంగాణ
ఆవశ్యకతవ్యవసాయానికి నీరు
స్థితినిర్మాణంలో వున్నది
నిర్మాణం ప్రారంభం2023, మార్చి 15
నిర్మాణ వ్యయం476.25 కోట్లు
యజమానితెలంగాణ ప్రభుత్వం
నిర్వాహకులుతెలంగాణ నీటిపారుదల శాఖ
ఆనకట్ట - స్రావణ మార్గాలు
Spillway typeChute spillway
Website
నీటిపారుదల శాఖ వెబ్సైటు

నాగమడుగు ఎత్తిపోతల పథకం అనేది తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా, నిజాంసాగర్‌ మండలం, జక్కాపూర్ గ్రామం సమీపంలో నిర్మించబడుతున్న ఎత్తిపోతల పథకం. 476.25 కోట్ల రూపాయలతో నిర్మించబడుతున్న ఈ పథకం ద్వారా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్, పిట్లం, పెద్ద కొడప్గల్, బిచ్కుంద మండలాలకు చెందిన 40 గ్రామాలలోని దాదాపు 40 వేల 768 ఎకరాలకు సాగునీరు అందుతుంది.[1][2]

నీటి వినియోగం

[మార్చు]

ఈ పథకంలో భాగంగా 12 కిలోమీటర్ల పైప్‌లైన్‌ నిర్మాణం చేపట్టారు. మంజీరా ఉపనదుల ద్వారా నాగమడుగు ఎత్తిపోతల పథకానికి వరద నీరు వచ్చి చేరి 0.280 టీఎంసీల నీటి సామర్థ్యానికి నిల్వచేస్తూ మిగతా నీటిని మంజీరా నదిలోనికి వదులుతారు. యాసంగిలో నిజాంసాగర్‌ ప్రాజెక్టు వరద నీళ్ళ ద్వారా నాగమడుగు ఎత్తిపోతల పథకానికి అవసరమయ్యే నీటిని వదులుతారు. దాంతో నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టు 2 లక్షల 8 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నాగమడుగు ఎత్తిపోతల నీరే నిజాంసాగర్‌ ఆయకట్టు మరో 40 వేల 768 ఎకరాలు పెరుగనున్నాయి.[3]

శంకుస్థాపన

[మార్చు]

2023 మార్చి 15న నాగమడుగు ఎత్తిపోతల పథకానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు శంకుస్థాపన చేశాడు.[4] ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, నిజామాబాద్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ‌ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్, ప్రభుత్వ విప్ కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[5]

మూలాలు

[మార్చు]
  1. ABN (2021-02-12). "నాగమడుగు లిఫ్ట్‌తో 40వేల ఎకరాలకు సాగు నీరు". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-03-15. Retrieved 2023-03-15.
  2. telugu, NT News (2023-03-15). "నాన్‌ కమాండ్‌ కు జలాభిషేకం". www.ntnews.com. Archived from the original on 2023-03-15. Retrieved 2023-03-15.
  3. ABN (2021-03-29). "నాగమడుగు ఎత్తిపోతలకు నిజాంసాగర్‌ నీళ్లే!". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-03-15. Retrieved 2023-03-15.
  4. "నాగమడుగు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్‌". EENADU. 2023-03-15. Archived from the original on 2023-03-15. Retrieved 2023-03-15.
  5. "నాగమడుగు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన". Prabha News. 2023-03-15. Archived from the original on 2023-03-15. Retrieved 2023-03-15.