పేరూరు ఎత్తిపోతల పథకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పేరూరు ఎత్తిపోతల పథకం
పేరూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రి కేటీఆర్
ప్రదేశంమహబూబ్‌నగర్, తెలంగాణ
ఆవశ్యకతవ్యవసాయానికి నీరు
నిర్మాణం ప్రారంభం2022
నిర్వాహకులుతెలంగాణ నీటిపారుదల శాఖ
ఆనకట్ట - స్రావణ మార్గాలు
నిర్మించిన జలవనరుకృష్ణా నది
Website
నీటిపారుదల శాఖ వెబ్సైటు


పేరూరు ఎత్తిపోతల పథకం, తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, దేవరకద్ర మండలంలోని వెంకటాయిపల్లి- పేరూరు గ్రామాల మధ్యలో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం. రామన్ పాడు బ్యాక్ వాటర్ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ ఎత్తిపోతల పథకం ద్వారా పేరూరు, వెంకపల్లి, అమ్మాపూర్, వెంకటగిరి, రేకుళంపల్లి, దాసరిపల్లిలోని 3500 ఎకరాలకు సాగునీరు అందుతుంది.[1]

పరిపాలనా అనుమతులు[మార్చు]

2021 మార్చి 23న ఈ ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. నిర్మాణానికి కావలసిన 51 కోట్ల రూపాయల నిధులను మంజూరుచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.[2]

పేరూరు ఎత్తిపోతల పథకం[మార్చు]

ఈ గ్రామ సరిధిలో 55 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ ఎత్తిపోతల పథకానికి 2022, జూన్ 4న తెలంగాణ రాష్ట్ర ఐటి, పురపాలక పరిశ్రమల శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు శంకుస్థాపన చేశాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖామంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పర్యాటక సాంస్కృతిక శాఖామంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, మహబూబ్‌నగర్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే సి.హెచ్. లక్ష్మారెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[3][4]

మూలాలు[మార్చు]

  1. telugu, NT News (2021-03-23). "పేరూర్ లిఫ్ట్ ఏర్పాటుకు పరిపాలనా అనుమతులు మంజూరు". www.ntnews.com. Archived from the original on 2021-03-23. Retrieved 2023-01-23.
  2. ABN (2021-03-24). "పేరూరు ఎత్తిపోతల పథకానికి రూ.51 కోట్లుb". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-01-23. Retrieved 2023-01-23.
  3. telugu, NT News (2022-06-04). "పేరూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్‌". Namasthe Telangana. Archived from the original on 2022-06-05. Retrieved 2023-01-23.
  4. "పేరూరు ఎత్తిపోతల పథకానికి కేటీఆర్ శంకుస్థాపన | తాజా వార్తలు | www.NavaTelangana.com". NavaTelangana. 2022-06-04. Archived from the original on 2022-06-05. Retrieved 2023-01-23.