లక్ష్మీనరసింహస్వామి ఎత్తిపోతల పథకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లక్ష్మీనరసింహస్వామి ఎత్తిపోతల పథకం
ప్రదేశంగుండంపల్లి, దిలావర్‌పూర్‌ మండలం, నిర్మల్ జిల్లా, తెలంగాణ
ఆవశ్యకతవ్యవసాయానికి నీరు
స్థితివాడుకలో వున్నది
ప్రారంభ తేదీ2023, అక్టోబరు 3
నిర్మాణ వ్యయం714 కోట్లు
యజమానితెలంగాణ ప్రభుత్వం
నిర్వాహకులుతెలంగాణ నీటిపారుదల శాఖ
ఆనకట్ట - స్రావణ మార్గాలు
Spillway typeChute spillway
Website
నీటిపారుదల శాఖ వెబ్సైటు

లక్ష్మీనరసింహస్వామి ఎత్తిపోతల పథకం అనేది తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లా, దిలావర్‌పూర్‌ మండలంలోని గుండంపల్లి వద్ద నిర్మించిన ఎత్తిపోతల పథకం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్యాకేజీ నంబర్‌ -27లో భాగంగా దీనిని నిర్మించారు.[1]

నిర్మాణం[మార్చు]

714 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ పథకం ద్వారా నిర్మల్‌ నియోజకవర్గంలోని దిలావర్‌పూర్‌, నర్సాపూర్‌ (జి), కుంటాల, సారంగాపూర్‌, నిర్మల్‌, లక్ష్మణచాంద, మామడ, సోన్‌ మండలాల్లోని 99 గ్రామాల పరిధిలో గల చెరువులు, కుంటలకు నీరందుతోంది.[2]

ప్రాజెక్టు వివరాలు[మార్చు]

ప్యాకేజీ 27 పనులను మూడు యూనిట్లుగా విభజించబడ్డాయి. మొదటి యూనిట్‌ లో 32 వేల ఆయకట్టు కోసం దిలావర్‌పూర్‌ గ్రామ శివారులో సిస్టర్న్‌ నిర్మించబడింది. దీని ద్వారా ఎడమ ప్రధాన కాలువ, కుడి ప్రధాన కాలువలోకి సాగునీటిని ఎత్తి పోస్తున్నారు. యూనిట్‌-1 కింద ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌లో గుండంపెల్లి వద్ద పంప్‌హౌస్‌, 6.70 కిలోమీటర్ల పొడువుతో అప్రోచ్‌ చానల్‌ను నిర్మించబడింది. ఎడమ ప్రధాన కాలువ పొడువు 29.50 కిలో మీటర్లు కాగా, ఈ కాలువ ద్వారా నీటి సరఫరా సామర్థ్యం 140 క్యూసెక్కులు ఉంది. కుడి ప్రధాన కాలువ పొడువు 13.50 కిలోమీటర్లు కాగా, నీటి సరఫరా సామర్థ్యం 100 క్యూసెక్కులుగా ఉంది.[3]

రెండో యూనిట్‌ లో 5 వేల ఎకరాల ఆయకట్టు కోసం దిలావర్‌పూర్‌ గ్రామ శివారులో మొదటి పంప్‌హౌస్‌ డెలివరీ సిస్టర్న్‌ వద్ద రెండో పంప్‌హౌస్‌ నిర్మించబడింది. ఇక్కడి నుంచి పంపింగ్‌ ద్వారా నీటిని ఎత్తి పోస్తున్నారు. దీని పరిధిలో ఎడమ కాలువ పొడువు 7.50 కిలోమీటర్లు కాగా, కుడి కాలువ పొడువు 3.75కిలోమీటర్లుగా ఉంది. ఆయా కాలువల నీటి సరఫరా సామర్థ్యం 20 క్యూసెక్కులుగా ఉంది.

3వ యూనిట్‌ లో 13 వేల ఆయకట్టు కోసం సోన్‌ మండలంలోని కడ్తాల్‌ గ్రామం వద్ద మూడో పంప్‌హౌస్‌ నిర్మాణంలో ఉంది. ఈ పంప్‌హౌజ్‌లోని రెండు పంపుల ద్వారా సరస్వతీ కెనాల్‌లో నుంచి నీటిని ఎత్తి పోయాలని ప్రతిపాదించబడింది. దీనికింద 2023 అక్టోబరు నాటికి 17.50 కిలోమీటర్ల మేర ఎడమ కాలువ, 1.90 కిలోమీటర్ల మేర కుడి కాలువల నిర్మాణం పనులు జరుగుతున్నాయి.[4]

ప్రారంభం[మార్చు]

దిలావర్‌పూర్‌ మండలంలోని గుండంపెల్లి వద్ద నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ నంబర్‌ -27 ( శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఎత్తిపోతల పథకం)ను 2023, అక్టోబరు 3న రాష్ట్ర ఐటీ, పురపాలక పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించి, రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి ఎత్తిపోతల పథకానికి స్విచ్‌ ఆన్‌ చేసి కాలువలకు నీటిని విడుదల చేసి రైతులకు అంకితం ఇచ్చాడు.[5]

మూలాలు[మార్చు]

  1. Today, Telangana (2023-10-04). "KTR inaugurates Sri Lakshminarsimha Swamy Lift Irrigation Scheme in Nirmal". Telangana Today. Archived from the original on 2023-10-29. Retrieved 2023-10-29.
  2. "Nirmal - శీ లక్ష్మీనరసింహస్వామి ఎత్తిపోతల పథకాన్నిరైతుల‌కు అంకితం చేసిన కెటిఆర్". Prabha News (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-10-04. Archived from the original on 2023-10-12. Retrieved 2023-10-29.
  3. Today, Telangana (2023-10-03). "Sri Laxminarasimha Swamy Lift Irrigation Scheme becomes reality". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2023-10-29. Retrieved 2023-10-29.
  4. telugu, NT News (2023-10-04). "Minister KTR | శ్రీలక్ష్మీనరసింహస్వామి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌". www.ntnews.com. Archived from the original on 2023-10-05. Retrieved 2023-10-06.
  5. Latha, Suma (2023-10-04). "శ్రీలక్ష్మీనరసింహస్వామి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌". Vaartha. Archived from the original on 2023-10-05. Retrieved 2023-10-29.