వక్తృత్వం
Appearance
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
వక్తృత్వం అనగా ఏదైనా విషయము గురించి ఆసక్తికరంగా మాట్లాడటం లేక ఉపన్యాసము చేయడం. తోటివారిపై ప్రభావం చూపడంలో, ఇది చాలా ఉపయోగం. చర్చ లాంటి కార్యక్రమాలలో కూడా ఈ కళ తెలిసినవారు చాలా సులభంగా ఇతరులను ఆకట్టుకుంటారు. అందువలన, పాఠశాల స్థాయినుండే విద్యార్థులలో వేదిక భయము పోగొట్టటానికి, వక్తృత్వ పోటీలు ఏర్పాటు చేస్తారు.
సాధారణ భావ ప్రసరణ కంటే ఈ విషయంలో ఉపన్యాసకులు పదాలను సరిగా పలకడం, సరిగా బట్టలు వేసుకోవడం, నిలబడడం, సంజ్ఞలు వాడడంపై ధ్యాసపెడతారు. ప్రతి సంవత్సరం జిల్లా, రాష్ట్ర స్థాయిలలో పోటీలు జరుగుతాయి.
నైపుణ్యతని పెంచుకోవటానికి సూచనలు
[మార్చు]- విషయాన్ని సమగ్రంగా తెలుసుకోవటం.
- ఉపన్యాసాన్ని తయారుచేసుకోవడం
- సమయపాలనకి, పొరపాట్లు దొర్లకుండా వుండటానికి, ముందుగా ప్రాక్టీస్ చేయడం.
- టోస్ట్ మాస్టర్ సంఘంలో సభ్యులుగా చేరటం