వాడుకరి:JVRKPRASAD/నా గురించి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


JVRKPRASAD
విజయవాడ లోని స్వగృహము నందు తీసుకున్న చిత్రం
విజయవాడ లోని స్వగృహము నందు తీసుకున్న చిత్రం
లింగము: పురుషుడు
పుట్టిన రోజు: (1956-08-13) 1956 ఆగస్టు 13 (వయస్సు: 63  సంవత్సరాలు)
పుట్టిన స్థలం: అవనిగడ్డ
ప్రస్తుతం ఉంటున్న స్థలం: విజయవాడ,
హైదరాబాదు,
గుడివాడ
దేశం: భారతదేశం
వివాహం: Married
జీవిత భాగస్వామి: పద్మావతి
గర్ల్‌ ఫ్రెండ్: No
పిల్లలు: 2 - 1.Daughter:Gynaecologist
2.Son:Project Manager, సింగపూర్
3.Daughter-in-law: Sr.Engineer, సింగపూర్
వృత్తి: విశ్రాంత ఉద్యోగి
ఉద్యోగం: భారతీయ రైల్వేలు
కాలేజి: గుడివాడ
స్కూలు: A.G.K.M.H.School
మతము: హిందూ
Politcs: వేదాంతం Socialism
సంప్రదించే సమాచారం
ఈ-మెయిల్: Here

వంశ వృక్షం లింకులు[మార్చు]

 • [1] నా వంశవృక్షం.
 • [2]వంశవృక్షం

జీవిత విశేషాలు[మార్చు]

నివాస స్థలము: విజయవాడ
 • ఒకటవ తరగతి: బళ్ళారి, కర్నూలు.రాయదుర్గం, అనంతపురము, అవనిగడ్డ. నేను మునిసిపల్ స్కూల్స్ లందు నందు 1961-1962 సం.లో చేరాను. వేసవి సెలవులలో ఖాళీగా వుండటము ఎందుకని, చదువుకునేందుకు అవనిగడ్డలో "జానకి రామయ్య" మాష్టారి ఇంటికి వెళ్ళే వాడిని. పెద్ద కాలువ దగ్గర వారి నివాసము.
 • రెండవ తరగతి: కడప, చిత్తూరు, చీరాల, చినగంజాము, బాపట్ల, తణుకు, పెరవలి, అవనిగడ్డ. నేను చినగంజాము మునిసిపల్ స్కూలు నందు 1962-1963 సం.లో చేరాను. వేసవి సెలవులలో ఖాళీగా వండటము ఎందుకని చదువుకునేందుకు అవనిగడ్డలో జానకి రామయ్య మాష్టారి ఇంటికి వెళ్ళే వాడిని. తణుకులో పెదకాలువ దగ్గర కుడివైపున పచ్చడి మరియు తీపి మామిడి చెట్లు ఉన్న ఇంట్లో కుడివైపు వాటాలో బామ్మ గారింట్లో అద్దెకు ఉండే వాళ్లము. ఆ కాలువలో అందరూ ఈత కొడుతూ ఉంటే, నేను కూడా అందులో దూకాను, కానీ నాకు ఈత రావాలి అని తెలియదు. మునిగిపోతూ ఉంటే నీళ్ళలో ఏడుస్తూ అరిచాను. ఎవరికీ వినబడదు, కానీ అ దృశ్యం నా సోదరికి తెలిసి జుట్టు పట్టుకుని లాగి బయట మెట్ల మీద పడేసింది. అప్పటి నుండి నీళ్ళు లోతైనా లేదా ఎత్తైనవి చూస్తే భయం ఇప్పటికీ ఉంది
 • మూడవ తరగతి: అవనిగడ్డ, ఒంగోలు:: నేను తోపులో బడి, పోలీసు స్టేషను రోడ్డు, రంగారాయుడు చెరువు దగ్గర వున్న మునిసిపల్ స్కూలు నందు 1963-1964 సం.లో చేరాను. వేసవి సెలవులలో ఖాళీగా వండటము ఎందుకని చదువుకునేందుకు అవనిగడ్డలో జానకి రామయ్య మాష్టారి ఇంటికి వెళ్ళే వాడిని. వారి దగ్గరకు 1961-1964 సం.ల వరకు వెళ్ళాను. నాకు "ఎవరెస్టు పాఠంలో పర్వత శిఖరాల కొలతలు అంతగా గుర్తుంచుకునే వాడిని కాదు. మరుసటి రోజు అడిగే వారు. చెప్పలేక పోయే వాడిని. అందువల్ల దెబ్బలు రోజూ తిని, ఆ తరువాత బుద్దిగా, శ్రద్దగా చదివి చెప్పేవాడిని. అందుకేనేమో లెక్కలు, సైన్సు డిగ్రీలో మంచి మార్కులు వచ్చాయేమో అని అనుకుంటాను. ఆస్ట్రానమీ, హిందూ తత్వము, స్నేహములు, చదువు, కుటుంబ వ్యవస్థ, తదితరములు అంటే ఇష్టము.
 • నాల్గవ తరగతి: నేను తోపులో బడి, పోలీసు స్టేషను రోడ్డు, రంగారాయుడు చెరువు దగ్గర వున్న మునిసిపల్ స్కూలు నందు 1964-1965 సం.లో చదివాను.
 • ఐదవ తరగతి: నేను తోపులో బడి, పోలీసు స్టేషను రోడ్డు, రంగారాయుడు చెరువు దగ్గర వున్న మునిసిపల్ స్కూలు నందు 1965-1966 సం.లో చదివాను.
 • ఆరవ తరగతి: నేను పి.వి.ఆర్. స్కూలు, జయరామ టాకీసు థియేటరు (పోలీసు స్టేషను రోడ్డు, రంగారాయుడు చెరువు దాటితే అదే రోడ్డులో వస్తుంది.) దగ్గర వున్న మునిసిపల్ స్కూలు నందు 1966-1967 సం.లో చదివాను.

మేము రంగారాయుడు చెరువు దగ్గర ఒక పెద్ద సత్రం వుంది. దాని ప్రక్కన పెద్ద ఇల్లు వండేది. దానిలో వుండే వాళ్ళము. ఆ ఇంటిని ఇప్పుడు 4 భాగాలు చేసి, 2 భాగాలు ఒకరు, ఒక భాగము ఒకరు మరో భాగము ఇంకొకరు తీసుకున్నారు.

వివాహము[మార్చు]

 • నాకు 1979 సం. లో ప్రపోజలు, 1980 సం. లో పెళ్ళి చూపులు, 1981, ఫిబ్రవరి, 19 న వివాహము. ఒకే ఒక సంబంధము చూసాను (ము), ఆ తరువాత పెళ్ళి.

పెళ్ళి తరువాత మొదటి సినిమా[మార్చు]

నేను సినిమాలు పెద్దగా చూడను. ఆ రోజుల్లో పెళ్ళి తరువాత మొదటిగా భార్యాభర్తలు ఇద్దరు కలసి సినిమాకు వెళ్ళితే గుర్తుగా వుంటుంది అని అనుకున్నాను. మేము చూసిన, మా మొదటి సినిమా ప్రేమాభిషేకం. ఆ సినిమాని గుడివాడ, భాస్కర్ ధియేటరు నందు రెండవ ఆట ఛూసాము.

సినిమా రికార్డు''[మార్చు]

మాకు వివాహము అయి సంవత్సరము అయ్యింది. ఆఫీసు నుంచి వచ్చాను. ఈ రోజు ఏదో ఒకటి జీవితములో గుర్తు వుండే పని చేయాలి అని అనుకున్నా(ము)ను. గుడివాడ, భాస్కర్ ధియేటరు లో ఇంకా ప్రేమాభిషేకం సినిమా ఆడుతోంది. మేమిద్దరము తిరిగి అదే సినిమా చూసాము. ఇందులో విశేషములు యేమిటంటే:

 1. సినిమా మొదటి "రన్".: అంటే మొదటి సారిగా రిలీజు అయ్యాక, యేకధాటిగా మా వివాహము అయి సంవత్సరము దాటినా ఆడటము.
 2. మా మొదటి సినిమా ప్రేమాభిషేకం. వివాహము సంవత్సరము తరువాత కూడా అదే సినిమాకు వెళ్ళడము.
 3. మా మొదటి సినిమా ప్రేమాభిషేకం. వివాహము సంవత్సరము తరువాత కూడా అదే సినిమాకు అదే రెండవ ఆటకు వెళ్ళడము.
 4. మా మొదటి సినిమా ప్రేమాభిషేకం. వివాహము సంవత్సరము తరువాత కూడా అదే సినిమాకు అదే అదే తరగతికి వెళ్ళడము.
 5. మా మొదటి సినిమా ప్రేమాభిషేకం. వివాహము సంవత్సరము తరువాత కూడా అదే సినిమాకు అదే సీట్లలో కూర్ఛుని సినిమా చూడటము.

పిల్లలు[మార్చు]

మాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి.

నివాసము[మార్చు]

ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా జిల్లా లోని విజయవాడ దగ్గర పోరంకి నందు వుంటున్నాను.