వాడుకరి:K.Venkataramana/నా గురించి

వికీపీడియా నుండి
(వాడుకరి:Kvr.lohith/నా గురించి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కె.వెంకటరమణ
— వికీపీడియన్  —
కె.వి.రమణ - 2017లో చిత్రం
కె.వి.రమణ - 2017లో చిత్రం
పేరుకె. వెంకటరమణ
జననం (1970-08-02) 1970 ఆగస్టు 2 (వయసు 53)
జాతీయతభారతీయుడు
దేశం India
భాషలుతెలుగు, ఆంగ్లం, హిందీ
విద్య - ఉద్యోగం
వృత్తిఉపాధ్యాయుడు
ఉద్యోగిబౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు
విద్యఎం.ఎస్సీ, బి.యిడి
విశ్వవిద్యాలయంఆంధ్ర విశ్వవిద్యాలయం
అభిరుచులు - నమ్మకాలు
అభిరుచులువిద్యాబోధన, వికీపీడియా అభివృద్ధి చేయుట,
మతంహిందూ
2013 లో పాలగిరి,శేషగిరిరావు గార్లతో కె.వి.రమణ

కె.వెంకటరమణ భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడు. అతను 1970 ఆగస్టు 2న భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన్మించాడు. అతను 2012 మే 13పొందూరు వ్యాసంలో మొదటి దిద్దుబాటు తో ఆంగ్ల వికీపీడియాలోనికి ప్రవేశించాడు. తరువాత ఐదు నెలల వరకు వికీలో ఏ దిద్దుబాటూ చేయలేదు.

తెవికీ లోకి ప్రవేశం- సేవలు

ఆంగ్ల వికీలో శ్రీకాకుళం జిల్లా గురించి అంశాలను చేరుస్తున్న సందర్భంలో వ్యాస అంతర్వికీ లింకు ద్వారా తెలుగు వికీపీడియాలోనికి 2012 అక్టోబరు 19 న ప్రవేశించాడు. తెలుగు వికీలో వివిధ వ్యాసాలను శోధించేటాప్పుడు కొన్ని వ్యాసాలు లేకపోవడం, కొన్ని వ్యాసాలు దోషాలతో ఉండటం గమనించి, తెలుగు వికీలో వ్యాసాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో అనేక శాస్త్ర విజ్ఞాన వ్యాసాలతో పాటు తెలుగు ప్రముఖుల వ్యాసాలను తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టాడు. రాజశేఖర్ గారి ప్రోత్సాహంతో వికీలో రచనలు చేయడం ప్రారంభించాడు. అప్పటి ప్రముఖ నిర్వాహకులైన రాజశేఖర్, చంద్రకాంతరావు, అర్జున, అహ్మద్ నిస్సార్ ల సూచనలతో నిర్వహణ విషయాలను, శుద్ధి చేసే విధానాలను తెలుసుకున్నారు. పాలగిరి వంటి ప్రముఖ వికీపీడియన్ లను స్ఫూర్తిగా తీసుకొని రచనా ప్రస్థానాన్ని కొనసాగించాడు. "turn the page, learn the work" అనే నినాదంతో అనేక వ్యాసాలను సీనియర్ వాడుకరులు ఎలా తీర్చిదిద్దుతున్నారో గమనించి నా రచనలను చేయడం, మూసలను తయారుచేయడం, వ్యాసాల శుద్ధి కార్యక్రమాలను చేయడం ప్రారంభించారు. కొంత కాలానికి తెవికీలో నిర్వాహకునిగా భాద్యతలు చేపట్టి వివిధ వ్యాసాలు పర్యవేక్షించుట, తెవికీలో రచనలు చేయుట, ఇతర వ్యాసములు శుద్ధి చేయుట, విస్తరించుట వంటి కార్యక్రమములతో పాటు తెలుగు వికీపీడియా లో మొదటి పేజీలోని శీర్షికలను కూడా నిర్వహించుచున్నారు.

తెలుగు వికీపీడియాలో నిర్వాహకుడైన రాజశేఖర్ గారి సూచనలతో అనేక శాస్త్ర విజ్ఞాన వ్యాసాలను శుద్ధి చేయడం, తెలుగు ప్రముఖుల ప్రాజెక్టు ద్వారా అనేక మంది తెలుగు ప్రముఖుల వ్యాసాలను చేర్చడం, ఆయా వ్యాసాలను శుద్ధి చేయడం చేసాడు. తెలుగు వికీపీడియాలో రాశికన్నా వాసి ముఖ్యం అని నమ్మే వ్యక్తిగా అతను వ్యాస నాణ్యతలపై దృష్టి పెట్టి అనేక వ్యాసాలను శుద్ధి చేసాడు. ప్రముఖ వికీపీడియన్/నిర్వాహకులు యర్రా రామారావు, చదువరి, వంటి వారు వికీపీడియాలో నిర్వహించిన మొలక వ్యాసాల విస్తరణ కార్యక్రమంలో పాల్గొని అనేక గ్రామ వ్యాసాల విస్తరణ, సినిమా వ్యాసాల విస్తరణలను చేసాడు. ప్రముఖ నిర్వాహకులు పవన్ సంతోష్, విశ్వనాథ్ లు నిర్వహించే డిజిటల్ లైబ్రరీ ప్రాజెక్టు, గ్రంథాలయ ప్రాజెక్టులలో పాల్గొన్నారు. విశ్వనాథ్ తో పాటు ఉత్తరాంధ్ర లోని కొన్ని గ్రంథాలయాలను కూడా సందర్శించి అనేక వ్యాసాల విస్తరణకు కృషి చేసాడు.

అధికారి రాజశేఖర్ గారి సూచనలతో అనేక మంది ప్రముఖుల వంశవృక్షాలను తయారు చేసాడు.

వికీపీడియాలోని వ్యాసానికి మూలాలు ముఖ్యమని భావించి అనేక వ్యాసాలకు మూలాలను చేర్చి విస్తరణలు చేసాడు.

2017 ఆగస్టు లో వికీమీడియా ఫొండేషన్ అతనిని ఫీచర్డ్ వికీమీడియన్ గా గుర్తించి ప్రచురించింది.

మొదటి పేజీ నిర్వహణ

మొదటి పేజీ నిర్వహణా కార్యక్రమాన్ని 2013 27వ వారం నుండి నిర్జల ఘటం ప్రచురించడం ద్వారా ప్రారంభించాడు. మొదటి పేజీలో మీకు తెలుసా విభాగం లోనికి కొత్త వ్యాసాల నుండి ఆసక్తి గల వాక్యాలను చేర్చడం కూడా అప్పటి నుండి ప్రారంభించాడు. మొదటి పేజీలో ఉన్న "ఈ వారం వ్యాసం", "మీకు తెలుసా!" విభాగాల నిర్వహణను 2013 నుండి ఒక దశాబ్ద కాలం పాటు నిరంతరాయంగా కొనసాగిస్తున్నాడు. "చరిత్రలో ఈ రోజు" విభాగంలోని వాక్యాలను కూడా సరిదిద్దే కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నాడు.

పతకాలు-గుర్తింపులు

తెలుగు వికీపీడియాలో అతను చేసిన కృషి గుర్తింపుగా సహ నిర్వాహకుల నుండి అనేక గుర్తింపు పతకాలను పొందాడు.

పతకాలు

క్రికెట్ 2023 ప్రాజెక్టులో మీ కృషికి అభినందనలు

క్రికెట్ 2023 ప్రాజెక్టులో కృషి చేసి ప్రాజెక్టు విజయంలో పాలుపంచుకున్నందుకు అభినందనలతో__చదువరి (చర్చరచనలు) 14:10, 21 నవంబరు 2023 (UTC)

మీకు తెలుసా బార్న్‌స్టార్

•... "మీకు తెలుసా" శీర్షికలో ఉన్న విశేషాల్లో సుమారు 45% మీరే చేర్చారనీ, ఆ విధంగా తెవికీ మొదటిపేజీని సమాచార భరితంగా చేసారనీ!
వెంకటరమణ గారూ, మీకు తెలుసా శీర్షికలో మీ కృషికి ధన్యవాదాలతో ఈ చిరుకానుక. __చదువరి (చర్చరచనలు) 09:25, 18 సెప్టెంబరు 2023 (UTC)

చర్చలలో చురుకైనవారు
@K.Venkataramana గారు, 2021 లో వ్యాస, వికీపీడియా పేరుబరుల చర్చాపేజీలలో చురుకుగా పాల్గొన్నందులకు అభివందనాలు. గుర్తింపుగా ఈ పతకాన్ని స్వీకరించండి. మరిన్ని వివరాలు చూడండి. వికీపీడియా అభివృద్ధికి సామరస్యపూర్వక చర్చలు కీలకం. మీరు మరింత క్రియాశీలంగా చర్చలలో పాల్గొంటారని ఆశిస్తున్నాను. అర్జున (చర్చ) 06:56, 23 మార్చి 2022 (UTC)
వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021
ఈ ఉద్యమ కాలం (1 జూలై 2021 - 31 ఆగస్టు 2021) లో తెలుగు వికీపీడియా వ్యాసాలలో అధికంగా చిత్రాలను చేర్చి తృతీయ స్థానంలో నిలిచిన కె. వెంకటరమణ గారికి ప్రశంసాపూర్వక అభినందనలు.--స్వరలాసిక (చర్చ) 09:31, 14 సెప్టెంబరు 2021 (UTC)
వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021
వికీపీడియా పేజీలలో సముచితమైన బొమ్మలను చేర్చినందులకు గుర్తుగా ఈ మెడల్‌ను స్వీకరించండి.--స్వరలాసిక (చర్చ) 09:31, 14 సెప్టెంబరు 2021 (UTC)
మొలకల విస్తరణ ఋతువు 2020 ప్రాజెక్టు పతకం
2020 జూన్ 1 నుండి ఆగస్టు 31 వరకు జరిగిన మొలకల విస్తరణ ఋతువు ప్రాజెక్టులో భాగంగా మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకాన్ని స్వీకరించండి.--స్వరలాసిక 14:20, 3 సెప్టెంబరు 2020‎
తెలుగు అనువాద వ్యాసాల పతకం
జూన్ 2015-జులై 2020 కాలంలో తెలుగులో కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణం వాడి తొలగింపుకు గురికాని 1238 వ్యాసాలకు కృషిచేసిన 149 మందిలో వ్యాసాల సంఖ్యా పరంగా 80% వ్యాసాలు చేర్చిన 23 మందిలో మీరొకరు. మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకం అందజేస్తున్నాను. మీరిలాగే తెవికీలో అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ..--అర్జున
చురుకైన నిర్వాహకులు
వికీనిర్వహణలో ఆరుసంవత్సరాలకు పైగా నిరంతరాయంగా భాగం పంచుకుంటున్నందులకు అభివందనలు.-- అర్జున (చర్చ) 04:34, 3 ఆగస్టు 2019 (UTC)
Certificate of Achievement
This Certificate is presented to Venkataramana Katakam for being one of the top eleven to fifteen contributors of IMLD-ODD 2018 Wikidata India Edit-a-thon - Yohann Varun Thomas, Secretary, Wikimedia India.
నిరంతర నిర్వహణ కృషికి పతకం
తెలుగు వికీపీడియాలో నిర్వహణ బాధ్యతలను గత ఎన్నో సంవత్సరాల్లాగానే 2017 గ్రెగేరియన్ సంవత్సరంలో కూడా భుజాన వేసుకుని, మొదటి పేజీ నిర్వహణ నుంచి వ్యాసాల నాణ్యత పరిశీలన వరకూ ప్రతీ అంశంలోనూ నిరంతర కృషి చేస్తున్నందుకు మీకు ఒక పతకం. మీ కృషే ఈ పతకానికి వన్నె తీసుకువస్తుందని భావిస్తున్నాను. అందుకోండి పవన్ సంతోష్ (చర్చ) 06:48, 3 జనవరి 2018 (UTC)
చంద్రకాంతరావుగారి పతకం
అలుపెరుగని నిర్వహణ చేస్తూ, సహచరులకు నాణ్యమైన సూచనలు ఇస్తూ, మొదటిపేజీ శీర్షికలను నిర్వహిస్తూ తెవికీ అభివృద్ధికి తోడ్పడుతున్న వెంకటరమణ గారికి తెలుగు వికీపీడియా తరఫున సి.చంద్ర కాంత రావు అందించే చిరుకానుకను స్వీకరించండి.-- సి. చంద్ర కాంత రావు- చర్చ 19:38, 21 ఆగష్టు 2016 (UTC)
పంజాబ్ ఎడిటథాన్ విజయ పతకం
పంజాబ్ ఎడిటథాన్ లో భాగంగా అనేక చక్కని వ్యాసాలు రాసి తెవికీ సముదాయం విజయం సాధించడంలో చక్కని పాత్ర పోషించినందుకు, తెవికీ పంజాబ్ గురించిన వ్యాసాలతో కళకళలాడేలా చేసినందుకు ఈ విజయ పతకం.-- పవన్ సంతోష్ (చర్చ) 14:42, 10 ఆగష్టు 2016 (UTC)
సాంకేతిక తారాపతకం
అడగ్గానే పద్యం గురించి సమాచారపెట్టె తయారుచేయడమే కాక, దానిలో తలెత్తిన సమస్యలు తొలగించారు.. ఈనాడే కాదు గతంలో మరెన్నోసార్లు నాకూ, నాలాంటి వారికి ప్రతి కృషిలోనూ వెన్నంటి సాంకేతిక సహకారం చేస్తున్నందుకు ధన్యవాదాలతో మీకో తారాపతకం._

పవన్ సంతోష్ (చర్చ) 13:35, 25 అక్టోబరు 2015 (UTC)

బంగారు వికీపతకం
2014 లో మొదటి పేజీ నిర్వహణకు విశేషకృషి చేసిన వెంకటరమణ గారికి అభినందనలు. గుర్తింపు గా అందుకోండి ఈ బంగారు వికీపతకం.--అర్జున (చర్చ) 09:10, 10 మే 2015 (UTC)
తెలుగు వికీపీడియా 11వ వార్షికోత్సవ అభినందన ప్రశంసాపత్రం
తెలుగు వికీపీడియా 11 సంవత్సరాల ప్రయాణంలో ఎంతో సమయాన్ని వెచ్చించి నాణ్యతాపరంగానూ, సాంకేతికంగానూ ఉన్నత స్థాయి చేకూర్చడంలో శ్రీ కె.వెంకటరమణ గారి కృషి అనుపమానం.. అనిర్వచనీయం...! భావి తరాలకు తెలుగు స్వేచ్ఛా విజ్ఞాన భాండారాన్ని బహుమతిగా ఇవ్వడంలో వివిధరూపాలలో మీరందిస్తున్న సహాయ సహకారాలకు ఇవే మా కృతజ్ఞతా పూర్వక అభినందనలు. --పురస్కారాల ఎంపిక మండలి
కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కార పతకం-2013
తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో విజ్ఞాన సంబంధ వ్యాసాలపై కృషి, వందలాది వ్యాసాల విలీనం, ఈ వారం వ్యాసం మరియు ఇతర నిర్వహణా కార్యాల పై మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.--పురస్కారాల ఎంపిక మండలి
టైర్ లెస్ కంట్రీబ్యూషన్ బార్న్ స్టార్
అలుపెరగని కృషీతో తెవికీ అభివృద్ధికి తోడ్పడుతున్న వెంకట రమణగారికి ఈ చిరుకానుక బహూకరిస్తూ వారి కృషి ఇలా కొనసాగాలని కోరుకుంటున్నాను--t.sujatha (చర్చ) 14:49, 10 ఆగష్టు 2013 (UTC)
గండపెండేరం
మీరు తెలుగు వికీపీడియాలో ఎన్నో మంచి శాస్త్రవిజ్ఞానానికి సంబంధించిన వ్యాసాలు చేర్చి, సమస్యల పరిష్కారంలో చేస్తున్న కృషికి తెలుగు వికీపీడియా అధికారులు, నిర్వాహకులు మరియు సహసభ్యుల తరపున నా యీ చిన్న కానుక:దయచేసి స్వీకరించండి.Rajasekhar1961 (చర్చ) 16:24, 7 ఏప్రిల్ 2013 (UTC)
ఆర్టికల్ బార్న్ స్టార్
2012 లో మీ కృషికి అభివందనలు --అర్జున (చర్చ) 07:06, 15 జనవరి 2013 (UTC)
తెలుగు మెడల్
సభ్యునిగా చేరిన మూడు నెలలలోపు భౌతిక,రసాయనికశాస్త్రవ్యాసాలుచేర్చి వెయ్యి దిద్దుపాట్లుచేసినసందర్భంలో అభనందనలు.పాలగిరి (చర్చ) 01:07, 11 జనవరి 2013 (UTC)