జీవశాస్త్రానికి చెందిన వివిధ జీవులకు (మొక్కలు మరియు జంతువులు) తెలుగు పదాల్ని తెలుసుకొని వాటికి ఆంగ్ల లింకులు మరియు సమాచార పెట్టెలు అతికించడం. ఇవి జీవశాస్త్ర అబివృద్ధికి పునాది గా పనిచేస్తుందని నా అభిప్రాయం.
మనకు ప్రతిరోజు తారసపడే విషయాల గురించి వ్యాసాలు మొదలుపెట్టడానికి ప్రారంభించాను. సాధారణ తెలుగు పదాలు జాబితా నుండి గృహోపకరణాలు, ఆభరణాలు మొదలైన విషయాల వైపు విస్తరించాను.
మానవుని ఆరోగ్యానికి యోగా చాలా ముఖ్యమైనది. ఇది ప్రపంచానికి భారతీయ జీవనం ప్రసాదించిన వరము. యోగా లో ముఖ్యమైన యోగాసనాలు, ప్రాణాయామం మొదలైన వాటి గురించి సమాచారం చేరుస్తున్నాను.
తెలుగువాడినైన నేను మనకు మార్గదర్శకులైన పూర్వీకుల గురించి వారి జీవితాలను విశదీకరించడం. వీరే తెలుగు జాతి గర్వించదగిన సుప్రసిద్ధ ఆంధ్రులు.
రవాణా వ్యవస్థలో రహదారులు చాలా ప్రధానమైనవి. ముఖ్యమైన జాతీయ రహదారులు గురించి వ్యాసాలు మొదలుపెట్టి విస్తరించడము. వీటిని ప్రయాణీకులు ఒక సూచికగా ఉపయోగించుకోవచ్చును.
వికీపీడియా లో 7 సంవత్సరాలు పూర్తి చేసిన ఆనందం లో మీకు Praveen యొక్క చిన్న బహుమతి.
2011లో వ్యాసాలలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు
2011లో వ్యాసేతర ములలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు
2010లో వ్యాసాలలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు
తెవికీ జీవ శాస్త్ర వ్యాసాలలో విశేష కృషి చేస్తున్న రాజశేఖర్ గారికి విశ్వనాధ్ యొక్క చిన్న బహుమతి
వ్యాసాలే లక్ష్యంగా, అక్షరాలే సాధనాలుగా అవిశ్రాంతంగా తెలుగు వికీకి సేవ చేస్తున్న దీక్షాదక్షుడు రాజశేఖర్కు10 వేల దిద్దుబాట్లు పూర్తిచేసుకున్న సందర్భంగా [1] తెవికీ సభ్యులందరి తరఫున కృతజ్ఞతాభివందనలతో ఈ గండపెండేరము తొడుగుతున్నాను. మీరు 10 నెలలలోపే 10వేల దిద్దుబాట్లు చేశారు!
తెవికీ జీవ శాస్త్రానికి జీవం పోస్తున్న రాజశేఖర్ గారికి తెవికీ తరపున కృతజ్ఞతలు తెలుపుతు ఇచ్చే చిరుకానుక
తెవికీలో మొట్టమొదటిగా 50,000పైగా దిద్దుబాట్లు చేసి అందరికీ మార్గదర్శిగా ఉన్న శ్రీ రాజశేఖర్ గారికి తెవికీ తరపున కృతజ్ఞతలు తెలుపుతు ఇచ్చే చిరుకానుక. మీ తరువాతి దిద్దుబాట్ల సంఖ్య మీ దిద్దుబాట్లలో సగమే! - కాసుబాబు.