వికీపీడియా:తెలుగు వికీపీడియా
కాలానుగుణంగా తెలుగు వికీపీడియా అభివృద్ధి వివరాలు
సంవత్సరాల వారీగా అభివృద్ధి
[మార్చు]2003-2005
[మార్చు]2003లో ఆరంభించిన తెవికీలో 2004 ఆగస్ట్ వరకూ ఒక్క వ్యాసం కూడా నమోదు కాలేదు. తన తరువాతి ఘట్ట ప్రయత్నాలలో ఒక భాగంగా నాగార్జున రచ్చబండ వంటి తెలుగు సమాచార గుంపులలో ప్రచారం చేయడం ప్రారంభించారు. ఆయన ప్రయత్నం సక్రమ ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది. రావ్ వేమూరి, మిచిగాన్ విశ్వ విద్యాలయంలో ఆచార్యులుగా భాద్యతను నిర్వహిస్తున్న కట్టా మూర్తి లాంటి విద్యాధికులు స్పందించారు. అయ్యలరాజు నారాయణామాత్యుడు రచించిన హంసవింశతి గ్రంథం, శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యదలో రాయలవారు వర్ణించిన ఊరగాయ రుచులను ఆధారంగా వ్రాసిన ఊరగాయ వ్యాసం (నెట్) విహారకులను తెలుగు వికీపీడియా వైపు అడుగులు వేసేలా చేసింది. ఇలా తెలుగు వికీపీడియా అభివృద్ధి పధంలో నడవడం ప్రారంభించింది. తరువాతి దశలో కాలిఫోర్నియాలో ఉండే వాకా కిరణ్, మైక్రో సాప్ట్ లో పనిచేస్తూ హైదరాబాదులో నివసిస్తున్న చావాకిరణ్ లాంటి వారి కృషి అభివృద్ధికి కీలకమైంది. 2005 నాటికి 55 మంది సభ్యులు తమ సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు. వ్యాసాల సంఖ్య 110 కి చేరింది.
మిన్నిసోటా నివాసి ప్లాంట్ మాలిక్యులర్ బయాలజీలో పరిశోధనా బాధ్యతలను నిర్వహిస్తున్న వైజాసత్య, బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న మాకినేని ప్రదీపు, హైదరాబాదు కూకట్‌పల్లి నివాసి సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ కంపనీలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ భాద్యతలను నిర్వహిస్తున్న చదువరి(తుమ్మల శిరీష్) మొదలైన వారి విశేష కృషితో మరింత ముందుకు సాగింది. వీరిలో 2005లో ఏప్రిల్ మాసంలో వైజాసత్య యధాలాపంగా గూగుల్ లోఅన్వేషణలో యాదృచ్చికంగా తెలుగు వికీపీడియాను చేరాడు. అప్పటినుండి తెవికీ కోసం కొంతకాలం ఒంటరి పోరాటం చేసిన తదుపరి 2005లో జూలై చివరి దశలో చదువరి రాకతో తెవికీ కొత్త ఊపందుకుంది. వీరిద్దరి కృషిలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలు, మండలాలను గురించిన సమాచారం తెలుగులో చూసుకొనగలిగిన అవకాశం పాఠకులకు కలిగింది. ఈ ప్రాజెక్టులో బాటు (ఆటోమేటిక్ ప్రోగ్రాం స్క్రిప్ట్)లను తయారుచేసి మ్యాపులతో పేజీలను సిద్ధం చేయడంలో మాకినేని ప్రదీప్ కృషి గుర్తింపదగినది. 2005 డిసెంబర్ నాటికి వ్యాసాల సంఖ్య 2000కి చేరింది. 2005 సెప్టెంబరులో విశేషవ్యాసం, మీకు తెలుసా , చరిత్రలో ఈ రోజు శీర్షికల మొదటిపేజీ ప్రారంభమైంది.
2006
[మార్చు]2006లో వీవెన్ (వీర వెంకట చౌదరి) రాకతో తెవీకీ రూపురేఖలు సుందరంగా తయారుకావడం ఆరంభమైంది. బిజినెస్ అనలిస్ట్ అయిన వీవెన్ వెబ్ డిజైనింగ్ మీద ఉన్న ఆసక్తితో ఆయనను హెచ్ టి ఎమ్ ఎల్ (HTML)నేర్చుకునేలా చేసింది. ఈయన ఏర్పాటు చేసిన బ్లాగర్ల సమావేశం ఇచ్చిన ప్రేరణతో వీవెన్ లేఖిని అనే అనువాద పరికరాన్ని సృష్టించాడు. పద్మ సాంకేతిక పరిజ్ఞానంతో లేఖినిని సృష్టించినట్లు ఆయనే చెప్పుకోవడం ఆయన నిజాయితీకి నిదర్శనం. 2006 మే నాటికి 3,300 వ్యాసాలతో భారతీయ భాషలలో తెవీకీ అగ్రస్థానాన్ని చేరుకుంది. బ్లాగర్ల సాయంతో వైజాసత్యతో చేతులు కలిపిన కాజా సుధాకరబాబు, చిట్టెల్ల కామేశ్వరరావు, దాట్ల శ్రీనివాస్, నవీన్ మొదలైన వారికృషితో తెలుగు చిత్రరంగ వ్యాసాలు మొదలయ్యాయి. కాజా సుధాకరబాబు ఓమన్లో ఎలక్ట్రికల్ ఇంజినీర్. ఈయన వ్యాసాల ప్రాజక్ట్‌లను రూపొందించి ఆయారంగాలలో ఆసక్తి ఉన్న వారు ఆయా వ్యాసాలు రూపొందించడానికి కృషి చేశారు. చిట్టెల్ల కామేశ్వరరావు బి ఎస్ ఎన్ ఎల్(BSNL) ఉద్యోగి. శ్రీనివాసరాజు హైదరాబాదులోనూ, సురేంద్ర నవీన్ బెంగుళూర్ లోనూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. వీరి కృషితో 2006 చివరికి వ్యాసాల సంఖ్య 6,000కి చేరింది.
2007
[మార్చు]2007లో చేరిన బ్లాగేశ్వరుడు (ఈయన అసలుపేరు శ్రీనివాస శాస్త్రి) లండన్‌లో శిశువైద్యుడు. పుణ్యక్షేత్రాల వ్యాసాలను రూపొందించడంలో ఈయన కృషి అధికం. ఈయనతో చేతులు కలిపిన కళాకారుడు విశ్వనాధ్ కృషి పుణ్యక్షేత్రాల వ్యాసాలను అభివృద్ధి చేశారు. రాజశేఖర్, వందన శేషగిరిరావు వంటి వైద్యులు వ్యాధులు, మానవశరీరం వంటి వ్యాసాలలో తమవంతు కృషి అందించారు. రంగారెడ్డి జిల్లాకి చెందిన ప్రభుత్వోద్యోగి చంద్ర కాంత రావు కృషి ఆర్ధిక శాస్త్రం, క్రీడారంగం వ్యాసాలను అందించడానికి దోహదమైంది. ఈ మాట వెబ్ పత్రిక సృష్టికర్త కొలిచాల సురేష్, ఇంద్రగంటి పద్మ, కంప్యూటర్ పత్రిక సంపాదకుడు నల్లమోతు శ్రీధర్ మొదలైన వారు సాంకేతిక సాయం చేస్తున్నారు. వీరందరితో పోలిస్తే విక్షనరీ కోసం కృషిచేస్తున్న టి.సుజాత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆవిడ సాధారణ గృహిణి అయి ఉండి కేవలం తెలుగు భాష మీద అభిమానంతో విక్షనరీలోనే కాకుండా తెవికీలో కూడా ప్రపంచ ప్రసిద్ధ నగరాలు, వంటకాల వ్యాసాలపై కృషికొనసాగిస్తున్నారు. చిట్కాలను, ప్రకటనలను అందిస్తూ సాంకేతికంగా కృషి చేస్తున్న సభ్యుడు దేవా. వీరే కాకుండా అప్పుడప్పుడూ వస్తూ పాల్గొనేవారు కొందరు. ఇస్లాము గురించి అనేక వివరాలనూ, ఉర్ధూ భాష గురించిన వివరాలను అందిస్తూ అహ్మద్ నిసార్ విశేష కృషి అపారం. 2007 జూన్ లో ఈ వారం వ్యాసం శీర్షిక అక్టోబర్ లో ఈ వారపు బొమ్మ శీర్షిక ప్రారంభమైంది.
2008
[మార్చు]తెలుగు వికీ గణాంకాల విశ్లేషిస్తే [1]ఇంటి పేర్లు , ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు , ప్రముఖ వ్యక్తుల వ్యాసాలు ముఖ్యంగా చేర్చబడినవి.
2009
[మార్చు]- ప్రధాన వ్యాసం: వికీపీడియా: 2009 సమీక్ష
ప్రముఖ వ్యక్తుల వ్యాసాలు, సమకాలీన వార్తలకు సంబంధించిన వ్యాసాలు ఉదా: వై.యస్. రాజశేఖరరెడ్డి , తెలంగాణ , చంద్రయానం ముఖ్యంగా చేర్చబడినవి.
2010
[మార్చు]- తెవికీ తెరవెనుక సంగతులను, వికీపీడియన్లను అందరికి పరిచయంచేసి, తెవికీ సముదాయ చైతన్యాన్ని పెంచే ఆశయాలతో తెవికీ వార్త జులై 1, 2010న ప్రారంభమైంది.
- గూగుల్ వేతన వికీపీడియన్లకృషి వలన 665 పైగా వ్యాసాలు చేరి సగటు వ్యాస పరిమాణాన్ని పెంచాయి. అయితే ఔత్సాహికులు కృషి తగ్గిపోవటంతో వికీ అభివృద్ధి తగినంతగాలేదు.
- నెలలో రోజుకు 4 నుండి 22 వ్యాసాలు సృష్టించబడుతున్నాయి.
- నెలకు 5 దిద్దుబాట్లు చేసేవారి సంఖ్య 27 నుండి 42 మధ్య వుంది.
- నెలకు 100 దిద్దుబాట్లు చేసేవారి సంఖ్య 2 నుండి 10 మధ్య వుంది.
- నెలకు కొత్త గా వికీపీడియన్లుగా చేరే వారి సంఖ్య 3 నుండి 10 మధ్య వుంది.
- పేజీ వీక్షణలు పిభ్రవరి 2010 లో అత్యధిక స్థాయియైన 4.5 మిలియన్లుకు చేరి ఆ తర్వాత చాలా తగ్గి డిసెంబరు చివరికి 2.1 మిలియన్లకి చేరుకున్నాయి.
- డిసెంబరు 2010 పేజి వీక్షణలు డిసెంబరు 2009 తో పోల్చితే, -48 % పెరుగుదల. అన్ని వికిపీడియాల పెరుగుదల తోపోల్చితే తెవికీ 23వ స్థానంలో వుంది.
- 2010లో అత్యధిక వ్యాస మార్పులు చేసినవారిలో మొదటి 10 ర్యాంకులుగల వికీపీడియన్లు రాజశేఖర్, రవిచంద్ర, టి.సుజాత, అర్జున, చంద్రకాంతరావు, రహ్మాతుల్లా, వైజాసత్య, ముక్తేశ్వరి, కాసుబాబు మరియు వీర. వీరిలో అత్యధికంగా 4776 అత్యల్పంగా 309 మార్పులు చేసినట్లు నమౌదైంది.
2011
[మార్చు]- వికీపీడియా దశాబ్ది వుత్సవాలు హైదరాబాదులో జరిగాయి.
- తెలుగు వికీపీడియన్లు, భారత వికీ సమావేశం 2011 [2] లో పాల్గొన్నారు.
- తెవికీ వార్త 8 సంచికలు పూర్తిచేసుకుంది
- గూగుల్ వేతన వికీపీడియన్లకృషి దాదాపు 900 పైగా వ్యాసాల తరువాత తెవికీ సూచనలు అమలు చేయకుండానే ఆగిపోయింది.
- గుర్తింపులు: రాజశేఖర్, టి. సుజాత వికీమీడియా భారతదేశం సంస్థచే, విశిష్ట వికీమీడియన్ గుర్తింపు 2011 చే గౌరవించబడ్డారు.
- కొత్త లేక విస్తరించబడిన వ్యాసాలు: వివిధ విషయాలపై వ్యక్తిగత రచనలే ఎక్కువగా జరిగాయి. ప్రాజెక్టులు నడవలేదు.
- చర్చించబడ్డ ముఖ్యవిషయాలు: వికీపీడియా విధానాలు (ఏకవచన ప్రయోగం, బ్లాగ్ పోస్టులను వనరులుగా వాడడం) మరల చర్చలలోకి వచ్చాయి.
- 2011 లో వ్యాస పేజీలలో అత్యధిక మార్పులు చేసిన సభ్యులు: వాడుకరి:Rajasekhar1961, వాడుకరి:T.sujatha, వాడుకరి:C.Chandra_Kanth_Rao, వాడుకరి:JVRKPRASAD, వాడుకరి:AngajalaARS, వాడుకరి:Sridhar1000, వాడుకరి:Arjunaraoc, వాడుకరి:రవిచంద్ర, వాడుకరి:Bhaskaranaidu, వాడుకరి:కాసుబాబు. వీరుచేసిన మార్పులు అత్యధికంగా 12411 అత్యల్పంగా 347.
- 2011 లో వ్యాసేతర పేజీలలో అత్యధిక మార్పులు చేసిన సభ్యులు: వాడుకరి:కాసుబాబు, వాడుకరి:C.Chandra_Kanth_Rao, వాడుకరి:Rajasekhar1961, వాడుకరి:Arjunaraoc, వాడుకరి:రవిచంద్ర, వాడుకరి:JVRKPRASAD, వాడుకరి:T.sujatha, వాడుకరి:Veeven, వాడుకరి:Chavakiran, వాడుకరి:Cbrao. వీరుచేసిన మార్పులు అత్యధికంగా 9968 అత్యల్పంగా 21.
2012
[మార్చు]తెవికీకి పునరుత్తేజాన్ని కల్పించే ప్రయత్నాలు చేపట్టబడ్డాయి. వెబ్ ఛాట్, సంవత్సరపు లక్ష్యాలు నిర్థారించడం దానికి అనుగుణంగా పని జరిగింది అయితే మార్పుల సంఖ్యలోను, పేజీవీక్షణలలోను తరుగుదల కన్పించింది. మరిన్ని వివరాలకు వికీపీడియా:2012 లక్ష్యాలు చూడండి.
2013
[మార్చు]తెలుగు వికీపీడియా మహోత్సవం ఏప్రిల్ 10,11, 2013న హైదరాబాదులోని గోల్డెన్ త్రెషోల్డ్ లో జరిగింది. దీనిలో భాగమైన వికీ సర్వసభ్యసమావేశం, వికీ అకాడమీ,వికీచైతన్యవేదిక లలో వికీపీడియా సభ్యులు పాల్గొని వికీపీడియా అభివృద్ధికి చేపట్టవలసిన చర్యలను చర్చించారు, తరువాత హెచ్ఎమ్టీవి రాజశేఖర్, రహ్మతుల్లా, మల్లాది మరియు విష్ణులు పాల్గొన్న వికీపీడియా ఫోన్ ద్వారా వీక్షకుల ప్రశ్నలకు సమాధానాల కార్యక్రమము ప్రసారంచేసింది.[3]
పూర్తి గణాంకాల విశ్లేషణ
[మార్చు]2010 వరకు వ్యాసాల , వ్యాస రచయతల, పేజి వీక్షణల గణాంకాల వివరాలు [4] [5][6][7] పరిశీలిస్తే కనబడే విషయాలు
- 2006 ఆగష్టు నుండి డిసెంబరు వరకు అతి ఎక్కువ వ్యాసాల సృష్టి జరిగింది. (బాట్ ద్వారా గ్రామాల వ్యాసాలు, అత్యధికంగాసెప్టెంబరు లో 352 వ్యాసాలు)
- 2007 జూన్ నుండి సెప్టెంబరు వరకు ఎక్కువ వ్యాసాల సృష్టి జరిగింది.( అత్యధికంగా జూన్ లో 162 వ్యాసాలు)
- ఎక్కువ దిద్దుబాట్లు చేసిన జాబితా లో మొదటి 10 స్థానాలు రాజశేఖర్, కాసుబాబు, వైజాసత్య,చంద్రకాంతరావు, అహ్మద్ నిసార్ , రవిచంద్ర,చదువరి,రహంతుల్లా, సుజాత, మాకినేని ప్రదీప్ .
మూలాలు
[మార్చు]బయిటి లింకులు
[మార్చు]- చెవల, అర్జున రావు (2014-01-01). "అందరి విజ్ఞానం అందరికీ". రామోజీఫౌండేషన్ తెలుగు వెలుగు. Retrieved 2014-01-30.