Jump to content

వికీపీడియా:మీకు తెలుసా? భండారము/2009

వికీపీడియా నుండి

37 వ వారం

[మార్చు]
సెప్టెంబర్ 3, 2009 నుంచి డిసెంబర్ 21 2009 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
  • ... ప్రాచీన భారతీయ రాజు పురుషోత్తముడు ప్రపంచ విజేతయైన అలెగ్జాండర్ నే మెప్పించాడనీ! (అలెగ్జాండర్ వ్యాసం)
  • ... విజయవాడ పట్టణములో గల ఇంద్రకీలాద్రి పర్వతముపై అర్జునుడు తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడనీ! (ఇంద్రకీలాద్రి పర్వతం వ్యాసం)
  • ... అటకామా ఎడారి ప్రాంతంలో వర్షపాతం దాదాపు శూన్యమనీ! (అటకామా ఎడారి వ్యాసం)
  • ... చీమలు కందిరీగల నుంచి పుట్టుకొచ్చాయనీ! (చీమ వ్యాసం)
  • ... సబితా ఇంద్రారెడ్డి భారతదేశంలోనే హోంశాఖా మంత్రియైన తొలి మహిళ అనీ! (సబితా ఇంద్రారెడ్డి వ్యాసం)

26 వ వారం

[మార్చు]
జూన్ 17, 2009 నుంచి సెప్టెంబర్ 3 2009 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
  • ... ఫ్రెడరిక్ బాంటింగ్ ఇన్సులిన్ సహ ఆవిష్కర్తలలో ఒకరనీ! (ఫ్రెడరిక్ బాంటింగ్ వ్యాసం)
  • ... ఏథెన్స్ నగరాన్ని ప్రజాస్వామ్యానికి పుట్టిన స్థలంగా భావిస్తారనీ! ( ఏథెన్స్ వ్యాసం )
  • ... మార్టిన్ లూథర్ కింగ్ అతి పిన్న వయసులో నోబెల్ బహుమతి పొందిన వాడిగా ఖ్యాతి గాంచాడనీ! (మార్టిన్ లూథర్ కింగ్ వ్యాసం)
  • ... ఆస్వాల్డ్ కూల్డ్రే ను ఆధునిక ఆంధ్ర చిత్రకారులకు ఆది గురువుగా భావిస్తారనీ! ( ఆస్వాల్డ్ కూల్డ్రే వ్యాసం)
  • ... ప్రముఖ తమిళ కథానాయకుడు విక్రమ్ పరమకుడి గ్రామం నుంచి నాలుగో జాతీయ ఉత్తమ నటుడనీ! (విక్రమ్ వ్యాసం)

17 వ వారం

[మార్చు]
ఏప్రిల్ 21, 2009 నుంచి జూన్ 17 2009 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
  • ... హొగెనక్కల్ జలపాతాన్ని భారతీయ నయాగరా జలపాతంగా భావిస్తారనీ! ( (కుడివైపున బొమ్మ చూపబడినది) )
  • ... అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవుడు యూరీ గగారిన్ అనీ! ( యూరీ గగారిన్ వ్యాసం )
  • ... డా. సి. నారాయణ రెడ్డి రచించిన విశ్వంభర అనే కావ్యానికి 1988లో భారతదేశంలో సాహిత్య అత్యున్నత పురస్కారం, జ్ఞానపీఠ్ అవార్డు బహుకరించబడినదనీ! ( విశ్వంభర వ్యాసం )
  • ... రమణ మహర్షి తన మౌనం ద్వారా సందేశాన్ని పొందలేని వారికి మత్రమే బోధనల ద్వారా ఉపదేశించేవాడనీ! ( రమణ మహర్షి వ్యాసం )
  • ... ఇటీవల పరమపదించిన హాస్యనటుడు నగేష్ ను దక్షిణాది చార్లీ చాప్లిన్ గా అభివర్ణిస్తారనీ! ( నగేష్ వ్యాసం )

11 వ వారం

[మార్చు]
మార్చి 6, 2009 నుంచి ఏప్రిల్ 21 2009 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
  • ... యూరప్ కు చెందిన ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లో ఎత్తైన పర్వత శిఖరం మాంట్ బ్లాంక్ అనీ! (ఆల్ఫ్స్ పర్వతాలు వ్యాసం) (కుడివైపున బొమ్మ చూపబడినది)
  • ... షాంఘై నగరం చైనాలో అతిపెద్ద నగరమనీ! ( షాంఘై వ్యాసం )
  • ... సూయజ్ కాలువ యూరప్ మరియు ఆసియా ఖండాల మధ్య జల రవాణా కొరకు ఆఫ్రికా ఖండాన్ని మొత్తం చుట్టిరాకుండా దగ్గర మార్గంగా 1869 లో ఏర్పాటు చేయబడిందనీ! ( సూయజ్ కాలువ వ్యాసం )
  • ... అత్యంత ప్రతిష్టాత్మకమైన బుకర్ ప్రైజు 2008 సంవత్సరానికి గాను భారతీయ రచయిత అరవింద్ అడిగ ఎన్నికయ్యాడనీ! ( బుకర్ బహుమతి వ్యాసం )
  • ... మహాకావ్యం కిరాతార్జునీయం ను రచించినది భారవి అనీ! ( భారవి వ్యాసం )

07 వ వారం

[మార్చు]
ఫిబ్రవరి 5, 2009 నుంచి మార్చి 6 2009 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
  • ... దాదాపు శరీరం మొత్తం సహకరించకపోయినా భౌతిక శాస్త్రంలో విశేష కృషి చేసిన ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అనీ! (కుడివైపున బొమ్మ చూపబడినది)
  • ... సిమెంటు ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నదనీ! (సిమెంటు వ్యాసం)
  • ... ప్రపంచంలో మొట్టమొదటి ఉపగ్రహం పేరు స్పుత్నిక్ అనీ! (స్పుత్నిక్ వ్యాసం )
  • ... తెలుగు సాహితీ ప్రపంచంలో దిగంబర కవులు గా ప్రసిద్ధిగాంచిన ఆరుగురిలో వీరవెల్లి రాఘవాచార్య ఒకరనీ! ( జ్వాలాముఖి వ్యాసం)
  • ... 2007 లో అమెరికన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ షిండ్లర్స్ లిస్ట్ చిత్రాన్ని సినీ చరిత్రలో అత్యున్నత 100 చిత్రాలో ఎనిమిదవ చిత్రంగా ఎన్నుకున్నదనీ ( షిండ్లర్స్ లిస్ట్ వ్యాసం )

02 వ వారం

[మార్చు]
జనవరి 5, 2009 నుంచి ఫిబ్రవరి 4 2009 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
  • ... ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో సోమనాథ్ మొదటిది అనీ! (సోమనాథ్ వ్యాసం)(కుడివైపున బొమ్మ చూపబడినది)
  • ... ప్రహ్లాదుని తండ్రి మరియు రాక్షస రాజైన హిరణ్యకశిపుడు శాపగ్రస్తుడైన వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయుల్లో ఒకడనీ! ( హిరణ్యకశిపుడు వ్యాసం)
  • ... తమిళ సాహిత్యానికి మకుటంలా భావించే తిరుక్కురల్ ను రచించింది తిరువళ్ళువర్ అనీ! (తిరువళ్ళువర్ వ్యాసం)
  • ... గడ్డం రాంరెడ్డిని భారత దేశంలో దూర విద్యా పితామహునిగా భావిస్తారనీ! (గడ్డం రాంరెడ్డి వ్యాసం)
  • ... మొఘల్ ఎ అజం అనే సినిమా నిర్మాణానికి తొమ్మిదేళ్ళు పట్టిందని. (మొఘల్ ఎ అజం వ్యాసం)
  • ... కిరణ జన్య సంయోగ క్రియ అనగా జీవరాశుల మనుగడకు నిత్యావసరమైన పిండిపదార్థం తయారయ్యే ఒక కీలకమైన ప్రక్రియ అనీ! (కిరణజన్య సంయోగక్రియ వ్యాసం)