Jump to content

వికీపీడియా:2014 సమీక్ష

వికీపీడియా నుండి
(వికీపీడియా:2014లో తెవికీ ప్రగతి నుండి దారిమార్పు చెందింది)

తెలుగు వికీపీడియా దశాబ్ధిఉత్సవాల తరువాత మరింత ప్రగతిని సాధించింది. తెవికీలో వ్యాసాల సంఖ్య 60,000 అధిగమించించింది. అలాగే తెలుగు విక్షనరీలో 1,00,000 పేజీల సృష్టి జరగడం మరొక మైలు రాయి. తెలుగు వికీసౌర్స్ పేజీల సంఖ్య 10,000 లను దాటడం ముదావహం. ఇలా బహుముఖంగా సాధించడం అభినందించవలసిన విషయం. అందుకు సహకరిస్తూ ఈ మహత్తర అక్షరయజ్ఞంలో పాల్గొన్న క్రియాశీలక సభ్యులందరికీ ఈ అభినందన స్వంతం. తెలుగు వికీపీడియా శిక్షణా కార్యక్రమాలు (అకాడమీ), తెవీకీ హాకథాన్, పుస్తకప్రదర్శనలో తెవికీ స్టాల్, ఫేస్‌బుక్‌లో ఎడతెగకుండా పోస్ట్‌లు చేస్తూ తెవికీ ప్రగతిని అందరికీ తెలియజేస్తూ తెవికీని ప్రజలలోకి తీసుకువెళుతూ గుర్తింపును పెంపొందించడం వంటి కృషి విశేషంగా జరిగింది. ఇది తెవికీ వెలుపలి వ్యవహారం అయినప్పటికీ తెవికీ అభివృద్ధికి ఇవి అత్యవసరం. ఇలాంటి ఉత్సాహవంతులైన వికీపీడియన్లు తెవికీకి ఎంతో అవసరం. విశ్వనాధ్ మరియు పవన్ సంతోష్‌లు ఇండివిజ్యుయల్ గ్రాంట్లు సాధించి తెలుగు వికీపీడియా బలమేమిటో నిరూపించారు. ఈ ప్రగతిని మనం గుర్తుచేసుకుంటూ ఈ ఉత్సాహంతో మరింత మందికి ప్రేరణకలిగిస్తూ ముందుకు సాగి తెవికీని భారతీయ భాషలలో ప్రధమ స్థానానికి తీసుకురావడానికి మన వంతు కృషిని చేస్తాము. ఈకృషిలో భాగంగా ఏకాదశ ఉత్సవం నాటికి తెవికీ ప్రగతిని గురించి తెలియజేయడానికి ఒక సమగ్రమైన వ్యాసం రూపకల్పనలో భాగంగా ఈ పేజీ రూపకల్పన జరిగింది. ఇది మనందరి పేజీ. ఇందులో సభ్యులందరూ భాగస్వాములే. ఈ పేజీ ఇలా ఉండాలి అని తెలుసుకోవడానికి నమూనాగా కొందరి పేర్లను వ్రాయడం జరిగింది. అంతేకాని ఏ ఒక్కరినీ కించపరిచే ఉద్ధేశ్యం కాని, ఎవరికృషిని చిన్న పరచడం కాని దీని లక్ష్యం కాదు. కనుక సభ్యులు తమ పేర్లతో ఉపశీర్షికను సృష్టించి వారి వారి కృషిని సమగ్రంగా వ్రాయాలి. తగినంత సమయం లేదు కనుక అందరి పేర్లు వ్రాయడానికి జాప్యం జరుగుతుంది. కనుక సభ్యులందరూ ఇది తమ పనిగా భావించి ఈ పేజీకి సమగ్రరూపం తీసుకు రావాలి.

ఉత్సవాలు సమావేశాలు

[మార్చు]

తెలుగు వికీపీడియా ఉత్సవాలు సమావేశాలు తెలుగు వీపీడియన్లను ఉత్సాహపరుస్తాయి. అంతేకాదు సభ్యుల మధ్య మరింత స్నేహభావం కలిగించి సమిష్ఠి కృషిలో అన్యోన్యంగా భాగస్వామ్యం వహించేలా చేస్తాయి. తెవికీకి కొంతకాలం దూరమైన వారికుడా తిరిగి క్రియాశీలకంగా పనిచేసేలా చేస్తాయి. ఇలాంటి సమావేశాలలో చురుకుగా చేయవలసిన పనులు అనేకం ఉంటాయి. బ్యాడిజీల తయారీ, వికీటీషర్టు తయారీ, కరపత్రాలు మరియు బ్యానర్లు ముద్రించడం, వీటిని సమావేశ స్థలానికి తీసుకురావ డం, పలువురితో ఈ మెయిల్ సంప్రదింపులు నిర్వహించడం, స్కైప్ సమావేశాలను సమర్ధ వంతంగా నిర్వహించడం, హోటల్ వంటివి బుక్ చేయడం, బడ్జెట్ తయారు చేయడం, బదెజెట్‌కు ఆమోదం పొందడం, సమేశ వేదిక కొరకు విద్యాసంస్థలతో సంప్రదించడం, మాధ్యమాల దృష్టికి సమావేశాల వివరాలు అందించడం, ముఖ్యాతిధులను ఆహ్వానించి వారిని సమావేశానికి రప్పించడం. అతిధి మర్యాదలు చేయడం మొదలైన పలు కార్యక్రమాలు ఉంటాయి. వీటిని మన యువవికీపీడియన్లు అత్యంత ఉత్సాహంతో నిర్వహిస్తుంటారు. అత్యంత వ్యయప్రయాశాలతో కూడు కున్న ఈ కృషి దిద్దుబాట్ల వంటి గణాంకాలకు అందదు. అయినప్పటికీ వీరికృషి అభినందించతగినది అత్యవసరమైనది కూడా. వీరి కృషి ఈ పేజీలో పేర్కొనడం అత్యవసరం.

ఈ పేజీ సృష్టి లక్ష్యం

[మార్చు]
  • 2014 సంవత్సరంలో తెలుగు వికీపీడియా అభివృద్ధి గురించి సభ్యులకు అవగాహన కల్పించి సభ్యులను ఉత్సాహపరచడం.
  • తెవికీ ఏకాదశ ఉత్సవాలలో సభ్యులు ఒకచోట కలవడానికి అవకాశం ఉంది కనుక జరిగి అభివృద్ధి గురించి చర్చించి, తెవీకి మరింత అభివృద్ధి చెందడానికి అవసరమైన సలహాలు సంప్రదింపులు జరిపి భవిష్యత్తు నిర్ణయాలు తీసుకోవడం.
  • సమావేశానికి వచ్చే ముఖ్య అతిధులకు, మాధ్యమానికి తెవికీ అభివృద్ధి గురించిన అవగాన కలిగించడం.
  • క్రియాశీలక సభ్యుల కృషిని వెలుగులోకి తీసుకురావడం.

సభ్యులు చేయవలసిన పని

[మార్చు]
  • వారు చేసిన కృషిని తెలియజేయడం.
  • ఈ సంవత్సరకాలం వారు పాల్గొన్న సమావేశాలను అన్నింటినీ పేకొనడం.
  • అకాడమీ నిర్వహిహిస్తే అకాడమీల సంఖ్య, ప్రదేశం, సంభ్యుల భాగస్వామ్యం వివరించడం.
  • సమావేశాల, అకాడమీ, తెవికీ స్టాల్ విర్వహణ, మొదలైన చిత్రాలను గ్యాలరీలో ఇవ్వడం.
  • చేయాలి.జాబితాలో లేని వారుకూడా వారి పేరును చేర్చి వారి కృషిని తెలియజేస్తే బాగుంటుంది.
  • సమగ్రవ్యాసాలను వ్రాసినవారు వారి వ్యాసాలను లింకులతో చేర్చడం.
  • ప్రాజెక్టులో పనిచేసిన వారు ప్రాజెక్టు లింకులను ఇవ్వడం.
  • వంటివి చేస్తే తెవికి కృషి గురించిన సమగ్రమైన వివరణ అందుడానికి సహకరిస్తుంది.
  • విశ్వనాధ్ గారు, పవన్‌సంతోష్ గారు ఇండివిజ్యుయల్ ప్రాజెక్ట్లలకు అంగీకారం పొంది అందులో కృషిచేస్తూ ఉన్నారు.
  • పవన్ సంతోష్ ఇండివిజ్యుయల్ ప్రాజెక్‌లో సమగ్రమైన కృషిచేసారు. హాకథాన్ వంటివి నిర్వహించారు.
  • పవన్‌సంతోష్ ఇంటర్యూ, పేపర్‌లో న్యూస్ చిత్రాలను చేర్చితే బాగుంటుంది.
  • గోల్డేన్ త్రిషోల్డ్‌లో జరిగిన నెలవారి సమావేశాలు వాటి చిత్రాలు చేర్చాలి.
  • కశ్యప్‌ మొదలైన సభ్యులు పుస్తకప్రదర్శనలో తెవికీ స్టాల్ నిర్వహించారు.
  • స్టాల్‌లో పాల్గొన్న సభ్యులందరి వివరాలు ఇస్తే మిగిలిన సభ్యులకు ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనాలన్న ప్రేరణ కలగడానికి సహకరిస్తుంది.
  • సభ్యులు వికీపీడియా, విక్షనరీ, వీకీసౌర్స్, వికీకోట్ వంటి సోదర ప్రాజెక్టులో జరిపిన కృషి కూడా ఇందులో పేర్కొనడం అవసరం.
  • ఈ సంవత్సరం వీక్షనరీ 1,00,000 పేజీలకు చేరింది.
  • వికీసౌర్స్ 10,000 పేజీలను దాటుతుంది. వికీపీడియా 60,000 వ్యాసాలను దాటుతూ ఉత్సాహంతో పరుగులు తీస్తుంది.
  • 2014 లో తెవికీ బహుముఖంగా అభివృద్ధి చెందింది. ఈ ఉత్సాహానికి మరింత మెరుగులు పెడదాం.
  • తెవికిని భారతీయ భాషలలో ప్రధమ స్థాయికి మరియు స్థానానికి తీసుకు రావడానికి మనవంతు కృషి చేస్తాం.

టి.సుజాత

[మార్చు]
దస్త్రం:T.sujatha.jpg
right
టి.సుజాత
  • లీలావతి కూతుళ్ళు ప్రాజెక్టులో వ్యాసాలను అభివృద్ధి చేయడం. వికీపీడియా:వికీప్రాజెక్టు/లీలావతి కూతుళ్ళు.(25 వ్యాసాల అభివృద్ధి).
  • మహిళాదినోత్సవం సందర్భంగా తెవికీ గోల్డెన్ త్రెషోల్డ్ లో నిర్వహించిన సమావేశంలో పాల్గొనడం. కొత్తగా సభ్యత్వం తీసుకున్న మహిళలకు శిక్షణ ఇవ్వడం.
  • తెవికీ దశాబ్ధి ఉత్సవాలలో తీసుకున్న నిర్ణయాలలో భాగంగా భారతదేశ జిల్లాలకు పేజీలను సృష్టించి వ్యాసాలను అభువృద్ధి చేయడం. ప్రాజెక్ట్ పేజీ తయారు చెయ్యడం, వ్యాసాలకు అవసరమైన మూసల తయారీ, మూసలను పేజీలో చేర్చడం, మెటావికీతో పేజీని అనుసంధానించడం, వ్యాసాలను ఆగ్లవికీ ఆధారంగా అభివృద్ది చేయడం. వికీపీడియా:వికీప్రాజెక్టు/భారతదేశ జిల్లాలు (450 వ్యాసాలకు పైగా అభివృద్ధి)
  • తెవికీ స్కైప్ సమావేశాలలో పాల్గొనడం.
  • క్రియాశీలక సహ సభ్యులతో ఫోను ద్వారా సంప్రదింది పరస్పర చర్చలు జరపడం.
  • ప్రత్యేకంగా కొత్త సభ్యులను చేర్చి వారికి శిక్షణ ఇచ్చి వారితో కొన్ని దిద్దుబాట్లు చేయించడం.
  • తెవికీ ఏకాదశ ఉత్సవాలలో ముందస్తు కార్యక్రమాలలో భాగస్వామ్యం వహించడం.

డాక్టర్ రాజశేఖర్

[మార్చు]
రాజశేఖర్

ఎల్లంకి భాస్కర నాయుడు

[మార్చు]
ఎల్లంకి భాస్కరనాయుడు

2014 వ సంవత్సరంలో తెవికిలో నా కృషి:

  • వికీపీడియా, సంభందిత ప్రాజెక్టులలో

1. 2014 వ సంవత్సరంలో వికీపీడియా లో నేను చేసిన మార్పులు చేర్పుల సంఖ్య 52,000, వికీ సోర్సులో ఎక్కించిన వృక్షశాస్త్రము, అంటువ్యాధులు వంటి గ్రంధాలలోని విషయాన్ని వందలాది వ్యాసాలను వికీపీడియాలో ఎక్కించాను.

2. 2014 వ సంవత్సరంలో విక్షరీలో నేను చేసిన మార్పులు 1,00,000. ఇందులో 2014 వ సంవత్సరారంబంలో అతి తక్కువ స్థాయిలో వున్న తెలుగు విక్షనరీ దిద్దుబాట్ల సంఖ్య ఒక్కసారిగా.... ఒక లక్ష దిద్దుబాట్ల స్థాయికి చేరింది. డాక్టర్ రాజశేఖర్ గారి ప్రోత్సాహంతో బ్రౌన్ నిఘంటువులోని అన్నిపదాలు, మరికొన్ని నిఘంటువలులోని పదాలను పూర్తిగా విక్షనరీ ఎక్కించినందున విక్షరీలోని నా దిద్దు బాట్ల సంఖ్య లక్ష దాటింది. దీనితో ఇంచుమించు తెలుగు భాషలోని అన్ని మూలపదాలు విక్షనరీలో చేరినవి. 2014 సంవత్సరారంబంలో విక్షనరీలో నామోదయిన క్రియాశీల వాడుకరుల సంఖ్య అతి తక్కువ. అదే విదంగా అందులోని దిద్దుబాట్ల సంఖ్య కూడ తక్కువే. కాని వున్నవాళ్ళలో కొందరినైనా ఉత్సాహపరచి విక్షనరీ అభివృద్ధికి తోడ్పాటు ఇచ్చేందుకు చేసిన కృషిలో గుళ్ళపల్లి నాగేశ్వర రావు గారిని ప్రోత్సహించి విక్షరీలో ఎక్కువ దిద్దుబాట్లులను చేయగలిగిన స్థాయికి చేయగలిగాను.

3. 2014 వ సంవత్సరంలో వికీ సోర్సులో నేను చేసిన దిద్దుబాట్లు 11,900.ఇందులో 1. తెలుగువారి జానపద కళారూపాలు: గ్రంథ కర్థ: మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి: పుటలు...784, 2. అంటువ్యాధులు: గ్రంధ కర్థ: ..... ఆచంట లక్ష్మీపతి.... పుటలు......257, 3.యోగాసనములు: గ్రంధ కర్థ: ....... లంక సూర్యనారాయణ....188. 4. వృక్షశాస్త్రము, రచయిత వి. శ్రీనివాసరావు. పుటలు. 188. పెద్దవైన ఈ మూడు గ్రంధాలను అచ్చు దిద్ది అందులోనుండి వందలాది వ్యాసాలను వికీపీడియాలో ఎక్కించాను. సుభద్రా కళ్యాణం గ్రంధ కర్త : తాళ్ళ పాక తిమక్క: (పూర్తయినది 12/4/2014)పుటలు 56, సుభద్రా కళ్యాణం గ్రంధ కర్త : తాళ్ళ పాక తిమక్క: (పూర్తయినది 12/4/2014)పుటలు 56 వంటి కొన్ని చిన్న పుస్తకాలను కూడ అచ్చుదిద్ది ఎక్కించాను. అంతేగాక ఇతరులు వ్రాసిన పుటలను సరిద్ది , ఆమోదింప జేయడమో, సరిచేయడమో చేశాను.

4. 2014 వ సంవత్సరంలో వికీ కామన్స్ లో నేను ఎక్కించిన బొమ్మలు. 1,000 పైనే వుంటాయి.

  • వికీపీడియాలో/దాని సోదర ప్రాజెక్టులలో నేను చేసిన దిద్దు బాట్లు గాక వికీపీడియా కొరకు ఇతరత్రా నేను చేసిన కృషి.

1. హైదరాబాదులో నెల వారి జరిగే ప్రతి సమావేశానికి తప్పని సరిగా హాజరై కొన్ని కొత్త విషయాలు అవగాహన చేసుకున్నాను. దీనితో ఇతరులకు వికీపీడియా గురించి అవగాహన కలిగించడానికి అవకాశము లభించినది.

2. హైదరాబాదులో డిసెంబరు 2014 లో10 రోజుల పాటు జరిగిన పుస్తక ప్రదర్శన తెవికి స్టాలు నిర్వహించిన సందర్భంగా 9 రోజుల పాటు అందులో గుళ్ళపల్లి నాగేశ్వర రావు, ప్రణయ రాజ్ కాశ్యప్ వంటి సహ వికీపీడియన్లతో కలిసి పాల్గొని అనేక మంది సందర్శ కులకు తెవికి గురించి అవగాన కార్యక్రమాన్ని నిర్వహించాము.

3. 28.12.2014 హైదరాబాద్ గోల్డెన్ త్రెష్ హోల్డ్ లో జరిగిన హాకదాన్ కార్యక్రమంలో పాల్గొని కొత్తవారికి తెవికి అవగాహన కార్య క్రమాన్ని నిర్వహించాము.

4. జనవరి 2014 లో హైదరాబాద్ లోని ఖైరతా బాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన వికీపీడియా సదస్సులొ పాల్గొని విధ్యార్థులకు అవగాహన కలిగించాను. ఈ సందర్భంలో ఆ కళాశాల ప్రిన్సిపాల్ గారితో జరిగిన ముఖాముఖి సంభాషణలో వికీపీడియా గురించి ప్రభుత్వము యెక్క దృష్టికి తీసుకెళ్ళడం అనే విషయము ప్రతిపాధించాను. దానికి ప్రిన్సి పాల్ బాగా స్పందించి.... తనకు విధ్యాశాఖ మంత్రితో బాగా పరిచయమున్నదని, తన విద్యార్థి ఒకరు ఎం.ఎల్.గా వున్నారని వారి ద్వారా మనం తెలుగు వికీపీడియా గురించి ప్రభుత్వ దృష్టికి తేసుకెళ్ళవచ్చని,/మరియు ముఖ్య మంత్రి దృష్టికి కూడ తీసుకెళ్ళవచ్చని దానికి తగు ప్రతిపాధనలు తెస్తే ఒక సారి మనం అందరము మంత్రి గారిని కలవవచ్చని తెలిపారు. దీనిని మనం సద్వినియోగము చేసుకొని ఈ విషయమై మనం ప్రయత్నము చేయ వససి వున్నది.

5. మనం తిరుపతిలో జరుప తలపెట్టిన ఏకాదశ వార్షికోత్సవాల సందర్భంగా తెలుగు వికీపీడియా అవగాహన,/ ప్రచారానికి ఉపయోగ పడడానికి వీలుగా వుండేందుకు వికీపీడియా ప్రాథమిక అంశాలతో కూడిన ఒక చేతి పుస్తకమును తయారు (సుమారు 50....60 పుటలు) చేసి సహ వికీపీడియనుల సలహాలకొరకు రచ్చబండ లో వికీపీడియా:'''తెలుగు వికీపీడియా''' మార్గదర్శిని పేరుతో పెట్టాను.

6. వికీపీడియా:'''తెలుగు వికీపీడియా''' మార్గదర్శిని లోని ప్రాధమిక అంశాలను మాత్రము తీసుకొని సుమారు నాలు పుటలు వచ్చేటట్లు వికీపీడియా కరపత్రము పేరుతో రచ్చబండలో పెట్టడము జరిగినది. దీనిని తిరుపతి సమావేశాల సందర్భంగా జరగబోవు అవగాహన కార్య క్రమాల ప్రచారానికి ఉపయోగించు కోవడానికి వీలుగా తయారు చేశాను.

పవన్ సంతోష్

[మార్చు]

2014లో తెలుగు వికీపీడియాలో ప్రధానంగా రెండు ప్రాజెక్టులు చేపట్టి వాటి ద్వారాను, అవి కాక విడిగా స్వంతంగాను సాధ్యమైనంతగా వ్యాసాలను అభివృద్ధి చేశాను. ఆఫ్-వికీలో తెవికీ దశాబ్ది, వికీమీట్స్, కన్సల్టేషన్, కాన్ఫరెన్స్, ఎడిట్-అ-థాన్స్, వికీపీడియా స్టాల్, వికీ అకాడమీలు వగైరాల్లో పాల్గొన్నాను. స్వయంగా ఎడిట్-అ-థాన్లు, అకాడమీలు, లైసెన్స్ రీరిలీజ్ కార్యక్రమాలు నిర్వహించాను. ఇవి కాక వికీసోర్సులో, వికీకోట్స్‌లో, వికీ కామన్స్ వంటి సంబంధిత వికీప్రాజెక్టుల్లో కూడా కొద్దిగా కృషిచేశాను. వీటన్నిటి గురించి కొంత వివరంగా కింద చూడవచ్చు:

  • ఈ సంవత్సరం నేను ప్రారంభించి అభివృద్ధి చేసిన ప్రాజెక్టులు రెండు: సాహిత్యం ప్రాజెక్టు, తెలుగు సమాచారం అందుబాటులోకి. సాహిత్యం ప్రాజెక్టును మొదటి ఆరునెలల పాటు అభివృద్ధి చేయగా, మిగిలిన ఆరునెలలు తెలుగు సమాచారం అందుబాటులోకిపై ప్రధానంగా కృషిచేశాను.
  • తెలుగు వికీపీడియా సహకారంతో వికీపీడియాలను విశేషంగా అభివృద్ధి చేసే ప్రణాళికలు సమర్థించేందుకు వికీమీడియా ఫౌండేషన్ వారు అందించే ఇండివిడ్యువల్ ఎంగేజ్‌మెంట్ గ్రాంట్ పొందాను. ఇది పొందిన భారతీయుల్లో రెండవ వ్యక్తిగా, భారతీయ భాషా వికీపీడియాలను అభివృద్ధి చేసేందుకు ఐఈజీ పొందిన మొదటివ్యక్తిగా తద్వారా నిలిచాను.
  • తెలుగు సాహిత్యంలో(భారతీయ సాహిత్యంలో కూడా) ముఖ్యమైన పుస్తకాలు, కవులు, సాహిత్యవిమర్శకులు, అవార్డులు వంటి గురించి పేజీలు తయారుచేయడం, ఉన్న పేజీలు అభివృద్ధి చేయడం చేశాను. ఆ క్రమంలో ఇతర వికీపీడియన్లను సమన్వయం చేస్తూ తెలుగులో సాహిత్య అకాడమీ పురస్కారాలు పొందిన రచయితలు, భారతీయ భాషలన్నిటి నుంచి జ్ఞానపీఠ్ పురస్కారం పొందిన రచయిత పేజీలు సృష్టించి అభివృద్ధి చేశాం. ఇంకా కొందరు భారతీయ జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీతల గురించిన పేజీలు తయారుకావాల్సివుంది.
  • వికీమీడియా ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో గ్రాంటీగా నేను చేపట్టిన తెలుగు సమాచారం అందుబాటులోకి ప్రాజెక్టులో భాగంగా తెలుగు వికీపీడియన్లకు విలువైన డిజిటల్ బుక్స్ మూలాలుగా అందించే కృషిచేశాను. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని విలువైన తెలుగు పుస్తకాల్లో నాలుగువేల పైచిలుకు పుస్తకాలను సరైన వివరాలతో తెలుగు వికీపీడియాలోని విషయపు పేజీల్లో జాబితాలు చేశాం. దీని మూలంగా సంబంధిత పుస్తకాలను, రచయితలను, వివరాలను కానీ తెవికీలో, గూగుల్ సెర్చింజన్‌లో వెతికితే తేలికగా పుస్తకాన్ని దొరకబుచ్చుకుని వినియోగించుకోవచ్చు.
  • డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితాగా అబివృద్ధి చేసిన పేజీల్లోని తెలుగు పుస్తకాల నుంచి దాదాపుగా 600 వ్యాసాలను అభివృద్ధి చేశాము.(ఇందులో నాతోపాటుగా రాజశేఖర్ గారు, స్వరలాసిక గారు, మీనాగాయత్రి వంటివారు పాల్గొన్నారు.)
  • తెలుగు వికీపీడియాలోని గ్రామాల వ్యాసాలను విస్తృతిపరంగా అభివృద్ధి చేసేందుకు కొన్ని ప్రత్యేకమైన నమూనాలను ప్రయత్నించి చూశాను. ఆ క్రమంలో నెల్లూరు జిల్లా గ్రామనామాలపై, గ్రామాల పేర్లపై పరిశోధనలు చేసిన పరిశోధన పత్రాలను, గ్రంథాలను తీసుకుని వాటి ద్వారా రాష్ట్రంలోని వివిధ గ్రామాల పేజీలలో పేరు వెనుక చరిత్ర అన్న శీర్షికను అభివృద్ధి చేశాను. (ప్రయోగాత్మకంగానే, పెద్దఎత్తున కాదు) తొలియాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య 1830లో వ్రాసిన కాశీయాత్రచరిత్రలో ఆయన పర్యటిస్తూ ఆనాటి సాంఘక స్థితిగతులతో వ్రాసిన గ్రామాల వివరాలు తీసుకుని, ఆయా గ్రామాలను గుర్తించి వాటి వ్యాసాల్లో చరిత్రగా చేర్చాను. చిత్తూరు, కడప, కర్నూలు, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రామాల వరకూ పూర్తిచేశాను. దాని సూచిక పేజీ ఇది.
  • తెవికీలో పలు చారిత్రిక గ్రంథాల ఆకరాల నుంచి సేకరించిన వివరాలతో కొన్ని చారిత్రికవ్యాసాలు కొత్తగా రాశాను, మరికొన్నిటిని అభివృద్ధి చేశాను. ఈ క్రమంలోనే కర్నూలు నవాబుల పేజీలు సృష్టించి, 19వ శతాబ్ది చెన్నపట్టణానికి సంబంధించిన వ్యక్తుల వ్యాసాలు, దేశచరిత్రలో ప్రముఖమైన యుద్ధాలు, మొఘల్ చరిత్ర, నిజాం రాజ్యానికి సంబంధించిన వ్యాసాలు, వగైరాలు అబివృద్ధి చేశాను.
  • వికీమీడియా ఫౌండేషన్ ఇండియా కమ్యూనిటీ కన్సల్టేషన్-2014లో తెలుగు ప్రతినిధి బృందంలో ఒకనిగా పాల్గొన్నాను. తాడేపల్లిగూడెంలో తెలుగు సమాచారం అందుబాటులోకి ప్రాజెక్టు గురించి వివరించేందుకు అయ్యంకి వెంకటరమణయ్య స్మారక ఎడిట్-అ-థాన్, కర్ణాటక సంగీత కృతుల హక్కుల విడుదల కార్యక్రమం నిర్వహించాను.
  • ఆఫ్ వికీ వివరాలకొస్తే తెవికీ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నాను. ఉడతాభక్తిగా నేనూ కొన్ని పనులలో సహకరించాను. మహిళా దినోత్సవం సందర్భంగా చేసిన ఎడిట్-అ-థాన్‌లో పాల్గొన్నాను. ప్రతినెలా నిర్వహిస్తున్న హైదరాబాద్ సమావేశాల్లో వీలుకుదరనప్పుడు స్కైప్ ద్వారా, కుదిరినప్పుడు వ్యక్తిగతంగానూ పాల్గొన్నాను. హైదరాబాద్ బుక్ ఫెస్టివల్‌లో వికీపీిడియా స్టాల్ నిర్వహించినప్పుడు వీలున్నంతలో రెండు రోజులు పాల్గొని సహకరించాను. వికీపీడియా హాకథాన్‌లోనూ పాల్గొన్నాను. విజయవాడలో సీఐఎస్-ఆంధ్రా లయోలా కాలేజీ నిర్వహిస్తున్న సంయుక్త కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు వికీపై అవగాహన కలిగించాను.
  • పుస్తకం.నెట్లో వికీపీడియా మహిళా దినోత్సవ కార్యక్రమం గురించి తెవికీలో సగం అన్న వ్యాసం వ్రాశాను. వికీమీడియా ఫౌండేషన్ వారి వ్యక్తిగత గ్రాంట్ గురించి సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ వంటి పత్రికల్లోనూ, ఈటీవీ2లోనూ వార్తలు, కార్యక్రమాలు ప్రసారమయ్యాయి.

స్వరలాసిక

[మార్చు]
  • సాహిత్య సంబంధ వ్యాసాల విస్తరణ మరియు సృష్టి. రాయలసీమ రచయితల చరిత్ర, కర్నూలు జిల్లా రచయితల చరిత్ర, పిఠాపుర సంస్థానము- కవిపండిత పోషణ, Who's who of Indian Writers, గోలకొండకవుల సంచిక మొదలైన గ్రంథాల ఆధారంగా మరియు భారతి, గృహలక్ష్మి వంటి పత్రికల ఆధారంగా కవుల, రచయితలపై వ్యాసాలు, గ్రంథాలపై వ్యాసాలు, శతకాలను గురించిన వ్యాసాలను, సాహిత్య సంస్థల/ప్రచురణ సంస్థల గురించిన వ్యాసాలను వ్రాయడం మరియు విస్తరించుట. ఇప్పటి వరకు 250కి పైగా వ్యాసాలను అభివృద్ధి చేయడం జరిగింది. ఆ వ్యాసాల వివరాలు నా వాడుకరి పేజీలో చూడవచ్చు.
  • గోల్డేన్ త్రిషోల్డ్‌లో జరిగిన నెలవారి సమావేశాలలో పాల్గొనడం.
  • తెవికీ స్కైప్ సమావేశాలలో పాల్గొనడం.

ప్రణయరాజ్ వంగరి

[మార్చు]
ప్రణయ్ రాజ్
  • తెవికీ నెలవారీ సమావేశాల ఏర్పాటు మరియు నిర్వహణలో చురుకైన పాత్ర పోషించడం.
  • సుమారు ఒక 30 మంది రంగస్థల నటీమణుల గురించి మరియు కొన్ని ప్రముఖ తెలుగు నాటకాల గురించిన వ్యాసాలు ప్రారంభించి అభివృద్ధి చేశారు.

కశ్యప్

[మార్చు]
కృపాల్ కశ్యప్
  • తెవికీ కోశాధికారిగా బాధ్యతలు సమర్థంగా నిర్వహణ.

కాశీ విశ్వనాథ్ బేసే

[మార్చు]
విశ్వనాధ్ బి.కె

శ్రీరామమూర్తి

[మార్చు]
శ్రీరామమూర్తి

కటకం వెంకటరమణ (kvr.lohit)

[మార్చు]
కటకం వెంకటరమణ
  • శాస్త్ర సాంకేతిక అంశాలలో నూతన వ్యాసాలను అభివృద్ది చేయడం మరియు కొత్త వాడుకరులకు దిశానిర్దేశం చేయడము.

వైవి.ఎస్. రెడ్డి

[మార్చు]

జలసూత్రం వెంకట రామకృష్ణ ప్రసాద్ (జె.వి.ఆర్.కె. ప్రసాద్)

[మార్చు]
జె.వి.ఆర్.కె.ప్రసాద్
  • భారతీయ రైల్వేల గురించిన సమగ్ర సమాచారాన్ని చేరవేయడం.
  • హిందూ మతము మరియు సంస్కృతి సంబంధిత సమాచారాన్ని విస్తరించడం మరియు కొత్త అంశాలను చేర్చడము.
  • కొత్తగా సభ్యత్వం తీసుకున్న వారికి ఆహ్వానములు అందించడము.
  • వ్యాసములలో అక్షరదోషములు సరిదిద్దడము.
  • భారత దేశము, హిందూ మతము, రసాయన శాస్త్రము, వేదములు, జ్యోతిష్యం, ప్రాచీన భారత దేశము, విశ్వము, అంతరిక్షము, శాస్త్రసాంకేతిక రంగము వికీపీడియా, మొదలయిన వాటి మూసలు తయారు చేయడము.
  • వ్యాసాలను సరి అయిన వర్గాలలో చేర్చడము.
  • సభ్యులకు అవసరమయిన సలహాలు, సూచనలు ఇవ్వడము.
  • ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా తదితర వాటికి సమగ్ర సమాచారం చేరవేయడము.

రవిచంద్ర

[మార్చు]
అహ్మద్ నిసార్

వీరశశిధర్ జంగం

[మార్చు]
  • ఫోటోగ్రఫీ సంబంధిత వ్యాసాలను విస్తరించడం.
  • తెవికీ కొత్త మూసలను మరియు వాడుకరి పెట్టెలను అభివృద్ది చేయడం.

రహ్మానుద్దీన్

[మార్చు]
  • తెవికీ శిక్షణా శిబిరాలను విజయవంతంగా నిర్వహించడం మరియు విద్యార్థులకు తెవికీని పరిచయం చేసి వారిని చురుగ్గా తెవికీలో పాల్గొనజేయడం.

విష్ణువర్ధన్

[మార్చు]
విష్ణువర్ధన్
  • లీలావతి కూతుళ్ళు ప్రాజెక్టు వికీపీడియా:వికీప్రాజెక్టు/లీలావతి కూతుళ్ళు ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించి తోటి సభ్యుల సహాయసహకారాలతో పూర్తిచేశారు. దీనిద్వారా సుమారు 60 మంది ప్రముఖ మహిళా శాస్త్రవేత్తల వ్యాసాలను ఏ భారతీయ భాషా సమూహం చేయకముందే తెలుగు వికీపీడియా ద్వారా సమగ్రమైన సమాచారాన్ని ప్రజలకు అందించారు.

సుల్తాన్ ఖాదర్

[మార్చు]
  • సమకాలీన అంశాలను తెవికీలో చేరవేత
  • కర్ణాటక రాష్ట్ర సమగ్ర సమాచారం తెవికీలో చేర్చే లక్ష్యంగా కృషి ప్రారంభం.
  • భారతదేశ విమానాశ్రయాల సమగ్ర సమాచారం తెవికీలో చేర్చివేత కృషి ప్రారంభం.
  • ప్రపంచదేశాల వ్యాసాల విస్తరణ మరియు శుద్ది

అహమ్మద్ నిస్సార్

[మార్చు]

అర్జునరావు

[మార్చు]

వైజాసత్య

[మార్చు]

చంద్రకాంతరావు

[మార్చు]
సి.చంద్రకాంతరావు
  • తెలంగాణ వ్యాసాల నాణ్యత పెంపు దిశగా విశేశ కృషి.

గుళ్లపల్లి నాగేశ్వరరావు

[మార్చు]
  • వికీపీడియాలో

గ్రామాల వ్యాసాలు అనేకం అభివృద్ధి చేశాను. వాటిలో 2011 జనాబ లెక్కలు మనకు అందుబాటులోకి రాకముందే జనాబా గణన శాఖ వారినుండి జనాబా అవివరాలు గల సీడి తెప్పించి చాల గ్రామాలకు జనాబా వివరాలు వ్రాశాను. ఇంకా వ్రాస్తున్నాను. అలాగే తెలుగు ప్రముఖు వ్వక్తుల జనన/మరణ వివరాలు వ్రాశాను.

  • విక్షనరీలో

విక్షనరీలో అనేక పదాలు వాటి అర్థాలు వ్రాశాను. అతి తక్కువ మంది వాడుకరులున్న విక్షరీలో నేను కూడ చురుకుగా పాల్గొన్నాను.

  • వికీసోర్స్ లో ఆంధ్రలోకోక్తిచంద్రికాశేషము పుస్తకం లిప్యంతరీకరణలో పాల్గొన్నారు. ఇతరులు వ్రాసిన దానిని దిద్దుబాట్లు చేయడం, ఆమోదించడము వంటి వాటిలో చురుకుగా పాల్గొన్నాను.

పాలగిరి రామకృష్ణారెడ్డి

[మార్చు]

వీవెన్

[మార్చు]

మీనా గాయత్రి

[మార్చు]

కట్టా శ్రీనివాసరావు

[మార్చు]

నాయుడుగారి జయన్న

[మార్చు]
  • తెలంగాణ సంస్కృతి మరియు దర్శనీయ ప్రదేశాల గురించిన సమాచారం చేరవేత.

పవన్ జంధ్యాల

[మార్చు]

ఆదిత్య మాధవ్

[మార్చు]

భూపతిరాజు రమేష్ రాజు

[మార్చు]

సుబ్రహ్మణ్య శర్మ

[మార్చు]

ప్రవీణ్ కుమార్ గోలివాడ

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]