వేదిక:తెలుగు సినిమా/ఈ వారం బొమ్మ/2015-51వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాపు

బాపు (డిసెంబరు 15, 1933 - ఆగస్టు 31, 2014) అసలు పేరు సత్తిరాజు లక్ష్మీనారాయణ. తెలుగునాట పేరెన్నికగన్న బహుముఖ ప్రజ్ఙాశాలి. బాపు గీత, బాపు వ్రాత తెలుగువారి సంస్కృతిలో భాగమయ్యాయి. బాపు చిత్రం ప్రచురించని తెలుగు పత్రికలు అరుదు. ఆయన వేసిన కార్టూనులూ, పుస్తకాల ముఖచిత్రాలూ లెక్క పెట్టడం కష్టం.

చలన చిత్రకళ[మార్చు]

1967లో సాక్షి (సినిమా) చిత్రదర్శకునిగా సినిమారంగంలో అడుగుపెట్టిన బాపు మొదటి చిత్రంతోనే ప్రసంసలు అందుకొన్నాడు. అయన మొత్తం 41 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 1976 లో వెలువడిన 'సీతాకల్యాణం' సినిమా చూసేవారికి కన్నుల పండుగ. ముఖ్యంగా అందులో గంగావతరణం సన్నివేశం మరువరానిది.

బాపు తను తీయబోయే చలన చిత్రపు సన్నివేశాలను సచిత్రంగా ( స్టోరీబోర్డు ) తయారు చేసుకుని తెరమీదకి ఎక్కిస్తాడు.ఈ విధానం వలన తను మనసులో అనుకున్నది కాగితం మీద ఎంత అందంగా చిత్రీకరించుకుంటాడో అంతే అందంగా తెరమీద గందరగోళం లేకుండా చిత్రీకరించగలుగుతాడు.
ఉదాహరణకి...రాధాగోపాళం తెలుగు సినిమాకి ఈయన గీసుకున్న సన్నివేశపు చిత్రం.

బాపు దర్శకత్వం వహించిన సినిమాలు[మార్చు]

 1. శ్రీరామరాజ్యం,2011(తెలుగు)
 2. సుందరకాండ,2008(తెలుగు)
 3. రాధా గోపాళం,2005(తెలుగు)
 4. రాంబంటు ,1996(తెలుగు)
 5. పెళ్ళికొడుకు,1994(తెలుగు)
 6. పరమాత్మా,1994(హిందీ )
 7. శ్రీనాథ కవిసార్వభౌమ,1993(తెలుగు)
 8. మిష్టర్ పెళ్ళాం,1993(తెలుగు)
 9. పెళ్ళి పుస్తకం,1991(తెలుగు)
 10. ప్రేమ్ ప్రతిజ్ఞా,1989(హిందీ )
 11. దిల్ జలా,1987(హిందీ )
 12. ప్యార్ కా సిందూర్,1986(హిందీ )
 13. కళ్యాణ తాంబూలం,1986(తెలుగు)
 14. మేరా ధరమ్,1986(హిందీ )
 15. ప్యారీ బెహనా,1985(హిందీ )
 16. బుల్లెట్,1985(తెలుగు)
 17. జాకీ,1985(తెలుగు)
 18. మొహబ్బత్,1985(హిందీ )
 19. సీతమ్మ సేత,1984(తెలుగు)
 20. మంత్రిగారి వియ్యంకుడు,1983(తెలుగు)
 21. వోహ్ సాత్ దిన్,1983(హిందీ )
 22. ఏది ధర్మం ఏది న్యాయం,1982(తెలుగు)
 23. కృష్ణావతారం,1982(తెలుగు)
 24. నీతిదేవన్ మయగుగిరన్,1982(తమిళం )
 25. పెళ్ళీడు పిల్లలు,1982(తెలుగు)
 26. బేజుబాన్,1981(హిందీ )
 27. రాధా కళ్యాణం,1981(తెలుగు)
 28. త్యాగయ్య,1981(తెలుగు)
 29. హమ్ పాంచ్,1980(హిందీ )
 30. వంశవృక్షం,1980(తెలుగు)
 31. కలియుగ రావణాసురుడు,1980(తెలుగు)
 32. పండంటి జీవితం,1980(తెలుగు)
 33. రాజాధిరాజు,1980(తెలుగు)
 34. తూర్పు వెళ్ళే రైలు,1979(తెలుగు)
 35. మనవూరి పాండవులు,1978(తెలుగు)
 36. అనోఖా శివభక్త్,1978,హిందీ
 37. గోరంత దీపం,1978(తెలుగు)
 38. స్నేహం,1977(తెలుగు)
 39. భక్త కన్నప్ప,1976(తెలుగు)
 40. సీతాస్వయంవర్,1976(హిందీ )
 41. శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్,1976(తెలుగు)
 42. సీతాకల్యాణం,1976(తెలుగు)
 43. ముత్యాల ముగ్గు,1975(తెలుగు)
 44. శ్రీ రామాంజనేయ యుద్ధం,1974(తెలుగు)
 45. అందాల రాముడు,1973(తెలుగు)
 46. సంపూర్ణ రామాయణం,1971(తెలుగు)
 47. బాలరాజు కథ,1970(తెలుగు)
 48. ఇంటి గౌరవం,1970(తెలుగు)
 49. బుద్ధిమంతుడు,1969(తెలుగు)
 50. బంగారు పిచ్చుక,1968, తెలుగు
 51. సాక్షి,1967(తెలుగు)

చిత్ర సౌజన్యం: కప్పగంతు శివరామప్రసాద్