Jump to content

సురేంద్ర రొడ్డ

వికీపీడియా నుండి

సురేంద్ర రొడ్డ
స్థానిక పేరుసురేంద్ర రొడ్డ
జననం(1969-06-01)1969 జూన్ 1
నివాస ప్రాంతం
గరుడ గేట్ వే అపార్ట్మెంట్

ఫ్లాట్ నెంబర్ 507 ఉప్పరపల్లి చెక్ పోస్ట్ తిరుపతి
మండలం: తిరుపతి
జిల్లా:తిరుపతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం

 India ఇండియా
విద్యఎం.ఏ,. బి ఎడ్,.
భార్య / భర్తఉషారాణి
పిల్లలుజ్ఞాపిక,శీర్షిక
తల్లిదండ్రులుజయరామయ్య, చెంగమ్మ

సురేంద్ర రొడ్డ [1] కవి, రచయిత, సినీ గేయ రచయిత [2], గాయకుడు, ఉపాధ్యాయుడు ఆంద్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, ఐరాల మండలం, గోవిందరెడ్డిపల్లి వాస్తవ్యులైన జయరామయ్య చెంగమ్మ దంపతుల కుమారుడిగా 1969, జూన్ 1న జన్మించాడు.[3]

విద్యాభ్యాసం

[మార్చు]

సురేంద్ర రొడ్డ ప్రాథమిక విద్య ఐరాల గోవిందరెడ్డిపల్లిలో, హైస్కూలు ఇంటర్మీడియట్ ఐరాలలో చదివాడు. అనంతరం, బి.ఏ అంబేద్కర్ యూనివర్సిటీ హైదరాబాద్. ఎం.ఏ (యం.కె.యు మధురై) బి.ఎడ్ (ఇగ్నో యూనివర్సిటీ ఢిల్లీ) దూరవిద్య ద్వారా పూర్తి చేసాడు.

వృత్తి వివరాలు

[మార్చు]

సురేంద్ర రొడ్డ విద్యాభ్యాసం పూర్తయ్యాక, 1989లో చిత్తూరు జిల్లా, కుప్పం మండలం నాయనూరు లో ప్రత్యేక ఉపాధ్యాయులుగా నియామకమయ్యాడు. 1992 లో సెకండరీ గ్రేడ్ టీచర్ గా కంగుంది పాఠశాలలో పర్మినెంట్ అయ్యాడు.

2019 లో పాఠశాల సహాయకులు (సాంఘిక శాస్త్రం)గా పదోన్నతి పొంది , జిల్లా ఉన్నత పాఠశాల (బాలురు) వడమాలపేట నందు ప్రస్తుతం పని చేస్తున్నాడు.

సాహితీ ప్రస్థానం

[మార్చు]

సురేంద్ర రొడ్డ హైస్కూలు చదివే రోజులనుండే రచనారంగం పై ఆసక్తి ఏర్పడింది. వక్తృత్వం, వ్యాసరచన పోటీలకు స్వయంగా వ్రాసేవాడు. అలా అలా కవిత్వం పై అభిలాష పెరిగి కవితలు వ్రాయడం ప్రారంభించారు. సురేంద్ర వ్రాసిన తొలికవిత "ప్రియా " 1992 లో ఆంధ్రభూమి లో ప్రచురితమైంది. అలా సురేంద్ర వ్రాసిన కవితలు అన్ని దిన, వార, మాసపత్రికలో ప్రచురితమయ్యాయి. మనం దినపత్రిక ఆదివారం మకుటంలో‌ ప్రచురితమైన " నాన్న పచ్చి అబద్ధాలకోరు " కవిత సురేంద్రకు బాగా పేరు తెచ్చింది. ఆ తరువాత సురేంద్ర "నాన్న పచ్చి అబద్ధాలకోరు" కవితాసంపుటి కూడా వెలువరించారు.

ఇక కథల విషయానికొస్తే, తొలికథగా "అడవి మల్లి" కథ రాసి " తెలుగు వెలుగు " మాసపత్రికకు పంపాడు.తొలి కథే ప్రచురణకు స్వీకరించబడింది. అలా వ్రాసిన ప్రతి కథ తెలుగు వెలుగు, మనం, స్నేహ, సాహితీకిరణం, ప్రజాశక్తి, విశాలాక్షి, సాహో, ఆంధ్రప్రభ మొదలగు పత్రికలలో ప్రచురితమయ్యాయి. రామోజీ ఫౌండేషన్ తెలుగు వెలుగు నిర్వహించిన కరోనా కవితలపోటీలో ప్రథమ విజేతగా నిలిచాడు.[4]

పుస్తకాలు

[మార్చు]
సురేంద్ర రొడ్డ కవి పుస్తకాలు

● నాన్న పచ్చి అబద్ధాలకోరు (కవితాసంపుటి)

● భావతరంగాలు (కవితాసంపుటి)

● అడవిమల్లి ( కథలసంపుటి)

పత్రికల్లో ప్రచురించిన కథలు

[మార్చు]

అడవి మల్లి- తెలుగు వెలుగు లో ప్రచురితమైనది.

● పచ్చని జ్ఞాపకాల సెలయేరు- మనం లో ప్రచురితమైంది.

● నాన్నమ్మ పెంపకం - స్నేహ లో ప్రచురితమైంది.

●నాన్న పాలలో వెన్న - స్నేహ లో ప్రచురితమైంది.

●నాన్న రాసిన ఉత్తరం - మనం లో ప్రచురితమైంది.

●సీతమ్మ మొగుడు - సాహితీ కిరణంలో ప్రచురితమైంది.

●మన ఇల్లు - విశాలాక్షి లో ప్రచురితమైంది.

●బడిబాట-స్వేరో కథలపోటి

●నాన్న నేనొస్తున్నా ! - విశాలాక్షి కథలపోటీ.

●తొలి ఉగాది - సాహో కథలపోటీ

● నివేదిత - సాహో కథలపోటీ

పత్రికల్లో ప్రచురించిన బాల సాహిత్యం

[మార్చు]

● పశ్చాత్తాపం - ఆంధ్రప్రభ లో ప్రచురితమైంది.

●తాతయ్య మాట - ప్రజాశక్తి లో ప్రచురితమైంది.

●నమ్మకం- ప్రజాశక్తి లో ప్రచురితమైంది.

●ముందుచూపు- ప్రజాశక్తి లో ప్రచురితమైంది.

●వాళ్ళే దేవుళ్ళు - సహరిలో ప్రచురితమైంది.

●పిచ్చోడికథ - విశాలాక్షి లో ప్రచురితమైంది.

●రైతు కష్టం - సాహో మాసపత్రిక లో ప్రచురితమైంది.

సత్కరాలు

[మార్చు]

● మదనపల్లి సాహితీ కళావేదిక వారిచే సన్మానం.

●గ్రంథాలయ స్వర్ణోత్సవం చిత్తూరు వారిచే సన్మానం.

● ముత్యాల సరాలు మాసపత్రిక చిత్తూరు వారిచే సన్మానం.

● సేనా సేవా సాహితీ ఫౌండేషన్ వారిచే సన్మానం.

●తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి ,పలమనేరు వారిచే సన్మానం.

●ప్రతిలిపి అనంతపురం వారిచే సన్మానం.

● యన్ జి ఓస్ నెట్వర్క్ తిరుపతి వారిచే సన్మానం.

●గార్గేయ సాహితీ సంస్థ ,సదుం వారిచే సన్మానం.

● తెలుగు తల్లి కెనడా మాసపత్రిక కెనడా డే-2023 సందర్భంగా నిర్వహించిన అంతర్జాతీయ కవితల పోటీలో విజేతకు తిరుపతి రచయితల సంఘం సన్మానం

పురస్కారాలు

[మార్చు]

● ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ఉగాదిపురస్కారం.

●విశ్వశ్రీ ఫౌండేషన్ హైదరాబాద్ వారి జాతీయ పురస్కారం.

● విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ వారి పురస్కారం.

●తపస్వి మనోహరం ఉత్తమ కథారచయిత పురస్కారం.

●సృజనసాహితీ సంస్థ పలమనేరు వారిచే 'కవి శ్రేష్ట బిరుదు పురస్కారం'.

● ఆంద్రప్రదేశ్ తిరుపతి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2022.

● ఐటాప్ ఐడియల్ టీచింగ్ నేషనల్ అవార్డు-2022.

● ఉత్తమ రచనా కీర్తి పురస్కారం 2023 ఆలూరి కల్చరల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్.

● తెలుగు వెలుగు సాహితీ కళారత్న పురస్కారం-2023. (నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆఫ్ న్యూ ఢిల్లీ సౌత్ ఇండియా విభాగం తెలుగు భాషా సాహితీ సాంస్కృతిక సేవా సంస్థ)

● సురేంద్రకు అంబేద్కర్ సాహిత్య పురస్కారం-2024[5]

సినీప్రస్థానం

[మార్చు]

ప్రస్తుతం"వెన్నెలొచ్చింది" సినిమాతో లిరిక్ రైటర్ గా పరిచయం అవుతున్నాడు.

మూలాలు

[మార్చు]
  1. pratapreddy. "సామజిక చైతన్య స్ఫూర్తి "నాన్న పచ్చి అబద్దాలకోరు"". Asianet News Telugu. Retrieved 2024-12-18.
  2. "18న 'శిశిరం' పాటలు విడుదల - Prajasakti" (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-12-16. Retrieved 2024-12-18.
  3. "సరళమైన భావాల 'సురేంద్ర కవిత్వం' | Surendra Rodda". web.archive.org. 2023-05-29. Archived from the original on 2023-05-29. Retrieved 2024-03-30.
  4. "అమృత సింధువు | Prajasakti". web.archive.org. 2023-05-29. Archived from the original on 2023-05-29. Retrieved 2024-03-30.
  5. ఆంధ్రజ్యోతి (2024-04-14), సురేంద్రకు అంబేద్కర్ సాహిత్య పురస్కారం, retrieved 2024-04-15