సూపర్ మేన్ (1980 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సూపర్ మేన్
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.మధుసూదనరావు
తారాగణం నందమూరి తారక రామారావు,
జయప్రద ,
కాంతారావు
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ అన్నపూర్ణ ఫిల్మ్స్
భాష తెలుగు

సూపర్ మేన్ 1980 లో వచ్చిన సినిమా. లక్ష్మి విష్ణు ప్రొడక్షన్స్ పతాకంపై ఆర్. గోపాల్ నిర్మించాడు.[1] దీనికి వి.మధుసూదన్ రావు దర్శకత్వం వహించాడూ,[2] చక్రవర్తి సంగీతం అందించాడు. ఎన్.టి.రామారావు, జయ ప్రద ప్రధాన పాత్రధారులు.[3][4]

రాజా ( ఎన్.టి.రామారావు ) జమీందార్ రఘునాథరావు ( కాంతారావు ) కుమారుడు. కుటుంబం మొత్తం హనుమంతుడి ( అర్జా జనార్థనరావు ) భక్తులు. తన బాల్యంలో, హనుమాన్ జయంతి సందర్భంగా, రఘునాథ రావు తమ వారసత్వ ఆభరణాలను దేవుడికి అర్పించాలనుకుంటారు. అదే సమయంలో, ముగ్గురు దొంగలు మహారాజ్ ( సత్యనారాయణ ), సర్దార్ ( శ్రీలంక మనోహర్ ), జైసింగ్ ( త్యాగరాజు ) లు ఆ నగలు దొంగిలించి రఘునాథ రావుతో పాటు అతని భార్య అన్నపూర్ణ ( అన్నపూర్ణ )ను, ఆలయ పూజారినీ చంపేస్తారు. రాజా ఒంటరిగా మిగిలిపోతాడు. పూజారి కుటుంబం కూడా అనాథగా మిగిలిపోతుంది. రాజా వారిని తన సొంత తల్లిగా, సోదరిగా చూసుకుంటాడు. కానీ రాజా ముగ్గురు ద్రోహులపై ప్రతీకారం తీర్చుకోవడానికి చాలా కష్టపడతాడు. అతను హనుమంతుడిని ప్రార్థిస్తాడు. ఆంజనేయుడి ఆశీర్వాదాలతో, రాజా అతీంద్రియ శక్తులను సంపాదించి సూపర్ మే న్ అవుతాడు.

రాజా పెంపుడు తల్లి శారద ( పండారి బాయి ) దానిని గుర్తించి, అతను దానిని బహిర్గతం చేయకూడదని అతని చేత ప్రమాణం చేయిస్తుంది. సంవత్సరాలు గడిచేకొద్దీ, రాజా తన శక్తిని ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించుకుంటూంటాడు. కాని తన గుర్తింపును వెల్లడి కానీడు. రాజా బంగారయ్య ( అల్లు రామలింగయ్య ) తో కలిసి మైనింగ్ వ్యాపారాన్ని చేపడతాడు. అతని కుమార్తె జయ ( జయ ప్రద ) తో ప్రేమలో పడతాడు. ముగ్గురు ద్రోహులు ఇప్పటికీ సమాజ వ్యతిరేక, చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిర్వహిస్తూనే ఉన్నారు. మొదట రాజా జైసింగ్‌ను తొలగిస్తాడు. ఆ తరువాత, బంగారయ్య గనిలో బంగారం ఉందని మహారాజ్ తెలుసుకుంటాడు. అది వారికి తెలియదు. కాబట్టి, వారు ఆ మైనింగ్ ప్రాంతంలో రాక్షసులు ఉన్నారని ప్రచారం చేసి ఎవరినీ పని చేయడానికి రానివ్వరు. వారు ఆ గనిని ఆక్రమించు కోవాలనుకుంటారు. రాజా వారి ప్రణాళికను తెలుసుకుంటాడు. ఆ ప్రక్రియలో అతను సర్దార్‌ను కూడా చంపేస్తాడు. ఇంతలో, రాజా సోదరి లక్ష్మి ( గీత ) మోహన్ ( చక్రపాణి ) అనే వ్యక్తిని ప్రేమిస్తుంది. గర్భవతి అవుతుంది. రాజా ఆమెకు మోహన్‌తో వివాహం చేయ్యాలని నిర్ణయించుకుంటాడు. కానీ దురదృష్టవశాత్తు, మోహన్ మహారాజ్ కుమారుడు. అతను ధర్మరావు వేషంలో రాజాను కలుస్తాడు. గనిలో రాజా వాటాను కట్నంగా తీసుకొని కొడుకు మోహన్ తో పాటు పారిపోతాడు. ఇప్పుడు లక్ష్మి ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది. అతను మోహన్ ను తిరిగి తీసుకువస్తానని హామీ ఇచ్చి రాజా ఆమెను రక్షిస్తాడు. వారు హాంకాంగ్‌లో ఉన్నారని తెలుసుకున్న రాజా అక్కడికి వెళ్తాడు. ఇంతలో, బంగారయ్య, జయ కూడా మహారాజ్ వేసిన ఎర కారణంగా మిగిలిన గనిని విక్రయించడానికి అక్కడకు చేరుకుంటారు. మహారాజ్ బంగారయ్యను తన అదుపులో ఉంచి, గనిని బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు. రాజా అండతో జయ తప్పించుకుంటుంది. అదే సమయంలో, మహారాజ్ అనేక సందర్భాల్లో రాజాను చంపడానికి ప్రయత్నిస్తాడు, కాని రాజా అతడి ప్రతి ప్రణాళికనూ విచ్ఛిన్నం చేస్తాడు. అంతిమంగా, అతను రాజాపై తన చేతబడిని ఉపయోగించే ఒక మాంత్రికురాలు లీ ( జయమాలిని ) ను పంపుతాడు, కాని ఆమె కూడా నాశనం అవుతుంది. చివరికి, రాజా మహారాజ్ ను 3 వ ద్రోహిగా గుర్తించి, అతన్ని కూడా అంపేస్తాడు. మోహన్ ను తిరిగి తీసుకువచ్చి, లక్ష్మితో పెళ్ళి చేస్తాడు. చివరగా, రాజా, జయల వివాహంతో ఈ చిత్రం ముగుస్తుంది.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక సిబ్బంది

[మార్చు]
 • కళ: ఎస్.క్రిహ్నా రావు
 • నృత్యాలు: సలీం
 • స్టిల్స్: ఆర్‌ఎన్ నాగరాజ రావు
 • పోరాటాలు: సంబశివరావు, పరమశివం, రాజు
 • సంభాషణలు: ఆచార్య ఆత్రేయ
 • సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
 • నేపథ్య గానం: ఎస్పీ బాలు, పి
 • సంగీతం: చక్రవర్తి
 • కథ: ఆర్‌కె ధర్మరాజు
 • కూర్పు: ఎస్.వెంకటరత్నం
 • ఛాయాగ్రహణం: కె.ఎస్ ప్రసాద్
 • నిర్మాత: ఆర్.గోపాల్
 • చిత్రానువాదం - దర్శకుడు: వి.మధుసుధన్ రావు
 • బ్యానర్: లక్ష్మి విష్ణు ప్రొడక్షన్స్
 • విడుదల తేదీ: 1980 జూలై 10

పాటలు

[మార్చు]
ఎస్. పాట పేరు సాహిత్యం గాయనీ గాయకులు నిడివి
1 "మబ్బుల్లో చంద్రయ్య" ఆచార్య ఆత్రేయ ఎస్పీ బాలు, పి.సుశీల 6:10
2 "అట్ట సూడమాక" వేటూరి సుందరరామమూర్తి ఎస్పీ బాలు, పి.సుశీల 3:23
3 "చినుకు చిటికేసింధి" వేటూరి సుందరరామమూర్తి ఎస్పీ బాలు, పి.సుశీల 2:55
4 "కోటలో పాగా" వేటూరి సుందరరామమూర్తి ఎస్పీ బాలు, పి.సుశీల 3:26
5 "కన్న కొట్టేయనా" వేటూరి సుందరరామమూర్తి ఎస్పీ బాలు, పి.సుశీల 3:04
6 "వెచ్చని" వేటూరి సుందరరామమూర్తి ఎస్పీ బాలు, పి.సుశీల 4:30
7 "శ్రీ అంజనేయ" ఆచార్య ఆత్రేయ పి. సుశీల 4:48

మూలాలు

[మార్చు]
 1. "Superman (Banner)". Chitr.com.[permanent dead link]
 2. "Superman (Direction)". Filmiclub.
 3. "Superman (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2018-01-11. Retrieved 2020-08-19.
 4. "Superman (Music)". Know Your Films.