1908 వేసవి ఒలింపిక్ క్రీడలు
స్వరూపం
1908 ఒలింపిక్ క్రీడలు లండన్లో జరిగాయి. ఇవి ఆధునిక ఒలింపిక్ క్రీడల పరంరపలో నాలుగవది. వాస్తవానికి 4వ ఒలింపిక్ క్రీడలు ఇటలీ రాజధాని నగరం రోంలో 1906లో జరుగవలసి ఉన్ననూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు బారన్ పియరీ డి కోబార్టీన్ ఈ క్రీడలను నాలుగేళ్ళకోసారి మాత్రమే నిర్వహించాలనే ప్రతిపాదనను ఆమోదించినందువల్ల నాల్గవ ఒలింపిక్ క్రీడలు లండన్లో జరిగాయి. ఈ క్రీడలలో 22 దేశాల నుంచి 2008 క్రీడాకారులు 22 క్రీడలు, 110 క్రీడాంశాలలో పోటీపడ్డారు. ఏప్రిల్ 27న ప్రారంభమైన ఈ పోటీలు అక్టోబర్ 31 వరకు జరిగాయి. నిర్వాహక దేశమైన బ్రిటన్ 56 స్వర్ణాలతోపాటు మొత్తం 146 పతకాలను గెలుచుకొని ప్రథమస్థానంలో నిలిచింది.
అత్యధిక పతకాలు పొందిన దేశాలు
[మార్చు]నిర్వాహక దేశమైన బ్రిటన్ 56 స్వర్ణాలను సాధించి ఈ పోటీలలో అగ్రస్థానం వహించింది. అమెరికా, స్వీడన్‌లు తరువాతి స్థానాలు పొందాయి.
నిర్వహించిన క్రీడలు
[మార్చు]
|
పాల్గొన్న దేశాలు
[మార్చు]
|
ఇవి కూడా చూడండి
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.