జాతీయ రహదారి 44
| National Highway 44 | |
|---|---|
Map of the National Highway in red | |
| మార్గ సమాచారం | |
| పొడవు | 3,745 km (2,327 mi) |
| ముఖ్యమైన కూడళ్ళు | |
| ఉత్తరం చివర | శ్రీనగర్, జమ్మూ కాశ్మీరు |
| దక్షిణం చివర | కన్యాకుమారి, తమిళనాడు |
| ప్రదేశము | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రాలు | జమ్మూ కాశ్మీర్: 304 km (189 mi) హిమాచల్ ప్రదేశ్: 11 km (6.8 mi) పంజాబ్: 279 km (173 mi) హర్యానా: 257 km (160 mi) ఉత్తర ప్రదేశ్: 287 km (178 mi) మధ్యప్రదేశ్: 547 km (340 mi) మహారాష్ట్ర: 260 km (160 mi) తెలంగాణ: 533 km (331 mi) ఆంధ్రప్రదేశ్: 260 km (160 mi) కర్ణాటక: 135 km (84 mi) తమిళనాడు: 630 km (390 mi) |
| రహదారి వ్యవస్థ | |
జాతీయ రహదారి 44 భారతదేశంలో ప్రధానమైన రహదారి. ఇది జమ్మూ కాశ్మీరులొని శ్రీనగర్ సరిహద్దు, తమిళనాడులొని కన్యాకుమారితొ కలుపుతుంది.[1] ఇది జమ్మూ కాశ్మీరు, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది.[2] ఇది దేశంలో కెల్లా అత్యంత పొడవైన జాతీయ రహదారి.
పాత ఏడు జాతీయ రహదారులను పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ విలీనం చేయడం ద్వారా ఎన్‌హెచ్ 44 ఉనికి లోకి వచ్చింది. శ్రీనగర్ నుండి వచ్చే జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి (పాత ఎన్‌హెచ్ 1A), పంజాబ్, హర్యానాల నుండి ఢిల్లీ వెళ్ళే పాత ఎన్‌హెచ్ 1, ఢిల్లీ నుండి ప్రారంభమై ఆగ్రాలో ముగిసే పాత ఎన్‌హెచ్ 2 భాగం, ఆగ్రా నుండి గ్వాలియర్ వరకు ఉన్న పాత ఎన్‌హెచ్ 3 (ఆగ్రా-బాంబే జాతీయ రహదారిగా ప్రసిద్ధి), ఝాన్సీ వరకు ఉండే పాత ఎన్‌హెచ్ 75, పాత ఎన్‌హెచ్ 26, లఖ్‌నాడన్, సియోని, నాగ్‌పూర్, ఆదిలాబాద్ మీదుగా, నిర్మల్, హైదరాబాద్, కర్నూలు, అనంతపురం, చిక్కబల్లాపూర్, దేవనహళ్లి, బెంగళూరు, హోసూర్, కృష్ణగిరి, ధర్మపురి, సేలం, నమక్కల్, కరూర్, దిండిగల్, మదురై, విరుదునగర్, తిరునల్వేలి కన్యాకుమారి వద్ద ముగిసే పాత ఎన్‌హెచ్ 7 లు ఇందులో భాగమయ్యాయి.[3]
మార్గం
[మార్చు]ఈ రహదారి శ్రీనగర్ నుండి ప్రారంభమవుతుంది. ఎన్‌హెచ్ 44 ని జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు లోని ఉత్తర-దక్షిణ కారిడార్. ఇది అధికారికంగా శ్రీనగర్ నుండి కన్యాకుమారి వరకు 4,112 కిమీ (2,555 మై) పైగా నడుస్తుంది. ఇది భారతదేశంలోనే అత్యంత పొడవైన జాతీయ రహదారి.
కూడళ్ళు
[మార్చు]| రాష్ట్రాలు | రాష్ట్రంలో పొడవు | కూడళ్ళు | గమ్యస్థానాలు | ఇతర పట్టణాలు |
|---|---|---|---|---|
| జమ్మూ కాశ్మీర్ | 541 km (336 mi) | 4 | శ్రీనగర్ (మొదలు) | |
| హిమాచల్ ప్రదేశ్ | 11.08 km (6.88 mi) | 0 | చక్కి నదికి సమాంతరంగా నడుస్తుంది | |
| పంజాబ్ | 279.42 km (173.62 mi) | 4 | దసువా | |
| హర్యానా | 257.80 km (160.19 mi) | 6 | కురుక్షేత్ర, ఫరీదాబాదు | |
| ఢిల్లీ | 15 km (9.3 mi) | 3 | ||
| ఉత్తర ప్రదేశ్ | 269.10 km (167.21 mi) | 3 | బృందావన్, మథుర, లలిత్‌పూర్,
గుర్హా | |
| రాజస్థాన్ | 28.29 km (17.58 mi) | 1 | ||
| మధ్య ప్రదేశ్ | 571.9 km (355.4 mi) | గ్వాలియర్, సాగర్, నర్సింగ్‌పూర్, లఖ్నదాన్, శివ్‌నీ | ||
| మహారాష్ట్ర | 268.36 km (166.75 mi) | నాగపూర్,
హింగన్‌ఘాట్ | ||
| తెలంగాణ | 492.85 km (306.24 mi) | 5 | ఆదిలాబాదు, కామారెడ్డి,
జడ్చర్ల | |
| ఆంధ్రప్రదేశ్ | 260.99 km (162.17 mi)[4] | 4 | ||
| కర్ణాటక | 95.67 km (59.45 mi) | 5 | అనంతపురం | |
| తమిళనాడు | 627.18 km (389.71 mi) | 13 | విరుధునగర్, నమక్కల్ | |
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 ఫిబ్రవరి 2016. Retrieved 3 April 2012.
- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 31 March 2012. Retrieved 3 April 2012.
- ↑ "NH-44's Impact on Real Estate: Route & Growth". Times Property. 2023-11-23. Archived from the original on 2024-04-16. Retrieved 2024-04-16.
- ↑ "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 28 March 2016. Retrieved 11 February 2016.
- Infobox road instances in India
- జాతీయ రహదారులు
- హర్యానా లోని జాతీయ రహదారులు
- పంజాబ్ లోని జాతీయ రహదారులు
- జమ్మూ కాశ్మీర్ లోని జాతీయ రహదారులు
- ఢిల్లీ లోని జాతీయ రహదారులు
- ఉత్తర ప్రదేశ్ లోని జాతీయ రహదారులు
- మధ్య ప్రదేశ్ లోని జాతీయ రహదారులు
- హిమాచల్ ప్రదేశ్ లోని జాతీయ రహదారులు
- రాజస్థాన్ లోని జాతీయ రహదారులు
- మహారాష్ట్ర లోని జాతీయ రహదారులు
- తెలంగాణ లోని జాతీయ రహదారులు
- ఆంధ్రప్రదేశ్ లోని జాతీయ రహదారులు
- కర్ణాటక లోని జాతీయ రహదారులు
- తమిళనాడు లోని జాతీయ రహదారులు
