Jump to content

నార్నూర్ మండలం

అక్షాంశ రేఖాంశాలు: 19°23′39″N 78°47′08″E / 19.394068°N 78.785477°E / 19.394068; 78.785477
వికీపీడియా నుండి
(Narnoor నుండి దారిమార్పు చెందింది)
నార్నూర్‌ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో ఆదిలాబాద్ జిల్లా, నార్నూర్‌ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో ఆదిలాబాద్ జిల్లా, నార్నూర్‌ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో ఆదిలాబాద్ జిల్లా, నార్నూర్‌ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 19°23′39″N 78°47′08″E / 19.394068°N 78.785477°E / 19.394068; 78.785477
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఆదిలాబాద్ జిల్లా
మండల కేంద్రం నార్నూర్‌
గ్రామాలు 53
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 49,239
 - పురుషులు 25,789
 - స్త్రీలు 23,450
అక్షరాస్యత (2011)
 - మొత్తం 41.41%
 - పురుషులు 55.73%
 - స్త్రీలు 26.51%
పిన్‌కోడ్ 504311

నార్నూర్‌ మండలం, తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఒక మండలం.[1] నార్నూర్, ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఉట్నూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 24 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి

వ్యవసాయం, పంటలు

[మార్చు]

నార్నూరు మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 16528 హెక్టార్లు, రబీలో 672 హెక్టార్లు. మండలంలో ప్రధాన పంటలు ప్రత్తి, జొన్నలు.[3]

గణాంక వివరాలు

[మార్చు]
2016 లో పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఆదిలాబాదు జిల్లాలో మండల స్థానం

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 49,239 - పురుషులు 25,789 - స్త్రీలు 23,450. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 201 చ.కి.మీ. కాగా, జనాభా 29,152. జనాభాలో పురుషులు 15,370 కాగా, స్త్రీల సంఖ్య 13,782. మండలంలో 5,813 గృహాలున్నాయి.

మండలంలోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  • తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ప్రకారం ఈ విభాగంలో 25 (ఇరవైఐదు) రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

మండలంలోని సాహితీవేత్తలు

[మార్చు]

రాథోడ్ శ్రావణ్ నార్నూర్ మండలంలోని సోనాపూర్ గ్రామానికి చెందిన రచయిత, పూర్వ అధ్యక్షులు ఉట్నూరు సాహితీ వేదిక, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకులుగా విధులు నిర్వర్ధిస్తున్నారు.

రచనలు: దేశభక్తి కైతికాలు, పండుగలు ముత్యాల హారాలు,బంజారా జాతి రత్నం బానోత్ జాలం సింగ్, బంజారా భీష్మ అమర్ సింగ్ తిలావత్ మొదలగునవి.

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "ఆదిలాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-03-06. Retrieved 2021-01-06.
  3. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 120