అక్షరయాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అక్షరయాన్
అక్షరయాన్ లోగో
సంకేతాక్షరంటిడబ్ల్యూడబ్ల్యూఎఫ్
స్థాపన14 జూలై 2019; 4 సంవత్సరాల క్రితం (2019-07-14)
కేంద్రీకరణసాహితీ, సామాజిక కార్యక్రమాలు
ప్రధాన
కార్యాలయాలు
హైదరాబాదు, తెలంగాణ
సేవా ప్రాంతాలుప్రపంచవ్యాప్తంగా
అధికారిక భాషతెలుగు
జాలగూడు‘అక్షరయాన్‌’ వెబ్‌సైట్‌

అక్షరయాన్ (అక్షరయాన్ తెలుగు విమెన్ రైటర్స్ ఫోరం) తెలుగు రచయిత్రుల ఫోరం.[1] వినూత్న సాహితీ, సామాజిక కార్యక్రమాలకు వేదికగా నిలుస్తోన్న ఈ ఫోరంలో ప్రస్తుతం 1100మంది రచయిత్రులు సభ్యులుగా ఉన్నారు. సమాజంలో మార్పు సాధించాలనే సంకల్పంతో ఒకవైపు సాహితీ సేవ చేస్తూ మరోవైపు ఈ సంస్థ తరపున ఆడవారికి అండగా నిలిచేలా అనేక సామాజిక కార్యక్రమాలను చేపడుతున్నారు.[2]

‘అక్షరయాన్‌’ వెబ్‌సైట్‌ను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ప్రారంభం[మార్చు]

పద్దెనిమిది సాహితీ ప్రక్రియల్లో సమకాలీన అంశాలపై రచనలు సాగించడం, రచయిత్రులను సంఘటితం చేయడం లక్ష్యంగా 2019లో అక్షరయాన్ ఫోరం ఏర్పాటయింది. రచయిత్రి అయినంపూడి శ్రీలక్ష్మి నేతృత్వంలో 40 మంది సభ్యుల తెలుగు రచయిత్రుల సమూహంగా ఏర్పడిన ఈ ఫోరం తెలుగు రాష్ర్టాల్లోనేకాకుండా దేశ, విదేశాల్లోని తెలుగు రచయిత్రులకు వేదికగా నిలుస్తున్నది.[3] హైదరాబాదులోని రవీంద్రభారతిలో అక్షరయాన్‌ ప్రారంభ సమావేశం జరుగగా, 2019 జూలై 14న మొయినాబాద్‌లో 40మంది రచయిత్రులతో తొలి సాహితీ సదస్సు జరిగింది. 2021, జనవరి 15న అక్షరయాన్ వెబ్సైట్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రారంభించింది.[4]

ఫోరం కార్యకలాపాలు[మార్చు]

  1. పసిపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలపై ‘పసి మొగ్గలు’ పేరిట 20 మంది రచయిత్రులతో ఆకాశవాణి రేడియో ద్వారా కవి సమ్మేళనం నిర్వహించింది.
  2. 2019, అక్టోబరు 17న హైదరాబాద్‌లో తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ విమెన్‌ వింగ్‌ కార్యాలయంలో 'భరోసా' ద్వారా అక్షరయాన్‌ రచయిత్రులు అత్యాచార బాధితులతో సమావేశమై, సొంత డబ్బుతో 6 కుట్టుమిషిన్లు ఇప్పించి, కుట్టుపనిలో వారికి తర్ఫీదు నిప్పించే ఏర్పాటు చేసింది.
  3. 2020, జనవరిలో కస్తూరిబా కళాశాలలో అతివలకు రక్షణ కవచంగా నిలుస్తున్న షి టీమ్స్ గొప్పదనాన్ని చాటుతూ 76 మంది రచయిత్రులు రాసిన కవితలను తెలంగాణ పోలీస్‌ మహిళా సేఫ్టీ వింగ్‌ ఆధ్వర్యంలో 'హితై‘షి' పేరుతో ముద్రించింది.
  4. రాష్ట్రపతి భవన్ లో రాష్ట్ర గవర్నర్ డా తమిళిసై సౌందరరాజన్ తో బతుకమ్మ సంబురాలలో 100 మంది రచయిత్రులు పాల్గొని పుస్తకాలన్ని పేర్చి పుస్తక బతుకమ్మను పూలబతుకమ్మతో జత చేర్చి గవర్నర్ తో కలిసి తొలిసారిగా రచయిత్రులు బతుకమ్మను ఆడారు.
  5. 2020, డిసెంబరు 21వతేది రెడ్ హిల్స్ లోని ఫాప్సీ భవన్ లో దాదాపు 300 మంది రచయిత్రులతో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ రచయిత్రులతో విత్తనంపై సాహితీ సదస్సు నిర్వహించి, విత్తనోత్పత్తి, ధ్రువీకరణ సంస్థ సహకారంతో చేపట్టిన ఈ సాహితీ సదస్సులో వెల్లువెత్తిన కవితలను, కథలను 'బీజ స్వరాలు' పేరిట పుస్తక రూపంలో వెలువరించింది.
  6. తెలంగాణ కళాభారతి మైదానం (ఎన్.టి.ఆర్ స్టేడియం)లో జరిగిన హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో అక్షరయాన్ రచయిత్రులు రాసిన పుస్తకాలతో 204 నెంబరు స్టాలును ఏర్పాటు చేసింది.
  7. కరోనా 19పై శ్రీలక్ష్మి రాసిన కరోనాకి ఓ రిటర్న్ గిఫ్ట్[5] అనే కవిత 2020, మార్చి 23న నమస్తే తెలంగాణ పత్రికలోని చెలిమె విభాగంలో ప్రచురితమయింది. ఆ కవితను చూసిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫోన్ లో స్వయంగా శ్రీలక్ష్మిని అభినందించడమేకాకుండా ఆరోజు జరిగిన పత్రికా సమావేశంలో ప్రశంసలు అందజేశాడు.[6] అక్షరయాన్ తరపున కరోనా పై 700లకు పైగా వీడియో కవితలని యూట్యూబులో అప్ లోడ్ చేశారు.
  8. 2020, నవంబరు 25న 'నింగిని గెలిచిన నేల' భరోసా కథల పుస్తకాన్ని జూమ్ మీటింగ్ ద్వారా అవిష్కరించారు.
  9. 2021 ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా హైదరాబాదు బేగంపేటలోని పర్యాటక శాఖ హరిత హోటల్ లో వేడుకలు నిర్వహించబడ్డాయి. మహారాష్ట్ర పూర్వ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంతో మాతృభాష సేవకు గానూ రాష్ట్ర సాంస్కృతిక సలహాదారు రమణాచారి (ఐ.ఏ.ఎస్). (రి) కు మహాకవి పంపన పేరిట విశిష్ట పురస్కారాన్ని అందించారు. విశిష్ట అతిధిగా వి.వి. లక్ష్మీ నారాయణ (ఐ.పి.ఎస్) పాల్గొన్నాడు. మాతృభాషా పరిరక్షణలో విశిష్ట సేవలందించిన ఆరుగురిని ‘సాహిత్య స్రష్టలు’ పురస్కారంతో సత్కరించగా, 14 పుస్తకాలు ఆవిష్కరింపబడ్డాయి.
  10. 2021 జూన్ 24న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కార్యాలయంలో కోట్ల వేంకటేశ్వరరెడ్డి ‘సరళ శతకం’ ఆవిష్కరించబడింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ బిసి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.
  11. . 2021, ఆగస్టు 5న బుర్రా వెంకటేశం (ఐ.ఏ.ఎస్.) మాతృమూర్తి కీ.శే. శ్రీమతి బుర్రా గౌరమ్మ కి నివాళిగా అక్షరయాన్ వెలువరించిన 6 పుస్తకాలు (అమ్మ అమ్మే, అమ్మ ఓ అద్భుతం ... అంతుచిక్కని రహస్యం, తల్లీ ... నిన్ను తలచి..., నీ వేలు పట్టుకొని..., అమ్మా! నీ కమ్మని పిలుపు మళ్లీ వినాలి!, మళ్లీ ఎప్పుడు వస్తావమ్మా!) కు జనగామ జిల్లా, ఓబుల్ కేశ్వాపూర్ గ్రామంలో రాష్ట్ర బి.సి. సంక్షేమ, పౌరసఫరాల శాఖామంత్రి గంగుల కమలాకర్ ఆవిష్కరించాడు.
  12. 2021, సెప్టెంబరు 24న ఖైరతాబాదులోని బి.సి. సంక్షేమ భవనంలో జరిగిన కార్యక్రమంలో 16 మంది సాహిత్యకారులు వ్రాసిన 16 సరళ శతకాల సంకలనం ‘శతక షోడశి’ పుస్తకాన్ని వ్యవసాయ శాఖామంత్రి నిరంజన్ రెడ్డి ఆవిష్కరించాడు.
  13. 2021, అక్టోబరు 17న రవీంద్ర భారతిలో 156 మంది సాహిత్యకారులు రాసిన రాసిన సూక్ష్మ కావ్య పుస్తకం 'అనుబంధాల పూదోట' ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
  14. 2021 డిపెంబరు 18 నుండి 28 వరకు తెలంగాణ కళాభారతి మైదానం (ఎన్.టి.ఆర్ స్టేడియం)లో జరిగిన 34వ హైదరాబాద్‌ జాతీయ పుస్తక ప్రదర్శనలో అక్షరాయాన్ స్టాల్ ను ఏర్పాటు చేయటం జరిగింది.
  15. 2022 ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా హైదరాబాదు బేగంపేటలోని పర్యాటక శాఖ హరిత హోటల్ లో వేడుకలు నిర్వహించబడ్డాయి. తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు టి. కిషన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మహారాష్ట్ర పూర్వ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు, విశిష్ట అతిధిగా వి.వి. లక్ష్మీ నారాయణ (ఐ.పి.ఎస్) విచ్చేసి, మాతృభాష సేవకు గానూ ఆంధ్రజ్యోతి సంపాదకులు కె. శ్రీనివాస్ కు మహాకవి పంపన పేరిట విశిష్ట పురస్కారాన్ని అందజేసారు. మాతృభాషా పరిరక్షణలో విశిష్ట సేవలందించిన పదిమంది (సినీగేయ రచయిత వడ్డేపల్లి కృష్ణ, యద్దనపూడి రెడ్డిశ్యామల, రచయితలు ముచ్చర్ల రజనీ శకుంతల, ఆనంద్‌ విరించి, రాధా కుసుమ, సి.శశిబాల, ఘాలి లలితా ప్రవల్లిక, భూదేవితో పాటు గేయ, వచన కవిత్వం రాస్తున్న ఇంటర్‌ విద్యార్థినులు శ్రీచందన, సమ్రీన్‌) సాహిత్యకారుల్ని ‘సాహిత్య స్రష్టలు’ పురస్కారంతో సత్కరించారు. 14 పుస్తకాలు ఆవిష్కరింపబడ్డాయి.[7][8]
  16. 2022 ఏప్రిల్ లో అక్షరయాన్ చిల్డ్రన్స్ వింగ్‌ను ప్రారంభించింది. విశిష్ట రూపమైన సరళా శతకాలు (పద్యాలు) రాయడంలో పిల్లలను ప్రోత్సహించడం ఈ వింగ్ ముఖ్యోద్దేశం.[9]

మూలాలు[మార్చు]

  1. "అలుపెరుగని 'అక్షరయానం' | మానవి". NavaTelangana. 2022-11-06. Archived from the original on 2022-11-06. Retrieved 2022-11-06.
  2. నమస్తే తెలంగాణ, జిందగీ (24 November 2020). "అక్షరయాన్‌.. నవ సమాజం దిశగా." ntnews. Archived from the original on 24 November 2020. Retrieved 19 May 2021.
  3. Andhrajyothy (24 April 2021). "సమాజం కోసం అక్షరయాన్‌". www.andhrajyothy.com. Archived from the original on 5 May 2021. Retrieved 19 May 2021.
  4. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (16 January 2021). "'అక్షరయాన్‌' వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన కవిత". www.andhrajyothy.com. Archived from the original on 19 May 2021. Retrieved 19 May 2021.
  5. గ్రేట్ తెలంగాణ, టాప్ స్టోరీస్ (26 March 2020). "ఈ కవిత కేసీఆర్‌ కూ నచ్ఛేసింది." Great Telangaana. Archived from the original on 26 February 2020. Retrieved 19 May 2021. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 26 ఫిబ్రవరి 2021 suggested (help)
  6. సాక్షి, ఫ్యామిలీ (29 June 2020). "కవిత్వమూ కరోనా". Sakshi. Archived from the original on 7 August 2020. Retrieved 19 May 2021.
  7. telugu, NT News (2022-02-21). "ప్రపంచ 'తెలుగు వర్సిటీ'గా అభివృద్ధి చేయాలి". Namasthe Telangana. Archived from the original on 2022-02-22. Retrieved 2022-02-22.
  8. Velugu, V6 (2022-02-22). "మొదటి ఐదేండ్లు మాతృభాషలోనే చదవాలి". V6 Velugu (in ఇంగ్లీష్). Archived from the original on 2022-02-22. Retrieved 2022-02-22.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  9. "United in letter and spirit". The New Indian Express. 2022-09-04. Archived from the original on 2022-09-04. Retrieved 2022-09-04.

బయటి లంకెలు[మార్చు]