ఆరవల్లి జిల్లా
ఆరవల్లి జిల్లా
અરવલ્લી જીલ્લો | |
---|---|
జిల్లా | |
Coordinates: 24°01′42″N 73°02′29″E / 24.0283°N 73.0414°E | |
ప్రధాన కార్యాలయం | మొడసా |
Named for | అరవల్లి హిల్స్ |
జనాభా (2013) | |
• Total | 1.024 Million [1] |
• Summer (DST) | IST (UTC+05:30) |
గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో ఆరవల్లి జిల్లా (గుజరాతీ : અરવલ્લી જીલ્લો) ఒకటి. మొదస పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. 2013 ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం ప్రకటించిన 7 జిల్లాలలో ఇది ఒకటి.[3]
పేరువెనుక చరిత్ర
[మార్చు]గుజరాత్, రాజస్థాన్ ఆరవల్లి పర్వతావళి జిల్లాలో ఉన్న కారణం జిల్లాకు ఈ పేరు వచ్చింది. .[4] గుజరాత్ ప్రభుత్వ రికార్డులు ఆరవల్లి పర్వతావళిలోని అరసూర్ శాఖ జిల్లాలోని దంతా, మొదస, శ్యామల్జీ తాలూకాలలో ఉందని తెలియజేస్తున్నాయి.[5]
చరిత్ర
[మార్చు]2013లో గుజరాత్ ప్రభుత్వం అంగీకారం పొందిన 7 జిల్లాలలో ఇది ఒకటి.[6] జిల్లాలో దీర్ఘకాలంగా గిరిజన ప్రజలు అధికంగా నివసిస్తున్నారు. 2012లో గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించిన తరువాత అప్పిటి అధికారంలో ఉన్న " భారతీయజనతా పార్టీ " 7 కొత్త జిల్లాల ఏర్పాటును ప్రతిపాదించింది.[7]
భౌగోళికం
[మార్చు]బనస్ కాంతా జిల్లాలోని మొదస, మల్పుర్, ధన్సుర, మెఘరాజ్, భిలోద, భయద్ తాలూకాలను వేరు చేసి ఆరవల్లి జిల్లా రూపొందించబడింది. [1]
గణాంకాలు
[మార్చు]జిల్లాలోని మెఘరాజ్, మల్పూర్, భిలోడా తాలూకాలలో గిరిజన ప్రజలు అధికంగా నివసిస్తున్నారు.[5] జిల్లాలో 676 గ్రామాలు, 306 గ్ర్రమపంచాయితీలు ఉన్నాయి. జిల్లా జనసంఖ్య 1,27 మిలియన్లు. గుజరాత్ రాష్ట్రంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన జిల్లాగా ఆరవల్లి జిల్లా గుర్తించబడుతుంది.[1]
పర్యాటక ఆకర్షణలు
[మార్చు]జిల్లాలో పలు బౌద్ధ అవశేషాలు, శ్యామల్జీ వంటి ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి.[1]
ఆర్ధికం
[మార్చు]ఆరవల్లి జిల్లాలో 500 మె.వా విద్యుత్తును ఉత్పత్తి చేయగలిగిన ప్రైవేట్ రంగానికి చెందిన మొదటి " సోలార్ పవర్ ప్లాంట్ " ఉంది.[1] జిల్లా పారిశ్రామికంగా వెనుకబడి ఉంది. జిల్లాలో పెద్ద పరిశ్రమలు ఏమీ లేనప్పటికీ మొదసా, భిలోడా, ధంసురా తాలూకాలలో చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాలో ప్రధానంగా మజుం నది ప్రవహిస్తుంది. మజుం నది మీద రెండు ఆనకట్టలు నుర్మించబడ్డాయి.[5]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 Dave, Kapil (August 25, 2013). "Dignity of PM office has reached its nadir: Modi". The Times of India. Retrieved 26 August 2013.
- ↑ http://m.indianexpress.com/news/7-new-districts-this-iday-govt-appoints-collectors/1155714/[permanent dead link]
- ↑ "Aravalli now a district in Gujarat". DNA. 18 September 2012. Retrieved 23 February 2013.
- ↑ "Narendra Modi packs in a new dist, Nitin Gadkari hopes for 'Gujarat-like govt' in Delhi". The Indian Express. 18 September 2012. Retrieved 23 February 2013.
- ↑ 5.0 5.1 5.2 "Namesake of oldest mountain, Aravalli scores nil in industry". The Indian Express. 2 September 2013. Retrieved 23 September 2013.
- ↑ "Seven new districts to be formed in Gujarat". Daily Bhaskar. January 24, 2013. Retrieved 23 February 2013.
- ↑ "Aravali to be Gujarat's 29th district". Times of India. September 17, 2012. Archived from the original on 2013-01-28. Retrieved 23 February 2013.
వెలుపలి లింకులు
[మార్చు]24°01′42″N 73°02′29″E / 24.0283°N 73.0414°E{{#coordinates:}}: cannot have more than one primary tag per page
- Pages with non-numeric formatnum arguments
- All articles with dead external links
- Pages with malformed coordinate tags
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox settlement with bad settlement type
- Pages using infobox settlement with unknown parameters
- గుజరాత్ జిల్లాలు
- 2013 స్థాపితాలు
- భారతదేశం లోని జిల్లాలు