ఇంద్రవెల్లి మండలం
ఇంద్రవెల్లి మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 19°29′40″N 78°40′13″E / 19.494347°N 78.670163°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ఆదిలాబాద్ జిల్లా |
మండల కేంద్రం | ఇంద్రవెల్లి (కె) |
గ్రామాలు | 34 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 47,506 |
- పురుషులు | 23,592 |
- స్త్రీలు | 23,914 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 49.46% |
- పురుషులు | 63.88% |
- స్త్రీలు | 35.54% |
పిన్‌కోడ్ | 504346 |
ఇంద్రవెల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాదు జిల్లాకు చెందిన మండలం.[1] ఇంద్రవెల్లి, ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఉట్నూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. ఈ మండలంలో 25 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
గణాంక వివరాలు
[మార్చు]2001 లెక్కల ప్రకారం ఇంద్రవెల్లి మండల జనాభా 38642. ఇందులో పురుషుల సంఖ్య 19045, మహిళలు 19597. షెడ్యూల్ కులాలవారు 4666, షెడ్యూల్ తెగల వారు 23361 మంది ఉన్నారు. మండల జనాభాలో 60% పైగా షెడ్యూల్ తెగల వారున్నారు.[3]
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 47435. ఇందులో పురుషుల సంఖ్య 23602, మహిళలు 23833. అక్షరాస్యుల సంఖ్య 25139. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 208 చ.కి.మీ. కాగా, జనాభా 39,781. జనాభాలో పురుషులు 19,733 కాగా, స్త్రీల సంఖ్య 20,048. మండలంలో 8,262 గృహాలున్నాయి.
వ్యవసాయం, పంటలు
[మార్చు]ఇంద్రవెల్లి మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 10646 హెక్టార్లు, రబీలో 534 హెక్టార్లు. ప్రధాన పంటలు ప్రత్తి, జొన్నలు.[4]
ఇంద్రవెల్లిలోని ఆనాటి సంఘటనలు
[మార్చు]1981, ఏప్రిల్ 20: పోలీసు కాల్పులలో అనేక మంది గిరిజనులు మరణించారు. దానికి గుర్తుగా గ్రామంలో అమరవీరుల స్తూపం నిర్మించబడింది.[5]
మండలానికి చెందిన కొన్ని విషయాలు
[మార్చు]- గ్రామపంచాయతీలు: 15
- చెరువులు: 7
- పోస్టాఫీసులు: 10
- బస్ స్టాపులు: 10
- రైల్వేస్టేషన్లు: లేవు
- గ్రంథాలయాలు: 2
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ప్రకారం ఈ విభాగంలో 25 (ఇరవైఐదు) రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.అయితే తరువాత ఆదిలాబాదు జిల్లా, సిరికొండ మండల పరిధిలో ఉన్న మల్లాపూర్, ధర్మసాగర్ అనే రెండు గ్రామాలు ఈ మండలంలో చేర్చారు.[6][7] వాటితో కలుపుకని ఈ మండలంలో 27 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
28.మార్కగూడ కొత్త గ్రామపంచాయతీ(ఇంద్రవెల్లి బి)
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "ఆదిలాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-03-06. Retrieved 2021-01-06.
- ↑ Statistics Book of Adilabad, 2004-05
- ↑ మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 111
- ↑ మన ఆదిలాబాదు, మడిపల్లి భద్రయ్య రచన, ప్రథమ ముద్రణ మార్చి 2008, పేజీ 108
- ↑ "Four new mandals formed, total goes up to 589". The New Indian Express. Retrieved 2022-04-27.
- ↑ Singh, S. Harpal (2019-03-08). "Mallapur, Dharmasagar repatriated to Indervelli". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-04-27.