కపూర్తలా జిల్లా
కపూర్తలా జిల్లా
ਕਪੂਰਥਲਾ ਜ਼ਿਲ੍ਹਾ | |
---|---|
జిల్లా | |
దేశం | India |
రాష్ట్రం | పంజాబ్ |
Named for | నవాబ్ కపూర్ సింగ్ |
ముఖ్య పట్టణం | కపూర్తలా |
విస్తీర్ణం | |
• Total | 1,633 కి.మీ2 (631 చ. మై) |
జనాభా (2011)‡[›] | |
• Total | 8,17,668 |
• జనసాంద్రత | 500/కి.మీ2 (1,300/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | పంజాబీ |
Time zone | UTC+05:30 (IST) |
అక్షరాస్యత | 80.20% |
పంజాబు రాష్ట్ర 24 జిల్లాలలో కపూర్తలా జిల్లా (డొయాబీ: ਕਪੂਰਥਲਾ ਜ਼ਿਲਾ) ఒకటి. కపూర్తలా పట్టణం ఈ జిల్లాకు కేంద్రం. వైశాల్యం, జనసంఖ్యల పరంగా కపూర్తలా, రాష్ట్రంలో చిన్న జిల్లాగా గుర్తింపు పొందింది. 2001 గణాంకాలను అనుసరించి కపూర్తలా జనసంఖ్య 7,54,521. ఈ జిల్లా దూరదూరంగా ఉన్న రెండు వేరువేరు ముక్కలుగా ఉంటుంది. ఒకటి కపూర్తలా -సుల్తాన్‌పూర్ లోఢీ కాగా, రెండవది ఫగ్వారా తాలూకా.
భౌగోళికం
[మార్చు]కపూర్తలా- సుల్తాన్‌పూర్ లోఢి భాగం 31° 07', 31° 22' ఉత్తర అక్షాంశం, 75° 36 తూర్పురేఖాంశంలో ఉంది. జిల్లా తూర్పు సరిహద్దులో హోషియార్‌పూర్, గుర్‌దాస్‌పూర్, అమృత్‌సర్, పశ్చిమ సరిహద్దులో బియాస్ నది, దక్షిణ సరిహద్దులో సట్లెజ్ నది, జలంధర్, హోషియార్‌పూర్ జిల్లాలు ఉన్నాయి.
విభాగాలు
[మార్చు]జిల్లా 3 ఉపవిభాగాలుగా విభజించబడింది: కపూర్తలా, ఫగ్వారా, సుల్తాంపూర్ లోఢి. మొత్తం వైశాల్యం 1633 చ.కి.మీ. కపూర్తలా తాలూకా వైశాల్యం 909.09 చ.కి.మీ.పగ్వారా వైశాల్యం 304.05 చ.కి.మీ., సుల్తాన్‌పూర్ లోఢీ వైశాల్యం 451.0 చ.కి.మీ.
ఆర్ధికం
[మార్చు]జిల్లా అధికంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. గోధుమ, వడ్లు, చెరుకు, ఉర్లగడ్డలు, మొక్కజిన్నాలు. కపూర్తలా ప్రధాన భూభాగం కలి- బెయిన్ మద్య ఉంది. దీనిని బెట్ ప్రాంతం అంటారు. ఈ ప్రాంతం తరచూ వరదలకు గురౌతూ ఉంటుంది. నీరు నిలవడం భూమిలో క్షారగుణం అధికమవడం వంటి సమస్యలను ఈ ప్రాంతం ఎదుర్కొంటూ ఉంటుంది. వరదల నుండి రక్షణ కొరకు " ధుస్సి బంధ్ " అనే నిర్మాణాన్ని బియాస్ నది ఎడమ తీరంలో నిర్మించబడింది. ఇది ఈ ప్రాంతాన్ని వరద తీవ్రత నుండి రక్షిస్తూ ఉంది. ఈ జిల్లాభూభాగం అంతా సారవంతమైన భూభాగం కలిగి ఉంది. దక్షిణతీరంలో ఉన్న నల్లరేగడి భూమిని " దిన్నా " ( ఇసుక, బంకమట్టి) అంటారు. పంజాబీ మైదాన వాతావరణం జిల్లా అంతటా ఉంటుంది. జిల్లాలో ఉపౌష్ణమండల వర్షపాతం ఉంటుంది. విస్తారంగా పంటలు పండే భూమి కనుక జిల్లాలో అరణ్యాలు, వన్యమృగాలకు అంతగా అవకాశం లేదు.
2001 లో గణాంకాలు
[మార్చు]విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 817,668,[1] |
ఇది దాదాపు. | కొమరోస్ దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అమెరికాలోని. | సౌత్ డకోటా నగర జనసంఖ్యకు సమం.[3] |
640 భారతదేశ జిల్లాలలో. | 481 వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 501 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 8.37%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 912:1000,[1] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 80.2%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Comoros 794,683 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
South Dakota 814,180