కాణిపాకం
కాణిపాకం | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 13°18′N 79°1′E / 13.300°N 79.017°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | చిత్తూరు |
మండలం | ఐరాల |
విస్తీర్ణం | 7.29 కి.మీ2 (2.81 చ. మై) |
జనాభా (2011)[1] | 4,960 |
• జనసాంద్రత | 680/కి.మీ2 (1,800/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 2,500 |
• స్త్రీలు | 2,460 |
• లింగ నిష్పత్తి | 984 |
• నివాసాలు | 1,267 |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్కోడ్ | 517131 |
2011 జనగణన కోడ్ | 596496 |
కాణిపాకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, ఐరాల మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన ఐరాల నుండి 16 కి.మీ. దూరం లోను, సమీప పట్టణమైన చిత్తూరు నుండి 12 కి.మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1267 ఇళ్లతో, 4960 జనాభాతో 729 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2500, ఆడవారి సంఖ్య 2460. షెడ్యూల్డ్ కులాల జనాభా 1531 కాగా షెడ్యూల్డ్ తెగల జనాభా 21. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 596496.[2] ఇది ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం. ఇక్కడ వరసిద్ధి వినాయక ఆలయంతో పాటు అనేక ప్రాచీన ఆలయాలున్నాయి.ఈ ఊరు నాలుగింట మూడవవంతు (3/4 వంతు) వివిధ దేవాలయాలతో నిండి ఉంది.
భౌగోళికం
[మార్చు]కాణిపాకం బాహుధా నది ఉత్తరపు ఒడ్డున, తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై, చిత్తూరు నుండి 12 కి.మీ. దూరంలో ఉంది.
సమీప గ్రామాలు
[మార్చు]కొత్తపల్లె 1 కి.మీ. చిగరపల్లె 1 కి.మీ. కొత్తపల్లె 2 కి.మీ. ఉత్తర బ్రాహ్మణ పల్లె 2 కి.మీ. పట్నం 2 కి.మీ. దూరములో ఉన్నాయి.[3]
జనగణన గణాంకాలు
[మార్చు]2011 జనగణన ప్రకారం 1267 ఇళ్లతో మొత్తం 4960 జనాభాతో 729 హెక్టార్లలో విస్తరించి ఉంది. జనాభాలో పురుషులు 2,500 - స్త్రీలు 2,460. గృహాల సంఖ్య 1,267
పేరు వెనుక చరిత్ర
[మార్చు]కాణి అంటే ఎకరం పావు మడిభూమి లేదా మాగాణి అని, పారకం అంటే నీళ్లు పొలంలోకి పారటం అని అర్ధం. చరిత్ర ప్రకారం ఒకప్పుడు ముగ్గురు అన్నదమ్ములు వుండేవారు. వారు ముగ్గురు మూడు రకాల అవిటితనాలతో బాధపడేవారు, ఒకరు గుడ్డి, ఇంకొకరు మూగ మరొకరికి చెవుడు. వారికి వున్న చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. పూర్వకాలంలో నూతి నుండి ఏతాంలతో నీటిని తోడేవారు. ముగ్గిరిలో ఒకరు క్రింద వుంటే ఇద్దరు ఏతాం పైన వుండి నీరు తోడేవారు. అలా వుండగా ఒక రోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది. దానితో ముగ్గురిలో ఒకరు నూతిలో దిగి లోతుగా త్రవ్వటం మొదలు పెట్టాడు. కాసేపటి తరువాత గడ్డపారకు రాయిలాంటి పదార్దం తగలటంతో ఆపి క్రింద జాగ్రత్తగా చూశాడు. గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుంచి రక్తం కారడం చూసి నిశ్చేత్రుడయ్యాడు. కొద్ది క్షణాలలో బావిలో నీరు అంతా కూడా రక్తం రంగులో మారిపోయింది.మహిమతో ముగ్గిరి అవిటితనం పూర్తగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు. ఈ విషయం విన్న చుట్టుప్రక్కల గ్రామస్థులు తండోపతండోలుగా నూతి వద్దకు చేరుకుని ఇంకా లోతు త్రవ్వటానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామి వారి స్వయాంభు విగ్రహం వూరే నీటి నుండి ఆవిర్భవించింది. ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన స్వయంభువుడు అని గ్రహించి చాలా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు. ఈ కొబ్బరి నీరు ఒక ఎకరం పావు దూరం చిన్న కాలువలా ప్రవహించింది. దీన్ని కాణిపరకం అనే తమిళ పదంతో పిలిచేవారు, రానురాను కాణిపాకంగా పిలవసాగారు. ఈ రోజుకి ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే వుంటుంది. అక్కడ ప్రాంగణములోనే ఒక్క బావి కూడా వున్నది దానిలో స్వామి వారి వాహనము ఎలుక ఉంది. అక్కడ స్వామివారికి, మనకి ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలి వెస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి.
వరసిద్ధి వినాయక దేవాలయం
[మార్చు]కాణిపాకంలో కొలువు తీరిన స్వామి వినాయకుడు. సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. స్వామి వారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్థి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు. స్వామి వారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. సత్యప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్దీకులు సిద్ధం కారు. కాణిపాకంలో ప్రమాణం చేస్తారా? అంటూ సవాల్ విసురుతారు. ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాలలో కూడా ప్రామాణికంగా తీసుకునేవారు.[4]దీనికి ఎదురుగా ఒక మంచి నీటి కోనేరు, ఒక వినూతమైన మండపం ఉన్నాయి
ఇతర ఆలయాలు
[మార్చు]- స్వయంభువు వరసిద్ధి వినాయకస్వామి గుడికి వాయవ్య దిశగా ఉన్న మరకతంభికా సమేత శ్రీ మణికంఠేశ్వర ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ ఆలయం. దీనితో కాణిపాకం హరిహర క్షేత్రమైనది. "బ్రహ్మహత్యా పాతక నివృత్తి" కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారని ప్రసిద్ధిచెందింది ఉంది. షణ్ముఖ,దుర్గ విగ్రహాలు చెప్పుకోదగినవి. ఈ ఆలయంలో ఎప్పుడు ఒక పాము నాగుపాము తిరుగుతూ వుంటుందంటారు. అది ఎవరికీ అపకారం చేసినట్లు ఇంతవరకు ధాఖలాలు లేవు. అది దేవతా సర్పమని, ఎంతో గొప్ప మహిమ గలదని, ఆ పాము పడగఫై మణి కుడా దర్శనం ఇస్తూ ఉంటుందని అక్కడి అర్చకులు, భక్తులు చెప్పుతూ ఉంటారు. దీన్ని 11 వ శతాబ్దంలో చోళరాజు కుళొత్తుంగ మహారాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి.[4] ఈ ఆలయాన్ని చోళ రాజైన రాజరాజేంద్ర చోళుడు కట్టించాడు.[5] ఈ ఆలయంలోని అద్భుతమైన శిల్పసంపద చోళ విశ్వకర్మ శిల్పిశైలికి తార్కాణంగా పేర్కొనబడుతుంది.
- శ్రీ వరసిద్ది వినాయకుని ఆలయానికి తూర్పుగా ఈశాన్య దిశలో శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయం ఉంది. పూర్వం జనమేజయుడు సర్ప యాగం చేసిన తర్వాత శ్రీ మహా విష్ణువు అతనికి కలలో కనపడి శ్రీ వరదరాజస్వామి వారి ఆలయాన్ని కట్టించమని అజ్ఞాపించడం చేత దానిని జనమేజయుడు కట్టించాడని అంటారు. వరదరాజస్వామి ఆలయంలో నవగ్రహాలమండపం, అద్దాల మేడ కూడా ఉంది.
- ఆంజనేయస్వామి గుడి
రవాణా సౌకర్యాలు
[మార్చు]- బస్సు సౌకర్యం
- సమీప ప్రధాన బస్సు స్టేషన్లు తిరుపతి, చిత్తూరు.
- రైలు సౌకర్యం
- సమీప రైల్వే స్టేషన్లు చిత్తూరు, రేణిగుంట గూడూరు
- విమాన సౌకర్యం
- సమీప విమానాశ్రయం తిరుపతి
విద్యా సౌకర్యాలు
[మార్చు]ఈ గ్రామములో 6 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 1 ప్రైవేటు ప్రాథమిక పాఠశాల, 2 ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు, 1 ప్రైవేటు మాధ్యమిక పాఠశాల, 1 ప్రభుత్వ సీనియర్ మాధ్యమిక పాఠశాలలు వున్నాయి. సమీప బాలబడి, అనియత విద్యా కేంద్రం (ఐరాలలో), సమీప ఆర్ట్స్, సైన్స్, కామర్సు డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాలలు చిత్తూరులో, వైద్య కళాశాల, మేనేజ్మెంట్ సంస్థలు తిరుపతిలో వున్నాయి.
భూమి వినియోగం
[మార్చు]గ్రామంలో భూమి వినియోగం ఇలా ఉంది (హెక్టార్లలో):
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 93.89
- వ్యవసాయం సాగని, బంజరు భూమి: 114.12
- వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 10.12
- సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 6.47
- బంజరు భూమి: 2.43
- నికరంగా విత్తిన భూ క్షేత్రం: 501.97
- నీటి సౌకర్యం లేని భూ క్షేత్రం: 434.38
- నీటి వనరుల నుండి నీటి పారుదల లభిస్తున్న భూ క్షేత్రం: 76.49
నీటిపారుదల సౌకర్యాలు
[మార్చు]బావులు/గొట్టపు బావుల ద్వారా 76.49 హెక్టార్లకు వ్యవసాయ నీటి పారుదల వ్యవస్థ వుంది.
ప్రధాన పంటలు
[మార్చు]చెరకు, వరి, మామిడి, వేరుశనగ కూరగాయలు ఇక్కడి ప్రధాన పంటలు.
ఆలయాల చిత్రమాలిక
[మార్చు]-
కాణిపాక దేవాలయ అంతరాలయం
-
కాణిపాక దేవాలయం ప్రవేశం ద్వారం
-
కాణిపాక దేవాలయం బయట అమ్మకాలు
-
కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం వద్ద భక్తులను ఆశీర్వదిస్తున్న ఏనుగు
-
కాణిపాకంలోని శ్రీ వరదరాజ స్వామి ఆలయం
-
కాణిపాకంలోని శివాలయం వద్ద ఉన్న రాశీచక్రం
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
- ↑ "Kanipakam". Retrieved 14 June 2016.
- ↑ 4.0 4.1 "కాణిపాకం-వినాయకుడు". 2016-11-25. Archived from the original on 2016-11-25. Retrieved 23 November 2016.
- ↑ Lists of the antiquarian remains in the presidency of Madras.
వెలుపలి లంకెలు
[మార్చు]- Pages using the JsonConfig extension
- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox settlement with bad settlement type
- Infobox mapframe without OSM relation ID on Wikidata
- Commons category link is locally defined
- ఐరాల మండలంలోని గ్రామాలు
- ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు
- చిత్తూరు జిల్లా పుణ్యక్షేత్రాలు
- రాయలసీమ లోని పుణ్యక్షేత్రాలు
- చిత్తూరు జిల్లా దర్శనీయ స్థలాలు
- చిత్తూరు జిల్లా పర్యాటక ప్రదేశాలు
- ఆంధ్రప్రదేశ్ దేవాలయాలు
- Pages using the Kartographer extension