చాందిని చౌదరి
చాందిని చౌదరి | |
---|---|
జననం | చాందిని చౌదరి 1991 అక్టోబరు 23 |
ఇతర పేర్లు | చాందిని |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2015–ప్రస్తుతం |
చాందిని చౌదరి తెలుగు చలనచిత్ర నటి. లఘుచిత్రాలలో నటించిన చాందిని, కేటుగాడు సినిమాతో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది.
జననం - విద్యాభ్యాసం
[మార్చు]చాందిని చౌదరి 1991, అక్టోబరు 23న విశాఖపట్టణంలో జన్మించింది. విద్యాభ్యాసమంతా బెంగళూరులో పూర్తిచేసింది.[1]
సినీరంగ ప్రస్థానం
[మార్చు]బెంగళూరులో చదువుతున్న సమయంలోనే లఘచిత్రాలలో నటించింది. కొన్ని ముఖాముఖీలలో తను ఎమన్నదంటే తను వేసవి సెలవలకి ఇంటికి వచ్చినప్పుడు యమ్.ఆర్ ప్రొడక్షన్స్ వారి 'ది వీక్' అనే లఘు చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత తను ప్రేమ ప్రేమ, లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ట్రూ లవ్, అప్రోచ్, ప్రపోజల్, మధురం, సాంబార్ ఇడ్లీ, లక్కీ, టూ సైడ్ లవ్, ఫాల్ ఇన్ లవ్, రోమియో జూలియట్ మొదలగు లఘు చిత్రాలు చాందినికి గుర్తింపునిచ్చాయి. మొదట్లో యువ కథానాయకుడు రాజ్ తరుణ్ తో కలిసి చాలా లఘు చిత్రాలలో నటించి విజయవంతమైన జంటగా పేరు తెచ్చుకున్నారు అందులో ఒకటి 'ది బ్లైండ్ డేట్'. వారు అన్ని లఘు చిత్రాలు చేసినప్పటికీ ఒక్క చలనచిత్రంలో కూడా కలిసి నటించకపోవడం గమనార్హం. [1]
2013లో వచ్చిన మధురం లఘచిత్రంలో చాందిని నటనను చూసిన ముళ్ళపూడి వరా, కె.రాఘవేంద్రరావులు కుందనపు బొమ్మ అనే చిత్రంలో అవకాశం ఇచ్చారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ సినిమా 2015 జనవరిలో ప్రారంభమైంది.[2]2015లో కేటుగాడు చిత్రంతో తెలుగు చలన చిత్ర తెరకు పరిచయం అయ్యింది. అంతకుముందు తను లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలలో చిన్న పాత్రలు పోషించింది. ఆ తరువాత కేటుగాడు సినిమాలో కధానాయికగా నటించిన చాందిని బ్రహ్మోత్సవం, శమంతకమణి సినిమాలలో కూడా నటించింది. 2018లో వచ్చిన మను సినిమాలో తన పాత్రకు ప్రశంసలు అందుకుంది. 2020లో సుహాస్ సరసన కలర్ ఫోటో సినిమాలో నటించింది.
నటించిన చిత్రాల జాబితా
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు | సూచనలు |
---|---|---|---|---|
2012 | లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ | అశోక్ పెళ్ళిలోని అతిథి | చిన్న పాత్రతో తెరాంగేట్రం | |
2013 | ప్రేమ ఇష్క్ కాదల్ | అర్జున్ ప్రేయసిలల్లో ఒకరు | ||
2015 | కేటుగాడు | అకిరా | ప్రధాన నటిగా ఆరంగేట్రం | |
2016 | బ్రహ్మోత్సవం[3] | ఆనంద వల్లి | అతిధి పాత్ర | |
కుందనపుబొమ్మ | సుచి | |||
2017 | శమంతకమణి[4] | మధు | ||
లై | సత్యం పెళ్లిచూపులోని అమ్మాయి | అతిధి పాత్ర | ||
2018 | హౌరా బ్రిడ్జ్ | స్వాతి | ||
మను | నీలా | భారతదేశంలోని మొదటి జన నిర్మాణ చిత్రం | ||
2020 | కలర్ ఫోటో | దీప్తి | ఆహలో విడుదల | |
బొంభాట్ | చైత్ర | అమెజాన్ ప్రైమ్ లో విడుదల | ||
2021 | సూపర్ ఓవర్[5] | మధు | ఆహాలో విడుదల | |
2022 | సమ్మతమే | శాన్వి | ||
2023 | సబా నాయగన్ | రియా | తమిళంలో ఆరంగేట్రం | |
2024 | గామి | జాహ్నవి | [6] | |
మ్యూజిక్ షాప్ మూర్తి | అంజన | [7] | ||
యేవమ్ | సబ్ ఇన్స్పెక్టర్ సౌమ్య | [8] | ||
సంతాన ప్రాప్తిరస్తు | TBA | నిర్మాణ దశలో ఉన్నది | [9] |
అంతర్జాల ధారావాహికలు
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | వేదిక | గమనికలు | సూచనలు |
---|---|---|---|---|---|
2019 | గాడ్స్ ఆఫ్ ధర్మపురి | స్వప్న | జీ5 | ||
2020 | మస్తీస్ | లేఖ | ఆహా | ||
షిట్ హ్యాపెన్స్ | పార్టీలోని అమ్మాయి | అతిథి పాత్ర | |||
2021 | అన్హియర్డ్ | పద్మ | డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ | ||
2022 | గాలివాన | శ్రావణి | జీ5 | ||
2022–2023 | ఝాన్సీ | బార్బీ | డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ | 2 భాగాలు |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 justbollywood. "Chandini Chowdary". www.justbollywood.in. Archived from the original on 1 June 2017. Retrieved 16 June 2017.
- ↑ సినీజోష్. "సినీజోష్ ఇంటర్వ్యూ: చాందిని చౌదరి". www.cinejosh.com. Archived from the original on 10 October 2017. Retrieved 16 June 2017.
- ↑ టాలీవుడ్ టైమ్స్. "మహేష్ బాబుతో షార్ట్ ఫిల్మ్ హీరోయిన్". www.tollywoodtimes.com. Archived from the original on 17 August 2018. Retrieved 16 June 2017.
- ↑ ఇండియా గ్లిట్జ్. "మల్టీస్టారర్ లో చాందిని చౌదరి..." /www.indiaglitz.com. Retrieved 16 June 2017.
- ↑ "Promo: Chandini Chowdary as Madhu in Super Over, film to premiere on aha from Jan 22". ap7am.com. Archived from the original on 2021-01-29. Retrieved 2021-02-11.
- ↑ Chitrajyothy (22 February 2024). "జాహ్నవిగా చాందిని చౌదరి.. ఫస్ట్ లుక్ వదిలారు | Introducing Chandini Chowdary Role in Gaami KBK". Archived from the original on 24 February 2024. Retrieved 24 February 2024.
- ↑ News18 తెలుగు (25 May 2024). "చాందినీ చౌదరి మ్యూజిక్ షాప్ మూర్తి.. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్". Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Chitrajyothy (26 April 2024). "మరో బలమైన పాత్రలో చాందిని చౌదరి". Archived from the original on 26 April 2024. Retrieved 26 April 2024.
- ↑ Chitrajyothy (23 October 2024). "చాందినీ 'సంతాన ప్రాప్తిరస్తు' లుక్ విడుదల". Retrieved 24 October 2024.