Jump to content

జాజ్‌పూర్ జిల్లా

వికీపీడియా నుండి
జాజ్‌పూర్ జిల్లా
జిల్లా
Nickname: 
జాజ్రా నగర్
ఒడిశా పటంలో జిల్లా స్థానం
ఒడిశా పటంలో జిల్లా స్థానం
దేశం India
రాష్ట్రంఒడిశా
ప్రధాన కార్యాలయంజాజ్‌పూర్
Government
 • CollectorAnil Kumar Samal, IAS
 • Member of Lok SabhaMohan Jena
విస్తీర్ణం
 • Total2,887.69 కి.మీ2 (1,114.94 చ. మై)
Elevation
331 మీ (1,086 అ.)
జనాభా
 (2001)
 • Total19,00,054
 • జనసాంద్రత658/కి.మీ2 (1,700/చ. మై.)
భాషలు
 • అధికారOdia, హిందీ,ఇంగ్లీషు
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
755 xxx
Vehicle registrationOD-04,OD-34
సమీప పట్టణంBhubaneswar
Literacy72.19%
లోక్‌సభ నియోజకవర్గంJajpur
Vidhan Sabha constituency7
 
  • Barchana
    Bari
    Binjharpur
    Dharmasala
    Jajpur
    Sukinda
    Korai
శీతోష్ణస్థితిAw (Köppen)
అవపాతం1,014 మిల్లీమీటర్లు (39.9 అం.)
సగటు వేసవి ఉష్ణోగ్రత38 °C (100 °F)
సగటు శీతాకాల ఉష్ణోగ్రత12 °C (54 °F)

ఒడిషా రాష్ట్రం లోని జిల్లాలలో జాజ్‌పూర్ జిల్లా ఒకటి. ఇది ఒక చారిత్రాత్మక యాత్రా స్థలం. ఒకప్పుడు జాజ్‌పూర్ పట్టణం కళింగ రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఇది ప్రస్తుతం పురాతత్వ పరిశోధన కేంద్రంగా ఉంది. జిల్లాలో విరజా దేవి శక్తిపీఠాలలో ఒకటిగా గుర్తించబడుతుంది. జిల్లాలో విరజాదేవి (దుర్గా) ఆలయాలు, జంగ్య బరాహ (మహావిష్ణువు వరాహావతారం), సప్తమాతృక ఆలయాలు , ఇతర మతాలయాలు బైతరణి నదీతీరంలో ఉన్నాయి. జిల్లాలో అశోక్‌నగర్, చంద్రఖోల్, చతియా, గోకర్ణికా, కురంసా, మహావినాయక్, పతరాజపూర్, రత్నగిరి (ఒడిషా), ఉదయగిరి (ఒడిషా), సత్యపిరా, సింఘపూర్, వ్యాస్ సరోబర్ , బరునేశ్వర్ పీఠం వంటి ప్రయాటక ఆకర్షిత ప్రాంతాలు ఉన్నాయి. జిల్లాలో పరిశ్రమాభివృద్ధికి సహకరించే ఖనిజాలు , సహజ వనరులు ఉన్నాయి.

భౌగోళికం

[మార్చు]

జాజ్‌పూర్ వైశాల్యం 2888 చ.కి.మీ. ఇందులో 202 చ.కి.మీ భూభాగంలో అటవీ ప్రాంతం ఉంది. జనసంఖ్య 1, 622,868, అక్షరాస్యత 72.19%. జిల్లాకేంద్రంగా జాజ్‌పూర్ పట్టణం ఉంది. జిల్లాలో 2 పట్టణాలు , 1781 గ్రామాలు ఉన్నాయి. జిల్లా వార్షిక వర్షపాతం 1771.8 మిమీ.

పర్యాటక ఆకర్షణలు

[మార్చు]
  • బిరాజా ఆలయం:- జిల్లా కేంద్రం జాజ్‌పూర్ పట్టణం పురాతన నామం బిరజాక్షేత్ర. ఈ ప్రాంతం పరాశక్తి బిరాజాదేవి పూజలదుకుంటున్న పవిత్రక్షేత్రం. ఈ చిన్న పట్టణం చుట్టూ వైతరణీ నది అర్ధచంద్రాకారంలో ప్రవహిస్తుంది. మరొక అంచున ఎగువకాలువ ఉంది. జాజ్‌పూర్ పట్టణం శక్తికి చిహ్నంగా భావించబడుతుంది. కళింగ సంరాజ్యానికి రాజైన జజాతికేసరి (11-12వ శతాబ్దం)కి జాజ్‌పూర్ రాజధానిగా ఉండేది.
  • చటియా బట్టా:- చటియాలో జగన్నాధుని ఆలయం ఉంది. ఇది కటక్ నుండి 25కి.మీ దూరంలో ఉంది. మాలికాలో వర్ణించబడిన సంఘటనల ఆధారంగా చటియాబట్టా రెండవ శ్రీక్షేత్రంగా భావించబడుతుంది. ఈ క్షేత్రానికి సమీపంలో ఉన్న చందిఖోల్ , కటక్‌లో హోటల్ సదుపాయం లభిస్తుంది. ఈ ప్రాంతంలో ఒరియా, హిందీ , ఇంగ్లీష్ భాషలు వాడుకలో ఉన్నాయి.
  • చందిఖోల్:- కటక్ నుండి 40కి.మీ దూరంలో ఉన్న చండీకోయల్ ప్రకృతి సౌందర్యంతో తులతూగుతున్న అందమైన విహారక్షేత్రం.
  • దశాశ్వమేధ ఘాట్:- దశాశ్వమేధ ఘాట్ బైతరణీ నదీతీరంలో ఉంది. ఈ పవిత్ర స్నానఘట్టాన్ని రాజా జజాతి కేసరి నిర్మించాడు. హిందువుల ప్రధాన పర్వదినాలలో ఈ స్నాఘట్టంలో స్నానం చేస్తే పుణ్యమని విశ్వసిస్తున్నారు. ఫిబ్రవరి - మార్చి మాసాలలో జరిగే బారుణి స్నానం పవిత్రదినంలో ఇక్కడ అనేక మంది భక్తులు స్నానం ఆచరిస్తుంటారు. జాజ్‌పూర్ టౌన్ , జాజ్‌పూర్ పట్టణంలో బసచేయడానికి వసతిసౌకర్యాలు లభిస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఒరియా, హిందీ , ఇంగ్లీష్ భాషలు వాడుకలో ఉన్నాయి.
  • మహాబినాయక్:- చండీఖోలుకు 2 కి.మీ దూరంలో ప్రకృతి సౌందర్యంతో అలరాతుతున్న ప్రదేశం మద్య మహాబినాయక్ ఆలయం ఉంది.
  • బౌద్ధ స్థూపాలు:- లలితగిరి, రత్నగిరి (ఒడిషా) , ఉదయగిరులలో ప్రసిద్ధ బౌద్ధాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలు కటక్ నుండి 60-65 కి.మీ మద్య దూరంలో ఉన్నాయి. పుష్పగిరిలో 7వ శతాబ్ధానికి చెందిన బౌద్ధ విశ్వవిద్యాలయం ఉండేదని విశ్వసిస్తున్నారు. లాంగుడి కొండ వద్ద త్రవ్వకాలలో సమీపకాలంలో అశోకచక్రవర్తి కాలానికి సంబంధించిన అశోకచక్రవర్తి శిల్పం ఒకటి లభించింది. 2012లో హతిఖల్ గ్రామంలో కొత్తగా మరిక బుద్ధ విహారం బయటపడింది.[1]
  • దుబురి: చంద్రఖోల్‌కు 38 కి.మీ దూరంలో దైతర్ గనుల మార్గంలో ఉన్న దుబురిలో పలు స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి.
  • కోరై: కోరై జాజ్‌పూర్ (ఒడిషా) జిల్లాలో ఒక మండలం. ఇక్కడ ఒక ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, ఒక కాలేజి, కొన్ని ఉన్నత పాఠశాలలు , 125 సంవత్సరాల పురాతనమైన పాఠశాల ఉన్నాయి. అంతేకాక ఇక్కడ మునుపటి కటక్ జిల్లాలోని పురాతన పోలీస్ స్టేషను ఉంది. ఇది రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఇది మద్రాసు - కొలకత్తా రైలు మార్గాంలో ఉంది. మునుపటి కటక్ జిల్లాలో ఒక రైల్వే స్టేషను ఇక్కడ ఉంది. ఈ రైల్వే స్టేషను కొలకత్తా జాతీయ రహదారి-5 మార్గానికి 9 కి.మీ దూరంలో ఉంది.
  • భరునేశ్వర ఆలయం:- భరునేశ్వర ఆలయం జిల్లాలోని అరెయి గ్రామంలో ఉంది. భరునేశ్వర ఆలయం బైతరణీ నదీ శాఖ అయిన కుశాభద్రా నదీతీరంలో ఉంది. ఇది బైతరణీ క్షేత్రానికి ఆగ్నేయంలో ఉంది. శివలింగం నదీజాలాలో లోపల మునిగి ఉంటుంది. వర్షాకాలం , శితాకాలంలో భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. ఇది యాత్రా స్థలంగా , విహారప్రాంతంగా ప్రసిద్ధిచెందిందింది. మకరమేళ లేక బరునేశ్వరమేళ ఒడిషా రాష్ట్రంలో జరిగే బృహత్తర ఉత్సవాలలో ఒకటి. జనవరి 14 న ప్రతిసంవత్సరం ఈ ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి.
  • వ్యాససరోవర మేళా:- దీనిని వ్యాస మహోత్సవం అనికూడా అంటారు. జాజ్‌పూర్ నగరంలో ఇది ప్రసిద్ధి చెందిన ఉత్సవంగా భావించబడుతుంది.
  • జిల్లాలోని జఖపురా వద్ద జూన్ 30న కళింగ నాగర్ మహోత్సవం నిర్వహించబడుతుంది.
  • జాజ్పూర్ ప్రాంతం గయాక్షేత్రాల్లో ఒకటిగా పౌరాణిక ప్రశస్తి పొందుతోంది. గయాసురుడిని పాతాళానికి తొక్కేప్పుడు ఆయన తలపై విష్ణుమూర్తి తన కుడికాలు పెట్టగా, విష్ణువును గయాసురుడు తన శరీరం పితృదేవతలనే తరింపజేసే పరమ పవిత్రమైన క్షేత్రాలకు నిలయంగా అనుగ్రహించమని కోరతారు. ఆయన కోరికను మన్నిస్తూ ఆ అతికాయుని తల వద్ద శిరో గయ, నాభి వద్ద నాభి గయ, పాదం వద్ద పాదగయ క్షేత్రాలు ఏర్పడేలా వరమిచ్చారు. అలా ఏర్పాటైన గయల్లోని నాబిగయ నేటి జాజ్పూర్లో ఉంది.[2]

ఆర్ధికం

[మార్చు]

దనగడి మండలంలో ఉన్న కళింగ నగర్‌లో 6 బృహత్తర స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి: జిండల్ స్టీల్ ప్లాంటు, నీలాంచల్ ఇస్పాటు నిగం లిమిటెడ్, వి.ఐ.ఎస్.ఎ. స్టీల్, మెస్కో స్టీల్, టాటా స్టీల్. అదనంగా 7 స్టీలు ప్లాంట్లు ఉతపత్తికి సిద్ధంగా ఉన్నాయి.

విభాగాలు

[మార్చు]

జిల్లాలో 7 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.

తాలూకా బ్లాకపల విభాగాలు

[మార్చు]
  1. బదచన
  2. బారి (ఒడిషా)
  3. బింఝర్పూర్
  4. డంగడి
  5. దశరథపూర్ (ఒడిషా).
  6. దర్పన్ (ఒడిషా)
  7. ధర్మశాల (ఒడిషా)
  8. జాజపూర్ తాలూకా
  9. జాజపూర్ సదర్
  10. కొరై (ఒడిషా) ఒడిషా
  11. పనికొలి తాలూకా (పనికొలి)
  12. రసూల్పూర్ తాలూకా
  13. సుకిండ తాలూకా

జిల్లాలో 2 పురపాలకాలు, 6 తాలూకాలు , 242 గ్రామపంచాయితీలు ఉన్నాయి.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,826,275,[3]
ఇది దాదాపు. కొసొవొ దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. నెబ్రస్కా నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 206 వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. 630 [3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 12.43%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 972:1000 [3]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 80.44%.[3]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

రాజకీయాలు

[మార్చు]

అసెంబ్లీ నియోజకవర్గాలు

[మార్చు]

ఈ క్రింది జాజ్పూరుకు చెందిన 7 ఒడిషా శాసనసభ నియోజకవర్గాలు [6][7] ఎన్నికైన సభ్యుల జాబితా [8] ఉంది.

క్ర.సం నియోజకవర్గం రిజర్వేషను పరిధి 14 వ శాసనసభ సభ్యులు పార్టీ
48 బింఝాపూర్ షెడ్యూల్డ్ కులాలు Binjharpur, Dasarathpur (part) ప్రమీళా మాలిక్ బి.జె.డి
49 బరి లేదు బరి, జాజ్‌పూర్ (భాగం), రసూల్పూర్ (భాగం) డెబాసుస్ నాయక్ బి.జె.డి
50 బరచన లేదు బరచన అమర్ ప్రసాద్ సత్పతి బి.జె.డి
51 ధర్మశాల లేదు ధర్మశాల, రసూల్పూర్ (part) కల్పతరు దాస్ బి.జె.డి
52 జాజ్‌పూర్ లేదు జాజ్‌పూర్ (ఎం), జాజ్‌పూర్ (భాగం) , దశరథపూర్ (భాగం) ప్రణాబ్ ప్రకాష్ దాస్ బి.జె.డి
53 కొరెయి లేదు Vyasanagar (M), Vyasanagar (O. G), Korei, Rasulpur (part) ప్రతిరంజన్ ఘాడై బి.జె.డి
54 శుకిండ లేదు శుకిండ, డంగడి ప్రఫుల్ల చంద్ర ఘడై బి.జె.డి

కళాశాలలు

[మార్చు]
  • ఎన్.సి. అటానమస్ కళాశాల ( జాజపూర్), జాజపూర్ పట్టణం
  • వ్యాసనగర్ కాలేజ్, వ్యాసనగర్, జాజపూర్ రోడ్
  • సాధు గౌరేశ్వర్ కాలేజ్ (ఎస్జి కళాశాల), కనికపడా, జాజపూర్
  • ఎ.పి కాలేజ్, సుజన్పూర్
  • బిరజ ఉమెన్స్ కాలేజీ, జాజపూర్
  • బిరజ లా కాలేజ్, జాజపూర్
  • ఇందిరా మహాత్మా గాంధీ ఉమెన్స్ కాలేజీ, జాజపూర్ రోడ్
  • జి.సి కాలేజ్, రామచంద్రపూర్
  • కాన్హు చరణ మహావిద్యాలయ, కొరై
  • ఎల్.బి జ్యూ కాలేజ్, అంగ్లొ
  • మంగళపూర్ ఉమెన్స్ కాలేజీ, మంగళపూర్
  • ప్రాంతీయ కాలేజ్,రాంబాగ్
  • పి.కె మోహబిద్యాలయ, బైతరణి. రోడ్
  • బి.బి .మోహబిద్యాలయ, చండిఖొలే
  • సహస్పూర్ కాలేజ్, సహస్పూర్
  • ఎం.హె.చ్.డి మోహబిద్యాలయ, చతుయా
  • బి.ఎస్.కాలేజ్, నౌహత్
  • యు.ఎన్.ఎస్. మోహబిద్యాలయ, ముగుపాల్
  • మధుపూర్ కాలేజ్, కలాన్
  • బ్రహ్మబరద మోహబిద్యాలయ, బారదవిహార్
  • ఖతస్రొత మోహబిద్యాలయ, సింఘపూర్
  • బరునేశ్వర్ మోహబిద్యాలయ, అరెయి
  • జునభద్ర కాలేజ్, అస్తరు
  • ఎ.బి.జె వుమెన్ కాలేజ్, అల్కుండ్
  • ధర్మశాల మహాబిద్యాలయ, ధర్మశాల
  • జెనపూర్ కాలేజ్, జెనపూర్
  • సుకిండ కాలేజ్, సుకిండ
  • ఝదేశ్వర్ కాలేజ్, టోల్కని
  • బి.వి. మోహవిద్యాలయ, హరిపురం
  • దశరథపూర్ కళాశాల, దశరథపూర్
  • బజరంగిరి మహావిద్యాలయ భుధవిహార్, కొటూర్

పాఠశాలలు

[మార్చు]
  • కొరై ఉన్నత పాఠశాల, కొరై
  • కొరై చిన్న పాఠశాల,కొరై
  • బి.బి. హై స్కూల్,ప్రితిపూర్
  • అహియాస్ హై స్కూల్, దశరథపూర్
  • ఎన్.సి. హై స్కూల్, జాజపూర్ రోడ్
  • మహాతాబ్ హై స్కూల్, దశరథపూర్
  • రాంబాగ్ హై స్కూల్, దశరథపూర్
  • జాజపూర్ జిల్లా స్కూల్, జాజపూర్ టౌన్
  • బిర్జా హై స్కూల్ (ఎన్సిసి ఎయిర్ వింగ్), జాజపూర్ టౌన్
  • రామ లక్ష్మణ్ ఉచ్చ విద్యాలయ, కందర,జాజపూర్
  • పురుషోత్తమపూర్ హై స్కూల్, కబీర్పూర్.
  • సరిబంట హై స్కూల్, కల్యాణ్పుర్
  • ఎం.వి. బిద్యాలయ, బర్చన
  • దశరథపూర్ హై స్కూల్,దశరథపూర్
  • బి.ఎస్. హై స్కూల్, సయీద్పూర్
  • బరునేశ్వర హై స్కూల్, బింఝర్పూర్.
  • బి.సి. అకాడమీ, బలియపాల్
  • మధుపూర్ హై స్కూల్, రసూల్పూర్
  • మధుబన్ హై స్కూల్, రసూల్పూర్
  • నందిపూర్ హై స్కూల్, నందిపూర్
  • ఆర్.సి. హై స్కూల్, సుజన్పూర్
  • చాటియా హై స్కూల్, బర్చనా
  • అమర్కానా ఎస్ నికేతన్,రాజతోటా
  • కృపసింధు బిద్యాలయ, బారి
  • కే పి చ బిద్యాలయా,ంకటియా
  • జి సి ఉన్నత పాఠశాల స్కూల్ ఔంరి
  • బరునెయిభైస్కూల్ స్కూల్ ఫతేపూర్
  • దశరథపూర్ హయ్యర్ సెకండరీ స్కూల్, దశరథపూర్
  • జగులై హై స్కూల్, కోట్పూర్
  • పంచాయతీ హై స్కూల్, అరెయికన
  • పద్మ చరణ్ అకాడమీ, మోహన్ పూర్
  • పి.పి విధాన్, జనక
  • హజీర్ హమియా హై స్కూల్, బ్రహ్మ బరద

మూలాలు

[మార్చు]
  1. "Buddha Vihar Unearthed in Odisha's Jajpur district, Odisha Current News". orissadiary.com. 2012. Archived from the original on 11 మార్చి 2013. Retrieved 17 August 2012. The remains of a Buddha vihar along with some stone images of Lord Buddha, Ganesh, Saraswati, Padmapani and others were unearthed from a land in village Hatikhal in Jajpur district
  2. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2019-01-07. Retrieved 2011-10-01. Kosovo 1,825,632 July 2011 est.
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Nebraska 1,826,341
  6. Assembly Constituencies and their EXtent
  7. Seats of Odisha
  8. "List of Member in Fourteenth Assembly". ws.ori.nic.in. Archived from the original on 2 మే 2007. Retrieved 19 February 2013. MEMBER NAME

వెలుపలి లింకులు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]