తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2021-2022)
Submitted | 2021 మార్చి 18 |
---|---|
Submitted by | తన్నీరు హరీశ్ రావు (తెలంగాణ ఆర్థిక శాఖామంత్రి) |
Submitted to | తెలంగాణ శాసనసభ |
Presented | 2021 మార్చి 18 |
Parliament | 2వ శాసనసభ |
Party | తెలంగాణ రాష్ట్ర సమితి |
Finance minister | తన్నీరు హరీశ్ రావు |
Tax cuts | None |
‹ 2020 2022 › |
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2021-2022) అనేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్.[1] తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా 2021 మార్చి 18న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమ్యాయి. బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాన్ని తనకు కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞత చెబుతూ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి తన్నీరు హరీశ్ రావు రెండవసారి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టాడు.[2][3] 1 గంట 37 నిముషాలపాటు బడ్జెట్ ప్రసంగం చదివాడు.
2021-2022 సంవత్సరానికి తెలంగాణ బడ్జెట్ విలువ రూ.2,30,825.96 కోట్లు కాగా, అందులో రెవెన్యూ వ్యయం రూ.1,69,383.44 కోట్లు, ఆర్థిక లోటు అంచనా రూ.45,509.60 కోట్లుగా ఉంది. పెట్టుబడి వ్యయం రూ. 29,046.77 కోట్లు, రెవెన్యూ మిగులు రూ. 6,743.5 కోట్లుగా అంచనా వేయబడింది.[4] మంత్రి హరీశ్‌రావుకు ఇది రెండో బడ్జెట్. రెండోసారి అధికారంలోకి వచ్చాక 2019-20లో బడ్జెట్‌ను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత ఆర్థికమంత్రిగా హరీశ్‌రావు 2020-21 నుంచి వార్షిక బడ్జెట్‌ను సభకు సమర్పిస్తున్నాడు.
రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా జూబ్లీహిల్స్ లోని వెంకటేశ్వరస్వామి దేవాలయంలో హరీశ్ రావు ప్రత్యేక పూజలు చేశాడు. అనంతరం శాసనసభ వ్యవహారాల శాఖామంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి అసెంబ్లీకు చేరుకున్నాడు. అక్కడ ఇతర మంత్రులతో కలిసి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి బడ్జెట్ ప్రతులను అందించాడు. ఆ తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా బడ్జెట్ ప్రతులను అందించాడు.
రాష్ట్ర ఆదాయం
[మార్చు]- పన్నుల ఆదాయం రూ.92,910 కోట్లు
- పన్నేతర ఆదాయం రూ.30,557.35 కోట్లు
- గ్రాంట్ల ఆదాయం రూ. 38,6669.46కోట్లు
- కేంద్ర పన్నుల్లో వాటా రూ. 13,990.13కోట్లు
- స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ. 12,500 కోట్లు
- ఎక్సైజ్ ఆదాయం రూ. 17వేల కోట్లు
- అమ్మకం పన్ను ఆదాయం రూ. 26,500కోట్లు
- వాహనాల పన్ను ఆదాయం రూ. 5వేల కోట్లు
శాఖల వారిగా కేటాయింపులు
[మార్చు]తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2021-2022)లో వివిధ శాఖలకు కేటాయించబడిన నిధుల వివరాలు:[5][6][7]
- ఎంబీసీ కార్పోరేషన్ కు రూ. 1,000 కోట్లు
- బీసీ సంక్షేమ శాఖకు రూ. 5,522 కోట్లు
- మైనార్టీ సంక్షేమ శాఖకు రూ. 1,606 కోట్లు
- మహిళలకు వడ్డీలేని రుణాల కోసం రూ. 3,000 కోట్లు
- మహిళ, శిశు సంక్షేమ శాఖకు రూ. 1,702 కోట్లు
- రైతు బంధుకు రూ. 14,800 కోట్లు
- రైతుల రుణమాఫీకి రూ. 5,225 కోట్లు
- వ్యవసాయ శాఖకు రూ. 25 వేల కోట్లు
- పశు సంవర్థక శాఖకు రూ. 1,730 కోట్లు
- నీటి పారుదల శాఖకు రూ. 16,931 కోట్లు
- సమగ్ర భూసర్వేకు రూ. 400 కోట్లు
- ఆసరా పింఛన్లకు రూ. 11,728 కోట్లు
- కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌కు రూ. 2,750 కోట్లు
- ఎస్సీ ప్రత్యేక ప్రగతి నిధికి రూ. 21,306.85 కోట్లు
- ఎస్టీల ప్రత్యేక ప్రగతి నిధికి రూ. 12,304.23 కోట్లు
- ఎస్టీ గృహాలకు రాయితీపై విద్యుత్ కు రూ. 18 కోట్లు
- మూడు లక్షల గొర్రెల యూనిట్ల కోసం రూ. 3,000 కోట్లు
- బీసీలకు కల్యాణలక్ష్మికి అదనంగా రూ. 500 కోట్లు
- రైతుల సంక్షేమం కోసం రూ. 338 కోట్లు
- కొత్త సచివాలయ నిర్మాణానికి రూ. 610 కోట్లు
- తెలంగాణ ఐటీ శాఖకు రూ. 360 కోట్లు
- దేవాదాయ శాఖకు రూ. 720 కోట్లు
- వైద్య ఆరోగ్య శాఖకు రూ. 6295 కోట్లు
- హోమ్ శాఖకు రూ. 6465 కోట్లు
- అటవీ శాఖకు రూ. 1,276 కోట్లు
- సాంస్కృతిక, పర్యాటక రంగానికి రూ. 726కోట్లు
- ఆర్టీసీకి రూ. 1,500 కోట్లు
- మెట్రో రైలుకు రూ. 1,000 కోట్లు
- ఓఆర్ఆర్ లోపల కొత్త కాలనీల్లో తాగునీరు కోసం రూ. 250 కోట్లు
- వరంగల్ కార్పోరేషన్‌కు రూ. 250 కోట్లు
- ఖమ్మం కార్పోరేషన్‌కు రూ. 150 కోట్లు
- మండల, జిల్లా పరిషత్‌కు రూ. 500 కోట్లు
- పరిశ్రమల రాయితీకి రూ. 2,500 కోట్లు
- పరిశ్రమల శాఖకు రూ. 3,077కోట్లు
- పాఠశాల విద్యకు రూ. 11,735 కోట్లు
- ఉన్నత విద్యకు రూ. 1,873 కోట్లు
- డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పథకానికి రూ. 11వేల కోట్లు
- సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్‌కు రూ. 1000 కోట్లు
- వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 1500 కోట్లు
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 29,271 కోట్లు
- పురపాలక, పట్టణాభివృద్ధికి రూ. 15,030 కోట్లు
- నియోజకవర్గ అభివృద్ధికి ఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి రూ. 5 కోట్ల రూ. 800 కోట్లు
- మూసీనది సుందరీకరణకు రూ. 200 కోట్లు
- ఆర్ అండ్ బికి రూ. 8,788 కోట్లు
- రీజనల్ రింగ్ రోడ్డు భూ సేకరణ కోసం రూ.750 కోట్లు
- పౌర సరఫరాల శాఖకు రూ. 2, 363 కోట్లు
- చేనేత కార్మికుల సంక్షేమానికి రూ. 338 కోట్లు
- గీత కార్మికుల సంక్షేమానికి రూ. 25 కోట్లు
ఇతర వివరాలు
[మార్చు]- బడ్జెట్ సమావేశాలకు వెళ్ళేముందు జూబ్లీహిల్స్‌లోని వెంకటేశ్వరస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించిన హరీశ్ రావు, అక్కడినుండి అసెంబ్లీకి వెళ్ళాడు.
- రూ.4 వేల కోట్లతో సరికొత్త విద్యా పథకం
మూలాలు
[మార్చు]- ↑ "Telangana Finance Portal". finance.telangana.gov.in. Archived from the original on 2021-05-16. Retrieved 2022-06-15.
- ↑ "తెలంగాణ 2021-22 బడ్జెట్ హైలైట్స్". Sakshi. 2021-03-18. Archived from the original on 2021-03-18. Retrieved 2022-03-07.
- ↑ "తెలంగాణ బడ్జెట్ 2021-22". andhrajyothy. 2021-03-18. Archived from the original on 2021-03-18. Retrieved 2022-03-07.
- ↑ "తెలంగాణ బడ్జెట్ 2021: రూ.2,30,826 కోట్లతో బడ్జెట్.. వెయ్యి కోట్లతో సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రాం". BBC News తెలుగు. 2021-03-18. Archived from the original on 2021-05-10. Retrieved 2022-03-07.
- ↑ reserved, © Ushodaya Enterprises Pvt Ltd All rights. "తెలంగాణ బడ్జెట్ 2021-22". EENADU PRATIBHA. Archived from the original on 2021-12-21. Retrieved 2022-03-07.
- ↑ "Telangana Budget 2021 Live: తెలంగాణ బడ్జెట్‌లో కేటాయింపులు ఇలా..." Samayam Telugu. 2021-03-18. Archived from the original on 2022-03-07. Retrieved 2022-03-07.
- ↑ "Telangana Budget 2021 Highlights: తెలంగాణ బడ్జెట్ 2021 లైవ్ అప్‌డేట్స్, ఆయా శాఖలకు నిధుల కేటాయింపులు ఇలా". Zee News Telugu. 2021-03-18. Archived from the original on 2021-03-18. Retrieved 2022-03-07.
బయటి లింకులు
[మార్చు]- తెలంగాణ ఆర్థిక శాఖ పోర్టల్ లో బడ్జెట్ వివరాలు Archived 2021-05-16 at the Wayback Machine