ద్రావిడ భాషలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ద్రావిడ భాషల అభివృద్ధిని తెలిపే చిత్రం
ద్రావిడ భాషల విస్తృతి

ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాషలే ద్రావిడ భాషలు. సాధారణంగా దక్షిణ భారతదేశము, శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, తూర్పు, మధ్య భారత దేశము, ఆఫ్ఘానిస్తాన్, ఇరాన్లలోని కొన్ని ప్రాంతాలలో మాట్లాడే భాషలు దాదాపు 26 భాషలు ఈ వర్గానికి చెందుతాయి. ఇక్కడే కాకుండా యునైటెడ్ కింగ్‌డం, అమెరికా, కెనడా, మలేషియా, సింగపూర్ లలో కూడా ద్రావిడ భాషలు మాట్లాడే జనాభా చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు.

ప్రపంచ వ్యాప్తముగా 25 కోట్లమంది ప్రజలు ద్రావిడ భాషలను మాట్లాడుతారు. ఈ భాషలు మిగిలిన యే భాషా కుటుంబానికి కూడా సంబంధము లేకుండా ప్రత్యేకముగా ఉన్నాయి. కొంతమంది భాషావేత్తలు ద్రావిడ భాషలను ఈలమో-ద్రావిడ భాష కుటుంబం అనే మహా కుటుంబంలో ప్రస్తుత నైరృత (south-western) ఇరాన్ కు చెందిన ప్రాచీన ఈలమైట్ భాషతో పాటు చేర్చారు. కానీ ఈ మహాకుటుంబ ప్రతిపాదనను భాషావేత్తలలో అధిక సంఖ్యాకులు అంగీకరించలేదు.

ద్రవిడం - ద్రావిడసిద్ధాంతం

[మార్చు]

ద్రావిడులు ఆర్యులు; ద్రవిడభాషలు ఆర్య భాషలు. ద్రవిడ మునకు పూర్వరూపము ద్రమిళ మనీ, ఇదే ద్రవిడముగ సంస్కృతమున నిలచి, ప్రాకృతము భాషలలో తిరమడ, తిరమిళ, తమిళ మొదలయిన రూపములను పొందినది. ద్రమిళ మే పూర్వపదము; ద్రవిడ ముత్తరరూపము. ధర్మ మీ రెండిటికిని సంధి. అంటే ద్రమిళ, ద్రవిడ, తిరమడ, తిరమిళ, తమిళ అను శబ్దములు ధర్మ శబ్ద భవములు అని అంటారు.

ధర్మ అనే శబ్దమునకు ధ్రమ అనేది కొన్ని ప్రాకృతములలో రూపాంతరం. అశోకుడు ధర్మ శాసనములనుంచి కొన్ని ఉదాహరణములు:

[సంకేతములు: షాబా. = షాబాజుగఢ; మంసే = మంసేహ్రో.రోమను అంకెలు శాసన సంఖ్యను, ఇంగ్లీషు అంకెలు పంక్తి సంఖ్యను తెలియజేస్తవి]

ద్రమం = ధర్మం. షాబా. IV-10; XIII -10; మంసే. IV-17; XII-6.

ధ్రమో = ధర్మః షాబా. XII-6.

ధ్రమ్మం = ధర్మం మంసే. XIII-11.

ధ్రమస = ధర్మస్య.షాబా XII -9.

ధ్రమే = ధర్మే. షాబా IV-9.

ధ్రమ-కమత = ధర్మకర్మతా. షాబా XIII-13

ధ్రమ-ఘోషే = ధర్మఘోషః.

ధ్రమ-చరణో = ధర్మాచరణం.

ధ్రమనుశస్తి = ధర్మానుశాస్తిః.

ధ్రమనుశశన = ధర్మశాసనం. మంసే. IV-17;

ఇందు ల, ఇల, -ళ, -ఇళ అనే ప్రత్యయాలు మతుర్ధక ప్రత్యయాలు. ఉదా: ఊర్మిళ (ఊర్మి అనగ మోహము, నిద్ర+కలది); సురభిళ (సౌరభ్యంకలది). ప్రాకృతములో ఈ మతుర్ధక ప్రత్యయములు సర్వ సాధారణములు. అందుచేతనే ధర్మ+ఇల = ధర్మిల: ప్రాకృతం: ధ్రమ + ఇళ = ధ్రమిళ = ద్రమిళ.

ఇక్కడ ధర్మము అంటే బౌద్ధ ధర్మము. బౌద్ధ ధర్మము ఉత్తర హిందూస్థానమున కపిలవస్తు ప్రాంతమున ఆరంభమయి భరతఖండమతటా వ్రాపించినా, దక్షిణహిందూస్థానములోనే దాని ప్రాబల్యము ఎక్కువ అయినది. అందుచేతనే ధర్మమునకు నిలయమైన దేశమంటే వింధ్యకు దక్షిణముగా ఉన్నదేశమని ప్రసిద్ధి. అందుచేతనే తక్కిన ద్రావిడ జాతులతో బాటు మహారాష్ట్రులు, ఘూర్జరులు కూడా పంచద్రావిడులలో చేరినారు.రానురాను బౌద్ధ ధర్మము ఉత్తర హిందూస్థానములో క్షీణించింది. ఔత్తరాహుల దృష్టిలో దాక్షిణాత్వమే ధర్మ ప్రతిష్ఠిగన్న దేశమైనది. కాబట్టి వారు దాక్షిణాత్యుల నందరినీ ధర్మిళులు అని పిలువసాగినారు. ఆమాటే ధ్రమిళ, ద్రమిళ అను ప్రాకృతమున రూపమును పొందినది. ఇట్లేర్పడిన ద్రమిళ శబ్దము రానురాను ధర్మము ప్రచారములో నుండిన దేశానికిను, ధర్మమును అనుసరించే ప్రజలుకు అంవయింపజొచ్చింది. ఇది జరగడము క్రీ.శ. 5 లేదా 6 శతాబ్దముల కీవలనే కాని అంతకుముందు కాదు. వైదిక వాజ్మయములో ద్రవిడ, ద్రమిళ, శబ్దములు లేనే లేవు. భాగవతము పురాణములో ద్రమిళ దేశముదహరింపబడింది. ఆపురాణము ఇటీవలదని కొందరి అభిప్రాయము.

ద్రవిడ భాషా కుటుంబాలు, జాబితా

[మార్చు]

ద్రావిడ బాషాకుటుంబాన్ని మూడు వర్గాలుగా విడగొట్టారు.

ద్రవిడ భాషల అభివృద్ధి క్రమం.

భారత దేశ జాతీయ భాషలు బొద్దు అచ్చులో:

  1. దక్షిణ ద్రావిడ భాషా కుటుంబం
  2. దక్షిణ మధ్య ద్రావిడ భాషాకుటుంబం
  3. మధ్య ద్రావిడ భాషా కుటుంబం
  4. ఉత్తర ద్రావిడ భాషా కుటుంబం

దక్షిణ

[మార్చు]

మధ్య ద్రావిడ భాషలు

[మార్చు]

మధ్య

[మార్చు]

ఉత్తర

[మార్చు]

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]