అక్షాంశ రేఖాంశాలు: 25°46′N 73°20′E / 25.77°N 73.33°E / 25.77; 73.33

పాలీ (రాజస్థాన్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాలీ
పాలీ , మార్వారీ
పాలీ is located in Rajasthan
పాలీ
పాలీ
పాలీ is located in India
పాలీ
పాలీ
Coordinates: 25°46′N 73°20′E / 25.77°N 73.33°E / 25.77; 73.33
దేశం భారతదేశం
రాష్ట్రంరాజస్థాన్
జిల్లాపాలీ
Government
 • చైర్‌పర్సన్ , మునిసిపల్ కౌన్సిల్శ్రీమతి రేఖా భాటీ
విస్తీర్ణం
 • మెట్రోపాలిటిన్153 కి.మీ2 (59 చ. మై)
జనాభా
 (2011)
 • మెట్రోపాలిటిన్2,29,956
 • జనసాంద్రత1,500/కి.మీ2 (3,900/చ. మై.)
 • Metro
2,86,214
భాషలు
 • అధికారికహిందీ , మార్వారీ , గోద్వారి
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్‌కోడ్
306401
ప్రాంతీయ ఫోన్‌కోడ్02932
ISO 3166 codeRJ-IN
Vehicle registrationRJ-22
లింగ నిష్పత్తి(పురుషులు) 1000:916 (స్త్రీలు)

పాలీ, భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఒక నగరం. ఇది పాలీ జిల్లాకు ప్రధాన పరిపాలనా కేంద్రం. పాలి పట్టణం మార్వార్ ప్రాంతంలో, బండి నది ఒడ్డున ఉంది. జోధ్పూర్కు ఆగ్నేయంగా 70 కి.మీ. దూరంలో ఉంది.దీనిని "ది ఇండస్ట్రియల్ సిటీ" అని అంటారు.

చరిత్ర

[మార్చు]

పూర్వం దీనిని పల్లికా పల్లి అని పిలిచారు.ఇది ఒక వాణిజ్య కేంద్రం.సా.శ.11 వ శతాబ్దంలో పాలిని మేవార్ గుహిలాస్ అనే అతను పాలించాడు. 12 వ శతాబ్దంలో ఇది నాడోల్ రాజ్యంలో భాగమైంది. దీనిని చౌహాన్లు పాలించారు. దీనిని సా.శ.1153లో సోలంకిలు, చాళుక్య రాజవంశానికి చెందిన కుమారపాల, అతని పాలేగాడుగా ఉండే వహదాదేవ పాలించారు. ఆకాలంలో ఇది జలోర్ చెందిన సాంగారా చౌహాన్లు ఆధీనంలోకి వచ్చింది.

16, 17 వ శతాబ్దాలలో పాలీ పరిసర ప్రాంతాలలో అనేక యుద్ధాలు జరిగాయి.గినీ యుద్ధంలో షెర్షా సూరిని రాజ్‌పుత్ పాలకులు ఓడించారు. మొఘల్ చక్రవర్తి అక్బర్ సైన్యం గాద్వాడ్ ప్రాంతంలో మహారాణా ప్రతాప్‌తో నిరంతరం యుద్ధాలు జరిపింది. మొఘలులు దాదాపు అన్ని రాజ్‌పుతానాను జయించిన తరువాత, మార్వార్‌కు చెందిన వీర్ దుర్గా దాస్ రాథోడ్ చివరి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు నుండి మార్వార్ ప్రాంతాన్ని విమోచించడానికి వ్యవస్థీకృత ప్రయత్నాలు చేశాడు. అప్పటికి పాలీ నగరం మార్వార్ రాష్ట్రంలోని రాథోర్స్‌కు స్వాధీనమైంది. పాలిని మహారాజా విజయ్ సింగ్ తిరిగి పునరావాసం కల్పించాడు.తరువాత ఇది ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా మారింది.

స్వేచ్ఛ కోసం పోరాటంలో పాత్ర

[మార్చు]

బ్రిటీష్ పాలనలో మార్వార్‌లో స్వాతంత్ర్య సంగ్రామానికి మార్గదర్శకత్వం వహించడం ద్వారా పాలి ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. అన్నింటికన్నా అత్యంత శక్తివంతమైన ఓవాకు చెందిన ఠాకూర్ నాయకత్వంలో పాలీకి చెందిన వివిధ ఠాకూర్లు బ్రిటిష్ పాలనను ఎదుర్కొన్నారు. ఆవా కోటను బ్రిటిష్ సైన్యం చుట్టుముట్టింది. తరువాత ఘర్షణలు 5 రోజులుపాటు కొనసాగాయి.చివరికి ఈ కోటను బ్రిటిష్ సైన్యం స్వాధీనం చేసుకుంది.దాని ఫలితంగా ఆవా ఈ వీరోచిత చర్య, స్వేచ్ఛ కోసం నిరంతర, వ్యవస్థీకృత పోరాటానికి మార్గం సుగమం అయింది.

భౌగోళికం

[మార్చు]

పాలి నగరం 25°46′N 73°20′E / 25.77°N 73.33°E / 25.77; 73.33 వద్ద ఉంది.[1] ఇది 214 మీటర్లు (702 అడుగులు) సగటు ఎత్తులో ఉంది.

పాలీ నగరంలో మతాలు వారిగా
మతాలు శాతం
హిందూ
  
75.59%
ముస్లిం
  
18.79%

జనాభా

[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం పాలీ నగరం జనాభా మొత్తం 229,956.[2] అందులో పురుషులు 52.2% మంది ఉండగా, స్త్రీలు 47.8%మంది ఉన్నారు.నగర సగటు అక్షరాస్యత 68.2%గా ఉంది.ఇది జాతీయ సగటు అక్షరాస్యత 74.04% కన్నా తక్కువగా ఉంది.పురుషుల అక్షరాస్యత 77.24% ఉండగా, స్త్రీల అక్షరాస్యత 59% ఉంది. పాలీ నగరం జనాభా మొత్తంలో 6 సంవత్సరాలలోపు వయస్సుగల జనాభా 13% మంది ఉన్నారు.

దర్శించతగ్గ ప్రదేశాలు

[మార్చు]

శ్రీ నవలక పార్శ్వనాథ్ జైన దేవాలయం

[మార్చు]

ఇది ప్రధాన నగరంలో ఉంది.దీనిని నవలఖా ఆలయం అని పిలుస్తారు. ఈ ఆలయానికి చెందిన మూల్నాయక్ పద్మసనా భంగిమలో నవలఖా పార్శ్వనాథ్ తెల్లని పాలరాతి విగ్రహం కలిగి ఉంది.[3] ఈ ఆలయం జైన మతానికి చెందిన శ్వేతాంబర్ శాఖకు చెందింది.[4] ధర్మశాల, భోజన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

చారిత్రక సోమనాథ్ మందిరం

[మార్చు]

ఇది చారిత్రక నేపథ్యం కలిగిన ఆలయం.ఆలయంలోని శిల్పకళకు పేరు పొందింది.ఈ శివాలయం నగరం మధ్యలో ఉంది.దీనిని చాళుక్య పాలకుడు కుమారపాల నిర్మించాడు.సోమనాథ్ ఆలయానికి సమీపంలో శ్రీమాలియన్ కా బాస్ ఆలయం ఉంది. ఇది మహారాణా ప్రతాప్ చేత తయారు నిర్మించబడింది.

మహారాణా ప్రతాప్ స్మారక్

[మార్చు]

ఇది సోమనాథ్ ఆలయానికి సమీపంలో ఉన్న మహారాణా ప్రతాప్ జన్మస్థలం

బంగూర్ ప్రదర్శనశాల

[మార్చు]

ఇది పాత బస్ స్టాండ్ వద్ద పాలీ నగరంలో ఉంది.పాలీ-బంగూర్ హాస్పిటల్, బంగూర్ ధర్మశాలలోని ఇతర భవనాల మాదిరిగా మిస్టర్ బంగూర్ పేరు పెట్టారు. రాజస్థానీ సంస్కృతిపై ఆసక్తి ఉన్న పర్యాటకులను ఆకర్షించడానికి దుస్తులు, నాణేలు, చేతులు మొదలైన అనేక పాత చారిత్రక, కళాత్మక వస్తువులను ఇక్కడ ఉంచారు.

లఖోటియా గార్డెన్

[మార్చు]

ఇది పాలీ నగరం నడిబొడ్డున ఉంది. దాని చుట్టూ చెరువు ఉంది.శివుని ఒక అందమైన, చాలా పాత ఆలయం తోట మధ్యలో ఉంది.

హేమావాస్ ఆనకట్ట

[మార్చు]

ఇది పాలీ నుండి 10 కి.మీ.దూరంలో ఉంది. మన్పురా భక్రీ హేమావాస్ ఆనకట్ట సమీపంలో ఉన్న ఒక పర్వతం.ఇందులో దుర్గా మాతా ఆలయం, జబ్రేశ్వర్ మహాదేవ్ ఆలయం, జైన దేవాలయం ఉన్నాయి. పాలీ నగరంలో ఎక్కడి నుండైనా భక్రి ఆలయాన్ని చూడవచ్చు.

పరిశ్రమలు

[మార్చు]

వస్త్ర పరిశ్రమ

[మార్చు]

పాలీ వస్త్ర పరిశ్రమలకు పేరు గడించింది.సింథటిక్, నూలు బట్టలు భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు పాలీ నగరం నుండి చాలా తక్కువ ధరకు ఎగుమతి జరుగుతుంది. బ్యాంగిల్స్, మార్బుల్ కటింగ్, మార్బుల్ ఫినిషింగ్ మొదలైన కొన్ని కొత్త పరిశ్రమలు నగర పరిసర ప్రాంతాలలో ఉన్నాయి.ఇక్కడ మహారాజా శ్రీ ఉమైద్ మిల్స్ అనే కాటన్ మిల్లు ఉంది. ఇది రాజస్థాన్ రాష్ట్రంలో అతిపెద్ద నూలు మిల్లుగా పేరు గడించింది.ఇందులో 3000 మంది కార్మికులు పనిచేస్తున్నారు.

పారిశ్రామిక ప్రాంతాలు

[మార్చు]

పాలీలో 3 పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నాయి. మాండియా రోడ్ ఇండస్ట్రియల్ ఏరియా, ఇండస్ట్రియల్ ఏరియా ఫేజ్ 1, 2, పునాయట ఇండస్ట్రియల్ ఏరియా.మాండియా రహదారి పారిశ్రామిక ప్రాంతం అన్నింటికన్నా పెద్దది, పురాతనమైంది.

మూలాలు

[మార్చు]
  1. Falling Rain Genomics, Inc - Pali
  2. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
  3. http://www.jinalaya.com/rajasthan/pali.htm
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-02-24. Retrieved 2021-02-08.

బాహ్య లింకులు

[మార్చు]