Jump to content

మల్లేపల్లి (ఆసిఫ్‌నగర్ మండలం)

అక్షాంశ రేఖాంశాలు: 17°23′21″N 78°27′32″E / 17.3893°N 78.4589°E / 17.3893; 78.4589
వికీపీడియా నుండి
మల్లేపల్లి
సమీపప్రాంతం
మల్లేపల్లి is located in Telangana
మల్లేపల్లి
మల్లేపల్లి
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
Coordinates: 17°23′21″N 78°27′32″E / 17.3893°N 78.4589°E / 17.3893; 78.4589
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500001
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంనాంపల్లి శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

మల్లేపల్లి, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఆసిఫ్ నగర్ సమీపంలో ఉన్న ప్రాంతం. నిజాం కాలంలో హైదరాబాదు చరిత్రలో ఉన్న పురాతన ప్రాంతాలలో ఇదీ ఒకటి.

ఉప ప్రాంతాలు

[మార్చు]

ఇక్కడ విజయనగర్ కాలనీ, ఆఘాపురా కాలనీ, బజార్ ఘాట్ కాలనీ, సీతారాంబాగ్, బాడీ మసీదు, తబ్లీఘీ జమాత్ మసీదు (నిజాం శకం), గ్లోరీ సినిమా టాకీస్ (1935 గతంలో జియా, షామ్ టాకీస్ అని పిలుస్తారు), ఎస్బిహెచ్ బ్రాంచ్ (1973), హౌసింగ్ బోర్డ్ కాలనీ (1956) మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[1][2]

చరిత్ర

[మార్చు]

ఐదవ అసఫ్ జాహి పాలకుడు - అఫ్జల్ ఉద్ దౌలా అఫ్జల్ సాగర్ ట్యాంక్ పక్కన ఈ ప్రాంతాన్ని నిర్మించారు. 19వ శతాబ్దం ప్రారంభంలో ఈ ప్రదేశంలో మలే ప్రజలు ఉండేవారు. దాంతో ఈ ప్రాంతానికి మల్లేపల్లి అని పేరు వచ్చింది.

20వ శతాబ్దం ప్రారంభంలో, హైదరాబాదులోని మూసీ నదికి వరదలు వచ్చాయి. ఆ వరదలు ప్లేగు వ్యాధికి దారితీసాయి. అప్పుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అసఫ్ జా VII, తన మంత్రులతో కలిసి నగరంలో పారిశుధ్యం, పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు సమగ్ర ప్రణాళికలను రూపొందించాడు.[3]

రవాణా

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో మల్లేపల్లి నుండి లక్డికాపూల్, టోలీచౌకీ, సికింద్రాబాద్, మెహదీపట్నం, బాపు ఘాట్ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[4] ఇక్కడికి సమీపంలో నాంపల్లి, లక్డికాపూల్ ప్రాంతాలలో ఎంఎంటిస్ రైలు స్టేషన్లు ఉన్నాయి.

ఇతర వివరాలు

[మార్చు]

ఇక్కడినుండి చాలామంది పెర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో పనిచేయడానికి వెళ్ళారు. ఇక్కడ రుచికరమైన అరేబియన్ వంటకాలు లభిస్తాయి, షవర్మా కేంద్రాలు ఉన్నాయి.[5][6]

ఇక్కడ ప్రియా సినిమా థియేటర్ కూడా ఉంది.[7]

వ్యక్తులు

[మార్చు]

సమీప ప్రాంతాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Mallepally Planned locality gone awry". The Hans India. 2015-08-05. Retrieved 2021-02-05.
  2. Aneez, Zeenab (2014-02-03). "Ward of words". The Hindu. ISSN 0971-751X. Retrieved 2019-01-31.
  3. Luther, Narendra. Hyderabad : a biography. ISBN 9780198090274. OCLC 963760325.
  4. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-02-05.
  5. "Moving on from Arab streets, humble Shawarma is a rage across south India". english.alarabiya.net. Retrieved 2021-02-05.
  6. "Hyderabad develops a taste for middle east food". Deccan Chronicle. 2015-12-06. Retrieved 2021-02-05.
  7. "Priya Theater 70MM - Mallepally North in Hyderabad Show Times | eTimes". m.timesofindia.com. Retrieved 2021-02-05.