మాదాపూర్
మాదాపూర్, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలంలోని గ్రామం.[1]
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
[మార్చు]2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]
ఐటీకి కేరాఫ్ అడ్రస్ మాదాపూర్. హైటెక్ సిటీతో పాటు పేరెన్నికగన్న ఐటీ కంపెనీలు, స్టార్‌హోటల్స్, హాస్పిటల్స్‌లు ఎన్నో మాదాపూర్‌లో ఉన్నాయి. ఐటీ, బీపీఓ హబ్‌గా ఉంది.రియాల్టీ ఇండస్ట్రీకి కనకవర్షం కురిపిస్తోంది. మన రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి నిలయమైన సైబర్ టవర్స్ మాదాపూర్‌కే తలమానికం. అంతర్జాతీయ సదస్సులకు వేదికైన హైటెక్స్ మాదాపూర్‌కు గుండెకాయలాంటిది. కళానైపుణ్యాలను మెరుగుదిద్దే శిల్పకళావేదికా ఈ ప్రాంతంలోనే ఉంది. ఐటీ, బీపీఓ దిగ్గజాలైన టీసీఎస్, మహీంద్రాసత్యం, పట్నీకంప్యూటర్స్, గూగుల్ ఇండియా, విప్రో, ఎసెంచర్, ఇన్ఫోటెక్, వ్యాల్యూ ల్యాబ్స్ కంపెనీలు మాదాపూర్ తలరాతనే మార్చేశాయి. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో ఆసియాలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ప్రాంతంగా మాదాపూర్‌ను చెప్పొచ్చు.
1990కి ముందు ఓ కుగ్రామంగా ఉన్న మాదాపూర్ అంటే రాళ్ళూరప్పలూ,జనసంచారం లేక పిచ్చిమొక్కలు పెరగడంతో ఈ ప్రాంతం ఒక అటవీ ప్రాంతంగా తలపించేది. కనీస మౌలిక సదుపాయాలు కూడా లేకపోవడంతో ఈ ప్రాంతంలో ఉండేందుకు జనం జంకేవారు. దీంతో ఓల్డ్ ముంబాయి హైవే పక్కనే ఉన్నప్పటికీ... మాదాపూర్‌కు డిమాండ్ అంతంత మాత్రమే.. అయితే హైటెక్ సిటీ రాకతో గత రెండు దశాబ్దాల్లో వేగంగా అభివృద్ధి చెంది మాదాపూర్ పరిస్థితిని ఒక్కసారిగా మార్చేసింది. అంతకుముందు 20 వేల రూపాయలు కూడా పలకని ఎకరం భూమి... ప్రస్తుతం కోట్ల రూపాయలు పలుకుతోంది.
ఐటీ రంగం ఈ ప్రాంతంలో ఎంత వేగంగా విస్తరించిందో అంతకు ఎన్నోరెట్లు రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి చెందింది. మౌలిక సదుపాయాలు ఒక్కసారిగా మెరుగవ్వడం, ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్స్, హోటల్స్, ఐటీ కంపెనీస్ ఇలా ఒక్కటేమిటి... ప్రతి ఒక్క రంగం చూపు మాదాపూర్‌పైనే పడింది. ఎన్ని కోట్ల రూపాయలైనే గుమ్మరించి... ఇక్కడ స్థలం కొనుక్కోవడానికి అనేక సంస్థలు ఆసక్తిచూపుతున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో రిటైల్ భూమ్ ఒక్కసారిగా పెరిగింది.
దేశవ్యాప్తంగా రియాల్టీ రంగం నెమ్మదించినప్పటికీ... నా రూటే సెపరేట్ అన్నట్టుగా ఉంది మాదాపూర్ పరిస్థితి. డిమాండ్ అధికంగా ఉండటంతో రియాల్టీ స్లో డౌన్ మంత్రం మాదాపూర్‌పై పనిచేయలేదు సరికదా డిమాండ్‌ను మరింత పెంచింది. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వెంచర్స్‌లో ప్లాట్స్ హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. ఈ ప్రాంతంలో స్క్వేర్ ఫీట్ 2 వేల 8 వందల నుంచి 4 వేల రూపాయలు పలుకుతోంది. పేరెన్నిక గన్న ఐటీ సంస్థలు రాంకీ, అపర్ణ, ఏలియన్స్, ల్యాంకోలు ఈ ప్రాంతంలో అతిపెద్ద ప్రాజెక్ట్‌లను, విలాసవంతమైన గృహాలను నిర్మిస్తున్నాయి. నిర్మాణం సమయంలోనే ఈ ప్రాజెక్ట్‌లోని మెజార్టీ ప్లాట్స్ బుక్ అవుతున్నాయి.
ప్రజా రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉండటంతో మాదాపూర్‌కు డిమాండ్ అధికంగా ఉంది. ఎంఎంటీసీ ట్రైన్స్ అందుబాటులో ఉండటం... తాజాగా మైట్రోరైల్ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉండటంతో ట్రాన్స్‌పోర్ట్, ఇన్‌ఫ్రా రంగం ఎంతో పటిష్ఠంగా ఉంది. అలాగే ఇన్నర్, ఔటర్ రోడ్లు డెవలప్ కావడంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య చాలా తక్కువగా ఉంది. దీంతో ఎక్కువ మంది ఈ ప్రాంతంలో ప్లాట్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
రవాణా
[మార్చు]ఎర్రగడ్డ నుండి నగరంలోని అన్ని ప్రాంతాలకు వివిధ వాహనాల రవాణా సదుపాయం ఉంది. ఇక్కడ మాదాపూర్ మెట్రో స్టేషను కూడా ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2018-04-07.
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-01.