రి-భోయ్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రి-భోయ్ జిల్లా
రి-భోయ్
మేఘాలయ పటంలో రి-భోయ్ జిల్లా స్థానం
మేఘాలయ పటంలో రి-భోయ్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమేఘాలయ
ముఖ్య పట్టణంనోంగ్‌పొ
Government
 • శాసనసభ నియోజకవర్గాలు7
విస్తీర్ణం
 • మొత్తం2,378 కి.మీ2 (918 చ. మై)
జనాభా
 (2001)
 • మొత్తం1,92,795
 • జనసాంద్రత81/కి.మీ2 (210/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత51%
ప్రధాన రహదార్లు40వ జాతీయ రహదారి
Websiteఅధికారిక జాలస్థలి

రి-భోయ్ జిల్లా, మేఘాలయ రాష్ట్ర జిల్లా. జిల్లావైశాల్యం 2,378 జిల్లా ప్రధానకార్యాలయాలు నోంగ్‌పొ వద్ద ఉన్నాయి. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 192,795 2011 గణాంకాలను అనుసరించి మేఘాలయ రాష్ట్ర జిల్లాలలో పశ్చిమ గారో హిల్స్ జిల్లా తరువాత అత్యల్ప జనసాంధ్రత కలిగిన జిల్లాగా గురించబడింది.[1]

చరిత్ర

[మార్చు]

తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా లో ఉపవిభాగంగా ఉన్న రి-భోయి 1992 జూన్ 4 నుండి పూర్తిస్థాయి జిల్లాగా మార్చబడింది.

భౌగోళికం

[మార్చు]

రి-భోయి జిల్లా 90°55’15 నుండి 91°16’ అక్షాంశ, రేఖాంశాల మద్య ఉపస్థితమై ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో కామరూప్ జిల్లా, తూర్పు సరిహద్దులో జెంతీ హిల్స్ జిల్లా, అస్సాం రాష్ట్రానికి చెందిన కర్బి ఆంగ్లాంగ్ జిల్లా, పడమర సరిహద్దులో పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లా ఉన్నాయి. పథర్‌ఖ్మా వద్ద సి, డీ బ్లాకులు ఒక అడ్మింస్టేట్ యూనిట్ ఉన్నాయి. జిల్లాలోని గ్రామాల సంఖ్య 561. రి-భోయి జిల్లా వైశాల్యం 2,448 చ.కి.మీ. రాష్ట్ర రాజధానికి షిల్లాంగ్కు 53 కి.మీల దూరంలో ఉంది. జిల్లా భౌగోళికంగా కఠిననశిలామయమై క్రమపద్ధతిలో లేని ఎగుడు దిగుడు మైదానాలతో నిండి ఉంటుంది. ఉత్తరదిశగా ఏటవాలుగా సాగుతున్న భూభాగం క్రమంగా బ్రహ్మపుత్ర నదీ లోయలతో కలిసి పోతుంది. జిల్లాలో ప్రవహిస్తున్న నదులలో ముఖ్యమైనవి ఉంత్రూ, ఉంసియాంగ్, ఉంరన్, ఉమియం ముఖ్యమైనవి. జిల్లా ప్రధాన కార్యాలయం "నోంగ్‌పొ"లో ఉంది.

ఆర్ధికం

[మార్చు]

2006లో పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో రి-భోయి జిల్లా ఒకటి అని గుర్తిచింది.[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న 3 మేఘాలయ రాష్ట్రజిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[2]

విభాగాలు

[మార్చు]

నిర్వహణా విభాగాలు

[మార్చు]

రి-భోయి జిల్లా 3 బ్లాకులుగా విభజించబడింది.[3]

పేరు ప్రధానకార్యాలయం జనసంఖ్య ప్రాంతం
జిరంగ్ వసినూన్
ఉమ్లింగ్ నాంగ్పొ
ఉంస్నింగ్ ఉంస్నింగ్

ప్రయాణవసతులు

[మార్చు]

రి-భోయ్ జిల్లా రవాణా, సమాచార వసతులు తక్కువగా ఉన్నాయి. జోరాబాదు నుండి షిల్లాంగ్ వరకు సాగే జాతీయరహదారి 37 ఈ జిల్లాగుండా సాగిపోతూ ఉంది.

గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య .. 258,380,[1]
ఇది దాదాపు... [4]
అమెరికాలోని జనసంఖ్యకు
640 భారతదేశ జిల్లాలలో 580 వస్థానంలో ఉంది [1]
1చ.కి.మీ జనసాంద్రత 109 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం 34.02%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి 951 : 1000 [1]
జాతియ సరాసరి (928) కంటే అధికం
అక్షరాస్యత శాతం 77.22%.[1]
జాతియ సరాసరి (72%) కంటే అధికం

భాషలు

[మార్చు]

రి-భోయి జిల్లాలో అత్యధికులకు తెలిసిన భాష భోయీ భాష. జిల్లాలో కర్యూ భాష ప్రధానమైనదిగా భావించబడుతుంది. అంతే కాక జిల్లాలో అమ్రి, టిబెటో-బర్మన్ భాషలను 1,25,000 మంది ప్రజలు మాట్లాడుతున్నారు.[5]

వృక్షజాలం, జంతుజాలం

[మార్చు]

1981లో రి-భోయి జిల్లా " నాంగ్‌ఖిల్లెం " వన్యమృగ అభయారణ్యానికి " పుట్టినిల్లైంది. జిల్లా వైశాల్యం 29చ.కి.మీ.[6]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  3. Meghalaya Administrative Divisions (PDF) (Map) (in English). The Registrar General & Census Commissioner, India, New Delhi, Ministry of Home Affairs, Government of India. 2011. Retrieved 2011-09-29.{{cite map}}: CS1 maint: unrecognized language (link)
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Vanuatu 224,564 July 2011 est.
  5. M. Paul Lewis, ed. (2009). "Amri Karbi: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
  6. Indian Ministry of Forests and Environment. "Protected areas: Meghalaya". Archived from the original on 2011-08-23. Retrieved September 25, 2011.

వెలుపలి లింకులు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]