Jump to content

వికీపీడియా:వాడుకరులకు సూచనలు

వికీపీడియా నుండి

వికీపీడియాలో రచనలు చేసే వాడుకరులకు ఉపయోగకరమైన సూచనలు, సహాయం, వికీ సాంకేతిక విశేషాలు, కొత్తగా వెలుగు లోకి వచ్చిన విశేషాలు మొదలైన వాటిని ఈ పేజీలో చూడవచ్చు. ఆయా విశేషాలను ఈ పేజీలో నేరుగా రాయవచ్చు. లేదా [[వికీపీడియా:వాడుకరులకు సూచనలు/<కొత్త విశేషం>]] అనే పేరుతో ఒక ఉప పేజీని సృష్టించి ఆ పేజీని ఇక్కడ {{వికీపీడియా:వాడుకరులకు సూచనలు/<కొత్త విశేషం>}} అని ట్రాన్స్‌క్లూడు చెయ్యవచ్చు. తదనంతరం కొన్నాళ్ళ తరువాత ఈ కొత్త విషయాన్ని ఈసరికే ఉన్న వికీపీడియా, సహాయం పేరుబరుల్లోని సంబంధిత పేజీల్లో కూడా చేర్చాలి. తద్వారా ఆయా పేజీలు కూడా తాజా విశేషాలను చూపిస్తాయి.

ఈ పేజీలో రాసిన విశేషాలన్నీ చెప్పినట్లుగా పనిచెయ్యాలంటే కింది నిబంధనలు పాటించాలి:

  1. మొబైల్ ద్వారా దిద్దుబాట్లు చేయాలనుకొంటే మొదట మొబైల్ వీక్షణ నుండి డెస్క్‌టాప్ వీక్షణకు మారాలి
  2. దిద్దుబాట్లు చేసేందుకు విజువల్ ఎడిటరును వాడాలి.


అనువాదంలో మానవిక అనువాద శాతం

[మార్చు]

అనువాద పరికరం ద్వారా చేసే అనువాదంలో మానవిక శాతమెంత, యాంత్రికానువాద శాతమెంత అని తెలుసుకునేందుకు కింది లింకును వాడవచ్చు.

అనువాద పరికరంలో అనువాదం చేస్తూంటే పై పేజీ ఎప్పటికప్పుడు తాజా అవుతూ అనువాద శాతాలను చూపిస్తూ ఉంటుంది.

మరిన్ని వివరాలు:

--> పైన చూపిన url కు వెళ్తే అక్కడ కింది తెరపట్టులో చూపిన ఫారం కనిపిస్తుంది.
--> ఈ ఫారములో Source language వద్ద en అని ఇవ్వాలి (english అని పూర్తిగా ఇవ్వరాదు). Target language వద్ద te అనీ (telugu అని పూర్తిగా ఇవ్వరాదు), Source title వద్ద ఇంగ్లీషు వ్యాసం పేరునూ కింద చూపిన విధంగా ఇచ్చి, Find బొత్తాన్నినొక్కాలి. కింది తెరపట్టు చూడండి
--> అప్పుడు కింద చూపిన విధంగా ఫలితం వస్తుంది.
--> పై తెరపట్టులో అడుగున ఉన్న Progress లైనులో మనకు అవసరమైన సమాచారాన్ని కనిపిస్తుంది. any అంటే ఇంగ్లీషు వ్యాసాంలో మనం అనువదించిన భాగం (పై తెరపట్టులో 0.8446. అంటే 84.46%), mt అంటే అనువదించిన దానిలో యాంత్రికానువాద భాగం (పై తెరపట్టులో 0.5565. అంటే 55.65%), human అంటే అనువదించిన దానిలో మానవిక అనువాద భాగం (పై తెరపట్టులో 0.4434. అంటే 44.34%).
ఇక పై పేజీ లోని మిగతా అంశాలు కూడా ఆసక్తికరంగానే ఉంటాయి, పరిశీలించండి.

మూస "పేరు", మూస "పేజీ పేరు" ఒకటే ఉండాలి

[మార్చు]

వికీలో ఏదైనా మూసను గమనిస్తే దాని పైనున్న పట్టీలో ఎడమ చివర v t e మూడు అక్షరాలను చూడొచ్చు - పక్కనున్న బొమ్మలో లాగా. అందులో v ని నొక్కితే మూస పేజీని తెరిచి చూడవచ్చు, t ని నొక్కితే దాని చర్చ పేజీ తెరుచుకుంటుంది. e ని నొక్కితే మూస దిద్దుబాటు పేజీ (ఎడిట్ పేజీ) తెరుచుకుంటుంది. ఈ మూడు లింకుల వలన ఉపయోగం ఏంటంటే..

మూసను ఏ పేజీలోనైతే ట్రాన్స్‌క్లూడు చేసారో ఆ పేజీనుంచే నేరుగా, ఈ లింకుల ద్వారా ఈ పేజీలను తెరవవచ్చు. లేదంటే, ఈ ట్రాన్స్‌క్లూడు చేసిన పేజీ దిద్దుబాటు పేజీని తెరచి, మూస "మార్పు" ను నొక్కి, అక్కడి నుండి మూస పేజీకి వెళ్ళాల్సి ఉంటుంది. ఉదాహరణకు విజయవాడ పేజీలో అడుగున, {{విజయవాడ పట్టణ మండలంలోని గ్రామాలు}} అనే మూస ఉంది. ఆ మూసను తెరవాలంటే దాని పట్టీలో ఉన్న v t e అనే లింకులను వాడవచ్చు.

అయితే ఈ v t e లింకులు పని చెయ్యాలంటే కింది కండిషను తప్పనిసరి:

మూసలో ఉండే name, మూస పేజీ పేరు - ఈ రెండూ ఒక్కటే అయి తీరాలి. కింది బొమ్మలు చూడండి:

మూస పేజీ పేరు: "చత్తీస్‌గఢ్ లోని జిల్లాలు", మూస లోని పేరు (name): "చత్తీస్‌గఢ్" - రెండూ వేరువేరు, కాబట్టి ఇక్కడ లింకులు పనిచెయ్యవు"
మూస పేజీ పేరు: "చత్తీస్‌గఢ్ లోని జిల్లాలు", మూస లోని పేరు (name): "చత్తీస్‌గఢ్ లోని జిల్లాలు" - రెండూ ఒకటే, కాబట్టి ఇక్కడ లింకులు పనిచేస్తాయి

ఏ మూసలోనైనా v t e లను నొక్కినపుడు (ముఖ్యంగా v e లు. ఎంచేతనంటే t పేజీని (చర్చ పేజీ) ఇంకా సృష్టించి ఉండకపోవచ్చు), పేజీ ఉనికిలో లేదు సృష్టించండి అని అన్నదీ అంటే దానర్థం.. పై లోపం ఉన్నట్టే. దీనికి పరిష్కారం: సదరు మూసలో name పరామితిని మార్చడమే.

వికీడేటా "వివరణ" వికీపీడియాలో

[మార్చు]

గమనిక: విజువల్ ఎడిటరుతో దిద్దుబాటు చేసేటపుడు మాత్రమే ఇది వర్తిస్తుంది

విజువల్ ఎడిటరుతో దిద్దుబాటు చేసేటపుడు, ఏదైనా లింకుపై నొక్కితే, కింద ఒక చిన్న పెట్టె తెరుచుకుంటుంది. అందులో ఆ లింకు ఏ పేజీకి లింకై ఉందో (గమ్యం పేజీ) చూపిస్తుంది. దాని కిందనే చిన్నపాటి వివరణ ఉంటుంది. బొమ్మ-1 చూడండి (కర్నూలు జిల్లా గూడూరు,కర్నూలు మండలం లోని గ్రామం). ఈ వివరణ వికీడేటా నుండి వస్తుంది. గమ్యం పేజీకి సంబంధించిన వికీడేటా అంశం లోని "వివరణ"ను ఇక్కడికి తెచ్చి చూపిస్తుంది.

కొన్ని సందర్భాల్లో వివరణ ఏమీ చూపించదు, రెండవ బొమ్మలో లాగా. అంటే దాని వికీడేటా పేజీలో "వివరణ" ఏమీ లేదన్నమాట.

కొన్ని సందర్భాల్లో అక్కడ వివరణ సరిగ్గా ఉండకపోవచ్చు, మూడవ బొమ్మలో లాగా (భారతదేశంలోని గ్రామం అనే వివరణ మరీ జనరిక్‌గా ఉంది).

బొమ్మ-1
బొమ్మ-2
బొమ్మ-3

వీటిని బట్టి మనం వికీడేటా లోని ఆ అంశానికి వెళ్ళి "వివరణ" రాయవచ్చు/సరిదిద్దవచ్చు. వికీడేటా పేజీకి వెళ్ళాలంటే గమ్యంపేజీలో నేవిగేషను పట్టిలో ఉన్న "వికీడేటా అంశం" అనే లింకు నొక్కితే చాలు.

గమనిక: ఈ విషయమై మరింత సమాచారం కోసం వికీపీడియా:వాడుకరులకు సూచనలు#పేజీ క్లుప్త వివరణ విభాగం చూడండి.

వికీసోర్సుకు లింకు ఇవ్వడం ఎలా

[మార్చు]

తెవికీ వ్యాసం పేజీ నుండి వికీసోర్సు లోని సంబంధిత పేజీకి లింకు చేసేందుకు {{Wikisourcelang}} అనే మూసను వాడాలి. తెవికీ వ్యాసం పేరు, వికీసోర్సు పేజీ పేరు - ఈ రెండూ ఒకటే అయితే {{Wikisourcelang}} అని రాసేస్తే సరిపోతుంది. ఒకవేళ అవి రెండూ వేరువేరు అయితే, {{Wikisourcelang|te|<వికీసోర్సు వ్యాసం పేరు>}} అని రాయాలి.

దీనికి బదులు తెలుగు వికీసోర్సుకు {{వికీసోర్స్}} అనే మూసను కూడా వాడవచ్చు

{{Wikisource}} అనే మూసతో తెలుగు వికీసోర్సుకు లింకు ఇవ్వడం కుదరదు, ఇంగ్లీషు వికీసోర్సుకు మాత్రమే లింకు ఇవ్వగలం.

-మరియు, -యొక్క తొలగింపుల విదానం

[మార్చు]

వికీపీడియాలో మరియు లు ఈ యొక్క లు వ్యాసం పేజీలో వాడకూడదు. వాటిని మూకుమ్మడిగా తొలగింపు ఎలా చేయాలి, లేదా ఒక పదాన్ని ఎలా తొలగించాలి. అనే అంశం తేలికైన ఒక పద్ధతి.

-మరియు, -యొక్క తొలగింపుల విదానం కొత్త వాడుకరులకు కాస్త తేలికైనది.

అనువాదం పరికరము ఉపయోగించి లేదా ఏ వ్యాసమైన... ముద్రించే ముందు కంట్రోల్ F, (Ctrl + F) గురించి:

మరియు లేదా యొక్క పక్కన మౌస్ తో ద్దిద్ది ఇప్పుడు కంట్రోల్ F, (Ctrl + F) నొక్కలి...

మరియు, లేక యొక్క లను మౌస్ లేక కీ బోర్డుతో ఎంపిక చేసి, కంట్రోల్ + F ఇప్పుడు నొక్కితే ఆ పేజీలో ఎన్ని మరియు లు ఉన్న లెక్కకట్టి మరి చెబుతోంది. మార్చు, అనే చోట నుండి ఒక్కటి తొలగించవచ్చును.అన్నిటినీ మార్చు ఉపయోగించి వాటిని అన్ని తొలగించవచ్చును.

అంతర్వికీ లింకులు

[మార్చు]

అంతర్వికీ లింకుల ప్రాముఖ్యత గురించి, అవి ఎలా ఇవ్వాలి అనే సంగతి గురించీ ఈ విభాగం చెబుతుంది.

వికీపీడియా పేజీలకు అంతర్వికీ లింకులు ఎందుకివ్వాలి

[మార్చు]

వికీపీడియా పేజీలకు అంతర్వికీ లింకులు చేరిస్తే కింది ప్రయోజనాలుంటాయి.

  1. తెలుగు వ్యాసం చదివిన పాఠకుడికి ఇంగ్లీషు లేదా ఇతర భాషల్లోని వ్యాసాలు కూడా చదివి అందులో మరింత సమాచారం ఉంటే తెలుసుకునే వీలు కలుగుతుంది.
  2. నేరుగా ఇంగ్లీషు/ఇతర భాషా వ్యాసానికి వెళ్ళిన తెలుగు పాఠకుడికి తెలుగు వ్యాసపు లింకు తెలిసిపోతుంది. ఇక్కడికి వచ్చి ఈ వ్యాసం చదవవచ్చు. అసలు తెలుగు వికీపీడియా అనేది ఒకటి ఉంది అనే సంగతి కూడా కొంత మందికి ఇలాగే తెలుస్తుంది.
  3. సాధారణంగా ఎన్వికీ పేజీకి వికీడేటాలో పేజీ ఉండే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎన్వికీ లింకు చేర్చగానే సంబంధిత వికీడేటా పేజీలో తెవికీ పేజీ లింకు ఆటోమాటిగా చేరిపోతుంది.
  4. అలా వికీడేటా లింకు ఉండని పేజీల కోసం వికీడేటాలో ఓ కొత్త పేజీని సృష్టిస్తారు. ఇది ఒక బాటు ద్వారా జరుగుతుంది. అంటే ఒకపేజీ ఈసరికే ఉన్నప్పటికీ, అవసరం లేని మరో పేజీ తయారౌతుందన్నమాట. అంతర్వికీ లింకిస్తే దీన్ని నివారించవచ్చు.

అంతర్వికీ లింకు ఇవ్వడం ఎలా

[మార్చు]
  • నేవిగేషను పట్టీలో "భాషలు" విభాగంలో ఉన్న "లంకెలను చేర్చండి" లింకును నొక్కండి.
  • అప్పుడూ కనబడే పట్టీలో భాషను ఎంచుకోండి (ఏ భాషకు చెందిన వికీపీడియా పేజీని లింకు చెయ్యదలచుకున్నారో ఆ భాషను ఎంచుకోండి.
  • ఆ భాషలో సంబంధిత పేజీని ఎంచుకోండి.
  • లింక్ విత్ పేజ్ అనే బొత్తాన్ని నొక్కండి.

అంతే. మీరు ఎంచుకున్న భాష లోని పేజీ మాత్రమే కాక దానికి లింకై ఉన్న భాషల పేజీలన్నీ లింకైపోతాయి.

పేజీని మెరుగుపరచే పనులు ఏమేమున్నాయి?

[మార్చు]

ఏదైనా వ్యాసంలో కొత్త సమాచారం చేర్చి, ఉన్న సమాచారాన్ని సవరించి వ్యాసానికి అభివృద్ధి చేస్తూ, మెరుగులు దిద్దుతూంటాం. ఈ పని చేస్తేనే వ్యాసాన్ని మెరుగుపరచినట్లు కాదు. ఇది కాకుండా ఇంకా అనేక విధాలుగా వ్యాసాన్ని మెరుగు పరచవచ్చు. పేజీకి సాధారణంగా ఉండే ఇతర హంగులను చేర్చడం, వాటిని సవరించడం వంటి పనులు చేసి పేజీకి మంచి విలువను చేకూర్చి, దాని నాణ్యతను గణనీయంగా పెంచవచ్చు. అలాంటి కొన్ని పనులు కింద ఉన్నాయి:

  1. పేజీలో నిర్వహణ మూసలు పెడుతూంటాం (అనాథ వ్యాసం, మొలక వ్యాసం, శుద్ధి చెయ్యండి, తొలగింపు మూస వగైరాల వంటివి). కొన్ని సందర్భాల్లో ఆయా నిర్వహణ పనులు జరిగిన తరువాత కూడా ఈ నోటీసులను తొలగించకపోవడం జరుగుతూంటుంది. (ఉదాహరణకు, 2020 లో నిర్వహించిన మొలకల విస్తరణ ఋతువు ప్రాజెక్టు కోసం సన్నాహాలు చేస్తున్నపుడు గమనించిన సంగతి చూడండి.. 600 పైచిలుకు వ్యాసాలు మొలక స్థితి దాటిపోయిన తరువాత కూడా ఆ పేజీల్లో గతంలో పెట్టిన "మొలక" మూసలు అలాగే ఉండిపోయాయి. అప్పుడు ఆ పేజీలన్నిటినుండి ఆ మూసను తీసేసాం) అలాంటివి ఏమైనా ఉన్నాయేమో పరిశీలించి, తీసెయ్యదగిన నోటీసులను తొలగించవచ్చు.
  2. అనాథ వ్యాసమా?: ఈ పేజీకి వేరే పేజీల నుండి లింకులు (ఇన్‌కమింగు లింకులు) ఏమైనా ఉన్నాయా లేదా? నేవిగేషను పట్టీ లో ఉన్న "ఇక్కడికి లింకున్న పేజీలు" అనే లింకును నొక్కి పేజీ అనాథో కాదో పరిశీలించండి. ఒక వేళ అనాథ అయితే సంబంధిత పేజీల నుండి సముచితమైన లింకులు ఇచ్చి దాన్ని అనాథ పేజీ స్థితి నుండి బయట పడెయ్యవచ్చు. ఈ పని ఎలా చెయ్యాలో తెలుసుకునేందుకు వికీపీడియా:వికీప్రాజెక్టు/అనాథాశ్రమం పేజీ చూడండి.
  3. అగాధ వ్యాసమా?: ఈ పేజీ నుండి ఇతర పేజీలకు కనీసం మూడైనా వికీలింకులు ఉన్నాయో లేదో చూడండి. లేకపోతే చేర్చండి.
  4. సముచితమైన వర్గాలున్నాయా?: చేర్చాల్సిన వర్గాలేమైనా ఉన్నాయా, ఉన్న వర్గాలు సముచితమైనవేనా అనేది చూసి తగు సవరణలు చెయ్యండి.
    1. వ్యక్తుల పేజీలకు జనన, మరణ వర్గాలు ప్రత్యేకం. అవి ఉన్నాయా లేదా చూడండి. అలాగే ఆయా సంవత్సరాలు, తేదీల పేజీల్లో వారి జనన, మరణాలు నమోదయ్యాయో లేదో చూసి తగు చర్యలు తీసుకోండి. మరిన్ని వివరాలకు వికీపీడియా:వికీప్రాజెక్టు/జనన మరణాల నమోదు ప్రాజెక్టు చూడండి.
    2. వ్యక్తుల పేజీలను వారి జనం, జీవించిన ప్రాంతాలను బట్టి భౌగోళిక వర్గాలుంటాయి. అకాగే వారి వృత్తి ప్రవృత్తులను బట్టి కూడా వర్గాలుంటాయి. వారి జాతిని బట్టి కూడా వర్గాలుంటాయి. వారి నివాసస్థితిని బట్టి కూడా వర్గాలుంటాయి. ఆయ వర్గాలున్నాయో లేదో చూసి సముచితమైన వర్గాలను చేర్చండి. ఈ విషయమై కొంత సమాచారం కోసం వికీపీడియా:వికీప్రాజెక్టు/వ్యక్తుల వర్గాల క్రమబద్ధీకరణ ప్రాజెక్టు చూడవచ్చు.
  5. అంతర్వికీ లింకులున్నాయా?: నేవిగేషను పట్టీలో ఉండే ఇతర భాషల వికీపీడియాల లింకులు ఉన్నాయా? ఒక్క లింకు ఉన్నా ఇక చూడనవసరం లేదు, వదిలెయ్యండి (చాలా సందర్భాల్లో వదిలెయ్యవచ్చు). అసలు ఒక్క లింకు కూడా లేనపుడు మాత్రమే తగు లింకులు ఇవ్వండి. మరిన్ని వివరాలకు అంతర్వికీ లింకులు చూడండి.
  6. సమాచార పెట్టె ఉందా?: చాలా వికీ పేజీలకు పైన కుడివైపున సమాచారపెట్టె ఉంటుంది. అది ఉండాలన్న రూలేమీ లేదు. కానీ చాలావాటికి ఉంటుంది. అది లేకపోతే సముచితమైన సమాచారపెట్టెను చేర్చండి. అందులో చేర్చాల్సిన సమాచారం వ్యాసం లోనే ఉంటుంది.
  7. సంబంధిత నేవిగేషను మూసలు ఉన్నాయా?: కొన్ని సందర్భాల్లో ఈ పేజీ విషయానికే చెందిన ఇతర పేజీలన్నిటికీ కలిపి ఒక మూసను తయారు చేస్తారు. ఈ మూసను సాధారణంగా పేజీ అడుగున చేరుస్తారు (కొన్ని సందర్భాల్లో పేజీలో కుడిపక్కన, సమాచారపెట్టెకు దిగువన, కూడా ఉండవచ్చు). ఉదాహరణకు మండలం లోని గ్రామాలు మూస, జిల్లా లోని మండలాల మూస వగైరాలు. వీటిని నేవిగేషను మూసలు అంటారు. అలాంటి మూసలేమీ లేకపోతే సముచితమైన మూస ఉంటే చేర్చండి.
  8. వికీడేటాలో సవరణలు: నేవిగేషను పట్టీలో "పరికరాల పెట్టె --> వికీడేటా అంశం" అనే లింకును నొక్కండి. అక్కడ అన్నిటికంటే పైన ఉన్న పెట్టెలో లేబులు, వివరణ (డిస్క్రిప్షన్) చేర్చండి.
  9. వ్యాసంలో సంబంధించిన బొమ్మ ఉందా?: వ్యాసంలో బొమ్మ లేకపోతే, సముచితమైన బొమ్మ కోసం తెవికీ లోను, కామన్స్ లోనూ వెతికి దాన్ని చేర్చండి. లేకపోతే మీరే సముచితమైన బొమ్మను ఎక్కించి, దాన్ని వ్యాసంలో చేర్చండి. ఒకవేళ ఈసరికే వ్యాసంలో బొమ్మ ఉంటే అది బాగానే, సముచితం గానే ఉంటే సరే, లేదంటే మెరుగైన బొమ్మను చేర్చండి.
  10. చాలా వ్యాసాల చర్చా పేజీల్లో "బొమ్మ చేర్చి ఈ పేజీని మెరుగు పరచండి" అంటూ ఒక నోటీసు పెట్టి ఉంటుంది. బొమ్మను చేర్చారు కాబట్టి ఇక ఆ నోటీసును తీసెయ్యండి. గతంలో బొమ్మను చేర్చాక కూడా ఈ నోటీసును తీసెయ్యని సందర్భాలు అనేకంగా ఉన్నాయి. అలాంటివి గమనిస్తే చర్చాపేజీలో ఉన్న ఈ నోటీసును తీసెయ్యండి.
  11. {{Authority control}} ఉందా?: వ్యక్తులు, సంస్థలు, పుస్తకాలు, ప్రదేశాలు వంటి చాలా వ్యాసాల్లో ఈ మూసను చేర్చే ఆస్కారం ఉంది. ఈ మూసను పేజీలో అడుగున చేర్చాలి. ఈ మూసను పేజీలో చేరిస్తే ఎలా కనబడుతుందో తెలుసుకునేందుకు ఉదాహరణగా టి. ఎన్. శేషన్ పేజీలో అడుగున చూడవచ్చు. ఆ వ్యక్తికి అలాంటి ఐడెంటిటీలు లేకపోతే, ఈ మూసను ఆ వ్యక్తి పేజీలో చేర్చినప్పటికీ ఏమీ కనబడదు. ఈసరికే చేర్చారా లేదా అనేది పేజీని దిద్దుబాటు మోడ్‌లో తెరిస్తే కనబడుతుంది. ఈసరికే చేర్చి ఉంటే వదిలెయ్యండి. లేదంటే చేర్చండి. మూస పేరును చేర్చితే చాలు, పరామితులేమీ ఇవ్వనక్కర్లేదు. అయితే నేవిగేషను పట్టీ లోని "వికీడేటా అంశం" లింకు తప్పనిసరిగా ఉండాలి. ఈ లింకు లేని పక్షంలో ఈ మూసకు పరామితులు ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇవేమీ లేకపోయినా ఉత్తమూసను పేజీలో చేర్చినప్పటికీ నష్టమేమీ లేదు. భవిష్యత్తులో వికీడేటా లింకు ఏర్పడినప్పుడు, అక్కడి పేజీలో ఐడెంటిటీ లక్షణాలను చేర్సితే ఇక్కడ ఈ మూస ఆటోమాటిగ్గా ఆ ఐడెంటిటీ లింకులను చూపిస్తుంది.
  12. మీకు ఆటోవికీబ్రౌజరు (AWB) వాడుకరి అనుమతి ఉంటే, అది తెరిచి, Pagelist లో ఈ పేజీని చేర్చి, options ట్యాబులో Regex typo fixing అనే అంశాన్ని ఎంచుకుని ఈ పేజీలో దిద్దుబాటు చెయ్యండి. అలా చేస్తే, వికీపీడియా:AutoWikiBrowser/Typos అనే పేజీలో చూపించిన భాషా, శైలి, వ్యాకరణ, తదితర దోషాలు ఈ పేజీలో ఉంటే AWB వాటిని సవరిస్తుంది.
  13. మూలాల్లో ఏమైనా దోషాలున్నాయేమో పరిశీలించి తగు సవరణలు చెయ్యండి. సాధారణంగా మూలాల్లో దోషాలుంటే మూలాల జాబితాలో కనిపిస్తాయి. వర్గాల జాబితాలో సంబంధిత దోషాల వర్గాలు కూడా కనిపిస్తాయి.
  14. పేజీ చదవండి, భాషాదోషాలు, శైలీ దోషాలూ ఏమైనా ఉంటే సవరించండి.
  15. పేజీని చదివాక, మంచి సమాచారం ఉంది, భలే ఉంది ఈ పేజీ అని మీకు అనిపిస్తే, దాని చర్చా పేజికి వెళ్ళండి. ఈ పేజీని గతంలో ఈ వారపు వ్యాసంగా పరిగణించారో లేదో చూడండి. అక్కడ ఆ సమాచారం ఏమీ లేకపోతే, దీన్ని ఈ వారపు వ్యాసంగా పరిగణించవచ్చని సూచిస్తూ {{subst:ఈ వారం వ్యాసంగా పరిగణించవచ్చు}} అని చేర్చండి. ఈ మూసను చర్చాపేజీలో మాత్రమే చేర్చాలి, వ్యాసం పేజీలో కాదు. ఈ సూచన చెయ్యకపోయినా ఈ పేజీ బాగుందని మీరు భావిస్తే ఓ మెచ్చుకోలు మాట రాయండి. ఆ పేజీలో పనిచేసిన వారు మీ వ్యాఖ్య చూస్తే సంతోష పడతారు. లేదు, వేరే ఏమైనా సూచనలుంటే అవి రాయండి.

పేజీ క్లుప్త వివరణ

[మార్చు]

ఈ విభాగం లోని సమాచారం #వికీడేటా "వివరణ" వికీపీడియాలో విభాగంలో ఇచ్చిన సమాచారానికి పైమెట్టు.

వికీపీడియా ప్రధానబరిలో ఉండే ప్రతి పేజీకీ, దాని పరిధిని వివరించేలా ఒక క్లుప్తమైన వివరణ ఉండాలి అనేది వికీమీడియా సంస్థ నిర్ణయం. ఆ వివరణ ఎలా రాయాలి, ఎలా దిద్దుబాటు చెయ్యాలి అనే సాంకేతిక విషయాలను వికీపీజీలకు చేర్చారు. ఈ అంశాన్ని కొత్తగా (సాపేక్షికంగా కొత్త అంశమిది) చేర్చారు కాబట్టి, పేజీలో క్లుప్త వివరణ చేర్చేవరకు, ఆ వివరణను వికీడేటా నుండి తెచ్చుకోవాలని నిశ్చయించి, వికీ సాఫ్టువేరులో దాన్ని అమలు చేసారు. అయితే దీన్ని భవిష్యత్తులో తొలగిస్తారు. ఆ లోగా తెవికీలో ప్రతి పేజీకీ ఒక వివరణను చేర్చుకోవాలి.

పేజీలోకి ఈ వివరణను ఎలా చేర్చాలి, ఎలా దిద్దుబాటు చేయ్యాలి, పేజీలో ఈ వివరణ ఎక్కడ కనిపిస్తుంది, అలా కనిపించాలంటే వాడుకరులు ఏమేం చెయ్యాలి, వగైరా విశేషాలను వికీపీడియా:పేజీ క్లుప్త వివరణ అనే పేజీలో చూడవచ్చు. ఈ క్లుప్త వివరణకు సంబంధించి చేసే మార్పుచేర్పుల వివరాలు వికీపీడియాలో "పేజీ చరిత్ర"లో గానీ, "ఇటీవలి మార్పులు"లో గానీ కనిపించవు. ఇవి వికీడేటాలో కనిపిస్తాయి.

  • మొబైలు యాప్‌ లోను, మొబైలు సైట్లోనూ ఈ క్లుప్తవివరణ, పేజీ శీర్షిక కిందనే కనిపిస్తుంది. ఇది కనబడాలంటే ప్రత్యేకంగా ఏమీ చెయ్యనక్కర్లేదు. డిఫాల్టుగా కనిపిస్తుందంతే.
  • డెస్కుటాపు బ్రౌజర్లలో కూడా ఇది పేజీ శీర్షిక కిందనే కనిపిస్తుంది. కానీ, ఇది డిఫాల్టుగా కనిపించదు. కనబడాలంటే కింది పని చెయ్యాలి:
    • మీ వాడుకరి పేజీకి అనుబంధంగా ఉన్న common.js‎‎ పేజీని తెరవండి. ఉదాహరణకు వాడుకరి:Chaduvari/common.js
    • ఆ పేజీలో అన్నిటి కంటే అడుగున కింది కోడ్‌ను చేర్చండి:

mw.loader.getScript( 'https://en.wikipedia.org/w/load.php?modules=ext.gadget.libSettings' ).then( function() { mw.loader.load( 'https://en.wikipedia.org/w/load.php?modules=ext.gadget.Shortdesc-helper' ); })‎‎

    • ఒకవేళ ఈ పేజీ ఈసరికే లేకపోతే ఇప్పుడు కొత్తగా పై కంటెంటుతో ఈ పేజీని సృష్టించండి.

భద్రపరచండి, అంతే! ఈ పని చెయ్యడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే, దీనిపై ఏదైనా సహాయం అవసరమైతే, ఇక్కడి చర్చాపేజీలో రాయండి.

common.js పేజీ ఎందుకు?

[మార్చు]

వికీపీడియాలో మనం మీడియావికీ సాఫ్టువేరును వాడుతున్నాం. మనం చూసే అన్ని ప్రధాన అంశాలు - ఇటీవలి మార్పులు, దిద్దుబాటు పెట్టె, రకరకాల పేరుబరులు,.. వగైరాలు - అన్నీ ఈ సాఫ్టువేరులో భాగమే. ఈ సాఫ్టువేరు వివిధ అంశాలను మనబోటి వాడుకరులకు డిఫాల్టుగా అందించడమే కాకుండా, కొత్త అంశాలను తయారు చేసి ఈ సాఫ్టువేరులో కలుపగలిగే సౌకర్యాన్ని కూడా కలిగిస్తోంది. సంబంధిత సాంకేతిక పరిజ్ఞానం ఉంటే మనమే తయారు చేసుకోవచ్చు కూడా. ఉదాహరణకు ట్వింకిల్, హాట్‌కేట్ వంటివి ఇలా తయారు చేసిన అదనపు సౌకర్యాలే. ఇవి నేరుగా మీడియావికీ సాఫ్టువేరులో భాగం కాదు. వివిధ వికీపీడియా వాడుకరులు తయారు చేసి వాటిని సాఫ్టువేరుకు అదనపు హంగులుగా చేర్చారు. ఇలాంటి అదనపు అంశాలను మీడియావికీ సాఫ్టువేరు డిఫాల్టుగా అందరికీ చూపించదు. ఈ సౌకర్యాలను వాడుకరులు వాడుకోవాలంటే కొన్ని పద్ధతులున్నాయి. వాటిలో ముఖ్యమైనవి రెండు:

  1. ఉపకరణాలు (గాడ్జెట్లు): వాడుకరులు తయారు చేసిన కొత్త అంశాలను గాడ్జెట్ల పేరుతో మీడియావికీ చేర్చుకుంటుంది. అయితే ఈ ఉపకరణాలు డిఫాల్టుగా అందరికీ అందుబాటులో ఉండవు. నా అభిరుచులు పేజీలోకి వెళ్ళి అక్కడ ఉపకరణాలు పేజీలో మనకు అవసరమైన వాటిని ఎంచుకుని టిక్కు పెట్టాలి. అప్పుడు ఆ వాడుకరికి, ఆ ఉపకరణం అందించే విశేషాలు అందుబాటు లోకి వస్తాయి. ట్వింకిల్, హాట్‌కేట్ ఆ విధంగా మనకు అందుబాటు లోకి వచ్చినవే.
  2. జావాస్క్రిప్టు ఫైళ్ళను పిలవడం: ఇంగ్లీషు వికీపీడియా లోని మన "ప్రిఫరెన్సెస్" పేజీలో "గాడ్జెట్స్" ట్యాబుకు వెళ్ళి చూస్తే, తెలుగులో "నా అభిరుచులు" పేజీలోని "ఉపకరణాలు" పేజీలో కనబడని బోలెడు గాడ్జెట్లు కనిపిస్తాయి. మనకిక్కడ పది దాకా ఉపకరణాలుంటే అక్కడ నలభై యాభై గాడ్జెట్లుంటాయి. అంటే అనేక గాడ్జెట్లు మనకు ఇంకా అందుబాటు లోకి రాలేదన్నమాట ("తెచ్చుకోలేదన్నమాట" అనేది సరైన మాట). అలాంటి అంశాలను మనమూ వాడుకోవాలంటే రెండు పద్ధతులున్నై - 1. ఆ ఉపకరణాన్ని మనమూ ఇక్కడ స్థాపించుకోవడం అది నిర్వాహకులు చెయ్యాలి. రెండో పద్ధతి.., ఏ నిర్వాహకుడిపైనా ఆధారపడకుండా, వాడుకరే స్వయంగా తనవరకూ స్థాపించుకోవడం. అందుకు ఉపయోగపడే ఫైలే common.js. ప్రతీ వాడుకరికీ వాడుకరి:<వాడుకరిపేరు>/common.js అనే పేరుతో ఈ పేజీ ఉంటుంది. మీకు లేకపోతే.., మీరింకా సృష్టించుకోలేదన్నమాట. సృష్టించుకోవడానికి చెయ్యాల్సిందేమీ లేదు.. మీకు అవసరమైన తొట్ట తొలి జావాస్క్రిప్టును తెచ్చి ఇక్కడ పేస్టు చేసి సృష్టించుకోవచ్చు. లేదా, అసలు ఖాళీ పేజీని కూడా సృష్టించుకోవచ్చు. (కాకపోతే ఈ ఖాళీ పేజీ చేసే పని ఏమీ ఉండదు)

గమనిక: పేజీ పేరును మాత్రం common.js అనే ఉంచండి, మార్చవద్దు, అనువదించవద్దు, లిప్యంతరీకరణ చెయ్యవద్దు.

ఇలాంటి జావాస్క్రిప్టు పేజీలు వికీలోని వివిధ రూపులకు (స్కిన్ లు) కూడా - ఒక్కోదానికి ఒక్కోటి - ఉంటుంది. వాటిని మనం పెద్దగా మార్చాల్సిందేమీ ఉండదు. ఇంకా "ఉపకరణం"గా పొందుపరచని కొత్త విశేషాలు ఏమైనా వాడుకోవాలంటే మాత్రం ఈ common.js లో సంబంధిత జావాస్క్రిప్టు కోడును చేర్చి ఆ అంశాన్ని వాడుకోవచ్చు. ఉదాహరణకు వికీపీడియా:వాడుకరులకు సూచనలు/క్లుప్త వివరణ చూపించే జావాస్క్రిప్టు.

బానే ఉంది గానీ.. ఈ కొత్త అంశాల గురించీ, వాటికి సంబంధించిన జావాస్క్రిప్టుల గురించీ మనకు తెలిసేదెలా? అది తెలియాలంటే ఇంగ్లీషు వికీపీడియాను అప్పుడప్పుడూ చూస్తూండాలి.

వికీలో సత్వర సాయం పొందాలంటే

[మార్చు]

వికీలో పనిచేస్తూ ఉంటే అనేక సందేహాలు వస్తూంటాయి. ఈ సందేహాల నివృత్తి కోసం ఇతర వాడుకరుల సాయం తీసుకోవడమనేది సాధారణ విషయం. సందేహాన్ని సందర్భాన్ని బట్టి మీ చర్చా పేజీ, వేరే వాడుకరి చర్చా పేజీ, రచ్చబండ, ప్రధాన పేరుబరికి చెందిన చర్చా పేజీ.. మొదలైన చోట్ల అడగవచ్చు. ఈ పేజీల్లో ఎక్కడైనా మీ ప్రశ్నను ప్రచురించగానే అది ఇటీవలి మార్పులు పేజీలో కనిపిస్తుంది. ఇతర వాడుకరులు అది చూసి మీకు అవసరమైన సాయం చేస్తారు. అయితే వికీలో మార్పు చేర్పులు జరిగే కొద్దీ, పాత మార్పులు వెనకబడిపోతూ చివరికి కనుమరుగై పోతాయి, మీ ప్రశ్నతో సహా. మరి, మీ ప్రశ్న కనుమరుగయ్యే లోపు దాన్ని ఎవరూ చూడకపోతే..! ఇక ఆ ప్రశ్న ప్రశ్నగానే ఉండిపోవాల్సిందేనా? అలా మిగిలిపోక పోయినా.., సాయం అందడానికి చాలా సమయం పట్టవచ్చు.

దీనికి ఒక ఉపాయం ఉంది.

ప్రశ్నను అడిగేటపుడు దానికి పైన {{సహాయం కావాలి}} అనే మూసను చేర్చాలి. అపుడది వర్గం:సహాయం కోసం ఎదురు చూస్తున్న సభ్యులు లేక పేజీలు అనే వర్గం లోకి చేరుతుంది. కొందరు నిర్వాహకులూ సీనియర్ వాడుకరులూ ఆ వర్గాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూంటారు. వాళ్ళకు మీ ప్రశ్న కనిపిస్తుంది, వెంటనే తగు సాయం చేస్తారు. అందువలన మీ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.

తగు పరిష్కారం దొరికాక, ఈ మూసను తీసేసి, దాని స్థానంలో మూస:సహాయం చేయబడింది అనే మూసను చేర్చాలి. ఒక వారం రోజుల్లో సరైన సహాయం దొరక్కపోతే మూస:సహాయం కావాలి-విఫలం అనే మూసను పెట్టాలి. ఇది ప్రశ్న అడిగినవారే చెయ్యాలి.

వర్గాలకు వికీలింకు ఇవ్వడం

[మార్చు]

మామూలుగా పేజీలకు లింకులిచ్చేటపుడు [[ ]] అనే రెండు సెట్ల బ్రాకెట్ల మధ్య లింకును ఇస్తూంటాం. [[అల్లూరి సీతారామరాజు]] అని రాస్తే, అపుడది అల్లూరి సీతారామరాజు లా కనిపిస్తుంది. వర్గానికి కూడా ఇలాగే లింకు ఇస్తే, అలా కనబడదు. అసలు ఆ స్థానంలో ఏమీ కనబడదు. ఉదాహరణకు

"[[అల్లూరి సీతారామరాజు]] అనే పేజీని [[వర్గం:తెలుగువారిలో స్వాతంత్ర్య సమర యోధులు]] వర్గంలో చూడవచ్చు"

అని రాసారను కోండి. అది ఇలా కనిపిస్తుంది:

"అల్లూరి సీతారామరాజు అనే పేజీని వర్గంలో చూడవచ్చు"

అంటే, [[వర్గం:తెలుగువారిలో స్వాతంత్ర్య సమర యోధులు]] అనే లింకు, మామూలు పేజీలకు ఇచ్చే లింకులాగా వర్గం లింకు కనబడదు. ఈ లింకును ఏ పేజీలోనైతే ఇచ్చారో ఆ పేజీని [[వర్గం:తెలుగువారిలో స్వాతంత్ర్య సమర యోధులు]] అనే వర్గం లోకి చేరుస్తుంది. మరి లింకు లాగా కనబడాలంటే ఏం చెయ్యాలి? ఆ లింకులో, ముందు : ను చేర్చాలి, ఇలా: [[:వర్గం:తెలుగువారిలో స్వాతంత్ర్య సమర యోధులు]]. అంటే పై వాక్యాన్ని ఇలా రాయాలి:

"[[అల్లూరి సీతారామరాజు]] అనే పేజీని [[:వర్గం:తెలుగువారిలో స్వాతంత్ర్య సమర యోధులు]] వర్గంలో చూడవచ్చు"

అపుడది కిందివిధంగా కనిపిస్తుంది:

అల్లూరి సీతారామరాజు అనే పేజీని వర్గం:తెలుగువారిలో స్వాతంత్ర్య సమర యోధులు వర్గంలో చూడవచ్చు"

పైపు లింకు

[మార్చు]

మరి పైపు లింకు సంగతేంటి? వర్గం లింకులో పైపుకు రెండు పనులు చేస్తుంది. మొదటిది: ముందు కోలన్ పెట్టి లింకు ఇస్తూ పైపు వాడినపుడు మామూలుగా ఇతర పైపు లింకు లాగానే పని చేస్తుంది.

"[[అల్లూరి సీతారామరాజు]] అనే పేజీని [[:వర్గం:తెలుగువారిలో స్వాతంత్ర్య సమర యోధులు|తెలుగు స్వాతంత్ర్య సమర యోధులు]] వర్గంలో చూడవచ్చు"

అపుడది కిందివిధంగా కనిపిస్తుంది:

అల్లూరి సీతారామరాజు అనే పేజీని తెలుగు స్వాతంత్ర్య సమర యోధులు వర్గంలో చూడవచ్చు"

కానీ.., ముందు కోలన్ లేకుండా పైపు లింకు పెట్టారనుకోండి.. కింది విధంగా

[[వర్గం:తెలుగువారిలో స్వాతంత్ర్య సమర యోధులు|సీతారామరాజు]]

అపుడు మొదటి విభాగంలో చెప్పినట్లుగా ఆ పేజీని ఈ వర్గం లోకి చేరుస్తుంది. దాంతోపాటు మరో పని కూడా చేరుస్తుంది. అదేంటంటే, ఈ పేజీని వర్గం పేజీలో ఏ స్థానంలో చేర్చాలో నిర్ణయిస్తుంది. అంటే అక్షర క్రమంలో ఎక్కడ చేర్చాలో నిర్ణయిస్తుంది. పైపు ఉందా లేదా, పైపు ఉంటే దాని తరువాత ఏముంది అనేదాన్ని బట్టి కింది పనులు చేస్తుంది:

  1. అసలు పైపు ఇవ్వనే లేదనుకోండి: [[వర్గం:తెలుగువారిలో స్వాతంత్ర్య సమర యోధులు]] అని రాస్తే అల్లూరి సీతారామరాజు పేజీ ఈ వర్గంలో "అ" అక్షరం కిందకు వెళ్తుంది. ఎందుకంటే పేజీ పేరు "అ" తో మొదలైంది కాబట్టి.
  2. పైపు ఇచ్చి ఆ తరువాత పేరు రాసారనుకోండి: [[వర్గం:తెలుగువారిలో స్వాతంత్ర్య సమర యోధులు|సీతారామరాజు]] అని రాస్తే అల్లూరి సీతారామరాజు పేజీ ఈ వర్గంలో "స" అక్షరం కిందకు వెళ్తుంది. ఎందుకంటే పైపుకవతల పేరు "సీ" తో మొదలైంది కాబట్టి. వర్గం:ఆంధ్రప్రదేశ్ రైల్వేస్టేషన్లు, వర్గం:ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు, వర్గం:ఆంధ్రప్రదేశ్ నీటి వనరులు అనే మూడు పేజీలను పైపు లేకుండా వర్గం:ఆంధ్రప్రదేశ్ అనే వర్గం లోకి చేరిస్తే, ఈ వర్గంలో ఆ మూడూ "ఆ" అక్షరం కిందనే చేరుతాయి. అలా కాకుండా రైల్వేస్టేషన్లు, వ్యక్తులు, నీటి వనరులు అని రాస్తే ఆ మూడూ ర, వ, న అనే అక్షరాల కిందకు చేరుతాయి. వర్గంలో వాటిని కనుక్కోవడం తేలిగ్గా, కంటికింపుగా ఉంటుంది. ప్రస్తుతం (2020 ఆక్టోబరు 31) వర్గం:ఆంధ్రప్రదేశ్ వర్గాన్ని పరిశీలిస్తే చాలా పేజీల్లో ఇలా పైపు ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలుస్తుంది.
  3. పైపు ఇచ్చి ఆ తరువాత స్పేసు రాసారను కోండి: [[వర్గం:తెలుగువారిలో స్వాతంత్ర్య సమర యోధులు| ]] అని రాస్తే అల్లూరి సీతారామరాజు పేజీ ఈ వర్గంలో అన్నిటికంటే పైన విడిగా ఏ అక్షరం కిందా లేకుండా కనిపిస్తుంది. ఈ పేజీ ఆ వర్గానికి ప్రధానమైన, ప్రాథమికమైన పేజీ అన్నమాట. ఎందుకంటే పైపుకవతల పేరు " " ఉంది కాబట్టి.
  4. పైపు ఇచ్చి ఆ తరువాతి మాటను * తో మొదలుపెట్టారనుకోండి : [[వర్గం:తెలుగువారిలో స్వాతంత్ర్య సమర యోధులు|*సీతారామరాజు]] అని రాస్తే అల్లూరి సీతారామరాజు పేజీ ఈ వర్గంలో అన్నిటికంటే పైన విడిగా ఏ అక్షరం కిందా లేకుండా - పైన చూపించిన ప్రధాన పేజీకి కింద - కనిపిస్తుంది. అంటే ఈ పేజీ ఆ వర్గంలో, ప్రధానపేజీ తరువాత ముఖ్యమైన పేజీల్లో ఒకటన్నమాట. ఇలా * తో ఎన్నైనా పేజీలను పెట్టవచ్చు. ఆ పేజీలన్నీ ప్రధాన పేజీ కింద, అక్షర క్రమంలో చేరుతాయి.

ట్రాన్స్‌క్లూజన్ సంగతులు

[మార్చు]

వికీపీడియాలో ఏదైనా ఒక పేజీలో (మూలం పేజీ) ఉన్న సమాచారం మొత్తాన్నీ మరొక పేజీలో (దీన్ని గమ్యం పేజీ అంటారు) చూపించాలంటే ఆ సమాచారం మొత్తాన్నీ గమ్యం పేజీలో మళ్ళీ రాయాల్సిన పని లేదు. దానికి ట్రాన్స్‌క్లూజన్ అనే పద్ధతి ఉంది. దాన్ని వివరించే విభాగమే ఇది.

మూసలను పేజీలో చేర్చేటపుడు {{మూసపేరు}} అని రాసి చేరుస్తాం. ఇలా {{ }} అనే జమిలి బ్రాకెట్ల మధ్య పేజీ పేరు పెట్టడాన్నే ట్రాన్స్‌క్లూజన్ అంటారు. {{తెలంగాణ నదులు}} అనే మూసను ఏదైనా పేజీలో ట్రాన్స్‌క్లూడు చేసామనుకోండి ఆ పేజీలో అది కింది విధంగా కనిపిస్తుంది:

వికీ ఎడిటరులో పైన ఉండే పరికరాల పెట్టెలో "చొప్పించు" --> "మూస" ను ఎంచుకుని, అప్పుడు కనబడే పెట్టెలో "తెలంగాణ నదులు" అని ఇచ్చినా సరిగ్గా ఇదే జరుగుతుంది.

కొన్ని నియమాలు

[మార్చు]

"మూస" పేరుబరి లోని పేజీలనే కాదు, ఏ పేరుబరి లోని పేజీనైనా ఇతర పేజీల్లో ట్రాన్స్‌క్లూడు చెయ్యవచ్చు. ఉదాహరణకు, వికీపీడియా:వాడుకరులకు సూచనలు అనే పేజీలో {{వికీపీడియా:వాడుకరులకు సూచనలు/ట్రాన్స్‌క్లూజన్ సంగతులు}} అని రాసామనుకోండి.. అప్పుడు {{వికీపీడియా:వాడుకరులకు సూచనలు/ట్రాన్స్‌క్లూజన్ సంగతులు}} అనే పేజీలో రాసిన ప్రత్యక్షరమూ ఉన్నదున్నట్లుగా వికీపీడియా:వాడుకరులకు సూచనలు పేజీలోకి చేరిపోతుంది. అయితే పేరుబరులకు సంబంధించి కొన్ని నియమాలున్నాయి. అవేంటో చూద్దాం.

  1. ప్రధాన పేరుబరి లోని పేజీలను ట్రాన్స్‌క్లూడు చెయ్యాలంటే పేజీ పేరుకు ముందు కోలన్ (:) పెట్టాలి. అంటే భారతదేశ జిల్లాల జాబితా/పంజాబ్ అనే పేజీని వేరే పేజీలో ట్రాన్స్‌క్లూడు చెయ్యాలంటే, గమ్యం పేజీలో {{:భారతదేశ జిల్లాల జాబితా/పంజాబ్}} అని రాయాలి. ముందు "కోలన్"ను గమనించండి. ప్రధాన పేరుబరి లోని వ్యాసాలను ట్రాన్స్‌క్లూడు చేసేటపుడు ముందు కోలన్ తప్పనిసరిగా ఉండాలి.
  2. మూస పేరుబరి లోని పేజీలను ట్రాన్స్‌క్లూడు చేసేటపుడు పేరుబరి లేకుండా ఉత్త పేజీ పేరు రాయాలంతే. గమ్యం పేజీలో సింపులుగా {{తెలంగాణ నదులు}} అని రాయాలి. అంటే, మూస పేరుబరి లోని పేజీలను ట్రాన్స్‌క్లూడు చేసేటపుడుపేరుబరిని రాయకూడదు.
  3. ఇతర పేరుబరుల్లోని పేజీలను ట్రాన్స్‌క్లూడు చేసేటపుడు సంబంధిత పేరుబరితో సహా పేజీ పేరు రాయాలి ఉదా: {{వికీపీడియా:వాడుకరులకు సూచనలు/అనువాదంలో మానవిక అనువాద శాతం}}. మీకు ఆసక్తి ఉంటే.., వికీపీడియా:వాడుకరులకు సూచనలు అనే పేజీని దిద్దుబాటు మోడ్‌లో తెరిచి, అక్కడ ఏయే పేజీలను ట్రాన్స్‌క్లూడు చేసారో చూడండి.

ఇప్పుడు కొన్ని చిట్కాలు

[మార్చు]

అయితే మూలం పేజీ లోను, గమ్యం పేజీలోనూ ఏయే సమాచారాన్ని చూపించాలులి, దేన్ని చూపించకూడదు అనే విషయంలో మనకు కింది విధమైన అవసరాలుండవచ్చు. ఆయా అవసరాలను ఎలా సాధించుకోవాలో కూడా చూడవచ్చు.

  • ట్రాన్స్‌క్లూడు చేసే పేజీలో (మూలం పేజీ) ఉన్న కొంత సమాచారం అక్కడ మాత్రమే కనబడాలి, కానీ గమ్యం పేజీలో కనబడకూడదు: ఈ సందర్భంలో సదరు సమాచారాన్ని <noinclude> </noinclude> అనే ట్యాగుల మధ్య ఉంచాలి. అప్పుడు ఆ సమాచారం గమ్యం పేజీలో కనబడదు.
  • ట్రాన్స్‌క్లూడు చేసే పేజీలో (మూలం పేజీ) ఉన్న కొంత సమాచారం అక్కడ కనబడకూడదు, కానీ గమ్యం పేజీలో మాత్రం కనబడాలి: ఈ సందర్భంలో సదరు సమాచారాన్ని <includeonly> </includeonly> అనే ట్యాగుల మధ్య ఉంచాలి. అప్పుడు ఆ సమాచారం గమ్యం పేజీలో మాత్రమే కనబడుతుంది. ఉదాహరణకు,

ఈ ట్యాగులను మూలం పేజీలోనే పెట్టాలి. గమ్యం పేజీలో కాదు. వీటిని ఎక్కువగా వర్గాలను చేర్చే సందర్భంలో వాడుతారు.

ఏ వ్యాసాలను సృష్టించాలి

[మార్చు]

కొత్త వ్యాసాలు రాయాలనుకున్న వారికి ఏ వ్యాసాలు రాయాలనే సందేహం ఉండే అవకాశం ఉంది. అలాంటి వారికి కింది పేజీల్లో ఉన్న జాబితాలు ఉపయోగపడవచ్చు. ఈ జాబితాల్లోని అనేక వ్యాసాలు ఒకటి కంటే ఎక్కువ జాబితాల్లో ఉండి ఉండవచ్చు.

  1. వివిధ పేజీల నుండి ఇన్‌కమింగు లింకులున్న పేజీలు: వికీపీడియాలో ఈసరికే ఉన్న పేజీల నుండి ఎర్రలింకులున్న పేజీలు. ఎన్నిఎక్కువ ఇన్‌కమింగు లింకులుంటే అంత ఆవశ్యకమైన పేజీ అన్నమాట. ఈ జాబితాలో అన్ని పేరుబరుల్లోనూ ఉన్న పేజీలుంటాయి.
  2. ప్రతీ వికీపీడియాలోనూ ఉండాల్సిన పదివేల వ్యాసాల జాబితా: ఈ పేజీ, దీనికింద ఉన్న ఉపపేజీల్లో ఉన్న పేజీలు కొన్ని ఈసరికే ఉండి ఉండవచ్చు. ఆ జాబితాల్లోని పేజీల ఇంగ్లీషు వికీ పేజీని తెరిచి, అక్కడ అంతర్వికీ లింకులను పరిశీలించండి. వాటిలో తెలుగు లేదని నిర్ధారించుకున్నాకే తెవికీలో పేజీ సృష్టించండి.
    1. ఆసియాకు చెందినవి
    2. కళలు
    3. గణితం
    4. చరిత్ర
    5. జీవశాస్త్రం, ఆరోగ్యం
    6. తత్త్వశాస్త్రం, మతం
    7. భౌగోళికం
    8. భౌతిక శాస్త్రాలు
    9. వ్యక్తులు
  3. వికీపీడియా:తెలుగు వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు
  4. వికీపీడియా:వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు
  5. తొలగించిన గూగుల్ యాంత్రికానువాద వ్యాసాలు

ఎలా పనిచెయ్యాలి

[మార్చు]
  • పై పేజీల్లో, ఇంగ్లీషు పేరుకు ఎదురుగా తెలుగు పేరు లేని పేజీని తీసుకోండి.
  • దాని ఇంగ్లీషు పేజీని తెరవండి.
  • అక్కడి అంతర్వికీ లింకుల్లో (ఎడమ పక్కన ఉన్న నేవిగేషను పట్టీలో) తెలుగుకు పేజీ ఉందో లేదో గమనించండి.
  • పేజీ లేకపోతే, అప్పుడు అనువదించడానికి పూనుకోండి.
  • అనువాదం చేసేందుకు అనువాద పరికరం అనువైనది, వేగవంతమైనదీ కాబట్టి దాన్ని వాడితే పని వేగంగా చెయ్యవచ్చు
  • పేజీని సృష్టించాక, ఈ జాబితాలో ఇంగ్లీషు వ్యాసం పేరు ఎదురుగా తెలుగు వ్యాసం పేరు రాయండి. ఆ జాబితాపై పనిచేయదలచిన ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇతర పనులు, వనరులు

[మార్చు]

ఉన్న వ్యాసాలను విస్తరించడం మీ అభిమతమైతే,కింది పేజీలను చూడవచ్చు

  1. వికీపీడియా:సముదాయ_పందిరి చూడండి. ఏయే పనులు చెయ్యాలో ఈ పేజీలో చూడవచ్చు.
  2. వర్గం:మొలక: ఈ వర్గం, దీని ఉపవర్గాల్లోని పేజీలను విస్తరించి మొలకస్థాయిని దాటించి ఆ పేజీల్లో ఉన్న మొలక మూసను తీసెయ్యండి.
  3. వికీపీడియా:చదవదగ్గ వ్యాసాల జాబితా: గతంలో మొదటి పేజీలో ప్రదర్శించిన వ్యాసాల లింకులు ఈ పేజీలో ఉంటాయి. మొదటి పేజీలో ప్రదర్శించినప్పటికీ, ఆ వ్యాసాల్లో నాణ్యతా లోపాలుండవచ్చు. వాటిని సరిచెయ్యడం అత్యావశ్యకం. వాటిని సరిచెయ్యండి. అవసరమైన చోట్ల అదనపు సమాచారాన్ని చేర్చండి.
    1. చరిత్ర
  4. వర్గం:శుద్ధి చేయవలసిన వ్యాసాలు
  5. వర్గం:విలీనం చేయవలసిన వ్యాసాలు: ఒకే అంశం గురించి రెండు పేర్లతో వ్యాసాలుంటే వాటిని విలీనం చేసేందుకు ప్రతిపాదించినపుడు ఆ పేజీలు ఈ వర్గం లోకి చేరతాయి. ఆ రెండు పేజీల్లోని పాఠ్యాలను తగిన విధంగా విలీనం చేసి ఒక పేజీని రెండవ దానికి దారిమార్పుగా చెయ్యండి.
  6. వర్గం:అనువదించ వలసిన పేజీలు: ఈ వర్గం లోని పేజిలను అనువదించి అనువాదం మూసను తీసెయ్యండి.
  7. వర్గం:వికీకరించవలసిన వ్యాసాలు: వికీ శైలిలో వ్యాస ఆకృతి, భాష వగైరాలు లేనపుడు, ఆ వ్యాసాలను ఈ వర్గం లోకి చేరుస్తారు. తగువిధమైన సవరణలు చేసి, వికీకరణ మూసను తీసెయ్యండి.

కాలదోషం పట్టే వ్యాసాలను గుర్తించడం ఎలా

[మార్చు]

వికీపీడియా వ్యాసాల్లో చేర్చే సమాచారానికి కాలదోషం పట్టడమనేది పెద్ద సమస్య. చాలా పేజీల్లో సమాచారానికి కాలదోషం పడుతూ ఉంటుంది. కాలదోషం గురించి, సదరు పేజీల విషయంలో వాడుకరులు తీసుకోవాల్సిన చర్యల గురించీ ఈ భాగం తెలియజేస్తుంది. సమాచారానికి కాలదోషం పట్టినా తాజాకరించక పోతే, వాక్యాల్లో దోషం ఏర్పడుతుంది. (అలా ఏర్పడగల దోషాలను నివారించడం ఎలాగో తెలుసుకునేందుకు ఇదే పేజీ లోని కాలదోషం పట్టినా వాక్యదోషం ఏర్పడకుండా రాయడం చూడండి.)

ఇప్పటికే కాలదోషం పట్టేసిన పేజీలు

[మార్చు]

వ్యాసం లోని సమచారానికి ఈసరికే కాలదోషం పట్టేసి ఉండొచ్చు. అది ఒక వాక్యం కావచ్చు, కొన్ని వాక్యాలు కావచ్చు, ఒక విభాగంలో ఉండొచ్చు, అనేక విభాగాల్లో ఉండొచ్చు. ఉదాహరణలు:

  1. ఫలానా గ్రామంలోని దేవాలయంలో 2017 మే 18 న విగ్రహ ప్రతిష్ఠ జరగనుంది
  2. 2020 జూన్ 11 న ఎన్నికలు మొదలై, 2020 జూన్ 23 న పూర్తౌతాయి. ఫలితాలను 2020 జూన్ 27 న వెల్లడిస్తారు.
  3. ఒలింపిక్ క్రీడలు 2016 జూన్ 4 న మొదలౌతాయి
  4. ఆస్ట్రేలియా భారత్‌ల మధ్య క్రికెట్ మ్యాచి 2017 డిసెంబరు 26 న మొదలు కానుంది

పై వాక్యాల్లో సూచించిన తేదీ తరువాత ఆ పేజిలను చూసినపుడు కింది పద్ధతుల్లో ఏదో ఒకదాని ప్రకారం చర్య తీసుకోవాలి:

  1. ఆ వాక్యాల స్థానే తాజా సమాచారాన్ని చేర్చాలి. ఇది అత్యుత్తమ పద్ధతి
  2. తాజా సమాచారం గురించి తెలియనపుడు, ఆ పేజీలో పైన {{Update}} అనే మూసను చేర్చాలి. దానితో ఈ పేజీ వర్గం:తాజాకరించవలసిన వ్యాసాలు అనే వర్గం లోకి చేరుతుంది. ఆ వర్గాన్ని గమనించే వాడుకరులు ఆయా పేజీలను తాజాకరిస్తారు.

భవిష్యత్తులో ఖచ్చితంగా ఫలానా రోజు నాటికి కాలదోషం పట్టే పేజీలు

[మార్చు]

ప్రస్తుతం పేజీలో ఉన్న సమాచారం దోషరహితమే, కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా ఫలానా తేదీ నాటికి దానికి కాలదోషం పడుతుంది. ఉదాహరణకు

  1. ఈ సినిమా 2020 ఏప్రిల్ 4 న విడుదల కానుంది

ఈ వాక్యంలో చూపించిన తేదీని దాటగానే ఈ వాక్యానికి కాలదోషం పడుతుంది. అప్పటి వరకు ఈ వాక్యం దోష రహితమే. కానీ ఈ వాక్యాన్ని సవరించాలని ఆ తేదీన గుర్తు రాకపోవచ్చు. అందుచేత ఈ వాక్యం పక్కనే {{Update after}} అనే మూసను చేర్చాలి (సంవత్సరం, నెల, తేదీ పరామితులను తప్పనిసరిగా చేర్చాలి). ఆ తేదీ వచ్చే వరకు మూస అదృశ్యంగా ఉంటుంది, స్తబ్దు గానే ఉండిపోతుంది. ఆ తేదీ దాటగానే మూస ప్రత్యక్షమై, పేజీని వర్గం:కాలదోషం పట్టిన వాక్యాలు గల వ్యాసాలు‎ అనే వర్గం లోకి చేరుస్తుంది. ఆ వర్గాన్ని గమనించే వాడుకరులు ఆ పేజీని తాజాకరిస్తారు. ఉదాహరణకు {{Update after|2023|03|30}} అని రాస్తే 2023 మార్చి 30 తరువాత ఈ మూస క్రియాశీలమై, పేజీలో [dated info] అనే మూస కనిపిస్తుంది, అలాగే ఆ పేజీని పైన చూపిన వర్గం లోకి చేరుస్తుంది. సంవత్సరం, నెల, తేదీ పరామితులు ఇవ్వకపోతే, ఈ మూస వెనువెంటనే క్రియాశీలమౌతుంది.

భవిష్యత్తులో కాలదోషం పట్టే సంభావ్యత ఉన్న పేజీలు

[మార్చు]

ప్రస్తుతం సమాచారం దోషరహితమే, కానీ భవిష్యత్తులో దానికి కాలదోషం పట్టవచ్చు. కానీ ఎప్పుడు పడుతుందో తెలియదు. ఉదాహరణకు:

  • స్థూల దేశీయోత్పత్తి పరంగా 2020 సెప్టెంబరు 19 నాటికి భారతదేశం ప్రపంచంలో ఆరవ స్థానంలో ఉంది.

ఆ తరువాత భారతదేశం ఒక స్థానం ఎగబాక వచ్చు. అలాంటి సందర్భంలో దాన్ని తాజాకరించే విషయాన్ని గమనింపులో ఉంచుకునేందుకు {{As of}} అనే మూసను వాడాలి, ఇలా:

  • స్థూల దేశీయోత్పత్తి పరంగా {{As of|2020|09|19}} భారతదేశం ప్రపంచంలో ఆరవ స్థానంలో ఉంది.

అపుడు ఆ వాక్యం కింది విధంగా కనిపిస్తుంది.

  • స్థూల దేశీయోత్పత్తి పరంగా As of 19 సెప్టెంబరు 2020భారతదేశం ప్రపంచంలో ఆరవ స్థానంలో ఉంది.

వాక్య రూపం మారలేదు. కానీ ఈ రెండో వాక్యం వర్గం:కాలదోషం పట్టే అవకాశమున్న వాక్యాలు గల వ్యాసాలు‎ అనే వర్గం లోకి చేరుతుంది. ఈ వర్గాన్ని గమనించే వాడుకరులు ఆ పేజీలో తగు చర్య తీసుకునే అవకాశం ఉంటుంది.

మరణ వివరాలను చేర్చేటపుడు

[మార్చు]

వ్యక్తులు మరణించినపుడు వారి వికీపీడియా వ్యాసాల్లో ఏయే మార్పులు చెయ్యాలో ఈ విభాగం తెలియజెబుతుంది. మరిన్ని వివరాలకు వికీపీడియా:వికీప్రాజెక్టు/జనన మరణాల నమోదు ప్రాజెక్టు చూడండి.

  1. ముందుగా మరణ వివరాలను పేజీలో తగిన చోట చేర్చండి. ఎలా మరణించారు, ఎప్పుడు మరణించారు, ఎక్కడ మరణించారు (ఊరు పేరే కాకుండా, ఇల్లా, ఆసుపత్రా, మరేదైనా స్థలమా అనే వివరం కూడా రాస్తే బాగుంటుంది). కింద చూపిన సమాచారం చేర్చేముందు దీన్ని తప్పనిసరిగా చేర్చాలి.
  2. ప్రవేశికలో పేరు పక్కనే బ్రాకెట్లో ఉండే జనన తేదీ పక్కనే మరణ తేదీని చేర్చాలి.
  3. వర్గాలు
    • ఆ సంవత్సరంలో జరిగిన మరణాలు ఆనే వర్గం లోకి చేర్చాలి. ఉదాహరణకు వర్గం:2021 మరణాలు (పనిలోపని.. పేజీలో "జననాలు" వర్గం ఉందో లేదో చూసి, లేకుంటే అది కూడా చేర్చండి)
    • మరణం అసహజమైతే మరణ కారణ వర్గాన్ని కూడా చేర్చాలి. దీనికి సంబంధించిన వివిధ వర్గాల కోసం వర్గం:మరణాలు చూడండి.
  4. సంవత్సరం, తేదీ పేజీల్లో మరణ వివరాన్ని చేర్చండి. ఉదాహరణకు ఒక వ్యక్తి 2021 మే 14 న మర్ణించి ఉంటే మరణ వివరాన్ని 2021 పేజీ, మే 14 పేజీ - రెండిట్లోనూ చేర్చాలి.
  5. సమాచారపెట్టెలో మార్చాల్సినది:
    • మరణ తేదీని చేర్చాలి. ఇందుకోసం {{Death date and age}} అనే మూసను చేర్చాలి. దానిలో మరణించిన సంవత్సరం, నెల, తేదీ, పుట్టిన సంవత్సరం, నెల, తేదీ - ఈ ఆరు పరామితులను ఇవ్వాలి. ఉదా: {{Death date and age|2021|05|14|1965|10|9}} అని చేర్చినపుడు 2021 మే 14(2021-05-14) (వయసు 55) అని చూపిస్తుంది. {{Death date}} అనే మూసను (దీనికి మూడు మరణ పరామితులు ఇస్తే చాలు) కూడా వాడవచ్చు గానీ, ఇది వయసును చూపించదు.
    • జననతేదీని మార్చాలి: జనన తేదీలో {{Birth date and age}} అని వాడి ఉందేమో చూడాలి. జీవించి ఉన్న వాళ్లకు ఇది వాడతాం. దీన్ని వాడినపుడు పుట్టిన తేదీతో పాటు, బ్రాకెట్లో వర్తమాన తేదీ నాటికి వయసెంతో కూడా బ్రాకెట్లో చూపిస్తుంది. జీవించి ఉన్నవారికి ఇది వాడడం మామూలే. అయితే వ్యక్తి మరణించాక ఇక అది అక్కరలేదు కాబట్టి (వయసు మారదు కదా), {{Birth date and age}} అనే మూసని తీసేసి దాని స్థానంలో {{Birth date}} అనే మూసను చేర్చాలి. దీనికి పుట్టిన సంవత్సరం, నెల, తేదీ అనే మూడు పరామితులు ఇవ్వాలి.

వికీ డేటాబేసు నుండి ముడి డేటాను తెచ్చుకోవడం

[మార్చు]

వికీపీడియాలో మనం చూస్తున్న పేజీలు సర్వరులో నిల్వ ఉంటాయి. ఫలానా పేజీ కావాలని వికీపీడియా సైటును అడిగినపుడు ఆ సర్వరు నుండి పేజీని తెచ్చి మన కంప్యూటరు లోనో, మొబైల్లోనో చూపిస్తుంది. అయితే ఈ పేజీలను పేజీ రూపం లోనే సర్వరులో పెట్టదు. పేజీలో ఉండే సమాచారాన్ని అనేక ముక్కలుగా విడదీసి ఒక పద్ధతిలో దాచి పెడుతుంది. దీన్ని డేటాబేసు అంటారు. ఈ డేటాబేసులో పట్టికలుంటాయి. పట్టికల్లో డేటాను దాచిపెడుతుంది. మనం ఏదైనా పేజీ లింకును నొక్కినపుడు, సదరు పేజీకి సంబంధించిన ముడి డేటాను ఆయా టేబుళ్ళ నుండి తెచ్చి ఒక పేజీగా అందంగా కూర్చి మనకు చూపిస్తుంది. ఇదంతా నేపథ్యంలో జరుగుతుంది, అదేమీ మనకు కనబడదు -మనకు పేజీ మాత్రం కనిపిస్తుందంతే!

ఈ డేటాబేసు పట్టికల నుండి ముడి డేటాను వికీపీడియా తెచ్చుకున్నట్టే మనమూ తెచ్చుకుని చూసే వీలుంది. మనకు కావలసిన విధంగా అడిగి కావలసిన డేటాను తెచ్చుకునే అవకాశం ఉంది. అంటే ఫలానా వాడుకరి చేసిన రోల్‌బ్యాకుల్లో తిరిగి రోల్‌బ్యాక్ చేసినవెన్ని, ఏమేంటి? ఫలానా వర్గంలో ఉన్న పేజీల్లో ఉన్న మొత్తం ఎర్రలింకులెన్ని, అవేవి? ఇలాంటి అనేక ప్రశ్నలను డేటాబేసును అడగవచ్చు, సంబంధిత డేటాను పొందనూ వచ్చు. ఇలాంటి డేటాను తెచ్చుకుని వికీపీడియాను మెరుగుపరచడానికి సాధనాలుగా వాడుకోవచ్చు. ఆటోవికీ బ్రౌజరును వాడి ఆయా పనులను వేగవంతంగా చేయడంలో కూడా ఈ డేటా ఎంతో ఉపయోగపడుతుంది.

మరి ఈ డేటాను ఎలా తెచ్చుకోవాలి

[మార్చు]
  • ఈ డేటా ఎక్కడ దొరకబుచ్చుకోవాలి?: ఇది వికీపీడీయా సైటుల్లో దొరకదు. వికీపీడియా వారు నిర్వహిస్తున్న కొన్ని సైట్లలో ఆ సౌకర్యం ఉంది. వాటిలో ఒకటి, క్వారీ అనే సైటు. ఆ సైటులో మనకు కావలసిన డేటాను అడిగి తెచ్చుకునే వీలుంది.
  • డేటా కావాలని ఎలా అడగాలి?: ఇది కొంత సాంకేతికతతో కూడుకున్న వ్యవహారం. డేటాను అడగాలంటే ప్రాథమికంగా SQL భాష వచ్చి ఉండాలి. జనాంతికంగా దీన్ని సీక్వెల్ భాష అని ఆంటారు. నాకు ఫలానా డేటాను చూపించు అని డేటాబేసును ఈ భాషలో అడుగుతాం. ఇలా అడగడాన్ని "క్వెరీ" అంటాం. క్వారీ సైటుకు అ పేరు "క్వెరీ" నుండే పెట్టారు (క్వెరీల గని అని అర్థం వచ్చేలా). ఈ సీక్వెల్ భాష లోని మౌలికమైన భావనలను నేర్చుకోవడం ఒకట్రెండు రోజుల పని. ఆపైన సాధన చేస్తూ భాష లోని లోతులను చూడడం ఆ తరువాత పని. మొత్తమ్మీద ఒక వారం రోజుల సాధనతో ఒక స్థాయికి చేరవచ్చు.
  • ఇప్పుడు నాకు నేర్చుకునేంత ఓపిక తీరికా లేవుగానీ, వేరే మార్గమేమైనా ఉందా?: భేషుగ్గా ఉంది! పైన చెప్పిన క్వారీ సైటులో ఇతరులు అడిగిన క్వెరీలన్నీ, ఇతర వికీల్లో అడిగిన క్వెరీలతో సహా, కనిపిస్తాయి. వాటిని చూడవచ్చు. వాటిని కాపీ చేసుకుని, కొత్త క్వెరీ పేజీ తెరిచి అందులో కాపీ చేసుకుని, చిన్నచిన్న మార్పులు చేసుకుని, తెవికీ నుండి సంబంధిత డేటాను తెచ్చుకోవచ్చు. లేదా కింద చూపినట్లుగా Fork చేసుకోవాలి
  • తెలుగు వికీపీడియనులు అడిగిన క్వెరీలేమైనా ఉన్నాయా?: ఉన్నాయి. అర్జున, కశ్యప్, చదువరి అడిగిన క్వెరీలను చూడవచ్చు. ఒక్కో వికీపీడియనుకు ఒక్కో పేజీ ఉంటుంది. ఆ పేజీలో వారు తయారు చేసిన క్వెరీలను చూడవచ్చు. కొందరు తెలుగు వికీపీడియనుల పేజీలు కొన్ని
  • పై లింకుల పేజీల్లో రెండు జాబితాలుంటై - మొదట ప్రచురించిన క్వెరీల పేర్ల జాబితా (పబ్లిష్‌డ్ క్వెరీస్) ఉంటుంది. ఆ జాబితా కింద చిత్తుప్రతులు (డ్రాఫ్ట్ క్వెరీస్) ఉంటాయి. చిత్తుప్రతుల్లో కొన్ని పనిచేయక పోవచ్చు. ప్రచురించిన జాబితా లోంచి ఏదైనా క్వెరీ పేరును నొక్కినపుడు ఒక పేజీ తెరుచుకుంటుంది. అందులో SQL అనే పేరున్న నల్లటి పెట్టెలో ఆ క్వెరీ పూర్తిగా కనిపిస్తుంది. దాని కిందనే ఆ క్వెరీని నడిపాక వచ్చే ఫలితాలు కూడా ఉంటాయి.

ఇతరులు రాసిన క్వెరీని నడిపి తాజా సమాచారం తెచ్చుకోవడం ఎలా

[మార్చు]
  • ముఖ్యమైన గమనిక: ఇతరులు రాసిన క్వెరీల ఫలితాలన్నీ ఆ క్వెరీని చివరిసారి నడిపినపుడు వచ్చిన డేటా మాత్రమే కనిపిస్తుంది. తాజా డేటా రాదు. ఆ క్వెరీని ఇతరులు నడిపే వీలు లేదు
  • మరి, తాజా డేటా కనబడాలంటే ఏం చెయ్యాలి?: దాని కోసం కింది పద్ధతులలో ఏదో ఒకదానిని అనుసరించవచ్చు:
    • పేజీలో కుడివైపు పైన ఉండే "Fork" అనే బొత్తాన్ని నొక్కండి. ఈ క్వెరీ అంతటినీ కాపీ చేసి ఒక కొత్త క్వెరీ విండో తెరుచుకుంతుంది. అది మీ స్వంత క్వెరీ అన్నమాట. దాన్ని మీరు నడుపుకోవచ్చు.

లేదా

    1. SQL అనే పెట్టె లో ఉన్న క్వెరీని కాపీ చెయ్యండి
    2. పైనున్న NewQuery అనే లింకు నొక్కండి.
    3. ఆ పేజీలో ఉన్న SQL పెట్టెలో మీరు కాపీ చేసుకున్న క్వెరీని పేస్టు చెయ్యండి.
    4. దానికి పైనున్న "Click to enter database" అనే చిన్న పెట్టెలో "tewiki" అని రాయండి.
    5. ఆ తరువాత SQL పెట్టెకు కింద ఉన్న "Submit Query" అనే బొత్తాన్ని నొక్కండి. అంథే..! మీకు తాజా డేటా ఆ కిందనే కనిపిస్తుంది.
    • ఆ డేటాను మనం మన కంప్యూటర్లోకి దించుకోవచ్చు. డేటాకు పైన ఉన్న "Download data" అనే డ్రాప్ డౌన్‌ను నొక్కితే దింపుకోలు వికల్పాలు కనిపిస్తాయి. వాటి లోంచి ExcelXLSX అనే వికల్పాన్ని ఎంచుకుంటే అ డేటా మొత్తం ఎక్సెల్ ఫైలు లాగా దిగుమతి అవుతుంది. ఆ ఫైలును మైక్రోసాఫ్ట్ ఎక్సెల్‌లో తెరవొచ్చు.
    • మీరు కాపీ చేసుకుని నడిపిన ఆ క్వెరీకి "Click to add title" అనే పెట్టెలో ఒక పేరు రాయండి.
    • ఆ తరువాత దాని కింద ఉన్న "Publish" నొక్కండి. అది ప్రచురితమౌతుంది. "Publish" నొక్కకపోయినా ఏం కాదు, డ్రాఫ్టుగా మిగిలిపోతుంది.

ఇక ఇది మీ స్వంత క్వెరీ అన్నమాట. దీన్ని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు "Submit Query" బొత్తాన్ని నొక్కి తాజా డేటాను తెచ్చుకోవచ్చు.

సైట్ నోటీసులు

[మార్చు]

వికీపీడియాలో ఏ పేజీలోనైనా పైన వికీపీడియా సందర్శకులందరికీ కనిపించేలా పెట్టే నోటీసులను సైట్ నోటీసులంటారు. సాధరణంగా ఒక నిర్ణీత కాలావధిలో జరిగే కార్యక్రమాల గురించి వాడుకరులకు, పాఠకులకూ తెలిపేందుకు ఈ నోటీసులను వాడతారు. ఉదాహరణకు ఏదైనా పోటీ, లేదా ఎడిటథాన్ వంటివి. ఈ నోటీసుల్లో రకరకాలున్నాయి - లాగినైన వాడుకరులకు మాత్రమే కనిపించే నోటీసులు, అజ్ఞాతలకు మాత్రమే కనిపించేవి, ఒక భౌగోళిక ప్రాంతంలో మాత్రమే కనిపించేవి, వీక్షణ జాబితాలో కనిపించేవి, నేరుగా మెటా నుండి వచ్చే కేంద్రీయ నోటీసు వగైరాలు. ఈ విభాగంలో ప్రస్తుతం మనం మొదటి రెండింటి గురించి తెలుసుకుందాం.

లాగినైన వాడుకరులకు మాత్రమే కనీంచే నోటీసులను మీడియావికీ:Sitenotice పేజీలో రాస్తాం. ఇక్కడ చేర్చిన నోటీసులు లాగినైన వాడుకరులందరికీ ప్రతి పేజీలోనూ పైన కనిపిస్తాయి. ఆ నోటీసుకు పక్కనే [ఈ నోటీసును తొలగించు] అనే లింకు కనిపిస్తుంది. దాన్ని నొక్కితే ఈ నోటీసును కనబడకుండా చెయ్యవచ్చు. అలా తొలగించిన నోటీసును మళ్ళీ కనబడేలా చెయ్యాలని ఎవరైనా వాడుకరి అనుకుంటే, ఆ వాడుకరి తన బ్రౌజరులో "dismissSiteNotice" అనే కుకీని తీసెయ్యాల్సి ఉంటుంది. ఉదాహరణకు, క్రోమ్ బ్రౌజరులో ఇది chrome://settings/cookies/detail?site=te.wikipedia.org అనే చోట, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజరులో edge://settings/cookies/detail?site=te.wikipedia.org వద్దా ఉంటుంది.

కానీ, ఈ నోటీసును అందరికీ - తొలగించిన వాడుకరులతో సహా - కనబడేలా చెయ్యాలంటే ఒక కేంద్రీయ పద్ధతి ఉంది. అదేంటంటే, మీడియావికీ:Sitenotice id అనే పేజీకి వెళ్ళి, అక్కడ ఉన్న అంకెకు 1 కలిపి ప్రచురించడమే (అక్కడ 1 అని ఉంటే దాన్ని 2 చెయ్యాలన్నమాట). దాంతో ఈ నోటీసు అందరికీ, కనబడకుండా చేసిన వారితో సహా, కనిపిస్తుంది. మీడియావికీ:Sitenotice లో కొత్తగా ఒక సైటు నోటీసును చేర్చినపుడు ఈ పని తప్పక చెయ్యాలి.

ఈ సైటు నోటీసు అజ్ఞాతలకు కనిపించదని చెప్పుకున్నాం గదా.. వారికి నోటీసులను చూపించాలంటే వేరే నోటీసు పేజీ ఉంది - మీడియావికీ:Anonnotice. ఇక్కడ రాసిన నోటీసు అజ్ఞాతలకు అన్ని పేజీల్లోనూ కనిపిస్తుంది. దీన్ని తొలగించడం అనేది ఉండదు.

ఒక గమనిక: ఈ నోటీసులను సాధారణంగా ఒక పరిమిత కాలానికి మాత్రమే పెడుతూంటాం కాబట్టి, ఆ వ్యవధి పూర్తి కాగానే నోటీసును తీసెయ్యడం మరచిపోకూడదు.

కొత్త పేజీలో ఏమేం ఉండాలి

[మార్చు]

ఇది కొత్త పేజీ సృష్టించేటపుడు అందులో ఏయే అంశాలు ఉండాలో చెప్పే అంశాల పాక్షిక జాబితా. అసలు వ్యాసాన్ని సృష్టించడం ఎలాగో తెలుసుకునేందుకు వికీపీడియా:వ్యాససృష్టికి మార్గసూచీ చూడండి. కొత్త పేజీని సృష్టించినపుడు దానిలో సమాచారాన్ని చేర్చడం, దానికి సముచితమైన మూలాలివ్వడంతో పాటు, వికీపేజీకి ఉండాల్సిన హంగులు కొన్ని ఉన్నాయి. సాధారణంగా ఉండాల్సిన ఆ హంగులు ఉంటే ఆ పేజీకి మరింత విలువ చేకూరుతుంది. ఆయా హంగులను చేర్చడాన్ని పేజీ సృష్టిలో భాగంగానే భావించాలి. అలాంటి కొన్ని పనులు కింద ఉన్నాయి. ఇది పూర్తి జాబితా కాదు, కొన్ని ముఖ్యమైన అంశాల జాబితా మాత్రమే.

  1. మీ కొత్త పేజీని అనాథ కానీయకండి. ఈ పేజీకి వేరే పేజీల నుండి లింకులు (ఇన్‌కమింగు లింకులు) ఏమీ లేకపోతే అది అనాథ వ్యాసమౌతుంది. మీరు ఈ పేజీని సృష్టించకముందే దీనికి వేరే పేజీలనుండి ఎర్ర లింకులు ఉండే అవకాశం ఉంది. మీరు ఈ పేజీని సృష్టించగానే అవి నీలం రంగు లోకి మారిపోతాయి. నేవిగేషను పట్టీలో ఉన్న "ఇక్కడికి లింకున్న పేజీలు" అనే లింకును నొక్కితే ఏయే పేజీల నుండి ఇక్కడికి లింకులున్నాయో తెలుస్తుంది. ఒకవేళ ఈ పేజీ అనాథ అయితే, దీనికి సంబంధిత పేజీలలో ఈ కొత్త పేజీకి లింకు ఇవ్వండి. ఈ పని ఎలా చెయ్యాలో తెలుసుకునేందుకు వికీపీడియా:వికీప్రాజెక్టు/అనాథాశ్రమం పేజీ చూడండి.
  2. మీ కొత్త పేజీని అగాధ పేజీ కానీయకండి. ఈ పేజీ నుండి ఇతర పేజీలకు కనీసం మూడైనా వికీలింకులు ఇవ్వండి.
  3. మీ కొత్త పేజీని కనీసం ఒక్కటైనా వర్గం లోకి చేర్చండి.
    1. వ్యక్తుల పేజీలకు జనన, మరణ వర్గాలు ప్రత్యేకం. అవి ఉన్నాయా లేదా చూడండి. అలాగే ఆయా సంవత్సరాలు, తేదీల పేజీల్లో వారి జనన, మరణాలను నమోదు చెయ్యండి. మరిన్ని వివరాలకు వికీపీడియా:వికీప్రాజెక్టు/జనన మరణాల నమోదు ప్రాజెక్టు చూడండి.
    2. వ్యక్తుల పేజీలను వారి జననం, జీవించిన ప్రాంతాలను బట్టి భౌగోళిక వర్గాలుంటాయి. అలాగే వారి వృత్తి ప్రవృత్తులను బట్టి కూడా వర్గాలుంటాయి. వారి జాతిని బట్టి కూడా వర్గాలుంటాయి. వారి నివాసస్థితిని బట్టి కూడా వర్గాలుంటాయి. మీరు సృష్టించిన పేజీని సముచితమైన వర్గాల్లోకి చేర్చండి. ఈ విషయమై కొంత సమాచారం కోసం వికీపీడియా:వికీప్రాజెక్టు/వ్యక్తుల వర్గాల క్రమబద్ధీకరణ ప్రాజెక్టును చూడవచ్చు.
  4. అంతర్వికీ లింకులివ్వండి. నేవిగేషను పట్టీలో "ఇతర భాషలు" కింద వికీపీడియాల లింకులు ఇవ్వాలి. లింకు ఎలా ఇవ్వాలో తెలుసుకునేందుకు అంతర్వికీ లింకులు చూడండి.
  5. సమాచార పెట్టె పెట్టండి. చాలా వికీ పేజీలకు పైన కుడివైపున సమాచారపెట్టె ఉంటుంది. అది ఉండాలన్న రూలేమీ లేదు. కానీ చాలావాటికి ఉంటుంది. అది లేకపోతే సముచితమైన సమాచారపెట్టెను చేర్చండి. అందులో చేర్చాల్సిన సమాచారం వ్యాసం లోనే ఉంటుంది.
  6. వ్యాసంలో సంబంధించిన బొమ్మ చేర్చండి. వ్యాసంలో బొమ్మ లేకపోతే, సముచితమైన బొమ్మ కోసం తెవికీ లోను, కామన్స్ లోనూ వెతికి దాన్ని చేర్చండి. లేకపోతే మీరే సముచితమైన బొమ్మను ఎక్కించి, దాన్ని వ్యాసంలో చేర్చండి.
  7. {{Authority control}} అనే మూసను చేర్చండి. వ్యక్తులు, సంస్థలు, పుస్తకాలు, ప్రదేశాలు వంటి చాలా వ్యాసాల్లో ఈ మూసను చేర్చే ఆస్కారం ఉంది. ఈ మూసను పేజీలో అడుగున చేర్చాలి. ఈ మూసను పేజీలో చేరిస్తే ఎలా కనబడుతుందో తెలుసుకునేందుకు ఉదాహరణగా టి. ఎన్. శేషన్ పేజీలో అడుగున చూడవచ్చు. ఆ వ్యక్తికి అలాంటి ఐడెంటిటీలు లేకపోతే, ఈ మూసను చేర్చినప్పటికీ ఏమీ కనబడదు. మూస పేరును చేర్చితే చాలు, పరామితులేమీ ఇవ్వనక్కర్లేదు. అయితే నేవిగేషను పట్టీ లోని "వికీడేటా అంశం" లింకు తప్పనిసరిగా ఉండాలి. ఈ లింకు లేని పక్షంలో ఈ మూసకు పరామితులు ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇవేమీ లేకపోయినా ఉత్తమూసను పేజీలో చేర్చినప్పటికీ నష్టమేమీ లేదు. భవిష్యత్తులో వికీడేటా లింకు ఏర్పడినప్పుడు, అక్కడి పేజీలో ఐడెంటిటీ లక్షణాలను చేర్సితే ఇక్కడ ఈ మూస ఆటోమాటిగ్గా ఆ ఐడెంటిటీ లింకులను చూపిస్తుంది.
  8. మీకు ఆటోవికీబ్రౌజరు (AWB) వాడుకరి అనుమతి ఉంటే, అది తెరిచి, Pagelist లో ఈ పేజీని చేర్చి, options ట్యాబులో Regex typo fixing అనే అంశాన్ని ఎంచుకుని ఈ పేజీలో దిద్దుబాటు చెయ్యండి. అలా చేస్తే, వికీపీడియా:AutoWikiBrowser/Typos అనే పేజీలో చూపించిన భాష, శైలి, వ్యాకరణ, తదితర దోషాలు ఈ పేజీలో ఉంటే AWB వాటిని సవరిస్తుంది.
  9. పేజీ చదవండి. భాషాదోషాలు, శైలీ దోషాలు ఏమైనా ఉంటే సవరించండి.

పేజీల దిగుమతి గురించి

[మార్చు]

ఇంగ్లీషు, తదితర భాషల వికీపీడియాల్లో వాళ్ళు తయారు చేసుకునే మూసలు తెవికీలో కూడా అవసరమైతే, వాటిని ఇక్కడ మళ్ళీ తయారు చేసుకునే అవసరం లేకుండా, కాపీ పేస్టు చేసుకునే అవసరం లేకుండా వాటిని తెవికీలోకి తెచ్చుకునే సౌకర్యమే దిగుమతి. దిగుమతి చేసుకోవడాం వలన కొన్ని ప్రత్యేకమైన లాభాలున్నాయి. అవి:

  • దిగుమతి చేసుకునేటపుడు మూలం లోని చరిత్ర కూడా దిగుమతి అవుతుంది. అక్కడి వాడుకరులు ఇక్కడ కూడా ఉంటే సంబంధిత శ్రేయస్సు వారికి చెందుతుంది.
  • ఆ మూసల్లో వాడిన ఇతర మూసలు కూడా ఆటోమాటిగ్గా దిగుమతి అవుతాయి.
  • ఒకవేళ దిగుమతి చేసుకునే మూస ఇక్కడ ఈసరికే ఉంటే, మూలంలోని కూర్పు ఇక్కడి దాని కంటే కొత్తదైతే, కొత్త కూర్పులు దిగుమతి అవుతాయి. దానివల్ల మూస తాజా అవుతుంది.
  • దిగుమతి చేసుకున్నందువలన భాషా లింకులు ఆటోమాటిగ్గా ఏర్పడతాయి. ఆ మూసలను వాడే వ్యాసాలను అనువాద పరికరం ద్వారా అనువదించేటపుడు దిగుమతి చేసుకున్న మూస కూడా ఆటోమాటిగ్గా అనువాద వ్యాసంలో చేరుతుంది.

దిగుమతి చేసే అవకాశం సాధారణ వాడుకరులకు ఉండదు. నిర్వాహకులు, అధికారులు మాత్రమే దిగుమతులు చెయ్యగలరు. దిగుమతి చెయ్యాల్సిన అవసరం ఉన్న వాడుకరులు నిర్వాహకులను అభ్యర్థించవచ్చు. అభ్యర్థనలను వికీపీడియా:దిగుమతి అభ్యర్థనలు పేజీలో చేర్చాలి.

చేసే విధానం

[మార్చు]

ప్రత్యేక పేజీల్లో దిగుమతి చేసుకోండి అనే లింకుకు వెళ్తే దిగుమతి ఫారం కనిపిస్తుంది. అక్కడ దిగుమతి చేసుకోవాల్సిన మూలం పేజీ పేరు, మూలం వికీ పేరు, దిగుమతి అయిన పేజీ ఏ పేరుబరిలో ఉండాలో అది (స్క్షాధారణంగా ఇది మూలం లోని పేరుబరే), మూలం లోని వాడుకరి ఇక్కడ ఉంటే దీని శ్రేయస్సు వారికి ఆపాదించు.. తదితర ఫీల్డులలో సమాచారం ఇచ్చి దిగుమతి చేసుకోవాలి. సాధారణంగా మూసలను మూలం లోని పేర్ల తోటే ఉంచడం ఉత్తమం.

దిద్దుబాట్లు చేస్తూండగా బ్రౌజరు క్రాష్ అయితే

[మార్చు]

దిద్దుబాట్లు చేసేటపుడు, ఏ కారణం చేతనైనా అకస్మాత్తుగా, అనుకోకుండా, మన ప్రమేయం లేకుండా, చేసిన మార్పుచేర్పులను ప్రచురించకుండానే బ్రౌజరు మూసుకుపోతే, మనం అప్పటి వరకూ చేసిన మార్పుచేర్పులను కోల్పోతాం. ఇటీవల వికీ సాఫ్టువేరులో వచ్చిన కొత్త అంశం ఆ సమస్యను పరిష్కరిస్తోంది. ఏదైనా వ్యాసాన్ని మనం దిద్దుబాటు మొదలుపెట్టగానే బ్రౌజరు ప్రతి 5 సెకండ్లకూ ఒకసారి సేవు చేస్తూ పోతుంది. అలా కొంతసేపు చేసాక కరెంటు పోయిందనుకుందాం లేదా బ్రౌజరు క్రాషైందనుకుందాం. మళ్ళీ మనం బ్రౌజరును తెరిచి (అదే కంప్యూటరులో, అదే బ్రౌజరును వాడినప్పుడు మాత్రమే) అదే వ్యాసాన్ని మళ్ళీ దిద్దుబాటు కోసం తెరిచినపుడు, కిందటిసారి మనం చేసిన దిద్దుబాట్లను తెచ్చేస్తుంది. మనం చేసిన మార్పులన్నీ క్షేమంగా ఉంచుతుంది అప్పటిదాకా. విశేషాలు:

  1. మీ అభిరుచుల్లో, దిద్దుబాట్లు ట్యాబులో, దిద్దుబాటు రికవరీ అంశాన్ని చేతనం చెయ్యి అనే అంశాన్ని ఎంచుకోవాలి, మొదటి బొమ్మలో హైలైటు చేసిన అంశం.
  2. ఇది ప్రస్తుతం 2010 వికీటెక్స్టు ఎడిటరు లోనే పనిచేస్తుంది. అంటే మీ అభిరుచుల్లో సవరణ టూల్ బార్ సచేతనం అనే అంశాన్ని ఎంచుకుని ఉండాలి. రెండవ బొమ్మలో హైలైటు చేసిన అంశం
  3. విజువల్ ఎడిటరులో ఈ అంశం ఈసరికే ఉంది, కానీ అది పనిచెయ్యాలంటే ఒక షరతు ఉంది - అదేంటంటే - బ్రౌజరు మూతపడే ముందు, ఆ ట్యాబు వెలుగులో ఉండాలి (కంట్రోలు ఆ ట్యాబు లోనే ఉండాలి). 2017 వికీటెక్స్టు ఎడిటరు, విజువల్ ఎడిటరులో భాగమే కాబట్టి దీనికీ విజువల్ ఎడిటరుకు ఉన్న సౌకర్యమే ఉంది.
  4. మొదటిసారి ఏ డివైసులో, ఏ బ్రౌజరులో దిద్దుబాట్లు చేసారో, అదే డివైసులో అదే బ్రౌజరులో మళ్ళీ చేస్తేనే ఇది పనిచేస్తుంది. అవి తేడాగా ఉంటే పనిచెయ్యదు.
  5. ఒకేసారి ఎన్ని పేజీల్లో దిద్దుబాట్లు చేస్తుంటే అన్నిటినీ ఇది సేవు చేస్తూంటుంది. ఈ పేజీల జాబితాను ప్రత్యేక:EditRecovery పేజీలో చూడవచ్చు. ఇది వాడుకరికే ప్రత్యేకించిన వ్యక్తిగతమైన పేజీ. ఉదాహరణకు మూడవ బొమ్మ చూడవచ్చు

ముఖ్య గమనిక: కావాలనో, పొరపాటునో మనమే ప్రచురించకుండా దిద్దుబాటును రద్దుచేస్తే ఇది పనిచెయ్యదు. (మనం రద్దు చేసేముందు అది ధ్రువీకరణ అడుగుతుంది, అప్పుడు సరేనంటేనే అది రద్దు చేస్తుంది)

దీనిపై మరింత సమాచారం కోసం ఈ లింకు చూడండి.

కాలదోషం పట్టినా వాక్యదోషం ఏర్పడకుండా రాయడం

[మార్చు]

వికీపీడియాలో వ్యాసాలను కొత్త సమాచారంతో తాజాకరించడం అనేది ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండాలి. లేదంటే సందర్భానికి కాలదోషం పట్టి కొన్ని వాక్యాలు మురిగిపోయి కనిపిస్తాయి. ఉదాహరణకు, "భారత సార్వత్రిక ఎన్నికలు 2024 ఏప్రిల్, మే నెలల్లో జరగనున్నాయి", "ఈ సినిమా 2020 జనవరి 4 న విడుదల కానుంది", "హైదరాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం 2008 నాటికి ప్రారంభమౌతుందని భావిస్తున్నారు". ఇలాంటివి చదివినపుడు, వ్యాసం పట్ల పాఠకులకు విముఖత కలిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని నివారించడానికి రెండు మార్గాలున్నాయి.

  1. సమాచారం చేర్చినపుడే భవిష్యత్తు తేదీల పక్కన తాజాకరణ అవసరం అని ఒక గుర్తు పెట్టడం. తద్వారా ఆ భవిష్యత్తు సమయం దాటినపుడు ఆ పేజీలే మాకు తాజాకరణ అవసరం అని సూచిస్తాయి. దీని గురించిన సమాచారం కోసం ఇదే పేజీలో కాలదోషం పట్టే వ్యాసాలను గుర్తించడం ఎలా అనే విభాగం చూడండి.
  2. రెండవ పద్ధతి - సమాచారానికి కాలదోషం పట్టినప్పటికీ, వాక్యాల్లో దోషం ఏర్పడకుండా రాయడం. దీని గురించి ఈ విభాగం తెలియజేస్తుంది.

ఈ పద్ధతిలో ముఖ్యమైన అంశం ఏమిటంటే వాక్యంలో దోషం ఏర్పడకుండా దాని నిర్మాణంలో జాగ్రత్త పడడం. దీని కోసం కింది పద్ధతులను పాటించవచ్చు

  • సాధ్యమైనంత వరకు "ప్రస్తుతం" అనే మాటను వాడవద్దు. "ప్రస్తుతం ఆమె బంగ్లాదేశ్ ప్రధాని పదవిలో ఉంది." అనే వాక్యం, 2024 ఆగస్టు 7 నుండి చెల్లదు, అందులో దోషం ఏర్పడుతుంది. దాని బదులు, "2024 ఆగస్టు 2 నాటికి ఆమె బంగ్లాదేశ్ ప్రధానిగా ఉంది" అని రాస్తే, దోషం ఏర్పడదు. ఆమె దిగిపోయాక, ఈ పేజీని తాజాకరించడంలో ఆలస్యమైతే, సమాచారం తాజాగా లేదు అనే లోపం ఉంటుంది తప్ప, "తప్పు" సమాచారమైతే ఉండదు (ఆగస్టు 6 న వ్యక్తి పదవి నుండి దిగిపోతే, ఆగస్టు 11 న "ప్రస్తుతం ఆమె ప్రధానిగా ఉంది" అనే వాక్యం తప్పే కదా!).
  • సంస్థల అధ్యక్షులు, చైర్మన్లు, గ్రామ పంచాయితీ అధ్యక్షులు,.. వగైరా పదవుల్లో ఉన్నవారి పేర్లను సమాచారపెట్టెలో రాయకపోవడం ఉత్తమం. ఒకవేళ రాసినా, తప్పనిసరిగా దాని పక్కనే బ్రాకెట్లో "ఫలానా తేదీ నాటికి" అని రాయాలి
  • ఇంగ్లీషు నుండి వ్యాసాలను అనువదించేటపుడు కూడా ఈ సంగతిని గుర్తుంచుకోవాలి. ఇంగ్లీషు లోని మూల వ్యాసంలో కూడా పాచిపోయిన సమాచారం ఉండే అవకాశం ఉంది. కాబట్టి అనువాదాన్ని ప్రచురించేటపుడు ఈ సంగతిని గమనంలో ఉంచుకోవాలి. "ఈ ప్రాజెక్టు 2012 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు." లాంటి వాక్యాలుంటాయి ("ఈ ప్రాజెక్టు నిరుడు పూర్తవుతుందని భావిస్తున్నారు" లాంటి వాక్యమే ఇది). అలాంటి సందర్భాల్లో తాజాసమాచారం కోసం వెతికి దాన్ని తగు మూలాలతో చేర్చడం అత్యుత్తమం. లేదా ఈ వాక్యాన్ని "ఈ ప్రాజెక్టు 2012 నాటికి పూర్తవుతుందని 2010 లో అంచనా వేసారు" లాగా మారిస్తే కొంత నయం - సమాచారం పాతదే అయినప్పటికీ, వాక్యంలో దోషం ఉండకుండా ఉంటుంది.

archive-url లోని టైమ్‌స్టాంపు, archive-date రెండూ ఒకటే ఉండాలి

[మార్చు]

వ్యాసంలో మూలాన్ని చేర్చినపుడు, ఆ మూలాన్ని ఆర్కైవు చెయ్యడం అనేది ఉత్తమమైన పద్ధతి. ఆర్కైవు లింకు అనేది శాశ్వతమైనది, ఎప్పటికీ చచ్చిపోదు. తద్వారా, మూలంలో ఇచ్చిన url, కొద్దికాలం తరువాత డెడ్ అయినప్పటికీ ఆర్కైవు లింకు శాశ్వతంగా ఉండిపోతుంది కాబట్టి మూలం మాత్రం ఎప్పటికీ లైవుగానే ఉంటుంది. అంచేత కొత్త మూలాన్ని చేర్చినపుడెల్లా ఆర్కైవు చెయ్యడం తప్పనిసరి.

సాధారణంగా మూలాన్ని archive.org అనే సైటులో ఆర్కైవు చేస్తూంటాం. మూలపు url ను archive.org కు సమర్పించినపుడూ అది దాన్ని ఆర్కైవు చేసి ఒక archive-url ను ఇస్తుంది. దాన్ని తెచ్చి, వ్యాసం లోని మూలంలో చేర్చాలి. దానితో పాటు ఆర్కైవు చేసిన తేదీ, archive-date, ని కూడా చేర్చడం తప్పనిసరి. లేదంటే లోపం తలెత్తుతుంది. ఆర్కైవు చేసినది ఈ రోజునే అయితే archive-date ఇవ్వాళ్టి తేదీ అవుతుంది. అయితే మీరు ఆర్కైవు చెయ్యదలచిన url ను ఈసరికే గతంలో ఆర్కైవు చేసి ఉండవచ్చు. ఆ archive-url ను వాడినపుడు archive-date కూడా అప్పటిదే ఇవ్వాలి. ఇవ్వాళ్టి తేదీ ఇచ్చినా, మరొక తేదే ఇచ్చినా, తెవికీ లోపం చూపిస్తుంది. ఆర్కైవు చేసిన తేదీ ఎప్పుడనేది ఇలా కనుగొనాలి:

  • ఒక పద్ధతి:
    archive.org లో అర్కైవ్ url కు వెళ్ళినపుడు తెరపై పైన కుడి చివర నలుపు రంగు నేపథ్యంలో తేదీని చూపిస్తుంది. అదే archive-date. పక్కనున్న తెరపట్టు చూడండి.
  • మరో పద్ధతి: archive-url లోనే, టైమ్‌స్టాంపు రూపంలో archive-date ఇమిడి ఉంటుంది. archive-url ఇలా ఉంటుంది: https://web.archive.org/web/20211224165002/https://.... ఇందులో web/ తరువాత ఉన్న 20211224165002 అనేది టైమ్‌స్టాంపు. ఇందులో మొదటి నాలుగు అంకెలు (2021) సంవత్సరాన్ని, తరువాతి రెండు అంకెలు (12) నెలను, ఆ తరువాతి రెండు అంకెలు (24) తేదీనీ చూపిస్తాయి. (ఆ తరువాతి అంకెలు గంటలు, నిమిషాలు, సెకండ్లను సూచిస్తాయి) అంటే పై archive-url కు archive-date 2021-12-24 అన్నమాట! తెవికీ ఈ రెంటినీ పోల్చి చూసుకుంటుంది. పై url కు archive-date 2021-12-24 ఉంటే సరే, లేదంటే లోపం చూపించి సంబంధిత వర్గంలో వేస్తుంది.

గమనిక: మూలం లోని url ను ఆర్కైవు చేసేందుకు InternetArchiveBot అనే బాటు కూడా ఉంది. దీన్ని మానవికంగా ఎవరైనా నడపవచ్చు.