సరిత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సరిత

జన్మ నామంసరిత
జననం (1964-10-08) 1964 అక్టోబరు 8 (వయసు 59)
Indiaమద్రాసు
తమిళనాడు
భార్య/భర్త ముఖేష్ (1989 - 2007) విడాకులు
ప్రముఖ పాత్రలు మరో చరిత్ర
ఆడవాళ్ళు మీకు జోహార్లు

సరిత దక్షిణ భారతీయ సినిమా నటీమణి. మరో చరిత్ర సినిమాతో బాగా పేరొందిన ఈమె సుమారు 160 చిత్రాలలో నటించింది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో నాయకిగా నటించి పేరు గాంచిన సరిత.. మలయాళ నటుడు ముఖేష్‌ను ప్రేమించి పెళ్లాడింది. వీరికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. కొంత కాలం తరువాత సరిత, ముఖేష్ మధ్య అభిప్రాయబేధాలు తలెత్తాయి. ఫలితం విడాకులకు దారి తీసింది. 2009లో ముఖేష్ సరిత నుంచి వివాహ రద్దు కోరుతూ చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ కాలం సాగిన ఈ కేసు విచారణ రెండేళ్ల క్రితం ముఖేష్, సరితకు విడాకులు మంజూరు చేస్తూ తీర్పు నిచ్చింది.దీంతో ముఖేష్.. మిధుల అనే ఆమెను రెండో వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహం చెల్లదంటూ నటి సరిత కేరళ, కొచ్చిలోని కుటుంబ సంక్షేమ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అందులో ఆమె పేర్కొంటూ చెన్నై కోర్టులో ముఖేష్ వివాహ రద్దు కోరుతూ వేసిన పిటీషన్‌పై విచారణ జరిగే సమయంలో తాను దుబాయిలో ఉన్నానన్నారు. దీంతో కోర్టు జారీ చేసిన నోటీసులను తాను అందుకోలేకపోయానని వివరించారు. తాను కోర్టుకు హాజరు కాకపోవడంతో కోర్టు విడాకులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.అందువలన ముఖేష్ రెండో వివాహం చెల్లదని తీర్పు ఇవ్వవలసిందిగా కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసు విచారణ సందర్భంగా సరిత, ముఖేష్‌లిద్దరూ 2015 మార్చి 4, గురువారం కొచ్చి కుటుంబ సంక్షేమ కోర్టుకు హాజరయ్యారు.[1]

ఇతర విశేషాలు[మార్చు]

  • ఈమె నటిగానే కాక డబ్బింగ్ కళాకారిణిగా కూడా రాణించింది.

పురస్కారాలు[మార్చు]

ఫిలిం ఫేర్ పురస్కారాలు[మార్చు]

నంది పురస్కారాలు[మార్చు]

తమిళనాడు రాష్ట్ర పురస్కారాలు[మార్చు]

  • తమిళనాడు రాష్ట్రం నుండి కలైమణి పురస్కారం
  • 1979 – ఉత్తమ నటి పురస్కారం - Oru Vellaadu Vengaiyagiradhu
  • 1982 – ఉత్తమ నటి పురస్కారం - Agni Sakshi
  • 1988 – ఉత్తమ నటి పురస్కారం - Poo Pootha Nandavanam

కర్ణాటక రాష్ట్ర పురస్కారాలు[మార్చు]

  • 1989-ఉత్తమ నటి పురస్కారం - Sankranthi

నటించిన చిత్రాలు[మార్చు]

తెలుగు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ""Mukesh's ex-wife Saritha faints in court". timesofindia.indiatimes.com. timesofindia. 4 March 2015. Retrieved 4 March 2015.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సరిత&oldid=4101546" నుండి వెలికితీశారు