సాంగ్లీ జిల్లా
సాంగ్లీ జిల్లా
सांगली जिल्हा | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మహారాష్ట్ర |
డివిజను | పూణే |
ముఖ్య పట్టణం | Sangli |
మండలాలు | |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు |
|
విస్తీర్ణం | |
• మొత్తం | 8,578 కి.మీ2 (3,312 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 28,20,575 |
• జనసాంద్రత | 330/కి.మీ2 (850/చ. మై.) |
• Urban | 24.5 |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 62.41% |
ప్రధాన రహదార్లు | NH-4, NH-204 |
సగటు వార్షిక వర్షపాతం | 400–450 మి.మీ. |
Website | అధికారిక జాలస్థలి |
మహారాష్ట్ర లోని జిల్లాలలోసాంగ్లి జిల్లా (హిందీ:) ఒకటి. సాంగ్లి పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లాలో 24.51% ప్రజలు నగరాలలో నివసిస్తున్నారు. సాంగ్లి జిల్లా ... డివిజన్‌లో భాగంగా ఉంది. జిల్లాలో ప్రధానంగా సాంగ్లి, మిరజ్ పట్టణాలు పెద్దవిగా ఉన్నాయి. .[2] సాంగ్లి జిల్లాలోని కిర్లోస్కర్ నగరం పారిశ్రామిక ప్రాధాన్యత కలిగి ఉంది. పారిశ్రామిక వేత్త లక్ష్మీనారాయణ కిర్లోస్కర్ ఇక్కడ ఫ్యాక్టరీ ప్రారంభించాడు.
చరిత్ర
[మార్చు]సాంగ్లి జిల్లాలో ఉన్న కుండల్ చాళుక్యులకు రాజధానిగా ఉండేది. 1600 వందల సంవత్సరాలనాటి పురాతనమైన కుండల్ గ్రామం (పురాతన కౌండిన్యపురం) పూర్వం కర్నాటకలో భాగంగా ఉండేది. [3] పులకేశి కర్నాటక లోని వాతాపిని (బాదామి) ని రాజధానిగా చేసుకున్నాడు. కూడల్ క్రాంతిసింఘ నానా పాటిల్, షాంరావ్ లాడ్, కేప్టన్ రామచంద్రా లాడ్, జి.డి. లాడ్, శంకర్ జంగం, హౌసబాయి వంటి స్వాతంత్ర్య సమరయోధులు నివసించారు.
భాషలు
[మార్చు]జిల్లాలో ప్రధానంగా మరాఠీ భాషవాడుకలో ఉన్నప్పటికీ కన్నడం కూడా అధికంగా వాడుకలో ఉంది.
ఆలయాలు
[మార్చు]జిల్లాలోని పురాతనమైన నరసింహపూర్ గ్రామంలో క్రీ.పూ 1100- 12000 సంవత్సరాలనాటి పురాతనమైన నరసింహాలయం ఉంది. సంత్ నామదేవ్, తాంతియాతోపే, సిద్ధేశ్వర్ మహరాజ్ మొదలైన వారు ఇక్కడ నివసించారు. గురుచరుత్రలో ఈ ప్రాంత ప్రస్తావన ఉంది.
భౌగోళికం
[మార్చు]సంగ్లి జిల్లా మహారాష్ట్ర పశ్చిమ భాగంలో ఉంది.
సరిహద్దులు
[మార్చు]జిల్లా ఉత్తర సరిహద్దులో సతారా, సోలాపూర్ జిల్లా, తూర్పు సరిహద్దులో బీజపూర్ జిల్లా, దక్షిణ సరిహద్దులో కోల్హాపూర్ జిల్లా, బెల్గాం జిల్లా, రత్నగిరి జిల్లా ఉన్నాయి.
నదులు
[మార్చు]సంగ్లి జిల్లా వార్నా, కృష్ణా నదీమైదానాల మద్య ఉంది. జిల్లాలో ప్రవహిస్తున్న వార్నా, పంచగంగా నదులు కృష్ణా నదిలో సంగమిస్తున్నాయి. జిల్లాలోని భూమి వ్యవసాయానికి అనుకూలంగా సారవంతంగా ఉంది.
-
లక్ష్మీ మార్కెత్, మిరజ్]
-
సాంగ్లీ జిల్లాలోని ఒక గ్రామం
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2,820,575,[4] |
ఇది దాదాపు. | జమైకా దేశ జనసంఖ్యకు సమానం.[5] |
అమెరికాలోని. | కనాస్ నగర జనసంఖ్యకు సమం..[6] |
640 భారతదేశ జిల్లాలలో. | 137 వ స్థానంలో ఉంది..[4] |
1చ.కి.మీ జనసాంద్రత. | 329 .[4] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 9.18%.[4] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 964: 1000[4] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 82.62%.[4] |
జాతియ సరాసరి (72%) కంటే. | |
భాషలు | మరాఠీ, కన్నడ, |
సంస్కృతి
[మార్చు]కుండల్ సమీప ంలోని కొండ మీద వీరభద్రా ఆలయం ఉంది. ఇది 300 సంవత్సరాల పురాతనమైనదని భావిస్తున్నారు. కుండల్ ప్రముఖ యాత్రాకేంద్రంగా ఉంది. ఇక్కడ దిగంబర్ జైన ఆలయం ఉంది. ఇక్కడకు ప్రతిసంవత్సరం వేలాది జైనులు యాత్రార్ధం వచ్చిపోతుంటారు. ఇక్కడ జైసింగ్ మాహారాజా ఆలయం నిర్మించబడి ఉంది. కుండల్ కొండల మద్య ఉంది. మహావీర్ విగ్రహం సమీప ం నుండి సెలయేటి జలాలు ప్రవహిస్తుంటాయి. ఇక్కడ మహావీరుని విగ్రహం, సీతా,రామ, లక్ష్మణలున్న రెండు గుహలు ఉన్నాయి. [7] కొండ మీద విశాలమైన ప్రదేశంలో " సమవ్ షరన్ " పేరుతో జైనుల పవిత్ర ప్రదేశం ఉంది. ఇక్కడ మహావీరుడు ప్రసంగించాడని భక్తులు విశ్వసిస్తున్నారు.
ప్రముఖులు
[మార్చు]- గోపాల్ గణేశ్ అగర్కార్ :- సాంఘిక, రాజకీయ సంస్కరణ కార్యకర్త. ఆయన తెంబు పట్టణంలో జన్మించాడు.
- బాలగంధర్వ :- జిల్లాలోని నాగ్థానేలో జన్మించాడు.
- సాంగ్లి ఆశా భోంస్లేకు జన్మస్థానం.
- సాంగ్లి హిందీ చలనచిత్ర నటి భాగ్యశ్రీ పట్వర్ధన్ జన్మస్థలం.
- సాంగ్లీలో సంగీత్ నాటకాలు, ఆరంభించబడ్డాయి.
- సంగీత నాటకాలకు మూలకర్త విష్ణుదాస్ భావే. సాంగ్లి ఆయనకు జన్మస్థలం.
- సాంగ్లికి సమీప ంలో ఉన్న విట పట్టణానికి " బంగారు నగరం " అనే మారు పేరు ఉంది.
రాజకీయనాయకులు
[మార్చు]సాంగ్లి జిల్లా పలు రాజకీయ నాయకులకు జన్మస్థలం. వీరిలో యశ్చంత్‌నాథ్ చావన్ (మహారాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి), వసంత్దాదా పాటిల్ (మహారాష్ట్ర ముఖ్యమంత్రి), గులాబ్‌రావ్ పాటిల్, గత మహారాష్ట్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మరుయు పార్లమెంటు సభ్యుడు, పంతంగ్రావ్ కదం (క్యాబినెట్ ఫారెస్ట్ మంత్రి, భారతి విద్యాపీఠం చాంసలర్, జయంత్ పాటిల్, ఆర్.ఆర్.పాటిల్, మదన్ పాటిల్ మొదలైన వారు సాంగ్లికి చెందిన వారే. ఆర్.ఆర్. పాటిల్ మహారాష్ట్ర హోం మంత్రి, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసాడు. జయంత్ పాటిల్ మహారాష్ట్ర రూరల్ డెవెలెప్మెంటు క్యాబినెట్ మంత్రిగా పనిచేసాడు. ఆయన మాహారాష్ట్ర ఆర్థిక మంత్రిగా పనిచేసాడు. క్రికెట్ వీరుడు విజయ్ హజారే సాంగ్లిలో జన్మించాడు.
దౌలప్ప భౌరావ్ నవాలె
[మార్చు]దౌలప్ప భౌరావ్ నవాలే 1910 జనవరి 15న అంకఖాప్ గ్రామంలో జన్మించాడు. ఆయన సాంగ్లీలో "షెత్కారి సహకారి సాకర్ కార్ఖానా " స్థాపించాడు. ఆయన 1962 నుండి 1971 వరకు ఎం.ఎల్.సిగా పనిచేసాడు. 1937లో ఆయన తనమిత్రులు గౌరిసిహాసనె, సక్కరం రెథరెఖర్ లతో కలిసి కాంగ్రెస్ తరఫున ఎన్నికలలో పాల్గొన్నాడు. ఎన్నికలలో ఆయన తనమిత్రులతో బ్రిటిష్ ప్రభుత్వానికి చెందిన కూపర్ పార్టీకి వ్యతిరేకంగా విజయం సాధించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రచారం అంకల్ఖోప్ - ఔదుంబర్ నుండి ప్రారంభించారు. అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ అంకల్ఖోప్ - ఔదుంబర్ నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నారు. సతారా జిల్లా నుండి మహాత్మాగాంధీతో సత్యాగ్రహంలో పాల్గొన్న వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది. 1940 ఆయన భిల్వాడి నుండి సత్యాగ్రహం ప్రారంభించాడు. తరువాత ఆయన ఖైదుచేయబడి యర్వాడా సెంట్రల్ జైల్‌కు పంపబడ్డాడు. ఆయన యెష్వంత్రవ్ భి.చవన్ స్వామి రామానంద్ భారతి, వి.ఎస్.పి. నానా పాటిల్ & వసంత్రఒ (దాదా) బందుజి పాటిల్ మొదలైన వారికి ఆప్తుడు. 1942 మే 24న ఆయన తన మిత్రులు వై.బి.చవన్ & వసంతదాదా పాటిల్‌లతో కలిసి తన స్వత ఊరు అంకల్ఖాప్ వద్ద చారిత్రాత్మక ప్రీతి సంగం స్థాపించాడు. గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడైన ఆయనను బ్రిటిష్ ప్రభుత్వం రెండు మార్లు ఖైదు చేసింది. ఆయన తాస్గావ్ సత్యాగ్రహ, ఇస్లాంపూర్, బిలాషి సత్యాగ్రహ మొదలైన వాటిలో పాల్గొన్నాడు. ఆయన సాంగ్లి జిల్లాలో పలు కోపరేటివ్ సంస్థలు, విద్యాసంస్థలు స్థాపించాడు. ఆయన 1988 సెప్టెంబరు 30న మరణించాడు.
- గజానన్ దిగంబర్ మద్గుల్కర్ (1919-1917) మరాఠీ భాషా కవి, గీతరచయిత, రచయిత, నటుడు. ఆయన అత్పాడి తాలూకాలోని మద్గులెలో జన్మించాడు.
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Based on Election Commission website
- ↑ "Census GIS India". Archived from the original on 2015-04-25. Retrieved 2014-11-27.
- ↑ "Chalukya capital tells a tale of ruin". Radhesham Jadhav. Retrieved 2009-04-14.[permanent dead link]
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Jamaica 2,868,380 July 2011 est
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Kansas 2,853,118
- ↑ "Jain Glory of Maharashtra". Retrieved 2009-04-14. [dead link]
వెలుపలి లింకులు
[మార్చు]- Official website of Sangli district
- Map of Sangli district
- Laxminarayan Puratan Vastu Sanghralay Museum in Sangli