అక్షాంశ రేఖాంశాలు: 18°24′0″N 81°40′0″E / 18.40000°N 81.66667°E / 18.40000; 81.66667

సుక్మా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుక్మా
పట్టణం
సుక్మా is located in Chhattisgarh
సుక్మా
సుక్మా
Coordinates: 18°24′0″N 81°40′0″E / 18.40000°N 81.66667°E / 18.40000; 81.66667
దేశం India
రాష్ట్రంఛత్తీస్‌గఢ్
జిల్లాసుక్మా జిల్లా
Elevation
210 మీ (690 అ.)
జనాభా
 • Total13,926
భాషలు
 • అధికారికహిందీ, ఛత్తీస్‌గఢీ
Time zoneUTC+5:30 (IST)
Telephone code07864-284001
Vehicle registrationCG
Coastline0 కిలోమీటర్లు (0 మై.)
Websitehttp://sukma.gov.in

సుక్మా ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం, సుక్మా జిల్లాలోని పట్టణం. ఈ జిల్లాకు ముఖ్యపట్టణం కూడా.

భౌగోళికం

[మార్చు]

సుక్మా 18°23'23.8"ఉత్తర, 81°39'28.9"తూర్పు నిర్దేశాంకాల వద్ద సముద్రమట్టం నుండి 210 మీటర్ల ఎత్తులో ఉంది. [1]

రవాణా

[మార్చు]

సుక్మాలో అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యం, రోడ్డు రవాణా మాత్రమే. జాతీయ రహదారి 30, సుక్మాను జగదల్‌పూర్‌తో కలుపుతుంది. బస్సులు ప్రజా రవాణాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. రాయపూర్, హైదరాబాద్, భిలాయ్, బిలాస్‌పూర్, విజయవాడ, జగదల్‌పూర్, విశాఖపట్నం లకు బస్సులు అందుబాటులో ఉన్నాయి. జీపులు టాక్సీలు ఇతర రోడ్డు రవాణా పద్ధతులు.

సమీప రైల్వే స్టేషను దంతెవాడలో ఉండగా, విమానాశ్రయం జగదల్‌పూర్‌లో ఉంది.

సుక్మా జిల్లా మావోయిస్టుల "రెడ్ కారిడార్ " లో భాగం. భారతదేశంలో ప్రధానంగా నక్సలైట్ -మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాన్ని రెడ్ కారిడార్ అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో మావోయిస్టులు తరచూ దాడులు చేస్తూంటారు. పోలీసు సిబ్బంది, సైనిక బలగాలు, రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తారు. సుక్మా లోను, చుట్టుపక్కల ప్రాంతాల లోనూ జరిగిన కొన్ని మావోయిస్టు సంఘటనలు: 2013 దర్భా లోయలో నక్సలైట్ల దాడి, 2017 సుక్మా దాడి, 2018 సుక్మా దాడి.

మూలాలు

[మార్చు]
  1. http://www.fallingrain.com/world/IN/37/Sukma.html Map and weather of Sukma

 

"https://te.wikipedia.org/w/index.php?title=సుక్మా&oldid=3858388" నుండి వెలికితీశారు