తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°24′36″N 79°35′24″E మార్చు
పటం

నల్గొండ జిల్లా లోని 12 శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గంలో 6 మండలాలు ఉన్నాయి. ఇది షెడ్యూల్ కులాల రిజర్వ్ నియోజకవర్గం. 2016లో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా సూర్యాపేట జిల్లా ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ నియోజకవర్గంలో రెండు కొత్త మండలాలను కూడా ఏర్పాటు చేసారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం సూర్యాపేట జిల్లాలో భాగం.[1][2]

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు[మార్చు]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి. తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గం 1967లో ఏర్పడింది. తొలి ఎన్నికల్లో భీమిరెడ్డి నరసింహారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నర్సింహారెడ్డి సోదరి మల్లు స్వరాజ్యం 1978,1983 ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. రాంరెడ్డి దామోదర్‌రెడ్డి 1985, 1989, 1994లలో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నేదురుమల్లి జనార్ధనరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు.[3]

సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ మూలాలు
1967 బి. నారాయణ రెడ్డి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా [4]
1972 గురుగంటి వెంకట్ నర్సయ్య స్వతంత్ర
1978 మల్లు స్వరాజ్యం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1983 మల్లు స్వరాజ్యం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1985 రాంరెడ్డి దామోదర్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
1989 రాంరెడ్డి దామోదర్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
1994 రాంరెడ్డి దామోదర్ రెడ్డి స్వతంత్ర
1999 సంకినేని వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ
2004 రాంరెడ్డి దామోదర్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
2009 మోతుకుపల్లి నర్సింహులు తెలుగుదేశం పార్టీ
2014 గాదరి కిషోర్ కుమార్ తెలంగాణ రాష్ట్ర సమితి
2018 గాదరి కిషోర్ కుమార్ తెలంగాణ రాష్ట్ర సమితి
సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు రిజర్వ్ గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2023[5] 96 తుంగతుర్తి ఎస్సీ మందుల సామేల్ పు భారత జాతీయ కాంగ్రెస్ 129535 గాదరి కిషోర్ కుమార్ పు బీఆర్ఎస్ 78441
2018 96 తుంగతుర్తి ఎస్సీ గాదరి కిషోర్ కుమార్ పు తెలంగాణ రాష్ట్ర సమితి అద్దంకి దయాకర్ పు భారత జాతీయ కాంగ్రెస్
2014 96 తుంగతుర్తి ఎస్సీ గాదరి కిషోర్ కుమార్ పు తెలంగాణ రాష్ట్ర సమితి 64382 అద్దంకి దయాకర్ పు భారత జాతీయ కాంగ్రెస్ 62003
2009 96 తుంగతుర్తి ఎస్సీ మోత్కుపల్లి నర్సింహులు పు తెలుగుదేశం పార్టీ 80888 గుడిపాటి నర్సయ్య పు భారత జాతీయ కాంగ్రెస్ 69025

2004 ఎన్నికలు[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావుపై 13184 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. దామోదర్ రెడ్డికి 68821 ఓట్లు రాగా, వెంకటేశ్వరరావుకు 55637 ఓట్లు లభించాయి.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Sakshi (25 October 2023). "తుంగతుర్తి.. ఇక్కడ స్థానికేతరులకు సైతం విజయాలు దక్కాయి..!". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
  2. Eenadu (14 November 2023). "నియోజకవర్గం ఒక్కటే.. మూడు జిల్లాల్లో ప్రాతినిధ్యం". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
  3. రేడియో జల్సా న్యూస్. "తుంగతుర్తి నియోజకవర్గం - సమీక్ష". www.radiojalsanews.blogspot.com. Devender Pulugujja. Archived from the original on 17 జూలై 2018. Retrieved 22 June 2018.
  4. Sakshi (20 October 2023). "ఏక్‌బార్‌.. ఎమ్మెల్యే". Archived from the original on 24 October 2023. Retrieved 24 October 2023.
  5. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.