దానిమ్మ

వికీపీడియా నుండి

దానిమ్మపండు
దానిమ్మ
దానిమ్మ పండు.
దానిమ్మ పండు.
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
విభాగము: Magnoliophyta
తరగతి: Magnoliopsida
ఉపతరగతి: Rosidae
వర్గము: Myrtales
కుటుంబము: Lythraceae
ప్రజాతి: Punica
జాతి: P. granatum
ద్వినామము
Punica granatum
L.

ప్రపంచ వ్యాప్తంగా పొడి వాతావరణం గల ప్రదేశాలలో వాణిజ్యపరంగా దానిమ్మ (Pomegranate) సాగవుతోంది. భారతదేశంలో దానిమ్మ సాగు అన్ని రాష్ట్రాలలో సాగులో ఉంది. దానిమ్మ సాగులో మహారాష్ట్ర ప్రథమస్థానంలో ఉంది. 2007 సంవత్సరం నాటికి మన రాష్ట్రంలో 10 వేల ఎకరాల్లో సాగవుతూ, 80 వేల టన్నుల దిగుబడి వస్తుంది. మనదేశం నుంచి 4000-5000 టన్నుల దానిమ్మ పండ్లు ఎగుమతి అవుతున్నాయి.

[మార్చు] దానిమ్మ చెట్టు

  • ముళ్ళతో ఎదిగే పెద్ద పొద లేదా చిన్న వృక్షం.
  • విపరీత అండాకారంలో గురు అగ్రంతో ఉన్న సరళ పత్రాలు.
  • గ్రీవాలలో ఏకాంతంగా గాని, నిశ్చిత సమూహాలుగా గాని అమరిన దట్టమైన ఎరుపురంగు పుష్పాలు.
  • గుండ్రంగా ఉన్న మృదుఫలాలు.
  • కోణయుత విత్తనాలు.

[మార్చు] ఉపయోగాలు

  • దానిమ్మ బెరడు, తొక్క, గింజలను విరోచనాల నివారణకు ఔషధంగా వాడుతారు.
  • దానిమ్మ పండు రసం కుష్టు వ్యాధికి పనిచేస్తుంది.
  • దానిమ్మ వేరు బెరడు, కాండం, ఆకుల నుంచి టానిన్‌లను తయారు చేయవచ్చు.
  • దానిమ్మ పండ్ల తోలు, పూలను బట్టలకు రంగు అద్దే పరిశ్రమలో ఉపయోగిస్తున్నారు.
  • పండ్ల నుంచి ద్రాక్ష వైన్స్‌ కంటే మేలైన వైన్‌ తయారు చేయవచ్చు.
పేజీకి సంభందించిన లింకులు