భానుప్రియ

వికీపీడియా నుండి
భానుప్రియ
BhanuPriyaPortrait.jpg
జననం జనవరి 15 1967 (1967-01-15) (వయసు 45)

భానుప్రియ ఒకప్పటి ప్రఖ్యాత సినీనటి. 1980-1993 మధ్యకాలంలో ఆమె అనేక తెలుగు మరియు తమిళ చిత్రాలలో కథానాయికగా నటించింది. 1990లలో కొన్ని బాలీవుడ్ చిత్రాలలో కూడా నటించింది. ఈమె 1967, జనవరి 15న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. భానుప్రియ సోదరి నిషాంతి కూడా శాంతిప్రియ అన్న పేరుతో తెలుగు తెరకు పరిచయమైంది. భానుప్రియ ప్రస్తుతం అమెరికాలో ఉంటూ, దక్షిణ భారతదేశ ప్రఖ్యాత శాస్త్రీయ నృత్యరీతులైన కూచిపూడి, మరియు భరతనాట్యం నందు శిక్షణ ఇస్తుంది. ఆల్చిప్పల్లాంటి కళ్ళు, వాలు జడతో బాపూ బొమ్మలా ఉండే భానుప్రియ దాదాపు 110 సినిమాలలో కథానాయికగా నటించింది. అభిమానులు ఆమెను మరో శ్రీదేవిగా పిలుచుకుంటుంటారు.

[మార్చు] సినీ జీవితం

భానుప్రియ వంశీ దర్శకత్వంలో వచ్చిన సితార సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వర్ణకమలంతో కళాకారిణిగా మంచి గుర్తింపు తెచ్చుకొంది. ఆమె సహజంగానే మంచి నాట్య కళాకారిణి. దీని తరువాత చాలా కమర్షియల్ సినిమాలలో నటించింది. ఇటీవల సన్ నెటవర్క్ ఛానల్స్లో ప్రసారమైన శక్తి అనే టెలీ ధారావాహికలో కూడా నటించింది.

[మార్చు] వ్యక్తిగత జీవితం

భానుప్రియ, భరతనాట్య కళాకారిణి సుమతీ కౌషల్ కుమారుడు, అమెరికాలో స్థిరపడిన ఫోటోగ్రాఫర్ ఆదర్శ్ కౌషల్ ను వివాహం చేసుకొని చెన్నైలో నివసిస్తుంది. వీరికి ఒక కుమార్తె ఉన్నది.

[మార్చు] భానుప్రియ నటించిన తెలుగు చిత్రాలు

"http://te.wikipedia.org/w/index.php?title=భానుప్రియ&oldid=420412" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు