మునగ
| మునగ | |
|---|---|
| Scientific classification | |
| Kingdom: | ప్లాంటే |
| (unranked): | Angiosperms |
| (unranked): | Eudicots |
| (unranked): | Rosids |
| Order: | బ్రాసికేలిస్ |
| Family: | మొరింగేసి |
| Genus: | మొరింగా |
| Species: | ఎమ్. ఓలీఫెరా |
| Binomial name | |
| మొరింగా ఓలీఫెరా |
|
ములక్కాడ లేదా మునగ (తమిళం: முருங்கை) ఒక రకమైన చెట్టు. దీని శాస్త్రీయ నామం మొరింగా ఓలీఫెరా. ఇది మొరింగా (Moringa) ప్రజాతిలో విస్తృతంగా పెంచే మొక్క. ఇది మొరింగేసి (Moringaceae) కుటుంబానికి చెందినది. ఇది విస్తృత ప్రయోజనాలున్న కూరగాయ చెట్టు. ఇవి సన్నగా పొడవుగా సుమారు 10 మీటర్ల ఎత్తు పెరిగి, కాండం నుండి కొమ్మలు వేలాడుతుంటాయి.
మునగ చెట్లు ముఖ్యంగా ఉష్ణ ప్రాంతాలలో పెరుగుతాయి. ఇవి పొడిగా ఉండే ఇసుక నేలలలో బాగా పెరిగినా, సముద్ర తీర ప్రాంతాలలో కూడా పెరుగుతాయి. ఇవి తొందరగా పెరిగి వర్షాభావాన్ని తట్టుకుంటాయి. వీటినిఆఫ్రికా, దక్షిణ అమెరికా, శ్రీలంక, భారతదేశం, మెక్సికో, మలేషియా మరియు పిలిప్పైన్స్ దేశాలలో పెంచుతున్నారు. ప్రపంచంలో బాగా ఉపయోగపడే చెట్లలో ఇది ఒకటి; దీనిలోని ప్రతీభాగం ఆహారంగాను లేదా ఇతర ప్రయోజనం కలిగివున్నాయి. మునగాకులను పశువులకు దాణాగా ఉపయోగిస్తారు.
ఆఫ్రికాకు చెందిన సాంప్రదాయ ఆహారంలో మొరింగా ఆహార కొరతను తీర్చి గ్రామాభివృద్ధికి తోడ్పడగలదు.[1]
మునగ కాయలు (Drumsticks) చెట్టులో అన్నిటికన్నా ఎక్కువగా ఉపయోగించే భాగం. వీటిని భారతదేశంలో చిక్కుడు మాదిరిగా వండుకుంటారు. కొన్నిసార్లు మునగ గింజల్ని వేపుకొని తింటారు. మునగ పువ్వులు పుట్టగొడుగులాగా రుచికరంగా ఉంటాయి.
మునగాకులు చాలా పుష్టికరమైన ఆహారం. వీనిలో బీటా కెరోటీన్, విటమిన్ సి, మాంసకృత్తులు, ఇనుము మరియు పొటాషియం ఎక్కువగా కలిగివుంటాయి. ఆకుకూరలు క్రింద వీటిని వివిధ రకాలుగా వండుకుంటారు. ఆకుల్ని ఎండబెట్టి పొడిగా చేసి సూప్ లలోనూ సాస్ ల లోనూ ఉపయోగిస్తారు. మురుంగకాయ్ తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాలలో సిద్ధ వైద్యంలో ఉపయోగిస్తారు. మునగాకులలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి.
మొరింగా విత్తనాలు సుమారు 38–40% వంట నూనె ఉంటుంది (ఎక్కువగా బెహెనిక్ ఆమ్లం కలిగివుండటం వలన బెన్ నూనె అంటారు). ఈ నూనె వాసనలేకుండా, క్లియర్ గా ఉంటుంది. నూనె తీయగా వచ్చిన పిప్పిని ఎరువుగానూ, నీటిని శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చును.
దీని చెట్టు బెరడు, వేర్లు, ఆకులు, విత్తనాలు, పువ్వులు అన్నీ చాలా దేశాల సాంప్రదాయక వైద్యవిధానాలలో ఉపయోగంలో ఉన్నాయి. జమైకా లో దీని కాండం నుండి నీలపు వర్ణకం తయారుచేస్తారు.
మునగ పువ్వులు పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్ లో బాగా ఇష్టపడే రుచికరమైన ఆహారం. అక్కడ దీనిని sojne ful అని పిలుస్తారు. వీటిని పచ్చి శెనగలు మరియు బంగాళాదుంపలతో కలిపి వండుతారు.
ఆయుర్వేదంలో [మార్చు]
ఆకుకూరలలో ప్రముఖమైనది మునగ. అయితే మునగ ఆకుల కంటే మునగ కాయలను ఎక్కువగా వాడుతుంటారు. మునగ కాయలతోపాటు పుష్పాలు, బెరడు, వేరు వంటి అన్ని భాగాలలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. మునగలో విటమిన్ ఎ, సిలతోపాటు కాల్షియం పుష్కలంగా ఉంది.[2]
నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక వ్యాధులను తగ్గించే శక్కి మునగ కలిగి ఉంది. కొన్ని వందల శారీరక రుగ్మతలు మునగ వల్ల నయమవుతాయి. ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు మునగలో ఉన్నాయి.
అన్నిటికీ మించి సెక్స్ సమస్యలకు మునగ దివ్యౌషధంగా పనిచేస్తుంది. మునగ చెట్టు ఎండిన బెరడును ఆవుపాలలో మరగించి కషాయం ఎండబెట్టాలి. ఆ పొడిని మూడు పూటలా నెల రోజులు తీసుకుంటే వీర్యవృద్ధి కలిగి చక్కని అంగస్తంభన అవుతుంది. సెక్స్ సామర్థ్యం తగ్గితే మునగ పూలు, పాలలో వేసుకుని తాగాలి. ఇది ఆడవారికి, మగవారికి ఇద్దరికీ పనిచేస్తుంది.
చిత్రమాలిక [మార్చు]
మూలాలు [మార్చు]
- ↑ National Research Council (2006-10-27). "Moringa", Lost Crops of Africa: Volume II: Vegetables, Lost Crops of Africa. National Academies Press. ISBN 978-0-309-10333-6. Retrieved on 2008-07-15.
- ↑ [1]