అనుముల కృష్ణమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనుముల కృష్ణమూర్తి
జననంఅనుముల కృష్ణమూర్తి
(1923-05-16)1923 మే 16
India తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, ఉప్పలగ్రామం
మరణం1996 మార్చి 31
వృత్తిఉపాధ్యాయుడు, రచయిత
భార్య / భర్తనర్సమాంబ
తండ్రిపండరినాథ శాస్త్రి
తల్లిశ్యామలాదేవి

అనుముల కృష్ణమూర్తి(జననం:మే 16, 1923తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా ఉప్పుల గ్రామానికి చెందిన రచయిత.[1][2]

బాల్యం, విద్యాభాసం[మార్చు]

అనుముల కృష్ణమూర్తి మే 16, 1923న అనుముల వంశంలో శ్యామలాదేవి, పండరినాథ శాస్త్రి దంపతులకు జన్మించాడు. పండరినాథ శాస్త్రికి ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు. వీరిలో రెండవ కుమారుడు అనుముల కృష్ణమూర్తి. కృష్ణమూర్తి చదువులో చాలా చురుకుగా ఉంటాడు. అందుకే సంస్కృతం, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో పండితుడు. ఫార్సీ, అరబీభాషలలో మంచి పట్టు సాధించాడు. సంస్కృతం వానమామలై వరదాచార్ల తండ్రి బక్కయ్య శాస్త్రి వద్ద నేర్చుకున్నాడు. ఫార్సీ, అరబీ మౌల్వీ సమయుజ్జీమా వద్ద నేర్చుకున్నాడు. మడికొండకు చెందిన ఉస్మానియా విశ్వవిద్యాలయం లో బీఏ, బీకాం, బీఈడీ పూర్తి చేసాడు. ఆదిలాబాద్ జిల్లా చేస్పూరులో తొలి ఉపాధ్యాయులుగా ఉద్యోగంలో చేరి మధిర, ఖిలా వరంగల్, కోస్ట్, మానుకోట, నిర్మల్, భువనగిరి, హన్మకొండ, వరంగల్ లో పనిచేసి ప్రమోషన్ పై పెద్దపల్లి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా  పనిచేసారు. ఆ తర్వాత పర్కాలా, సుల్తానాబాద్ లో పనిచేసారు. 1978లో పదవీ విరమణ చేశాడు.[3]

వివాహం[మార్చు]

తన మేనమామ కూతురు నర్సమాంబతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు.

ఇతర విషయాలు, రచనలు, పద్యాలు[మార్చు]

అనుముల కృష్ణమూర్తికి కాళోజీ సోదరులంటే భక్తి, కృష్ణమూర్తి ని సొంత తమ్ముడిగా భావించేవాడు. కాళోజీ సోదరులతో పాటు బిరుదురాజు రామరాజు, వానమామలై వరదాచార్యులు మొదటినుండి సన్నిహితులుగా ఉన్నారు.  కృష్ణమూర్తి, జువ్వాది కాంతమరావు మంచి మిత్రులు. సాహిత్యం తప్ప ఏమీ ఎరుగని కృష్ణమూర్తి సతీమణి నర్సమాంబ జబ్బు చేసి 1983లో మరణించింది. కృష్ణమూర్తి రచించిన పద్యాలకు మొదట శ్రోతధారి ఆమె.[3]

అనుముల కృష్ణమూర్తి కుదురులేని మనిషి. ఎంతో గొప్ప కవితాధార ఉండి, పాండిత్యముండి, విస్తృతమైన అధ్యనాలు చేసారు, కానీ ఈయన రచనలు చాలా తక్కువ. చిత్తు కాగితాలపై ఎక్కడపడితే అక్కడ రాసి పారేసేవారు, అసువుగా చెప్పేవారు.ఈయన పద్యాలు సరస్వతీ సాక్షాత్కారము శబరి, ఇతర ఖండికలు అనే గ్రంథం.[4] ఈ కావ్యాన్ని కాళోజీ ప్రమేయంతో 1967లో యువభారతి వారు తమ మొదటి ప్రచురణగా ప్రచురించారు. రెండవ ముద్రణ కూడా ప్రచురించారు[1][2]....

1967లో ప్రచురించబడిన 'సరస్వతీ సాక్షాత్కారము' కావ్యం శబరి ఇతర ఖండికలతో కలిసి 2007 వారి పిల్లల ప్రచురణ చేసారు. ఈ ప్రచురణకు సహకరించిన వారు నాగిళ్ళరామశాస్త్రి, ఆచార్య ఎస్.లక్ష్మణమూర్తి. సరస్వతీ సాక్షాత్కారము ఒక గొప్ప రసకావ్యం. ఈ రచనతో అనుముల కృష్ణమూర్తికి మహాకవి అని పేరు వచ్చినది. ఈయన గాత్రం కూడా గొప్పగా ఉంటుంది. ఆయన ఏ పద్యం చదివినా శ్రోతలు తన్మయంలో ఊగిపోయేవారు[1][5]

మరణం[మార్చు]

అనుముల కృష్ణమూర్తి 1996 మార్చి 31న తీవ్ర అనారోగ్యంతో మరణించారు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 Prof. V. Viswanadham. Saraswati Sakshatkaramu Anumula Krishnamurty 1967 084 P Yuvabharati Publication No 001 (in English).{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  2. 2.0 2.1 Anumula Krishnamurthy | Saraswathi Saakshatkaram | Nandini Siddareddy | Padachitra, retrieved 2022-03-15
  3. 3.0 3.1 తెలంగాణ తేజోమూర్తులు(Telangana Tejomurtulu) By Pranayraj Vangari - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige. Archived from the original on 2022-05-27. Retrieved 2022-03-16.
  4. "Display Books of this Author". www.avkf.org. Retrieved 2022-03-15.
  5. "పద్యాన్ని ఎత్తి నిలబెట్టిన సాహిత్య మాగాణం | Telangana Magazine". magazine.telangana.gov.in. Retrieved 2022-03-15.