ఆడెపు చంద్రమౌళి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆడెపు చంద్రమౌళి
జననంఆడెపు చంద్రమౌళి
ఏప్రిల్ 7, 1939
మరణంసెప్టెంబర్ 28, 2009
వరంగల్లు జిల్లా
ప్రసిద్ధికవి
పదవి పేరుChandramouli
మతంహిందూ మతము

ఆడెపు చంద్రమౌళి తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్లు జిల్లా కు చెందిన కవి. 1939లో జన్మించిన చంద్రమౌళి 2009లో మరణించాడు. పద్య సాహిత్యంలో విశేష కృషి చేశాడు. రామాయణ రమణీయం, వేములవాడ రాజరాజేశ్వర శతకం, శ్రీశ్రీనివాస బొమ్మల శతకం ఇతని రచనలు. ఇతను రచించిన శ్రీశ్రీనివాస బొమ్మల శతకంలోని పద్యాలను తెలంగాణ ప్రభుత్వం 2015లో ప్రచురించిన 7 వ తరగతి తెలుగు వాచకంలో చేర్చింది.[1] సాహిత్యంలో పరిశోధనలు చేసి డాక్టరేట్ పట్టాను పొందాడు.

రచనలు[మార్చు]

  1. రామాయణ రమణీయం (పద్యకావ్యం)
  2. వేములవాడ రాజరాజేశ్వర శతకం
  3. శ్రీశ్రీనివాస బొమ్మల శతకం

శ్రీశ్రీనివాస బొమ్మల శతకంలోని ఒక పద్యం...

 ఆ.వె.
సత్పురుషుల మైత్రి సలుపగా మనసిమ్ము
కమలనయన నిన్ను గాంచనిమ్ము
విశ్వశాంతి కోరు విజ్ఞానమే యిమ్ము
చిద్విలాస భాస! శ్రీనివాస!

మూలాలు[మార్చు]

  1. నవ వసంతం-2, 7 వ తరగతి-తెలుగు వాచకం, తెలంగాణ ప్రభుత్వ ప్రచురణ,హైదరాబాద్,2015, పుట-22