ఆనందరాజ్

వికీపీడియా నుండి
(ఆనంద్ రాజ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఆనందరాజ్
జననం
ఆనందరాజ్

12 October
పుదుచ్చేరి
విద్యాసంస్థఎంజీఆర్ ప్రభుత్వ నట శిక్షణా కేంద్రం
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1988 – ప్రస్తుతం

ఆనందరాజ్ (అక్టోబరు 12) ఒక ప్రముఖ తమిళ నటుడు. ప్రధానంగా ప్రతినాయక పాత్రలు పోషించాడు. ప్రభుదేవా దర్శకత్వంలో అజయ్ దేవగణ్, సోనాక్షి సిన్హా నటించిన యాక్షన్ జాక్సన్ అనే సినిమాతో ప్రతినాయక పాత్రలో బాలీవుడ్ లో ప్రవేశించాడు. దక్షిణాది భాషలన్నీ కలిపి సుమారు వందకు పైగా సినిమాల్లో నటించాడు.

ఆనందరాజ్ పుదుచ్చేరిలో పుట్టి పెరిగాడు. తండ్రి ఒక వ్యాపారి. చదువు అయిపోయిన తర్వాత ఆనందరాజ్ ఓ పోలీస్ ఆఫీసర్ కావాలని కోరిక. కానీ ఆనందరాజ్ కి మాత్రం సినిమాలంటే మక్కువ. కుటుంబ సభ్యులు కూడా ప్రోత్సహించారు. దాంతో ఆయన చెన్నైలోని ఎంజీఆర్ ప్రభుత్వ నటనా శిక్షణా సంస్థలో చేరాడు. ప్రముఖ కన్నడ నటుడు శివ రాజ్ కుమార్ అతని సహాధ్యాయి.

శిక్షణ పూర్తయిన వెంటనే అవకాశాలు వస్తాయనుకున్నాడు కానీ అందుకు కష్టపడాల్సి వచ్చింది. 1988లో వచ్చిన ఒరువర్ వాళుం ఆలయం అనే సినిమాతో తన ప్రస్థానం ప్రారంభించాడు. ప్రభు, శివకుమార్ ప్రధాన పాత్రలు పోషించిన ఆ సినిమాలో ఆనందరాజ్ ఓ విలన్ పాత్ర పోషించాడు. తరువాత ఉరిమై గీతమ్ అనే సినిమాలో నటించాడు. ఇవి రెండు మంచి విజయాన్ని సాధించాయి. పి.వాసు దర్శకత్వం వహించిన ఎన్ తంగచ్చి పడిచవా అనే సినిమా మంచి బ్రేక్ నిచ్చింది.[1] తరువాత అప్పటి ప్రముఖ కథానాయకులైన రజనీకాంత్, విజయకాంత్, శరత్ కుమార్, మమ్ముట్టి, చిరంజీవి, బాలక్రిష్ణ, విజయ్ లాంటి వారి పక్కన ప్రతినాయకుడిగా నటించాడు.

తెలుగు సినిమాలు[మార్చు]

గ్యాంగ్ లీడర్, సూర్యవంశం లాంటి సినిమాల్లో ప్రతినాయక పాత్రలతో తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడు.

మూలాలు[మార్చు]

  1. "My wife is happy that I am a villain Anand Raj". timesofindia. 2014-11-11. Retrieved 2014-11-12.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆనందరాజ్&oldid=3848394" నుండి వెలికితీశారు