ఆరెకటిక

వికీపీడియా నుండి
(కటిక నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

బి.సి.డి.గ్రూపులోని కులం. కటికోళ్ళు అని కూడా వీరిని అంటారు. వాస్తవానికి వీరు కత్తి పడతారు గానీ ఏ జంతువు ప్రాణం తీయరు. మాంసము అమ్మటం `ఆరెకటిక'ల కుల వృత్తి. అది కూడా గొర్రె, మేక మాంసమే తప్ప `గో' మాంసం కాదు. లోతుగా పరిశీలిస్తే వీరు కత్తిపడతారే తప్ప ఏ జంతువు ప్రాణం తీయరు. వేరెవరో ప్రాణం తీసిన జీవి చర్మాన్ని వలిచి ఆ కళేబరాన్ని శుభ్రపరిచి, ముక్కలు కొట్టి అమ్ముతారు. చేతిలో కత్తి, రక్తపు మరకలతో కనిపిస్తారు గానీ నరహంతకులు కాదు. వీరు మూల సూర్యవంశ క్షత్రియ కులస్తులు,మహరాజ్ ఖాట్వాంగ్ పేరుతో వీరిని ఖాటిక్ గా గుర్తిస్తారు, మహరాజ్ ఖాట్వాంగ్ గారు శ్రీరాముడి పూర్వికులు,కటికలు ఛత్రపతి శివాజీ సైన్యంలో హైందవ సామ్రాజ్యంకొసం తమ ప్రాణాలను సమర్పించారు,మొఘలుల కృత్యాలు ఎక్కువ అవ్వటంతో భారత దక్షిణ భాగానికి వచ్చి తాము మాంసం విక్రయాలు మొదలుపెట్టారు, కానీ ప్రభుత్వం వీరిని బిసీ-డి గానే గుర్తిస్తోంది. యస్సీలలో కలపాలని వీరి డిమాండు. మాంసము అమ్ముతారు కనుక వీరు అపరిశుభ్రత వృత్తి చేేయడం వల్ల వీరిని ఎస్సీలుగా గుర్తించాలని అడుగుతున్నారు . ఉత్తర ప్రదేశ్, హర్యానా, జమ్మూ కాశ్మీరు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఈ కులస్తులను ఎస్సీలుగానే గుర్తించినా మన తెలుగు రాష్ట్రాలలో మాత్రం బీసీ-డీలోనే కొనసాగుతున్నారు.

కల్లు దుకాణాల మూసివేతతో ఈ వృత్తిదారులు రోడ్డున పడ్డారు. పురుషులు మాంసము దుకాణాలలో ఉంటే, మహిళలు, పిల్లలు కల్లు దుకాణాల్లో గొర్రె, మేక లకు సంబంధించిన ప్రేగులు, చెవులు, కాళ్ళు, తల భాగాలతో తయారు చేసే వంటకాలు (బోటీ, చాక్నా) ను విక్రయిస్తారు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు రక్తాన్ని ఉడకబెట్టి కారం, ఉప్పూ కలిపి అమ్మేవారు. కాలేయాన్ని వేపుడు చేసి విక్రయించేవారు. మరికొందరు జాతర ల్లోనూ, వారానికి ఒక రోజు జరిగే సంతలకు వెళ్ళి పచ్చి మాంసము అమ్ముతుంటారు.

బతుకు బండిని లాగడానికి ఇలా ఎన్నో వ్యయప్రయాసలు పడే ఈ కుటుంబాలు కల్లు దుకాణాల మూసివేతతో ఉపాధిని కోల్పోయారు.`కులవృత్తులు కొనసాగిస్తున వారికి ఫెడరేషన్లు ఇస్తున్న రాష్ట్రప్రభుత్వం మాకూ ప్రత్యేక ఫెడరేషన్‌ ఇవ్వాలి' అని వీరు డిమాండ్‌ చేస్తున్నారు. లేబర్‌ పని చేస్తున్నాం కనుక లేబర్‌యాక్టు ప్రకారం తమకూ ఇఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని నాయీ బ్రాహ్మణులకు క్షౌరశాలలు, రజకులకు దోబీఖానాలు కేటాయించినట్లు తమ వృత్తి చేసుకునేందుకూ స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కొరుతున్నారు. కోసిన మాంసము నిల్వ ఉంచుకునే సౌకర్యం తమకు లేదు కనుక సాయంత్రానికి మాంసం అమ్ముడు పోక మిగిలిపోతే ఎవరో ఒకరికి అప్పుగా ఇచ్చి తర్వాత నిదానంగా వసూలు చేసుకుంటారు. పెట్టుబడి ఉన్నవారు ఫ్రిజ్‌లో పెట్టి అమ్ముకుంటారు.


★★★""ఆరెకటికల బతుకులు""★★★

రచన: డా మంగళగిరి శ్రీనివాసులు

కవి,రచయిత.

చుక్కపొడిచేయాల తెల్లారి కోడి కూతతో నిద్ర లేచి,

నస్కు నస్కులనే నమ్ముకున్న దేవరకు కోరి మొక్కి,

బ్రతుకు దేరువుల దందాకు బయలుదేరిన చౌద్రి,[ దాదా ],

యాట(వేట)కోయినోళ్ళ తీరు గొర్ల ,మేకల, మందల్లు తిర్గితివి యాటలకోసం(జీవాల కోసం),

గిట్టు బాటు కానీ హెచ్చు ధరలు చెప్పే హక్కుదారికి....

ఎల్లదంటూ మామా బావ ఎల్లదంటూ అగ్గువడుగా చూస్తే,

ఛీదరించుక్క వాడు జీవాలను చూసి ఇచ్చే బక్క సక్కలను,

దందా కోసమని జీవాల్దేస్తుంటే సడక్ మీదనే సచ్చేనొ బక్కయాట,

ఉన్నదాన్ని పట్టి హలాల్ చేయగా రక్తంలో తడిసిపోతే,

రక్తమరుకల చూసినజనం (కటిక,కసాయి)వాడు అంటే మనసు కలత చెందే,

మనసు క్రూరత్వము కాదని, మనసు వెన్నని కరిపోయే కంటి నీరు,

కసువు తీయువేల కసువుచిమ్మి కక్కు వచ్చేలా కంపు వచ్చినను,

కడిగి మాంసం అమ్ముతుంటె తొడకూర తొడకూర తొందరవెడితే తెగే నా చిటికెనవేలు,

కారిపోయే కన్నీరును దిగమింగుకుంటు అడిగిన వారికి ఆనందంగా ఇస్థి,

అయిపోనేలేదు పచ్చికూర ఆగముల మా బతుకులు ఆగమయ్యే,

ప్రపంచీకరణ మాల్స్..... ఆగండిలో నేడు కొత్త దుకనాలు అవతరించె,

దరికిరాక మాకు దూరమైరి జనులు రిలయన్స్ ,ఫ్రెష్ లు మాకు చెంప పెట్టు,

సాగుతున్న గోస గాసగాని కన్నా గోరమయ్యే నేడు,

ఇంట్ల పిల్లలంతా ఈగల్లా ముసురుతూ బువ్వ బువ్వ అని గోలచేస్తే,

బాయమ్మ మాటల్తో కడుపునింపి కల్లు కాంపొండులో నల్లచికులమ్మి చిల్లరతెంగా,

సన్ననూక బువ్వ వండి పెడ్తే ఆహుర్ ఆహుర్ మంటు తినిరి పిల్లలు,

దివ్వెలు లేని నాడు చికటుండు,దిగలున్న జీవితాన దిగులె ఉంటుందిగా,

ఓట్ల నడుగా రోజు వచ్చే ఎన్నికల నడవ వచ్చిరి నాయకులు మా వాడల చుట్టూ,

మాటలు చెప్పవట్రీ కోట్లకోలాది కుటికిలెనోల్లం ఓటు హక్కు ఉన్నోలం,


పురాణాలు~చిత్రాలు

తల్లిదండ్రుల సేవలోనే దైవత్వం ఉందనే సందేశాన్ని నేటి యువతకు తెలియజేస్తూ నిర్మించిన చిత్రమే "కర్మయోగి శ్రీ ధర్మవ్యాధుడి చరిత్ర శ్రీ ధర్మ వ్యాదుడి చరిత్ర".భోగి కార్ శ్యామల జమ్ము రాజా సమర్పణలో శ్రీ దుర్గా భవాని క్రియేషన్స్ పతాకంపై ఉల్కందే కార్ మురళీధర్ నిర్మించిన ఈ చిత్రానికి జి.జే రాజా దర్శకత్వం వహించారు. ఈ "కర్మయోగి శ్రీ ధర్మ వ్యాదుడి చరిత్ర" చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు కీ.శే.యస్.పి.బాలసుబ్రమణ్యం గారు అన్ని పాటలు పాడడం విశేషం.విజయ్ భాస్కర్, అనుషా, అశోక్ కుమార్, ఆనంద్ భారతి, వి.మురళీధర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న 04-03-2022 విడుదల ఆవుతుంది.

ఆరెకటికల నేపథ్యంలో వచ్చిన పుస్తకాలు:

1.ఆరెకటిక కులగోత్రా వృత్తి పురాణం

2.ఆరెకటిక మొగ్గలు ఇతరములు కలవు.



మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఆరెకటిక&oldid=3924380" నుండి వెలికితీశారు