కాదర్‌బాద్ నరసింగరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాదర్‌బాద్‌ నరసింగరావు
జననం
కాదర్‌బాద్‌ నరసింగరావు

1888 నవంబరు 14
మరణం1963 జూన్ 2(1963-06-02) (వయసు 74)
ఇతర పేర్లునంద్యాల గాంధీ
జీవిత భాగస్వామిఆదిలక్షమ్మ
పిల్లలుఏడుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు వారిలో కాదర్‌బాద్ రవీంద్రనాథ్ ఒకరు
తల్లిదండ్రులుకాదర్‌బాద్ వెంకట సుబ్బారావు, నరసమ్మ

కాదర్‌బాద్‌ నరసింగరావు, (1888 నవంబరు 14 - 1963 జూన్ 2) కొన్నిసార్లు ఖాదర్‌బాద్‌ అని కూడా పలుకుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇతను ప్రముఖంగా "నంద్యాల గాంధీ" గా ప్రసిద్ధి చెందిన భారత స్వాతంత్ర్య సమరయోధుడు. భారతదేశ స్వాతంత్ర్యంకోసం పోరాడినవ్యక్తి, పరోపకారి, సామాజిక సంస్కర్త, రాజకీయ నాయకుడు. అతని జీవితమంతా కష్టాల్లో ఉన్నవ్యక్తులను ఉద్ధరించడానికి, అంటరానితనాన్నినిర్మూలించడానికి నిరంతరం శ్రమించాడు.

ప్రారంభ జీవితం, విద్య[మార్చు]

నరసింగరావు 1888 నవంబరు 14న నంద్యాలలో (భారతదేశంలోని మద్రాసు ప్రెసిడెన్సీ) అతను తండ్రి వెంకట సుబ్బారావు, న్యాయవాది, తల్లి నరసమ్మ.వారు సాంప్రదాయ హిందూ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు.[1]

ప్రభుత్వ పాఠశాలలో తన ప్రాథమిక విద్యను పూర్తి చేసిన తరువాత, అతను క్రిస్టియన్ మిషనరీలచే నిర్వహించబడుతున్నఎస్.పి.జి. ఉన్నత పాఠశాలలో చేరాడు.అతను ఉన్నత పాఠశాల నుండి విద్య పూర్తైన తర్వాత, మద్రాస్ క్రిస్టియన్ కళాశాల, మద్రాసు (ఈనాటి చెన్నై) నందు చేరాడు. అతను తన ఇంటర్మీడియట్ చదువును అక్కడ పూర్తి చేశాడు. భారత స్వాతంత్ర్య పోరాటం, మహాత్మా గాంధీ ప్రభావంతో, అతను తన బిఎ పట్టాను కొనసాగించకూడదని నిర్ణయించుకుని, దానికి బదులుగా రాజకీయాల్లో చేరాడు.

దాతృత్వం సామాజిక సంస్కరణలు[మార్చు]

నరసింగరావు సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినప్పటికీ, మహాత్మా గాంధీ చేసిన ప్రయత్నాల ద్వారా సమాజంలో అంటరానితనం నిర్మూలించడానికి తీవ్రంగా ప్రభావితమయ్యాడు. పేదప్రజల (ఆరోజుల్లో అంటరానివారు అని పిలవబడే) దుస్థితితో కలిగిన వారినందరిని అతను సమాజంలో విలీనం చేయడానికి, వారికి ఆర్థిక అవకాశాలు, సమాన సామాజిక హోదాను అందించడానికి తన జీవితమంతా ప్రయత్నించాడు.

అతను తోటి బ్రాహ్మణుల సామాజిక బహిష్కరణ ముప్పును విస్మరించాడు.అణచివేయబడిన అంటరాని వారితో "సహపంక్తి-భోజనం" (కలిసి తినడం) లో పాల్గొన్నాడు. అతని స్థాయి, సంపద, రాజకీయ ప్రభావం, సామాజిక స్థితిని క్రమంగా అతని సంఘంలోని ఇతర సభ్యులు, ఇతరులు అతని సంస్కరణలను అనుసరించవలసి వచ్చింది.విద్యను పొందే అవకాశాలు లేకపోవడమే వారి ఆర్థిక, సామాజిక పోరాటాలకు మూలకారణమని అతను సరియైన కారణం అదేనని గుర్తించాడు. పేదరికం, ఆకలి ప్రధాన అడ్డంకులుగా గ్రహించాడు.

తన స్వంత వనరులను ఉపయోగించి, అతను హరిజన బాలురకు ఒక హాస్టల్ స్థాపించాడు.అక్కడ పేద ప్రజల పిల్లలు ఉండడానికి గది, తినడానికి ఆహారం, విద్యను అందించాడు.ఆక్కడ చదువుకున్న విద్యార్థులు వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్) అధికారులు అయ్యారు. వారు, వారి పిల్లలు, వారి మనవరాళ్లు భారతీయసమాజంలో కీలకపాత్ర పోషించారు,పోషిస్తున్నారు.తరువాత అతను హరిజన బాలికల కోసం కూడా ఒక వసతిగృహం స్థాపించాడు.నంద్యాల పట్టణంలో తన స్వంతభూమిని మసీదు నిర్మాణంకోసం దానంచేశాడు. [2]అతను, తనస్నేహితుడు, పొరుగున ఉన్న గడిచెర్ల హరిసర్వోత్తమ రావుతో కలిసి గ్రంధాలయ ఉద్యమాన్ని ప్రారంభించారు.వారు నంద్యాలలో "ఎడ్వర్డ్ కార్పొరేషన్ గ్రంధాలయం (ప్రస్తుతం" విక్టోరియా రీడింగ్ రూమ్ " అని పిలుస్తారు) స్థాపించారు. అతను ఈ గ్రంధాలయం కోసం తన భూమిని విరాళంగా ఇచ్చాడు [3]

రైతులకు సహాయం[మార్చు]

అతను వ్యక్తిగతంగా 1,200 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములతో ధనవంతుడు అయినప్పటికీ, అతను ఎల్లప్పుడూ పేదరైతులకు సహాయం చేశాడు. పరిపాలనలో ఉన్నతాధికారులతో, రాజకీయ నాయకులుతో తనకున్నప్రభావాన్ని, పరిచయాలను ఉపయోగించి, అతను పేద రైతులకు సహాయపడే అనేక కార్యక్రమాలను ప్రారంభించాడు.కుందూ నదిపై వంతెనను నిర్మించడంలో అతను కీలకపాత్ర పోషించాడు. దాని ఫలితంగా వర్షాకాల వరదల సమయంలో కూడా రైతులు తమ భూములను సులభంగా చేరుకోవడానికి వీలుకలింగింది. అతను తన నిస్వార్థ స్వభావానికి ప్రసిద్ధి చెందాడు.నంద్యాలలో వేలాది ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన ("బిపిఎల్") కుటుంబాలు అతని నుండి ద్రవ్య ప్రయోజనాలను పొందాయి.

రాజకీయ జీవితం[మార్చు]

నంద్యాల మునిసిపల్ చైర్‌పర్సన్‌ అధికారిక దుస్తులలో కాదర్‌బాద్ నరసింగరావు
కాదర్‌బాద్ నరసింగరావు కడపలోని చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ కలెక్టర్‌తో

అతను ఆత్మకూరు (ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా) తాలూకా బోర్డు అధ్యక్షుడిగా, తరువాత నంద్యాల తాలూకా బోర్డు అధ్యక్షుడిగా 15 సంవత్సరాలు పనిచేశాడు.నంద్యాల పురపాలక సంఘం చైర్‌పర్సన్‌గా 14 సంవత్సరాలు (1920 నుండి 1934 వరకు) పనిచేశాడు.1935 నుండి 1963 వరకు (మరణించే వరకు) నంద్యాల కాంగ్రెస్ పార్టీ (భారత జాతీయ కాంగ్రెసు) అధ్యక్షుడిగా పనిచేశాడు.అతను ప్రతి ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[4]

అతని పరిపాలనా కాలంలో, ప్రజల సంక్షేమం కోసం నంద్యాలలో విద్యను వ్యాప్తి చేయడానికి అవిశ్రాంతంగా పనిచేశాడు. 1925లో అతను పురపాలకసంఘం ఉన్నత పాఠశాల నిర్మాణం కోసం పట్టణం నడిబొడ్డున ఉన్న నాలుగు ఎకరాల అతని ప్రధాన స్థిరాస్తిని విరాళంగా ఇచ్చాడు.గౌరవ సూచకంగా ఈపాఠశాలకు 2005 లో "కాదర్‌బాద్ నరసింగరావు స్మారక పురపాలక ఉన్నత పాఠశాల" గా పేరు పెట్టారు.అతని విగ్రహాన్ని దాని ప్రాంగణంలో మాజీ ఉపహోంమంత్రి, భారత ప్రభుత్వం, న్యూఢిల్లీ, బీహార్, కర్ణాటక రాష్ట్రాల మాజీ గవర్నరు పెండేకంటి వెంకటసుబ్బయ్య ఆవిష్కరించాడు.ఈపాఠశాలలో చదివిన పిల్లలు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన స్థానాలను ఆక్రమించారు. అతను మహాత్మాగాంధీ సూత్రాల ద్వారా కూడా ప్రభావితమయ్యాడు బ్రిటిష్ పాలనపై అహింసా పోరాటంలో అతనిని అనుసరించాడు.అతడిని అందరూ ఆప్యాయంగా "నంద్యాల గాంధీ" అని పిలిచేవారు.

1930 లో, మహాత్మాగాంధీ నంద్యాలను సందర్శించినప్పుడు, నరసింగరావు తనఇంట్లో గాంధీజీకి ఆతిథ్యమిచ్చాడు.అతను గాంధీజీతో జరిగిన బహిరంగ సభకు అధ్యక్షత వహించాడు.గాంధీజీ ప్రసంగాన్ని తెలుగు భాషలోకి అనువదించాడు. ఈ ప్రయత్నాలు రాయలసీమ ప్రజలను స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడానికి బాగా ప్రేరేపించాయి.[5] 1937లో అతను మద్రాస్ రాష్ట్ర సమావేశం విజయవంతంగా ఏర్పాటు చేశాడు. దీనిని అప్పటి మద్రాస్ ప్రభుత్వాధినేత సి. రాజగోపాలాచారి ప్రశంసించాడు.

1935లో రాజేంద్ర ప్రసాద్ నంద్యాలలో పర్యటించి బహిరంగ సభ నిర్వహించాడు.ఆ బహిరంగ సభకు నరసింగరావు అధ్యక్షత వహించాడు.రాజేంద్ర ప్రసాద్ ప్రసంగాన్ని అనువదించాడు. రాజేంద్ర ప్రసాదుకు కూడా తనఇంట్లేనే ఆతిథ్యం ఇచ్చాడు.తరువాత 1952 లో,భారతదేశపు మొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ మళ్లీ నంద్యాలను సందర్శించాడు.

భారత రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్‌తో కాదర్‌బాద్ నరసింగరావు

1952లో, నరసింగరావు భారతదేశపు మొదటి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూను నంద్యాలకు ఆహ్వానించాడు. నంద్యాల రైల్వే స్టేషన్‌లో గొప్ప సమావేశాన్ని ఏర్పాటుచేశాడు.నంద్యాల ప్రాంతంలోని ప్రజల సమస్యలను ఆ సమావేశంలో నరసింగరావు, ప్రధాని దృష్టికి తీసుకెళ్లాడు.[6] [7] [8]

ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూతో కాదర్‌బాద్ నరసింగరావు

అతను సర్వేపల్లి రాధాకృష్ణన్ (తరువాత భారత రాష్ట్రపతి అయ్యాడు,1962-67), వివి గిరి (తరువాత భారత రాష్ట్రపతి అయ్యాడు,1969-74) వారు నంద్యాలను సందర్శించినప్పుడు కూడా నరసింగరావు తన ఇంట్లో ఆతిథ్యమిచ్చాడు.

ఆంధ్రప్రదేశ్ మంత్రి సంజీవయ్యతో కాదర్‌బాద్ నరసింగరావు
భారత జాతీయనాయకులకు ఆతిథ్యం ఇచ్చిన కాదర్‌బాద్ నరసింగరావు నివాసం

అతను తన ఇంట్లో ఇలా అనేక జాతీయ, రాష్ట్ర నాయకులకు ఆతిథ్యం ఇచ్చాడు.[9] ఈ నాయకులలో కొందరు స్వాతంత్ర్య సమరయోధులు సయ్యద్ బియాబానీ (తరువాత శాసనసభ సభ్యుడిగా పనిచేశాడు); కల్లూరు సుబ్బారావు (స్వాతంత్ర్య సమరయోధుడు); టంగుటూరి ప్రకాశం పంతులు (మద్రాస్, తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి); తెన్నేటి విశ్వనాధం (ఆర్థిక మంత్రి); పెద్దిరెడ్డి తిమ్మా రెడ్డి (వ్యవసాయ శాఖ మంత్రి); ఎన్.జి. రంగా (ఇతని పేరు మీద ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరు పెట్టబడింది); భోగరాజు పట్టాభి సీతారామయ్య ( ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు); ఎస్. కె. డే (స్థానిక పరిపాలన మంత్రి).ఇలా ఉన్నారు. ఈ నాయకులలో చాలామంది అతని సన్నిహితులుగా ఉన్నారు.

అతని పొరుగున ఉన్న గాడిచెర్ల హరిసర్వోత్తమ రావుతో, శ్రీబాగ్ ఒప్పందం చర్చల ముసాయిదాలో అతను ముఖ్యమైన పాత్ర పోషించాడు. రాయలసీమ ప్రాంత ప్రజల హక్కులను కాపాడడంలో, రాయలసీమ ప్రజలకు వివరించడం,వారి ఆమోదం పొందడంలో వారిద్దరూ కీలక పాత్ర పోషించారు.

అతను అనేక మంది కాంగ్రెస్ నాయకులకు మార్గదర్శకత్వం వహించాడు.తరువాత వారు గవర్నర్లు, మంత్రులు, ఇతర ప్రముఖ నాయకులుగా ఎదిగారు. అతను ఏనాడూ ప్రభుత్వంలో మరే రాజకీయ పదవులు కోసం ఆశించలేదు.

నంద్యాల మున్సిపల్ హైస్కూల్‌కు కాదర్‌బాద్ నర్సింగరావు పేరు పెట్టారు
మున్సిపల్ హైస్కూల్ నంద్యాలలో నరసింగరావు విగ్రహం
నంద్యాలలోని పురపాలకసంఘ ఉన్నత పాఠశాలలో నరసింగరావు విగ్రహం

కుటుంబం[మార్చు]

నరసింగరావు, ఆది లక్ష్మమ్మను (కరణం)ను వివాహం చేసుకున్నాడు. వారికి ఏడుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.వారందరు వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, విద్యావేత్తలు, శాస్త్రవేత్తలుగా ఎదిగారు.

అతని పిల్లలు, మనవరాళ్లు అతని సామాజిక సేవా సంప్రదాయాన్ని కొనసాగించారు. వారిలో ప్రముఖులు అతని కుమారుడు కాదర్‌బాద్ రవీంద్రనాథ్, మనవడు కాదర్‌బాద్ ఉదయ్ శంకర్.

కాదర్‌బాద్ రవీంద్రనాథ్ వ్యవసాయ శాస్త్రవేత్త, పత్తి పెంపకందారుడు "నరసింహ" అనే పత్తి రకాన్ని అభివృద్ధి చేయడంతో సహా అతను చేసిన కృషికి జీవిత సాపల్య గుర్తింపు పురస్కారం అందుకున్నాడు నరసింహ అనే సంకర జాతి పత్తి విత్తన కార్యక్రమంలో 20 కంటే ఎక్కువ ప్రముఖ పత్తి విత్తన తయారీదారులు మాతృరేఖగా విస్తృత పద్దతిలో ఉపయోగిస్తున్నారు. నరసింహ నుండి తయారైన సంకర జాతి పత్తివిత్తనాలు భారతదేశవ్యాప్తంగా ఒక కోటి (10 మిలియన్) ఎకరాల భూమిలో సాగు చేయబడుతున్నాయి.జాతీయ ఖజానాకు రూ.300 (రూ.3 బిలియన్లు) కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుంది.[10]

తన తండ్రి అడుగుజాడలను అనుసరించి, రవీంద్రనాథ్ నంద్యాల నుండి ఎన్నికైన ప్రధాన మంత్రి పివి నరసింహారావుతో పాటు గవర్నర్లు, కేంద్ర మంత్రులతో సంభాషించాడు. అతను వారిని నంద్యాలకు ఆహ్వానించాడు. ఆ ప్రాంత వాసులు, ముఖ్యంగా పేద రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చాడు. అతను "నంది రైతు సమాఖ్య " కు అధ్యక్షుడుగా వ్యవహరించాడు.ఇది స్థిరమైన సాగు పద్ధతుల్లో పేద, ఉపాంత రైతులకు సలహాలు సహాయాన్ని అందిస్తుంది.

కాదర్‌బాద్ ఉదయ్ శంకర్ నంద్యాలలో ప్రముఖ వైద్యుడు.నిరుపేద పిల్లలకు ఆశ్రయం, ఆహారం విద్యను అందించే "సంఘ మిత్ర" గృహాన్ని స్థాపించడంలో అతను కీలక పాత్ర పోషించాడు. అతను పేద పిల్లల కోసం "శారద విద్యా పీఠం" మోడల్ స్కూల్ నిర్వహిస్తున్నాడు.

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, ప్రకాశం జిల్లాలలో విస్తరించి ఉన్న నల్లమల అటవీప్రాంతంలోని, గిరిజన ప్రజల (చెంచు తెగ) అవసరాలను అతని సంస్థ గుర్తించి అందిస్తుంది. ప్రతి నెలా ఒక వైద్యుడు, సహాయక సిబ్బంది ముప్పైమంది రోగులను సందర్శించి, వారికి ఆరోగ్య పరీక్షలు, ఉచిత మందులను అందిస్తారు.

నరసింగరావు 2 జూన్ 1963 న మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. Vidwan G. Subramanya sastri, "Nandyal Gandhi: Biography of Kaderbad Narasinga Rao" (published in Telugu language, by Kaderbad Rabindranath et.al, Nandyal 2010)(Available as PDF file)
  2. "Honoring the family of Philanthropist", Vaartha (Telugu newspaper), 17-September-2010
  3. Nandyal is the seed of Library Movement (Andhra Jyothy (Telugu Newspaper) 24 March 2016)
  4. "First Chairman of Nandyal who made Nandyal famous" Vaartha (Telugu newspaper), 15 December 2005
  5. "Freedom fighters of Nandyal", Sakshi (newspaper), (Telugu), 15-August-2011
  6. "Sweet Memories of Nehru", Eenadu (Telugu newspaper), 15-April-2009
  7. "Nehru's Links with Nandyal", Eenadu (Telugu newspaper), 14-November-2009
  8. "We are Indians. Let us forget our religious differences and live together", Nehru's speech in public meeting at Nandyal in 1952. Andhra Jyothy (Telugu newspaper), 15-April-2006
  9. "Shelter for freedom fighters", Andhra Jyothy, (Telugu newspaper), 13-August-2014
  10. "Scientist's work earns Rs. 300 crore to the Exchequer", The Hindu (newspaper), 1-April-2014

వెలుపలి లంకెలు[మార్చు]